సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలు కొనసాగిద్దాం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: బహుజన రాజ్యాధికారం కో సం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలు కొనసాగిద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ డేవిడ్, అధికారులు, గౌడ సంఘం, ఇతర సంఘాల నాయకులతో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో పాపన్నగౌడ్ కులవృత్తి చేసుకుంటూనే తరుష్క్, మొగల్ సైనికుల ఆగడాలను ఎదిరించారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం పాపన్నగౌడ్ పేరుతో పోస్టల్ కవర్ విడుదల చేసిందని పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ జిల్లా అధికారి సజీవన్, డీపీవో భిక్షపతి గౌడ్, గౌడ సంఘం నాయకులు బాలేష్‌గౌడ్, రాధాకృష్ణగౌడ్ (బాబుగౌడ్), బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేశ్, నాయకులు సుదర్శన్‌గౌడ్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణానికి ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని జన్కాపూ ర్ కోదాండ రామాలయంలో ఈ నెల 6న నిర్వహించే సీతారాముల కల్యాణానికి హాజరు కావా లని ఆలయ కమిటీ ప్రతినిధులు బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను ఆహ్వానించారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, శైలు, యాదగిరి, నాగరాజు ఆహ్వానపత్రిక అందించారు. అలాగే జిల్లా కేంద్రంలో ఈ నెల 11న నిర్వహించే వీరహనుమాన్ శోభాయాత్రకు హాజరు కావాలని హనుమాన్ భక్తులు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఏఎస్పీ చిత్తరంజన్‌ను ఆహ్వానించారు.
సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలు కొనసాగిద్దాం


