ఇవాంక సదస్సు నుంచి దీపిక ఎగ్జిట్‌?  | After Padmavati Row, Deepika Padukone Exits Ivanka Trump Summit | Sakshi
Sakshi News home page

పద్మావతి ఎఫెక్ట్‌: ఇవాంక సదస్సు నుంచి దీపిక ఎగ్జిట్‌? 

Published Tue, Nov 21 2017 11:11 AM | Last Updated on Tue, Nov 21 2017 12:09 PM

 After Padmavati Row, Deepika Padukone Exits Ivanka Trump Summit - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ ముఖ్య అతిథిగా నగరంలో నిర్వహించబోయే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు  పద్మావతి చిత్ర సెగ తగిలినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సదస్సులో పద్మావతి చిత్ర హీరోయిన్‌, ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకునే పాల్గొని చర్చాగోష్టిలో ‘హాలీవుడ్‌ టు నాలీవుడ్‌ టు బాలీవుడ్‌’అనే అంశంపై ప్రసంగించాల్సి ఉంది. 

కానీ ఆమె ఈ కార్యక్రమం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. దీనికి కారణం పద్మావతి చిత్రంపై జరగుతున్న అల్లర్లేనని తెలుస్తోంది. డిసెంబర్‌1 విడుదల కావల్సిన ఈ చిత్రంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నిషేదించాలని రాజ్‌పుత్‌లు, కొంత మంది బీజేపీ నాయకులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇంకొంత మంది డైరెక్టర్‌ భన్సాలీ, దీపికను చంపితే 10 కోట్లు నజరానా ఇస్తామని ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యానే దీపిక ఈ సదస్సు నుంచి తప్పుకుందని, నిరసన కారులు సదస్సును అడ్డుకుంటారని నిర్వహకులే ఆమెను తప్పించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement