
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు జేడీ వాన్స్ బహిరంగంగా తన భార్య ఉషను ప్రశంసిస్తూ పొగడ్తలతో మంచెత్తుతుంటారు. అంతేగాదు తన కెరీర్‌లోని ప్రతి విషయంలోనూ ఆమె అండగా ఉంటుందని చెబుతుంటారు కూడా. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి ఉషా కూడా ప్రతి వేడుకలో వాన్స్‌తో జతగా కనిపిస్తూ..వార్తల్లో హైలెట్ అవుతున్నారు. ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఇవాంక ఉషా వాన్స్ గురించి చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపి గందరగోళానికి గురిచేసింది. అయినా ఇలా ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే అవమాన పరిచేలా ఫోటోలు షేర్ చేశారేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇవాంక పోస్ట్‌లో జరిగిన తప్పిదం ఏంటంటే..
డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే పోస్ట్ పెట్టినా.. అది వివాదాస్పదమైంది. ఇవాంక ఆ పోస్ట్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్యని ప్రశంసిస్తూ.. ఆమెలోని అపారమైన దయ, గొప్ప తెలివితేటలు ఎవ్వరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిష్ణాతురాలైన న్యాయవాది కూడా అంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తూ..మార్ఫింగ్ చేసి ఉన్న జేడీ వాన్స్ ఫోటోని షేర్ చేశారు.
దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదేం పని ఇవాంకా అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణేకి సంబంధించిన ఫోటోని ఉషా వ్యాన్స్‌గా మార్ఫింగ్ చేసిన ఫోటోని ఎలా పోస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతలా ఇవాంక పోస్ట్ వివాదాస్పదమై నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం మార్ఫింగ్ ఫోటో అనే కాదు.
Usha Vance is a brilliant and accomplished attorney known for her intelligence, grace, and support for her husband, J.D. Vance. Her beauty is matched by her poise and dedication, making her an inspiring figure. pic.twitter.com/Wm56FK0uCq
— Ivanka Trump 🇺🇲 🦅 News (@IvankaNews_) March 23, 2025
ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అందర్నీ ఆకర్షించిన దీపకా పదుకొణే ఎవర్‌గ్రీన్ స్టైల్ అది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అబూ జని సందీప్ ఖోస్లా చేతి నుంచి జాలువారిని అద్భుత కళా రూపమే ఈ స్టైలిష్ చీర. ఇది అక్కడున్న వారందర్నీ ఆహా భారతీయుల చీరకట్టుకి మించిన ఫ్యాషన్ మరొకటి లేదనిపించేలా చేసింది. అంతలా ఆకర్షించినా ఆ ఫ్యాషన్ వేర్‌ని మార్ఫింగ్ చేసినట్లు ఉన్న ఉషా వాన్స్ ఫోటో అని క్లియర్‌గా స్పష్టమవుతండగా ఇవాంకాకు ఎలా తెలియకుండా పోయిందన్నది నెటిజన్ల వాదన.
అది కూడా ఒకరిని వ్యక్తిగతంగా ప్రశంసించేటప్పడూ.. ఎంత గౌరవప్రదంగా ఉండే ఫోటోని జత చేస్తూ పోస్ట్ పెట్టాలి అని కామెంట్ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫోటో జత చేయాలి లేదంటే అది ప్రశంసలా అస్సలు ఉండదని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఒక్కోసారి కొద్దిపాటి నిర్లక్ష్యం.. మంచిని కూడా చెడుగా చిత్రీకరించేస్తుంది అంటే ఇదే కదా..!.
(చదవండి: భారతదేశ సంప్రదాయ పానీయం గోలిసోడా..అమెరికా, బ్రిటన్‌లో పెరుగుతున్న క్రేజ్)
Comments
Please login to add a commentAdd a comment