
దంచికొడుతున్న ఎండలు
కౌటాల: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. వేడి, తీవ్రమైన ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. ఆదివారం తిర్యాణి మండలం గిన్నెధరిలో 44.0 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యాణి 43.9, ఎల్కపల్లి, వాంకిడిలో 43.8, బెజ్జూర్, ఆసిఫాబాద్, కౌటాల, ధనోరాలో 43.7 డిగ్రీలు నమోదైంది. ఈస్టర్ నేపథ్యంలో ప్రార్థనల కోసం చర్చీలకు వెళ్లేందుకు క్రైస్తవులకు తిప్పలు తప్పలేదు. వడగాలులకు ద్విచక్ర వాహనాదారులు, చిరువ్యాపారులు అల్లడిపోయా రు. జిల్లాలోని 15 మండలాలు అలర్ట్ జోన్‌లో ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.