
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కాగజ్‌నగర్‌రూరల్: భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కాగజ్‌నగర్ మండలం వంజిరీలోని రైతు వేదికలో భూభారతి చట్టంలోని హక్కులు, అంశాలపై సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభా రతి ద్వారా రికార్డుల్లో తప్పులను తహసీల్దార్ కార్యాలయంలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ధరణి చట్టంతో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. కొత్త భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూభారతి పోర్టల్‌లో రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ కిరణ్, డీఏవో శ్రీనివాసరావు, ఏవో రామకృష్ణ పాల్గొన్నారు.
‘భూభారతి’పై అవగాహన అవసరం
సిర్పూర్(టి): భూభారతి ఆర్‌వోఆర్ చట్టంపై ప్రతిఒక్కరికి అవగాహన అవసరమని ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.