హ్యాండ్ పెయింట్స్‌లో మనదైన ఆత్మ కనిపిస్తుంటుంది. ఫ్యాబ్రిక్‌నే కాన్వాస్‌గా మలిచి, రంగుల కలయికతో కూర్చి తీర్చిదిద్దిన డిజైన్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. ఏ డిజైన్‌కి అదే ప్రత్యేకత. ఇక అవి గతం నుంచి ప్రేరణ పొందినవైతే అలనాటి హుందాతనాన్నీ, గాంభీర్యాన్నీ ఆహ్లాదాన్ని మనకూ పంచుతాయి.
సాగరిక ఘాట్గే భారతీయ నటి, మోడల్ కూడా. ఆమె తన తల్లి ఊర్మిళ ఘాట్గేతో కలిసి ఫ్యాబ్రిక్‌పై చేసిన హ్యాండ్ పెయింట్ అందాన్ని కిందటేడాది డిసెంబర్ నుంచి ‘అకూటీ’ ద్వారా మన కళ్లకు కడుతున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉండే ఊర్మిళ ఘాట్గే, సాగరిక ఘాట్గే. తమ సొంత లేబుల్‌తో హ్యాండ్‌పెయింట్ చీరలు, బ్లేజర్లు, దుపట్టాలు, సల్వార్‌సెట్‌లు డిజైన్ చేస్తున్నారు. ప్రకృతి సంబంధించిన మోటిఫ్‌లతో మన కళ్లకు కడుతున్నారు ఈ తల్లీకూతుళ్లు.
తల్లి పెయింటింగ్స్ నుంచి ప్రేరణ పొంది అందరి ముందుకు వాటిని తీసుకు రావడంలో చేసిన ప్రయత్నాన్ని ఎంతో ఆనందంగా మనకు పరిచయం చేస్తారు సాగరిక. ‘నా చిన్నతనంలో మా కుటుంబంలో స్త్రీలు షి΄ాన్లు, టిష్యూలు, బ్రోకేడ్‌లను ధరించే విధానం, వారి ఆభరణాలు.. ఎంతో అందంగా కనిపించేవి. మా అమ్మ మహారాష్ట్రలోని రాచకుటుంబానికి చెందిన వ్యక్తి. కొల్హాపూర్‌లో తన గార్డెన్‌లో ఆమె పెంచిన పూల తోటలో ఎన్నో పూలు ఆమె అభిరుచికి అద్దం పట్టేలా ఉండేవి. నా చిన్నతనంలో మా అమ్మ వేసే పెయింటింగ్స్, బట్టల ముక్కలను కళాత్మక కళాఖండాలుగా మార్చే విధానం ఆశ్చర్యాన్ని కలిగించేది.
ప్రకృతిని ఇష్టపడి ఆమె చేతితో చేసిన పెయింట్ పూల నమూనాలు ఆమె ధరించిన వస్త్రాలపైకి వచ్చేవి. కొన్నాళ్లకు అవి ఆమె బ్రాండ్‌గా పేరొందాయి. దానికి జీవం పోయడానికి కొంతమంది కళాకారులకు శిక్షణ ఇచ్చింది. ఈ రోజు ‘అకూటి’ పేరుతో రిచ్ టెక్స్‌టైల్స్, హ్యాండ్‌పెయింటెడ్ గార్మెంట్స్‌తో కొలువుదీరింది. నా కుటుంబంలోని ప్రసిద్ధ మహిళల చుట్టూ రూపొందించబడిన ఈ బ్రాండ్ మా మూలాలకు కట్టుబడి ఉంటుంది. నిజమైన అందం, గాంభీర్యం ఈ డిజైన్లలో ప్రతిఫలిస్తుంటుంది. ఆకూటీలో చీరలు, కో–ఆర్డ్ సెట్‌లు, బ్లేజర్లు, దుపట్టాలు, సల్వార్ సెట్స్ ఉన్నాయి. అన్నీ ప్రకృతికి సంబంధించిన మోటిఫ్‌లతో చేతితో పెయింట్ చేయబడ్డాయి’ అంటూ తమ ఫ్యాబ్రిక్ కళను పరిచయం చేస్తున్నారు.
ఇవి చదవండి: Tech Talk: యూట్యూబ్‌లో కామెంట్‌ను ఎడిట్, డిలీట్ చేయడానికి..
Comments
Please login to add a commentAdd a comment