Urmila
-
నటి కారు ఢీకొని కార్మికుడు మృతి.. కేసు నమోదు
ముంబైలో బాలీవుడ్ నటి ఉర్మిళా కొఠారే కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక కార్మికుడు మృతి చెందాడు. కాండీవిల్లోలో జరిగిన ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని ఆమె తిరిగి ఇంటికెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.మరాఠీ నటి ఉర్మిళా కొఠారే శుక్రవారం రాత్రి సినిమా సెట్స్ నుంచి ఇంటికి వెళ్తుండగా తన డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అదే దారిలో మెట్రో ప్రాజెక్ట్ నందు పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపైకి కారు దూసుకుని పోవడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరోకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ప్రకటించారు.ఈ ప్రమాదంలో ఉర్మిళా కొఠారేతో పాటు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. కారును చాలా వేగంగా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. సమయానికి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో వారిద్దరూ బయటపడ్డారని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో మరణానికి కారణమైన పలు సెక్షన్ల కింద డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘వేవ్‌మెడ్ పిక్సీ’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ – 2023 ‘ఊర్మిళ చౌహాన్’ బంజారాహిల్స్‌లోని ‘ది స్కిన్ సెన్స్’లో సందడి చేశారు. దక్షిణాదిలో స్కిన్‌కేర్ రంగంలోకి మొదటిసారిగా తీసుకొచి్చన వినూత్న ప్లాస్మా టెక్నాలజీ ‘వేవ్‌మెడ్ పిక్సీ’ని ఊరి్మళ చౌహాన్ ఆవిష్కరించారు. మంగళవారం జరిగిన ఈ ఆవిష్కరణలో ఊర్మిళ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి స్కిన్ కేర్ అవసరమని, ముఖ్యంగా సౌందర్య సంరక్షణలో పిక్సీ వంటి అధునాతన చికిత్సలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రముఖ డెర్మటాలజిస్టు ‘డాక్టర్ అలెక్యా సింగపూర్’ వేవ్‌మెడ్ పిక్సీ అధునాతన సేవల గురించి వివరిస్తూ.. పిక్సీ ఇటలీకి చెందిన అధునాతన ప్లాస్మా టెక్నాలజీ. ఇది నాన్–ఇన్వాసివ్ సర్జరీ. భవిష్యత్ సేవలకు ఇది నాంది పలుకుతుందని అన్నారు. నాన్–సర్జికల్ బ్లీఫరోప్లాస్టీ వంటి అధునాతన పద్దతులను ప్రదర్శిస్తుందని, అతి సులభంగా వినిమోగించేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందించారని పేర్కొన్నారు. -
చూపులను కట్టడి చేసేలా!
హ్యాండ్ పెయింట్స్‌లో మనదైన ఆత్మ కనిపిస్తుంటుంది. ఫ్యాబ్రిక్‌నే కాన్వాస్‌గా మలిచి, రంగుల కలయికతో కూర్చి తీర్చిదిద్దిన డిజైన్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. ఏ డిజైన్‌కి అదే ప్రత్యేకత. ఇక అవి గతం నుంచి ప్రేరణ పొందినవైతే అలనాటి హుందాతనాన్నీ, గాంభీర్యాన్నీ ఆహ్లాదాన్ని మనకూ పంచుతాయి.సాగరిక ఘాట్గే భారతీయ నటి, మోడల్ కూడా. ఆమె తన తల్లి ఊర్మిళ ఘాట్గేతో కలిసి ఫ్యాబ్రిక్‌పై చేసిన హ్యాండ్ పెయింట్ అందాన్ని కిందటేడాది డిసెంబర్ నుంచి ‘అకూటీ’ ద్వారా మన కళ్లకు కడుతున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉండే ఊర్మిళ ఘాట్గే, సాగరిక ఘాట్గే. తమ సొంత లేబుల్‌తో హ్యాండ్పెయింట్ చీరలు, బ్లేజర్లు, దుపట్టాలు, సల్వార్సెట్లు డిజైన్ చేస్తున్నారు. ప్రకృతి సంబంధించిన మోటిఫ్‌లతో మన కళ్లకు కడుతున్నారు ఈ తల్లీకూతుళ్లు.తల్లి పెయింటింగ్స్ నుంచి ప్రేరణ పొంది అందరి ముందుకు వాటిని తీసుకు రావడంలో చేసిన ప్రయత్నాన్ని ఎంతో ఆనందంగా మనకు పరిచయం చేస్తారు సాగరిక. ‘నా చిన్నతనంలో మా కుటుంబంలో స్త్రీలు షి΄ాన్లు, టిష్యూలు, బ్రోకేడ్లను ధరించే విధానం, వారి ఆభరణాలు.. ఎంతో అందంగా కనిపించేవి. మా అమ్మ మహారాష్ట్రలోని రాచకుటుంబానికి చెందిన వ్యక్తి. కొల్హాపూర్‌లో తన గార్డెన్లో ఆమె పెంచిన పూల తోటలో ఎన్నో పూలు ఆమె అభిరుచికి అద్దం పట్టేలా ఉండేవి. నా చిన్నతనంలో మా అమ్మ వేసే పెయింటింగ్స్, బట్టల ముక్కలను కళాత్మక కళాఖండాలుగా మార్చే విధానం ఆశ్చర్యాన్ని కలిగించేది.ప్రకృతిని ఇష్టపడి ఆమె చేతితో చేసిన పెయింట్ పూల నమూనాలు ఆమె ధరించిన వస్త్రాలపైకి వచ్చేవి. కొన్నాళ్లకు అవి ఆమె బ్రాండ్‌గా పేరొందాయి. దానికి జీవం పోయడానికి కొంతమంది కళాకారులకు శిక్షణ ఇచ్చింది. ఈ రోజు ‘అకూటి’ పేరుతో రిచ్ టెక్స్టైల్స్, హ్యాండ్పెయింటెడ్ గార్మెంట్స్‌తో కొలువుదీరింది. నా కుటుంబంలోని ప్రసిద్ధ మహిళల చుట్టూ రూపొందించబడిన ఈ బ్రాండ్ మా మూలాలకు కట్టుబడి ఉంటుంది. నిజమైన అందం, గాంభీర్యం ఈ డిజైన్లలో ప్రతిఫలిస్తుంటుంది. ఆకూటీలో చీరలు, కో–ఆర్డ్ సెట్లు, బ్లేజర్లు, దుపట్టాలు, సల్వార్ సెట్స్ ఉన్నాయి. అన్నీ ప్రకృతికి సంబంధించిన మోటిఫ్‌లతో చేతితో పెయింట్ చేయబడ్డాయి’ అంటూ తమ ఫ్యాబ్రిక్ కళను పరిచయం చేస్తున్నారు.ఇవి చదవండి: Tech Talk: యూట్యూబ్‌లో కామెంట్‌ను ఎడిట్, డిలీట్ చేయడానికి.. -
తండ్రి మందలించడంతో కూతురు తీవ్ర నిర్ణయం!
సాక్షి, కుమరం భీం: పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో యాదవ్ వివరాల ప్రకారం... చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్ గ్రామానికి చెందిన ఊర్మిళ మండల్(21) 10వ తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 2న తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అస్తవ్యస్తంగా ఉండడంతో తండ్రి కేనార్ మండల్ కూతుర్ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఈస్గాం తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు. ఇవి చదవండి: బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ.. నవ దంపతులు దుర్మరణం -
Urmila Rosario: అవును... మన అమ్మాయే!
ఫైనల్ మ్యాచ్‌లో మన జట్టు ఓటమి చెందిన బాధలో ఆమె పెద్దగా ఎవరికంటా పడలేదుగానీ... ఆ తరువాత మాత్రం ‘ఎవరీ అమ్మాయి?’ అనుకున్నారు చాలామంది. గెలుపు తరువాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పక్కన ప్రముఖంగా కనిపించిన ఆ అమ్మాయి పేరు... ఊర్మిళా రోసారియో. ఎవరీ ఊర్మిళ? ఊర్మిళా రోసారియో ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ మేనేజర్. ఆమె తల్లిదండ్రులు ఐవీ, వాలెంటైన్ రోసారియోలది కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలోని కిన్నిగోలి ప్రాంతం. ఐవీ, వాలంటైన్లు ఖతార్‌లోని దోహాలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఊర్మిళ జన్మించింది. ఊర్మిళకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. స్కూలు రోజుల్లో క్రికెట్ కంటే బాస్కెట్‌బాల్, టెన్నిస్ బాగా ఆడేది. బంగీ జంపింగ్ అంటే ఇష్టం. ఖతార్ టెన్నిస్ ఫెడరేషన్లో మూడు సంవత్సరాలు పనిచేసింది. కార్నెగీ మెలన్ యూనివర్శిటీ లో బీబీఏ చేసిన ఊర్మిళ ఆ తరువాత ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా పనిచేసింది. ఒక నాన్–ఆస్ట్రేలియన్‌కు టీమ్ మేనేజర్ బాధ్యతలు అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ నుంచి కొన్ని నెలల పాటు విరామం తీసుకొని ఖతార్‌లో ఫుట్‌బాల్ స్టేడియం నిర్వాహణ బాధ్యతలు చూసుకుంది. ఆ తరువాత మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మేనేజర్‌గా ఊర్మిళ పనితీరు, హిందీ, కన్నడ, కొంకణి... మొదలైన భారతీయ భాషలలో నైపుణ్యం వరల్డ్‌కప్ టూర్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మేనేజర్‌గా ఎంపిక చేయడానికి కారణం అయింది. ఏడు సంవత్సరాల క్రితం ఊర్మిళ తల్లిదండ్రులు దోహా నుంచి మన దేశానికి వచ్చారు. కాఫీ ఎస్టేట్ కొనుగోలు చేసి కర్ణాటకలోని సకలేష్‌పూర్‌లో స్థిరపడ్డారు. ‘క్రికెట్‌తో ఒకప్పుడు నాకు పెద్దగా పరిచయం లేదు. అలాంటి నాకు క్రికెట్‌తో ఇంత అనుబంధం ఏర్పడడం ఆశ్చర్యంగా ఉంది’ అని నవ్వుతూ అంటుంది ఊర్మిల. నవ్వడం సరే, క్రికెట్ టీమ్ మేనేజర్ అంటే మాటలా? ఒక్కమాటలో చెప్పాలంటే... ‘రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్’ దీనిలో వందకు వంద మార్కులు కొట్టేసింది ఊర్మిళ. ఊర్మిళ గత మార్చిలో తల్లిదండ్రులను చూడడానికి మనదేశానికి వచ్చింది. ఊర్మిళ ఇక్కడ ఉంటే కాఫీ ఎస్టేట్‌లో చిన్న చిన్న పనులు కూడా చేస్తుంది. ఆమె పక్కన ఉంటే తల్లిదండ్రులకు పండగే. కూతురి ఉన్నతి గురించి పెద్దగా మాట్లాడకపోయినా ‘ఫైనల్ మ్యాచ్ చూడడానికి అహ్మదాబాద్‌కు వెళ్లాలనుకున్నాం. దురదృష్టవశాత్తు మా ఎస్టేట్ దాటి వెళ్లలేకపోయాం’ అంటున్నారు ఊర్మిళ తల్లిదండ్రులు. ఫైనల్ మ్యాచ్ మిస్ అయితే ఏమిటి? ఏదో ఒకరోజు కాఫీ ఎస్టేట్‌కు ఊర్మిళ వస్తుంది కదా! ఆ మ్యాచ్‌ను కళ్లకు కడుతుంది కదా! ఇక దిగులెందుకు!! -
గెలుపు ఘుమఘుమలు@ 78
గట్టిగా అనుకుని ఆచరణలో పెడితే చాలు తలుచుకున్న పని తప్పక సఫలం అవుతుంది అనే మాటలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు బామ్మ ఊర్మిళా అషేర్. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉండి తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో లక్షలాది అభిమానులను ఘుమఘుమలతో కట్టిపడేసింది.ఆటుపోట్ల జీవనాన్ని అధిగమించి తన సత్తా చూపుతోంది. కష్టాలు తాత్కాలికమే, జీవితంపై నమ్మకం కోల్పోకూడదు. విపరిణామాలు మనపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలి. – ఊర్మిళా అషేర్ ‘‘మొన్న అప్లోడ్ చేసిన నా 200 వ వీడియోతో యూ ట్యూబ్ చానెల్ లక్ష మంది అభిమానులను సంపాదించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా టీవీలో ప్రసారమవుతున్న ‘రసోయి షో’లో పాల్గొన్నాను. మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 7లో పోటీదారుగా చేరడంతో మీ అందరికీ పరిచయం అయ్యాను. ఇదంతా మీ అభిమానం వల్లే కలిగింది’ అంటూ ఆనందంగా చెబుతోంది ఊర్మిళ అషేర్. ముంబైలో ఉంటున్న ఊర్మిళ అషేర్ గుజరాతీ కుటుంబీకురాలు. తన కుటుంబం ఆర్థిక కష్టాలు తీరాలంటే ఏదో ఒక సాయం చేయాలనుకుంది. అందుకు తనకు వచ్చిన పాకశాస్త్ర ప్రా వీణ్యాన్ని పెట్టుబడిగా పెట్టింది. తన మనవడు హర్ష్‌తో కలిసి మూడేళ్ల క్రితం ‘గుజ్జు బెన్ న నాస్తా’ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్ సాధిస్తూ 78 ఏళ్ల వయసులోనూ ‘గ్రేట్ బామ్మా’ అనిపించుకుంటోంది. కోల్పోనిది ధైర్యమొక్కటే.. ఊర్మిళా అషేర్కు పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. భర్త చిరుద్యోగి. ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. రెండున్నరేళ్ల వయసులో కూతురు మూడవ అంతస్తు మీద నుంచి కింద పడి మరణించింది. భర్త తెచ్చే జీతం డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ వచ్చింది. పెద్ద కొడుకుకి పెళ్లి చేసింది. కరోనాకు ముందు ఇద్దరు కొడుకుల్లో ఒకరు గుండెపోటుతో, మరొకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించారు. ఆ తర్వాత భర్త మరణించాడు. ఈ ఎదురు దెబ్బలు ఆమెను నిత్యం గట్టిపరుస్తూనే ఉన్నాయి. ‘మరణం అనేది పరమసత్యం. దాని గురించి ఎన్ని రోజులని ఏడుస్తూ కూర్చుంటాం. నేనెప్పుడూ నా వద్ద ఉన్న శక్తితోనే ఏం చేయగలను అనేదానిపై దృష్టిపెడతాను. ఉన్న సమస్యలు చాలవన్నట్టు నాలుగేళ్ల క్రితం నా మనవడు హర్ష్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పై పెదవి పూర్తిగా దెబ్బతిని, ఇంటికే పరిమితం అయ్యాడు. అతను నడుపుతున్న దుకాణాన్ని కరోనా మహమ్మారి కారణంగా మూసేశాం. దీంతో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కష్టాలు తాత్కాలికమేనని, జీవితంపై నమ్మకం కోల్పోకూడదని తెలుసు’ అని చెప్పే ఊర్మిళ ఈ విపరిణామాలు మనవడిపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని, ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలని చెబుతూ ఉంటుంది. ఆమె మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసాలే నేడు ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్‌కు చేరుకునేంతగా ఫుడ్ బిజినెస్‌లో ఎదిగేలా చేశాయి. కష్టం వచ్చినప్పుడు ఇంకాస్త గట్టిగా ఉండాలని తన కథనే ఉదాహరణగా ఇతరులతో పంచుకుంటోంది ఈ దాదీ. వ్యాపార విస్తరణ కోడలు, మనవడితో ఉండే ఊర్మిళ తన చేతి రుచి గురించి చెబుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి వంటలు బాగా చేస్తాననే పేరుంది. మమ్మల్ని మేం బతికించుకోవడానికి ముందుగా గుజరాతీ చిరుతిళ్ల వ్యాపారాన్ని ప్రా రంభించాం. ఆర్డర్లు వచ్చినదాన్ని బట్టి 20–25 రోజుల్లో 500 కిలోల పచ్చళ్లను రెడీ చేశాం. దీంతోపాటు తేప్లా , ఢోక్లా, పూరన్ పోలీ.. వంటి ఇతర స్నాక్స్ కూడా అమ్మడం మొదలుపెట్టాం. డిమాండ్‌ను బట్టి పనివాళ్లను ఎక్కువ మందిని నియమించుకున్నాం. ఒక సంవత్సరం తిరిగేసరికల్లా మా జీవితాలే మారిపోయాయి. నేనిప్పుడు టెడెక్స్ స్పీకర్‌ని కూడా. నా కథలను ఇతరులతో పంచుకుంటూ, ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటూ వివిధ నగరాలకూ ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు మా ఆలోచన ఒక్కటే! నేను, మా మనవడు కలిసి అంతర్జాతీయ విమానాశ్రయాలలో ‘గుజ్జుబెన్ నాస్తా’ను ఏర్పాటు చేయాలని. అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుండి కూడా ఆర్దర్లు తీసుకుంటున్నాం. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తేనే కదా మరింత మందికి చేరువ అయ్యేది... మా ఊరగాయలను ఆన్లైన్ ΄్లాట్ఫారమ్లలో పెట్టడానికి కావలసిన లాంఛనాలు కూడా పూర్తయ్యాయి’ అని ఉత్సాహంగా వివరించే ఊర్మిళ మాటలు నేటి యువతకూ స్ఫూర్తినిస్తాయి. -
చిన్నప్పుడు హీరోయిన్గా సింగారించుకునేది, ఇప్పుడేకంగా!
ఊర్మిళ.. పుట్టింది కోల్‌కతాలో.. పెరిగింది ముంబైలో. నోయిడాలోని ‘ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’లో యాక్టింగ్ కోర్సు చేసి, కెరీర్ ప్రారంభించింది. నటిగా స్థిరపడాలన్నదే ఆమె లక్ష్యం. అందుకే, ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేది కాదు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించి, బుల్లితెర అవకాశాన్ని పొందింది. 2015లో ‘హేమ’ సీరియల్లో మొదటిసారి మెరిసింది. ఆ పాత్ర నిడివి కొంతే అయినా ఆమె ప్రతిభ పలువురి దృష్టిలో పడింది. వరుసగా ‘దిల్ సే దిల్ తక్’, ‘సావధాన్ ఇండియా’, ‘ఆయుష్మాన్ భవ’ సీరియల్లో నటించడంతో పాటు, సినిమాలో చాన్స్ కొట్టేసింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’లో ఓ రిపోర్టర్‌గా నటించి, తన సిల్వర్ స్క్రీన్ కలను సాకారం చేసుకుంది. ప్రస్తుతం వెబ్తెరపైనా కనిపిస్తోంది. ‘గందీ బాత్’, ‘క్లైమాక్స్’ సిరీస్‌లతో అలరిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చిన్న విషయమేం కాదు. పెద్ద గెలుపే. అలాంటి విజేతల్లో ఒకరే.. వెబ్‌స్టార్.. ఊర్మిళ సిన్హా రాయ్. చిన్నప్పుడు సినిమాల్లోని హీరోయిన్స్‌ను చూసి, అచ్చం అలాగే ముస్తాబు అయ్యేదాన్ని. అప్పుడే నిర్ణయించుకున్నా హీరోయిన్ని కావాలని– ఊర్మిళ సిన్హా రాయ్ -
ఊర్మిళ తీరు అహంకారపూరితం..
సాక్షి, విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. సిరిమానోత్సవంలో ట్రస్ట్ చైర్‌పర్సన్‌కు ముందు వరుసలో సీటు కేటాయించడం ఆనవాయితీ అని వివరించింది. కొంతమంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారని పేర్కొంది. పుసపాటి అనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతి రాజు... ఈవో పక్కన కూర్చొని సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారని వివరించింది. అయినప్పటికీ తమకు సీట్లు కేటాయించలేదని మీడియాకు చెప్పడం బాధాకరమని మాన్సాస్ కార్యాలయం లేఖలో విచారం వ్యక్తం చేసింది. వారిని మహారాణి, రాజ కుమార్తెలాగా చూడాలని కోరుకుంటున్నారని, కానీ సిరిమానోత్సవం ప్రజల పండుగని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఇంకా కొంతమంది రాజరికం కోరుకోవడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఊర్మిళ తల్లి, ఊర్మిళ ప్రవర్తించిన తీరు అహంకారపూరితమని మాన్సాస్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దసరా సందర్భంగా గత మంగళవారం అమ్మవారి సిరిమానోత్సం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సాంప్రదాయాలను పాటిస్తూ నిర్వహిస్తూ జరిపిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రముఖులు వీక్షించారు. అయితే మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఊర్మిల, ఆమె తల్లీ కూర్చోవడంపై మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి తీరును ఖండిస్తూ లేఖను విడుదల చేశారు. జాతర సంఘటనలో ప్రభుత్వ ప్రమేయం లేదు పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై జరిగిన సంఘటనలో ప్రభుత్వ జోక్యం లేదని, సంచయిత వ్యక్తిగత ప్రమేయంతోనే జరిగిందని పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె పి.ఊర్మిళ గజపతిరాజు అన్నారు. తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటి ఇలావేల్పు పైడితల్లి అమ్మవారి సిరుమాను ఉత్సవాన్ని ఏటా కోట బురుజుపై నుంచి తిలకిస్తామన్నారు. మమ్మల్ని ఎవరు అనుమతించారని చైర్పర్సన్ సిబ్బందిపై ఆగ్రహించడం తగదన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించినా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయించలేదని ఆమె తెలిపారు. తమకున్న హక్కులు పలుమార్లు తెలిపామని, అధికారం శాశ్వతం కాదన్నారు. కార్యక్రమంలో ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు పాల్గొన్నారు. -
విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు
‘బాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్వీర్ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు కంగనా రనౌత్. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్ మాట్లాడారు. క్యూట్ గాళ్ నిధీ అగర్వాల్ కూడా ‘నెపోటిజమ్’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు. ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా ‘డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్‌లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్‌కు కౌంటర్ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్‌కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్ స్టార్ (శృంగార తార). ఆమె యాక్టింగ్‌కి ఆమె పాపులర్ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్ చేశారు. మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్వీర్ షోరే ‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్. ఈ కామెంట్‌ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్వీర్ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ (బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్‌ను చెప్పకనే చెబుతూ ట్వీట్ చేశారు రణ్వీర్ షోరే. వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్ ప్రస్తుతం డ్రగ్స్ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్. నెపోటిజమ్ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్ ‘అవును.. బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్‌సైడర్‌గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధీ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్‌సైడర్) స్టార్‌ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్‌ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్. జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద డ్రగ్స్ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్‌తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్‌గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు. -
అవకాశం వస్తే రాజకీయాల్లోకి
-
అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ
సాక్షి, విజయనగరం: తన తండ్రి మరణం అనంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఆనంద గజపతిరాజు, సుధా కూతురు ఊర్మిళా గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మా బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి తమను ఉద్దేశపూర్వకంగా దూరం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. తన తండ్రి మరణం అనంతరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నా అని, భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లో దిగుతానని ఊర్మిళ తెలిపారు. అనంద గజపతి రాజు 70వ జన్మదినం సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. (సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర) ‘నాన్న ఆనంద గజపతిరాజు గారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే వారు. ఆనంద గజపతిరాజు చాలా సాధారణ జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ పీవీజీ రాజు (తాత) ఆశయాలను కొనసాగించడం కోసమే పనిచేశారు. అందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీలు స్ధాపించడం, మాన్సాస్ ట్రస్ట్ బాగా నడిపించడం చేశారు. మెడికల్ కాలేజీ పెట్టాలి అనేది నాన్నగారి కల. ఆయన బ్రతికి ఉండి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించేవారు. కుటుంబ సభ్యులను కాకుండా ఆయన దగ్గర పనిచేసే వారిని కూడా చాలా బాగా చూసుకునే వారు. మా నాన్న మరణించేటప్పటికి నా వయసు 16 సంవత్సరాలు. మా బాబాయ్ మా నాన్న మరణం తర్వాత ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి మాకు అర్హత లేదన్నారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) తాతగారు ఏ ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టారో మా నాన్న ఆనంద గజపతిరాజు దాన్ని అలాగే కొనసాగించారు. దురదృష్టవశాత్తు నాన్న మరణం తర్వాత బాబాయి ఆ ఉద్దేశంతో ట్రస్ట్ కొనసాగించలేదు. అశోక్‌ను చైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఆ జీవోని ఉపయోగించుకుని మమ్మల్ని ట్రస్ట్‌కు దూరం చేశారు. నాన్న మరణం తర్వాత సింహాచలం దేవస్థానం వేడుకలకు ఆహ్వానించడం జరగలేదు. భవిష్యత్తులో మా నాన్న, మా తాత గారు లా ప్రజలకు సేవ చేస్తా. అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తా’ అంటూ తన మనసులోని మాటను చెప్పారు. -
ఎవరో చూస్తుంటారు
రాత్రి పది దాటింది. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది ఊర్మిళ. మనోజ్ తలుపులు మూసి బోల్టు పెట్టి ఊర్మిళను గాఢంగా కౌగిలించుకుని ముద్దులు కురిపించాడు.‘‘మనోజ్! ఏంటి అంత తొందర? ఈ రాత్రి అంతా మనదే’’ గోముగా అతన్ని అల్లుకుని గుసగుసలాడింది ఊర్మిళ.‘‘తొందరే మరి! వారం దాటింది మనం కలిసి. నిన్ను తలచుకోని క్షణం లేదనుకో. కనులు మూసినా నీవాయె, కనులు తెరిచినా నీవాయె. నిద్ర పట్టడం లేదు...’’‘‘ఏం చేద్దాం? మా ఆయనకు డే డ్యూటీ. సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడు. పగలు నువ్వు రావడం బాగుండదు. ఇంటికి ఎవరో ఒకరు వచ్చేస్తుంటారు. పట్టుబడితే అసలుకే మోసం మనోజ్. అర్థం చేసుకో..’’‘‘ఓకే.. ఓకే.. సుమన్గాడికి విడాకులిచ్చేయ్. తర్వాత మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా గడుపుదాం..’’ అన్నాడు మనోజ్ ఆమెను బెడ్రూమ్లోకి నడిపిస్తూ.‘‘అదంత ఈజీ కాదులే..! చూద్దాం! ఇప్పుడు సుమన్‌తో ఏం ప్రాబ్లమ్?’’‘‘ప్రాబ్లమా? వాడికి నైట్‌డ్యూటీలు ఉంటేనే మనకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. లేకపోతే నరకమే కదా?’’‘‘నరకం అనుభవిస్తేనే స్వర్గసుఖాల విలువతెలుస్తుంది’’ అని పకపక నవ్వింది ఊర్మిళ.ఇద్దరూ బెడ్ మీద వాలిపోయారు. కాసేపటికి కాలింగ్‌బెల్ మోగింది. ఉలిక్కిపడ్డాడు మనోజ్. భయపడిపోయింది ఊర్మిళ. ఇద్దరూ హడావుడిగా మంచం మీద నుంచి లేచి డ్రెస్ చేసుకోసాగారు.‘‘ఎవరు ఈ టైమ్‌లో వచ్చింది?’’ అడిగాడు మనోజ్. ‘‘ఏమో! ఎవరైనా రిలేటివ్స్ వచ్చారేమో? నువ్వు ఇక్కడే ఉండు. నేను లైట్ ఆర్పి వెళతాను’’ అంటూ ఊర్మిళ లైట్ స్విచాఫ్ చేసి, బెడ్రూమ్ తలుపులు మూసి హడావుడిగా వెళ్లి బోల్టు తీసింది.తలుపు తెరవగానే ఎదురుగా భర్త కనిపించే సరికి భయంతో వణికిపోయింది ఊర్మిళ. రేగిన జుట్టు, అస్తవ్యస్తంగా చుట్టుకున్న చీర, ముఖంలో భయం చూసి ‘‘నిద్రపోయావా?’’ వ్యంగ్యంగా అడిగాడు సుమన్.‘‘ఆ.. ఔనండీ! నిద్రపోతున్నాను. ఏంటి అప్పుడే వచ్చారు?’’ వణుకుతున్న కంఠంతో అన్నది ఊర్మిళ.‘‘ఎందుకంటే..? నువ్వు గుర్తొచ్చావు. చాలా రోజులైంది కదా.. ఆ సుఖంలేక’’‘‘చాలారోజులెక్కడా?’’‘‘ఇరవైనాలుగు గంటలే నాకు చాలా రోజులైనట్టుగా అనిపిస్తోందోయ్!.. పద..’’ అంటూ ఊర్మిళను బెడ్రూమ్లోకి లాక్కెళ్లసాగాడు సుమన్.‘‘అయ్యో! అదేంటండీ! ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. డ్రెస్ మార్చుకుని, స్నానంచేయండి..ఎందుకు తొందర..?’’ నవ్వుతూ అన్నది ఊర్మిళ.‘‘స్నానం చేద్దాంలే.. ఆ తర్వాత..’’ అంటూ బెడ్రూమ్లోకి లాక్కెళ్లాడు ఊర్మిళను.స్విచ్ వేశాడు. మంచం మీద ఉన్న మనోజ్ లేచి కూర్చున్నాడు. తని ముఖం నెత్తురు చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది. తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనకుండా నిలబడ్డాడు. సుమన్ పెద్దపులిలా మనోజ్ మీద పడ్డాడు. బూతులు తిడుతూ అందినచోటల్లాతన్నసాగాడు. మనోజ్ దెబ్బలు కాచుకుంటూ ఉన్నాడు.‘‘నిన్ను చంపేస్తారా!...’’ అంటూ సుమన్ వంటగదిలోకి పోయి చాకు చేతిలోకి తీసుకున్నాడు.‘‘వద్దండీ.. ప్లీజ్..! తప్పయింది. వదిలేయండి. ఇక ముందు అతన్ని రానీయను..’’ అంటూ ఊర్మిళ సుమన్ రెండు కాళ్లూ పట్టుకుని నిలువరించింది.ఆ సమయంలో మనోజ్ పారిపోయాడు.‘‘తప్పుడు ముండా! ఏం లోటు జరిగిందే వాడిని తగులుకున్నావు? పరువు తీస్తున్నావే దరిద్రగొట్టుదానా’’ అంటూ కొట్టసాగాడు.‘‘తప్పయిందండీ.. ప్లీజ్ క్షమించండి..’’ అంటూ ఏడుస్తోంది ఊర్మిళ.‘‘ఈసారి వాడు వచ్చినట్టు తెలిసిందో? ఇద్దరినీ చంపేస్తా..’’ ఆయాసపడుతూ అన్నాడు సుమన్.∙∙ నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో పోతోంది లాంచి. సుమన్ ఊర్మిళ పక్కపక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. సుమన్ చల్లగాలి పీలుస్తూ దూరంగా కనిపిస్తున్న కొండలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.ఇంతలో ఊర్మిళ సెల్ మోగింది.‘‘హలో.. హలో..’’ అన్నది.‘‘సరిగా వినపడ్డం లేదు..’’ అంటూ లేచి డెక్ మీదకు వెళ్లింది. ‘‘హలో.. ఎక్కడున్నావు?’’ అటు నుంచి ప్రశ్నించాడు మనోజ్.‘‘లాంచీలో పోతున్నాం. ఇప్పుడు రిజర్వాయర్ మధ్యలో ఉన్నాం. ఎందుకు ఫోన్ చేశావు అనవసరంగా..?’’ విసుగ్గా అన్నది ఊర్మిళ.‘‘ఏం లేదు. గుర్తుచెయ్యడానికి చేశాలే. నాగార్జున కొండ పైకి వెళ్లిన తర్వాత మ్యూజియమ్ చూస్తారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు ఉంటుంది. రీ కన్స్ట్రక్షన్ చేసిన బౌద్ధ స్థూపాలు, అవీ ఉంటాయి. వాటిని చూస్తూ కొండ చివరకు తీసుకెళ్లు వాడిని. అటు పక్క కొండపై నిలబడితే కింద రిజర్వాయర్ కనిపిస్తూఉంటుంది. సమయం చూసి వాడిని బలంగా నెట్టెయ్. నీళ్లలో పడిపోతాడు. ఛస్తాడు బద్మాష్!... తర్వాత గట్టిగా అరుస్తూ మ్యూజియమ్ వైపు వెళ్లు..’’మనోజ్ చెబుతుంటే.. ‘‘సరేనే, మల్లికా.. ఉంటాను’’ అంటూ వచ్చేసింది సుమన్ దగ్గరకు.‘‘ఎవరు?’’ అనుమానంగా చూస్తూ అడిగాడు సుమన్.‘‘మా ఫ్రెండ్ మల్లిక..’’ అన్నది నవ్వుతూ.సుమన్ ఆమె చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని చూశాడు. స్క్రీన్ మీద అంతకు ముందు మాట్లాడిన నంబర్, మల్లిక అనే పేరు కనిపించాయి. మనోజ్ నంబర్‌ను మల్లిక అని సేవ్ చేసుకుంది ఊర్మిళ తెలివిగా.లాంచి నాగార్జున కొండకు ఆనుకుని ఆగింది. ఒక్కొక్కరే దిగారు. లాంచి కెప్టెన్ అనౌన్స్ చేశాడు వెళ్తున్న వారిని ఉద్దేశించి..‘‘ఇప్పుడు పదిన్నరైంది. ఒంటిగంటకు లాంచి రిటర్న్ అవుతుంది. అప్పటికి లాంచి దగ్గరకు మీరంతా చేరుకోవాలి. మిస్సయ్యారంటే మళ్లీ సాయంకాలం నాలుగింటి వరకు వేరే లాంచి వచ్చి రిటర్న్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.’’ టూరిస్టులంతా మ్యూజియంలోకి ప్రవేశించారు. రెండువేల సంవత్సరాల కిందటి శిల్పాలు, బౌద్ధ సంస్కృతి, నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందినవి చూస్తూ గడుపుతున్నారు.‘‘రెండువేల సంవత్సరాల కిందట ఇక్కడ ఇక్ష్వాకులు రాజ్యం ఏలారు. నాగార్జునుడు యూనివర్సిటీ నడిపాడు. చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక వంటి పదమూడు ఆసియా దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్య నేర్చుకుని వెళ్లేవారు.యుద్ధాల వల్లనో, కృష్ణానది వరదల వల్లనో విజయపురి నగరం కాలగర్భంలో కలిసిపోయింది. పురావస్తు శాఖ 1926 లో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించడంవల్లయూనివర్సిటీ ప్రాంతం మునిగిపోయింది. శిల్పాలు, బౌద్ధారామాలు వగరైనా ఈ కొండ మీద మ్యూజియమ్‌లో ఉంచారు.’’గైడ్ చెబుతున్నది శ్రద్ధగా వింటూ కదులుతున్నారు. గంట తర్వాత టూరిస్టులు మ్యూజియం బయటకు వచ్చారు. ‘‘ఏమండీ మనం బౌద్ధ స్థూపాలు చూద్దాం. కొండ మీద అన్నీ రీ కన్స్ట్రక్షన్ చేశారట..’’ అన్నది ఊర్మిళ ఉత్సాహంగా.‘‘సరే.. పద..’’ అన్నాడు సుమన్.ఇద్దరూ కలసి బౌద్ధ స్థూపాలు చూస్తూ కొండ చివర ఒడ్డుకు చేరుకున్నారు. కొండ కింద సముద్రంలా కనిపిస్తోంది రిజర్వాయర్. కనుచూపు మేర అంతా నీరే.‘‘ఎంత బాగుందో ఈ సీన్. సముద్రం ఒడ్డున నిల్చున్నట్టు ఉంది..’’ అన్నది ఊర్మిళ పరవశించిపోతూ.‘‘ఊ..’’ అంటున్నాడు సుమన్.ఊర్మిళ అటూ ఇటూ చూస్తోంది. కొన్ని క్షణాల్లో సమయం చూసి సుమన్‌ని కొండ పైనుంచి తోసెయ్యడమే తరువాయి. ఊర్మిళ కబుర్లు చెబుతూ సమయం కోసం చూస్తున్నది. రెండు చేతులూ ముందుకు చాచి సుమన్‌ని నెట్టబోయింది.ఇంతలో ఒక యువకుడు పొదలమాటు నుంచి హఠాత్తుగా వచ్చి ఊర్మిళను బలంగా నెట్టాడు. ఊర్మిళ బొమ్మలా గాలిలో ఊగుతూ రిజర్వాయర్‌లోకి పడిపోయింది.‘‘వెల్డన్ శేఖర్..’’ అన్నాడు సుమన్ తమ్ముడిని అభినందిస్తూ.‘‘అన్నయ్యా! నిన్ను మర్డర్ చేయాలనే నాగార్జునకొండ ట్రిప్వేసింది. మనం అలెర్ట్‌గా ఉండబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఈపాటికి నీళ్లలో కొట్టుకుపోతూ ఉండేవాడివి’’ అన్నాడు శేఖర్.తర్వాత సుమన్ పరుగెత్తుతూ అరవసాగాడు..‘‘నా వైఫ్ కొండపై నుంచి జారి నీళ్లలో పడిపోయింది.. ప్లీజ్ హెల్ప్..’’ కాసేపటికి జనం గుమిగూడారు అక్కడ. సుమన్ ఏం జరిగిందో చెబుతున్నాడు. గజ ఈతగాళ్లు నీళ్లలోకి దిగారు. ఊర్మిళను లాక్కువచ్చారు. అప్పటికే ఆమె ప్రాణం వదిలింది. ‘‘నాగార్జున కొండ చూడడానికి వెళ్లిన టూరిస్ట్ ఊర్మిళ ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి రిజర్వాయర్‌లో పడిపోయింది. గజ ఈతగాళ్లు రక్షించడానికి ప్రయత్నించారు గాని, కాపాడలేకపోయారు. ఊర్మిళ మరణించింది. ఆమె భర్త భార్య మరణాన్ని తట్టుకోలేక విలపించడం టూరిస్టులందరినీ కలచివేసింది.’’వార్త అన్ని న్యూస్పేపర్లలోనూ వచ్చింది. సుమన్, శేఖర్ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు.తాము ఎత్తుకు పైఎత్తు వేసి ఊర్మిళను మట్టుబెట్టారు. లేకపోతే ఊర్మిళ ప్రియుడి సాయంతో సుమన్‌ని హత్యచేసి ఉండేది అనుకుని సంతోషించారు. ఆ రోజు ఇంటికి వచ్చిన సుమన్, తమ్ముడికి కాల్ చేశాడు.‘‘నా ఫ్రెండ్ ఫారిన్ నుంచి జానీవాకర్ తెచ్చాడు. నా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటున్నాం. నువ్వూ వచ్చి జాయిన్ అవ్వు..’’సుమన్ ఇంట్లో పార్టీ మొదలైంది. కాసేపటికి కాలింగ్‌బెల్ మోగింది. శేఖర్ వెళ్లి తలుపు తీశాడు.ఎదురుగా పోలీసు ఇన్స్పెక్టర్, కొందరు కానిస్టేబుల్స్.‘‘మిస్టర్ సుమన్ నిన్ను, నీ తమ్ముడు శేఖర్ని అరెస్టు చేస్తున్నాం..’’ సుమన్ దగ్గరకు వచ్చి చెప్పాడు ఇన్స్పెక్టర్.‘‘సార్! నన్ను, నా తమ్ముడిని అరెస్టు చేస్తున్నారా? ఎందుకు?’’ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సుమన్.‘‘ఎందుకా? నీ భార్యను కొండపై నుంచి నీళ్లలోకి తోసి చంపినందుకు..’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘నో.. ఊర్మిళ కాలుజారి పడింది..’’ గట్టిగా అన్నాడు సుమన్.‘‘సరే! ఇది చూడు..’’ అంటూ సెల్ఫోన్లో వీడియో చూపించాడు.శేఖర్ వేగంగా వెళ్లి ఊర్మిళను నెట్టేయడం, అన్నదమ్ములిద్దరూ షేక్హేండ్ ఇచ్చుకుంటూ పగలబడి నవ్వడం కనిపించింది.సుమన్, శేఖర్ బిత్తరపోయారు. భయంతో గడగడ వణికిపోయారు. తాము చేసిన పని ఎవరు షూట్‌చేసి పోలీసులకు పంపారో అర్థంకాలేదు.‘‘మిస్టర్ సుమన్! నేరం చేసేవాడు తమను ఎవరూ చూడటం లేదనుకుంటారు. కాని ఎవరో చూస్తుంటారు. ఒక టూరిస్ట్ మీరు చేసిన ఘాతుకం వీడియో షూట్ చేసి మాకు పంపబట్టి మీరు దొరికిపోయారు. తెలుసుకోండి.. నేరందాగదు..’’ చెప్పాడు ఇన్స్పెక్టర్.పోలీసు కానిస్టేబుల్స్ అన్నదమ్ములిద్దరికీ బేడీలు వేసి వ్యాన్ ఎక్కించారు. - వాణిశ్రీ -
కాంగ్రెస్ తరుపున ముంబై నార్త్ నుంచి పోటీచేస్తున్న ఊర్మిళ
-
లారీ ఎక్కించి చంపేస్తా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పోలీసుశాఖలో ఆమె ఉన్నతమైన హోదా కలిగిన ఉద్యోగి. అతడు పోలీసుల జాబితాలో కరుడుగట్టిన రౌడీ. అయితేనేం.. ఆమె హోదా కంటే తన నేరసామ్రాజ్యమే బలమైనదిగా చాటుకునే ప్రయత్నం చేశాడు. హోదాను అడ్డుపెట్టుకుని ఖైదీల జోలికెళితే ఖతం చేస్తా... లారీ ఎక్కించి అంతం చేస్తానని ధైర్యంగా వాట్సాప్ సందేశం పంపి రాష్ట్ర జైళ్లశాఖలో వణుకు పుట్టించాడు. మదురై జైళ్లశాఖ మహిళా ఎస్పీ ఊర్మిళకు బుల్లెట్ నాగరాజన్ అనే పేరొందిన రౌడీ హత్యా బెదిరింపులకు పాల్పడుతన్న వాట్సాప్ ఆడియో శుక్రవారం వైరలైంది. వివరాలు. తేని జిల్లా పెరియకుళం సమీపం జయమంగళానికి చెందిన బుల్లెట్ నాగరాజన్ రాష్ట్రంలో పేరొందిన రౌడీ. ఇతనిపై హత్య, దొంగతనాలు, దారిదోపిడీ తదితర 50కి పైగా కేసులున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు అతడు కొంతకాలంగా అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. బుల్లెట్ నాగరాజన్ అన్న 2006లో ఒక హత్యకేసులో అరెస్టయి మదురై సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్షను అనుభవించాడు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగడం అలవాటు చేసుకున్నాడు. ఖైదీలకు వైద్యపరీక్షల నిమిత్తం వారం రోజుల క్రితం జైలుకు వచ్చిన మహిళా డాక్టర్ వద్ద నిద్రమాత్రల కోసం పేచీపెట్టుకున్నాడు. ఇందుకు అంగీకరించిన మహిళా డాక్టర్‌పై ఆగ్రహంతో ఊగిపోతూ తన చొక్కావిప్పి ఆమె ముఖంపై వేశాడు. డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై మదురై జైళ్లశాఖ మహిళా పోలీసు సూపరింటెండెంట్ ఊర్మిళ విచారణ చేపట్టారు. కమాండోల సహాయంతో అతడిని సెల్లో పెట్టించారు. ఇదిలా ఉండగా, ఎంజీఆర్ శతజయంతి సందర్భగా కొందరు ఖైదీలతోపాటూ బుల్లెట్ నాగరాజన్ అన్న కూడా ఇటీవల విడుదలయ్యాడు. జైలు నుంచి బైటకు రాగానే తన తమ్ముడు నాగరాజన్ వద్దకు వెళ్లి ఈ గొడవ గురించి వివరించాడు. కోపోద్రిక్తుడైన నాగరాజన్..తన సెల్‌ఫోన్ వాట్సాప్ ద్వారా ఎస్పీ ఊర్మిళ, మహిళా డాక్టర్‌కు ఆడియో మెసేజ్ పంపాడు. ‘గ్రేట్ జనరల్ బుల్లెట్ నాగరాజన్‌ను మాట్లాడుతున్నా. తమిళనాడులో నేను చూడని జైలు లేదు. ఎంతో మంది ఖైదీలను కొట్టి హింసిస్తున్నారు. మదురై జైలుకు సంబంధించి మీకు నిర్వాహణ సామర్థ్యమే లేదు. ఖైదీలను కొట్టేందుకే కమాండో పార్టీలను పెట్టుకున్నారు. ఖైదీలను కొట్టిన ఒకేఒక కారణంతో జైలర్ జయప్రకాష్‌ను సజీవదహనం చేసిన విషయం జ్ఞాపకం ఉందా అయినా మీరు ఎందుకు మారడం లేదు మా నడతను మార్చుకుని ప్రస్తుతం పెద్దమనుషులుగా చలామణి అవుతున్నాం. ఖైదీలతో ఏదైనా సమస్య వస్తే మీరు ఏంచేస్తారో అదే మేమూ చేయాల్సి వస్తుంది. మనిషికి ఆరేళ్లలోనూ..నూరేళ్లలోనూ కూడా చావు రావచ్చు. దానికి గురించి నాకు బెంగలేదు. మీకు చివరి అవకాశం ఇస్తున్నా. జైలు సూపరింటెండెంట్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. అతడిని అడ్డుపెట్టుకుని ఖైదీల సొమ్మును కాజేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేందుకు సిగ్గులేదా...వేరే ఏదైనా వృత్తి చేసుకోవచ్చు కదా. ఇంతగా మాట్లాడుతున్నా, నన్ను ఏమైనా చేసి చూడండి, నేను పాత బుల్లెట్ నాగరాజన్‌కు కాదు. జైల్లో విధులు ముగించుకుని మీరు బైటకు వచ్చి తీరాలికదా. నేనేమీ చేయను, నా అనుచరులు ఏదైనా చేస్తారు..లారీ మీ మీదఎక్కవచ్చు..మారండి..అంటూ ఆడియో ద్వారా హెచ్చరించాడు. మహిళా ఎస్పీకి వచ్చిన ఈ బెదిరింపు జైళ్లశాఖలో కలకలం రేపింది. అజ్ఞాతంలో ఉన్న బుల్లెట్ నాగరాజన్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. హత్యాబెదిరింపులపై ఎస్పీ ఊర్మిళ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు, ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతామని మదునగర పోలీస్ కమిషనర్ డేవిడ్సన్ దేవా మీడియాకు తెలిపారు. -
ఉద్దానంలో ఎలుగుబంటి బీభత్సం
సోంపేట: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఆదివారం ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. భార్యాభర్తలపై దాడి చేసి చంపేసింది. మరో ఎనిమిది మందిని గాయపరిచింది. దీని దాడిలో రెండు ఎడ్లు కూడా తీవ్రంగా గాయపడ్డాయి. చివరకు ప్రజల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. సోంపేట మండలం సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైపల్లి ఊర్మిళ(44) ఇల్లు ఊడ్చిన చెత్తను బయట వేయడానికి గ్రామ పొలిమేరల్లో ఉన్న తుఫాను రక్షిత భవనం వద్దకు వెళ్లింది. ఇంతలో ఆమెపై ఎలుగు దాడికి దిగింది. ఆమె కేకలు వేయడంతో భర్త తిరుపతి(48) ఊర్మిళను రక్షించడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిపైనా ఎలుగు దాడిచేసింది. వీరిద్దరిని రక్షించడానికి గ్రామానికి చెందిన బైపల్లి దుర్యోధన, బైపల్లి పాపారావు, బైపల్లి రవి, బైపల్లి అప్పలస్వామి, రట్టి అప్పన్న ప్రయత్నించగా వారిని కూడా ఎలుగు గాయపరిచింది. దీంతో స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊర్మిళ మరణించింది. బైపల్లి తిరుపతి, అప్పలస్వామి, దుర్యోధనల పరిస్థితి విషమించడంతో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుపతి కూడా కన్ను మూశాడు. వీరిపై దాడి చేసిన ఎలుగు సిరిమామిడి గ్రామానికి చెందిన కె. చిట్టయ్యతో పాటు మందస మండలానికి చెందిన బి.గోపాల్, జె.నారాయణ, ఎం.పాపారావులపైనా దాడి చేసింది. ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి హేమరాజు కాడెడ్లపై దాడి చేయడంతో ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాల వారు హడలిపోయారు. తలుపులు వేసి ఇళ్లలోనే ఉండిపోయారు. ఆఖరకు మందస మండలం పితాళి గ్రామంలో ఎలుగును స్థానికులు హతమార్చారు. పలాస సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్ఛాపురం, పలాస సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్ నిమ్మాన దాసు పరామర్శించారు. -
ఆయ్ హాయ్.. ఆయ్ హోయ్
ఏప్రిల్ ఆరున విడుదలౌతున్న బాలీవుడ్ చిత్రం ‘బ్లాక్మెయిల్’లో ఊర్మిళ కనిపించబోతున్నారు. అయితే, సుమారు పదేళ్ల తర్వాత స్క్రీన్ మీదకు వస్తున్న ఊర్మిళ ఆ చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారు! మనసు చివుక్కుమనిపించే విషయమే ఇది. ‘ఆయ్ హాయ్, ఆయ్ హోయ్..’ అంటూ పావనీ పాండే గొంతులోంచి ప్రారంభమయ్యే ఈ పాటలో ఊర్మిళ అచ్చు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాగైతే ఉన్నారో, అలాగే ఉన్నారు! ఆ కళ్లు, హొయలు, అభినయం ఏ మాత్రం ఛేంజ్ కాలేదు. ‘బ్లాక్ మెయిల్’ చిత్రాన్ని అభినయ్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్‌కు ఊర్మిళనే ఎంచుకోడానికి ఆయన స్క్రీన్‌ప్లే ఆయనకుంది. పదేళ్ల అజ్ఞాతం తర్వాత దర్శనం ఇచ్చే ఒక స్టార్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉంటుంది. ఊర్మిళ తప్ప ఇంకెవరూ ఈ పాత్రకు సరిపోరని దేవ్ ముందే డిసైడ్ అయిపోయి, ఆమెను ఒప్పించారట. రామ్‌గోపాల్‌వర్మ ‘రంగీలా’తో వెలుగులోకి వచ్చిన ఊర్మిళ తొంభైలలో పెద్ద స్టార్. ఇప్పుడీ చిత్రంతో ఆమె మళ్లీ తన పూర్వపు అభిమానుల హృదయాలను ఊపిరితో నింపబోతున్నారు. ‘బ్లాక్మెయిల్’ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్, కీర్తీ కుల్హరి నటిస్తున్నారు. ఇదొక క్వర్కీ కామెడీ. కడుపు చెక్కలే. ఆ చెక్కల మధ్య బ్రేక్‌గా ఊర్మిళ వచ్చి పోతారు. -
హాట్ సాంగ్‌లో..
హాట్ గాళ్ ఊర్మిళా మాతోండ్కర్ పేరు చెబితే.. ‘రంగీలా’ (తెలుగులో ‘రంగేళి’) గుర్తుకు రాక మానదు. ఆ చిత్రంలో హాట్ హాట్‌గా నటించిన ఊర్మిళ ఆ తర్వాత కూడా పలు చిత్రాలు చేశారు. కానీ, ‘రంగీలా’ ఆమె కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ హాట్ స్టార్ తాజాగా ఓ హాట్ ఐటమ్ సాంగ్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్లో అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ‘రైతా’ అనే చిత్రంలోనే ఊర్మిళ ప్రత్యేక పాట చేయనున్నారట. అన్నట్లు.. ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. 1998లో వచ్చిన ‘చైనా గేట్’ చిత్రంలో ‘చమ్మా.. చమ్మా..’ అనే ఐటెమ్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
గోల్డ్ అండ్ గ్లామరస్ మనీష్ మల్హోత్రా @ 50
మనీష్ మల్హోత్రా అనేవాడు ఇప్పటికిప్పుడు రిటైర్ అయితే బాలీవుడ్లో సగం మంది ఇళ్ల నుంచి బయటకు రారు. సగం మంది సినిమాలు ఒప్పుకోరు. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్న దాని కంటే అంద విహీనంగా కనిపించి, అసలు రంగు బయటపెట్టేసుకుంటారు. అవును. మనీష్ మల్హోత్రా రెండు విధాలుగా బాలీవుడ్‌ను ప్రభావితం చేస్తున్నాడు. ఒకటి: ఫ్యాషన్ డిజైనర్‌గా, రెండు: కాస్ట్యూమ్ డిజైనర్‌గా. హిందీ సినిమాలను ‘రంగీలా’కు ముందు ‘రంగీలా’కు తర్వాత అని విభజిస్తారు కాస్ట్యూమ్ రంగంలో. ఎందుకంటే ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళా మాతోండ్కర్ కాస్ట్యూమ్స్‌ను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశాడు. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ బాలీవుడ్‌ని చాలా ఆకర్షించాయి. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు మనీష్ కాస్ట్యూమ్స్‌తో కొత్త అందాలను సంతరించుకున్నారు. ‘దిల్ తో పాగల్ హై’లో మాధురీ దీక్షిత్, ‘కుఛ్ కుఛ్ హోతాహై’లో కాజోల్, ‘కహో నా ప్యార్ హై’లో అమీషా పటేల్ వీళ్లంతా హిట్స్ సాధించారు. అయితే కరణ్ జోహార్ భారీ కాస్ట్యూమ్ డ్రామా ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాతో మనీష్ పేరు మార్మోగింది. ఆ తర్వాత అప్పటి నుంచి మొన్నటి ‘బజ్రంగీ భాయ్‌జాన్’ వరకూ మనీష్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకే కాస్ట్యూమ్స్ సిద్ధం చేసే మనీష్ ‘మొహబ్బతే’ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు. ‘చిన్నప్పటి నుంచి నాకు రంగుల మంచి చెడ్డలు తెలుసు. మా అమ్మ ఏదైనా నప్పని చీర కట్టుకుంటే ‘అమ్మా... ఈ చీర కాకుండా వేరే చీర కట్టుకోవచ్చుగా’ అని ప్రాణం తీసేసేవాణ్ణి’ అంటాడు మనీష్. ‘చెట్టు, పుట్ట, ఆకులు, మనుషులు, ప్రకృతి - అన్నీ నన్ను బట్టల రూపకల్పనలో ప్రభావితం చేస్తాయి. ఎవరైనా కష్టపడాల్సిందే. నేనే ఇవాళ ఎంత కష్టపడి ఎంత మంచి డిజైన్‌ను తయారు చేశానా అనేదే చూస్తూ ఉంటాను’ అంటాడతను. ఫ్యాషన్ డిజైనర్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌కు పని తీరులో మార్పు ఏముంటుంది? అని అడిగితే ‘ఫ్యాషన్ డిజైనర్‌గా నా ఊహకు హద్దులు ఉండవు. ఆ స్త్రీ ఏ బట్టల్లో ఎంత అందంగా గొప్పగా ఉంటుందో ఆలోచిస్తాను. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌కు పరిధి ఉంటుంది. ఫలానా సినిమాలో ఫలానా పాత్రకు తగినట్టుగా ఆ హీరోయిన్ని అందంగా చూపించాలి. ‘చమేలీ’ సినిమాలో కరీనా కపూర్ వేశ్య పాత్ర పోషించింది. ఆ పాత్రకు తగినట్టుగా, అంటే ఒక వేశ్యకు తగినట్టుగా ఆమె దుస్తులను సిద్ధం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఫలించి మంచి పేరు వచ్చింది’ అంటాడు మనీష్. ఈ తపన ఉండటం వల్లే మనీష్‌ను బాలీవుడ్లో అందరూ ఇష్టపడతారు. డిసెంబర్ 6న జరిగిన బర్త్‌డే పార్టీకి మహామహులు అందుకే తరలి వచ్చారు. షారుఖ్ ఖాన్, సయీఫ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, విరాట్ కోహ్లి, అనుష్కా శర్మ... ఇలా రానివాళ్లంటూ లేరు. ఆ రాత్రి ముంబాయి రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతూ మురిసిపోతూ ఉండిపోయింది. -
నీ నవ్వు చెప్పింది నాతో...
పాటతత్వం ‘‘అమ్మాయితో పరిచయం..ప్రణయం..పరిణయం.. క్లుప్తంగా ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని అందంగా ఐదు నిమిషాల్లో చెప్పిన గీతమిది’’ అన్నారు రాజ్ మాదిరాజు. నాగార్జున, ఊర్మిళ జంటగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అంతం’. ఈ చిత్రంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘నీ నవ్వు చెప్పింది నాతో..’ అనే పాట రాశారు. ఆర్.డి. బర్మన్ స్వరపరిచిన ఈ పాటతత్వం గురించి ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’ చిత్రాల దర్శకుడు రాజ్ మాదిరాజు మాటల్లో.... ఈ పాట సందర్భం ఏంటంటే... చిన్నప్పట్నుంచీ ఓ మారణాయుధంలా పెంచబడ్డ ఓ అనాథ కుర్రాడు తొలిసారి జీవితంలో అమ్మాయి అనే అందం, సున్నితత్వాలకు పరిచయమవుతాడు. అమ్మాయితో అతడి పరిచయం, స్నేహం, ప్రణయం.. ఒక్కో దశను ఈ పాటలో ఆవిష్కరించారు. పల్లవి: నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ల లోటేమిటో (2) ఓ జంటకు, ఒంటరి జీవితానికీ మధ్య తేడా ఏంటనేది శాస్త్రిగారు ఈ పల్లవిలో అద్భుతంగా చెప్పారు. పాట సందర్భానికి కూడా తగ్గట్టు.. తన పక్కన నడిచే అమ్మాయి నీడ ఇన్నాళ్ల తన జీవితంలో ఉన్న లోటు, అమ్మాయి నవ్వే తానెవ్వరో చెప్పిందంటూ అందంగా వర్ణించారు. చరణం1: నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని (2) నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని అబ్బాయి ఆలోచనలకు, బాధకూ అక్షర రూపం ఈ చరణం. స్నేహంతో అతడికి ఓ అమ్మాయి చేయి అందించింది. అంతకు ముందు ఏ అమ్మాయి తన జీవితంలో లేని విషయాన్ని గుర్తు చేసుకుని ఆ చేతిలో నా గతాన్ని చదివానని చెబుతున్నాడు. అమ్మాయి తన పక్కనే నడుస్తుంటే, ఆ అడుగుల్లో రేపు అనే రోజు ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటాడు. జీవితంలో తోడు లేదంటే నడకలో అలుపు, బతుకులో బరువు తప్పదని ఆ అబ్బాయి తెలుసుకుంటాడు. చరణం2: నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2) వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ నా పెదవిలో దూరి నాకే చిరునవ్వు పుడుతుందనీ నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ.. ఉదయం పూట అమ్మాయిలు ముగ్గులు వేస్తారు. అటువంటిది అమ్మాయి సిగ్గు అబ్బాయి జీవితంలో ముగ్గు పెట్టడం అంటే.. అమ్మాయి రాకతో తన జీవితం ఉదయించిందని చెబుతున్నాడు. ప్రతి ఉదయం అమ్మాయి కనుపాపలో మొదలవ్వాలని ఆశిస్తున్నాడు. జీవితంలో మార్పును ఆహ్వానిస్తున్నాడు. చరణం3: ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో (2) తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలతో ॥నవ్వు...॥ బాధలు, బాధ్యతలతో జీవితం బరువెక్కినప్పుడు మనం ఎవరితోనైనా పంచుకుంటే బరువు తగ్గుతుంది. ఆయుధంలా పెరిగిన ఆ యువకుడి బాధను పంచుకోవడానికి అమ్మాయి వచ్చిందనే విషయాన్నీ చెప్పారు. అదే సమయంలో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారనే అంశాన్ని శృంగారాత్మకంగానూ చెప్పారు. మొదటి చరణంలో అతడు పడిన బాధకు ఇక్కడ ముగింపు పలికారు. ఆర్.డి.బర్మన్ స్వరం, శాస్త్రిగారి సాహిత్యం అద్భుతమైతే... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గానం, ‘ఓ లలాలలా..’ అనే ఆలాపన మహాద్భుతం. ఆయన గానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందమైన ప్రయోగాలు, అద్భుతమైన ప్రతిభావంతుల కలయిక ఈ పాట. దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ పాట నా జీవితంలోనూ మార్పు తీసుకొస్తుందని ఊహించలేదు. (నవ్వుతూ...) అప్పుడు నేను నాగార్జునగారిలా ఉన్నానని గట్టిగా నమ్మేవాణ్ణి. ప్రతి అమ్మాయి దగ్గర ఆగి కళ్లు ఆర్పకుండా చూసేవాణ్ణి. పైగా, అమ్మాయే నన్ను చూసిందని స్నేహితులకు చెప్పేవాణ్ణి. టీనేజ్ నుంచి తలెత్తి ఓ ధిక్కారపు యవ్వనంలోకి వెళ్తున్న సమయం అన్నమాట. టీనేజ్‌లో తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వలన అమ్మాయిల కాళ్లు తప్ప, నేనెప్పుడూ వాళ్ల ముఖాలు చూసింది లేదు. యవ్వనంలో డెనిమ్ జాకెట్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిర్లక్ష్యంగా కాళ్ళను అటోటీ.. ఇటోటీ.. విసిరేస్తూ, నీళ్ళలో నా రోడ్‌స్టార్ షూస్ తడిసేలా నడిచేవాణ్ణి. అప్పుడొచ్చిందీ ‘అంతం’. సినిమా అంతా ఒక ఎత్తయితే.. ఈ పాట ఒక్కటీ మరో ఎత్తు. హాంటింగ్ మెలోడీ అంటే ఏమిటో అప్పుడు నాకు తెలీదు. ఆ ఆలాపన, భావన, సంగీతం మళ్లీ మళ్లీ వినాలని నా మనసులో బలమైన కోరిక. అంతసేపు ఒకే పాట వింటూంటే పిచ్చి ఎక్కాల్సిందిపోయి ఇంకా ఇంకా కావాలని కోరుకునే ఓ అలౌకిక స్థితి. క్యాసెట్‌కి రెండు వైపులా ఈ పాటను రికార్డు చేయించి పెట్టుకున్నాను. పీయస్: ఈ పాట నాపై అంత ప్రభావం చూపించిందని నాకూ తెలీదు. పాడుకుంటూ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేశాను. ఆ ఏడాది మైథిలి పరిచయమైంది. ఇద్దరమూ ఏడడుగులూ వేసి అప్పుడే పదిహేడేళ్లు అయ్యింది. ఇంటర్వ్యూ: సత్య పులగం -
మళ్లీ ఒకసారి...
గాసిప్ బాలనటిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఊర్మిళ మటోంద్కర్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ భాషల్లో కథానాయికగా తన ప్రతిభ చాటుకుంది. ‘రంగీల’ ‘సత్య’ ‘మనీ మనీ’ ‘అనగనగా ఒకరోజు’... ఇలా ఆమె కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. గ్లామర్ పాత్రలే కాదు నాన్గ్లామర్ పాత్రలను పండించడంలో కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. ‘పింజార్’ సినిమాలో హమిదా పాత్రలో ఆమె నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. విక్రమ్ భట్ ‘స్పీడ్’ తరువాత మాత్రం ఆమె కెరీర్ స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. ఫరాఖాన్ ‘ఓమ్ శాంతి ఓం’లో ఒక పాటలో కనిపించింది. ఆ తరువాత ఊర్మిళను ప్రత్యేకంగా గుర్తుంచుకునే సందర్భం, సినిమా ఏదీ రాలేదు. ఇక ఆమె బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లే అనుకున్నారు చాలామంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, వెండితెరపై ఊర్మిళ మరోసారి తన సత్తా చాటనుందని! ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన విందుకు హాజరైంది ఊర్మిళ. కరణ్ జోహర్, జోయా అక్తర్...మొదలైన వారు కూడా ఈ విందుకు హాజరయ్యారు. అందరూ ఏకకంఠంతో అన్నమాట ఏమిటంటే-‘‘ఊర్మిళలో గ్లామర్ పెరిగిందేగానీ తరగలేదు’’ అని! ఊర్మిళ కోసం కరణ్ జోహర్ మంచి కథ ఒకటి సిద్ధం చేశాడట. అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరిగితే...ఈ రంగీలా పిల్ల మరోసారి వెండితెరపై కనువిందు చేయవచ్చు! -
ముగ్గురు రైతుల బలవన్మరణం
వరంగల్: అప్పుల బాధతో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా కాటారానికి చెందిన గోగుల రాజబాబు(26) గతేడాది మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతానికి వెళ్లి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడికి రూ.2 లక్షలు అప్పు చేశాడు. కానీ, పంట పండలేదు. ఈ ఏడాది కాటారంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మళ్లీ పత్తి వేశాడు. పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. మెుత్తం అప్పు రూ.3.50 లక్షలకు చేరింది. ఆశించిన మేర రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదన చెందాడు. రాజబాబు మంగళవారం సమీప అటవీ ప్రాంతంలో ఉరేసుకున్నాడు. అతడికి భార్య శారద, కుమారుడు ఉన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన ముక్కాంల లింగమ్మ (48), భర్త లింగయ్యతో కలిసి వ్యవసాయం చే స్తోంది. తమకున్న 5 ఎకరాలతోపాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వరిని సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లోనే పురుగులమందు తాగింది. అలాగే, వరంగల్ జిల్లా ములుగు మండలం జంగాలపల్లికి చెందిన రేగుల ఊర్మిళ(35), సదయ్య దంపతులు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. భర్త సదయ్య కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఊర్మిళ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రబీలో నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేసింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షంతో పంట నేలవాలింది. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ సోమవారం రాత్రి వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. -
భర్త ఇంటి ఎదుటే ఊర్మిళ దీక్ష
తుంగతుర్తి : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. తల్లిదండ్రులు నిరాకరించారని కాదు పొమ్మన్నాడు.. దీంతో తనకు న్యాయం చేయాలని భార్య ఆ భర్త ఇంటి ఎదుటే మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన తుంగతుర్తి మండలం పసునూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేపాక శ్రీరాములు రెండో కుమారుడు సందీప్ కుమార్ మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన ఊర్మిళతో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఈ ఏడాది జనవరి 22న అక్కడే ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కొంత కాలం వరకు అక్కడే కాపురం కూడా చేశారు. ఇటీవల సందీప్ తన భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతడి తల్లిదండ్రులు పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో ఊర్మిళను అప్పటి నుంచి సందీప్ అతడి కుటుంబ సభ్యులు వేధించసాగారు. సందీప్ తన నుంచి విడిపోవాలని ఊర్మిళను ఒత్తిడి చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో మూడు రోజుల క్రితం ఊర్మిళను పసునూరులోనే వదిలి సందీప్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అయితే అప్పటి నుంచి భర్త ఇంటి ఎదుటే ఊర్మిళ దీక్ష చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అటు తల్లిదండ్రులు రానివ్వడం లేదని.. ఇటు చూస్తే తనకు వద్దంటూ భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని.. న్యాయం జరగకుంటే చావు తప్ప వేరే మార్గం లేదని ఊర్మిళ విలపిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. -
డి.గొటివాడలో డెంగ్యూ
వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో నలుగురు ఇంటింటా జ్వరపీడితులు గ్రామంలో కొరవడిన పారిశుద్ధ్యం వైద్య సేవలందిస్తున్నా తగ్గని జ్వరాలు భయాందోళనలో గ్రామస్తులు మాడుగుల: మండలంలోని డి.గొటివాడ వాసులు మంచం పట్టారు. పది రోజులుగా జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. ప్రతి ఇంటా ఒకరిద్దరు బాధితులు కనిపిస్తారు. గ్రామానికి చెందిన చినబ్బాయి, తణుకు నాని, షేక్‌సల్మాన్, దండి స్వరూప్‌లు డెంగ్యూ లక్షణాలతో ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో సుమారు 1200 మంది ఉన్నారు. గ్రామమంతటా పారిశుద్ధ్యం కొరవడింది. ఎక్కడికక్కడ మురుగునీరు రోడ్లపై కనిపిస్తుంది. దీనికి వర్షాలు తోడవ్వడంతో పరిస్థితి దయనీయంగా ఉంది. గ్రామంలో ప్రస్తుతం వంతాలముసమ్మ, దండిరాజు, దండి ఉపేంద్ర, రోబ్బా గోసమ్మ, వంజుల బాపనమ్మ, సీకూరు శ్రీను, రొబ్బా మహేష్‌లతో పాటు పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. కేజేపురం పీెహ చ్‌సీ వైద్యులు గ్రామానికి వచ్చి సేవలు అందిస్తున్నప్పటికీ వ్యాధులు అదుపులోకి రావడం లేదు. ఇదే విషయాన్ని ఎస్పీహెచ్ఓ శ్రావణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా, గ్రామంలో జ్వరాల తీవ్రత వాస్తవమే అన్నారు. ఒకటి రెండు డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చాయని, నాలుగు రోజులుగా ఇంటింటికి తిరిగి వైద్యం అందిస్తున్నామన్నారు. సోమవారం నుంచి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. గొందిమెలకలో జ్వరాలు జి.మాడుగుల: మండలంలోని వంజరి పంచాయతీ గొందిమెలకలో రెండు రోజులుగా 10 మంది జ్వరాలతో బాధపడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఊర్మిళ తెలిపారు. గ్రామస్తులు రక్షిత తాగునీటి సదుపాయానికి నోచుకోలేదన్నారు. ఈ కారణంగానే వ్యాధులకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. జ్వరంతో మహిళ మృతి అనంతగిరి : మండలంలోని పెదకోటలో కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ ఆదివారం చనిపోయిందని సీపీఎం నాయకులు డి.గంగారాజు.జంగం పెంటన్నదొర, ఎన్.సింహచలం తెలిపారు. గ్రామానికి చెందిన తావు సన్యాసమ్మ (45) వారం రోజులుగా జ్వరం లక్షణాలతో మంచం పట్టింది. సమీపంలోని పినకోట పీహెచ్‌సీకి వెళితే వైద్యాధికారి అందుబాటులో లేకుండాపోయారని వారు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో దేవరాపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆదివారం చనిపోయిందన్నారు. సన్యాసమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళుతున్నట్టు వారు తెలిపారు. -
ఈ రోజు నాకు రెండు పండగలు: సింగీతం
‘‘సింగీతం శ్రీనివాసరావు అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలెప్పుడూ పది, పదిహేనేళ్లు ముందుంటాయి. అంత ఫార్వార్డ్‌గా ఆలోచించడం ఆయన గొప్పదనం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరచడం గొప్ప విషయం’’ అన్నారు డా.దాసరి నారాయణరావు. శాండల్‌వుడ్ మీడియా పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారతి, భారతీకృష్ణ నిర్మించిన చిత్రం ‘వెల్కమ్ ఒబామా’. ఊర్మిళ, రేచల్, ఎస్తబన్, సంజీవ్, భువనచంద్ర, అనంతశ్రీరామ్, నిరంజని, ఆర్జే బాషా ముఖ్య తారలు. ఇటీవల హైదరాబాద్‌లో పలువురు చిత్రరంగ ప్రముఖుల కోసం ఈ చిత్రం ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని తిలకించిన దాసరి పై విధంగా స్పందించారు. వాణిజ్య అంశాలతో పాటు మంచి విలువలున్న చిత్రమని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సింగీతం మాట్లాడుతూ - ‘‘ఈ రోజు నాకు రెండు పండగలు. ఒకటి వినాయక చవితి అయితే మరొకటి ‘వెల్కమ్ ఒబామా’కు దక్కుతున్న ప్రశంసలు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆ తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తాం. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ టీవీ చానల్ ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకుంది. సింగీతంగారి దర్శకత్వం, ఆయన స్వరపరచిన పాటలు, కథ, నిర్మాణ విలువలు.. ఇవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి: కెమెరా: ఎస్.ఎస్. ధర్మన్, ఎడిటింగ్: సూర్య, ఆర్ట్: వర్మ, మాటలు: రోహిణి, కథ-సంగీతం-పాటలు-దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు. -
పాటలకు ‘వెల్కమ్ ఒబామా’
పయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వెల్కమ్ ఒబామా’. ఎస్.భారతి, కృష్ణ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఊర్మిళ, సంజీవ్, రేచల్, భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి ముఖ్య తారలు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సింగీతం ఓ కావ్యంలాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రోహిణి స్క్రిప్ట్ ఈ చిత్రానికి బలం. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. సింగీతమే సంగీతం అందించారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో పాటలను విడుదల చేస్తున్నాం. సింగీతంగారితో పనిచేసిన ప్రముఖ హీరోలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని తెలిపారు.