
మాట నిలుపుకున్న సీఎం..
గతంలో అమరవీరులకు నివాళులర్పించాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనైనా పరిస్థితి మారుతుందేమోనని ఆశించాం. కానీ పదేళ్లలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. పీసీసీ హోదాలో ఇంద్రవెల్లిలో పర్యటించిన రేవంత్‌రెడ్డి సీఎం కాగానే ఇంద్రవెల్లి స్మృతి వనానికి ఇచ్చిన మాట ప్రకారం రూ.కోటి కేటాయించారు. 15 మంది అమరవీరుల కుటుంబీకులను గుర్తించి వారిలో కొంత మందికి సాయం అందించాం. ఇంకా ఉన్నారని తెలుస్తోంది. వారిని సైతం అధికారికంగా గుర్తించి సాయం అందించేలా చూస్తాం.
– వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే