
ప్రపంచ వ్యాప్తంగా బార్బీయ మేనియా కమ్మేసింది. మన దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్ సినిమాల బార్బీఫైడ్ సీన్‌లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ‘ఓంశాంతి ఓం’ సినిమాలోని ‘ఫిర్ మిలేంగే ఛల్తే ఛల్తే’ పాటను బార్బీఫైడ్ చేశారు. పింక్ కోర్టులో షారుఖ్‌ఖాన్, దీపిక పదుకొణె బ్యాడ్మింటన్ ఆడుతూ పాడుతుంటారు. అయితే అది ‘ఫిర్ మిలేంగే...’ పాట కాదు.
ఇంగ్లీష్ సాంగ్ రైటర్, సింగర్ దువ లిపా ‘బార్బీ’ సినిమా సౌండ్ ట్రాక్ కోసం రాసిన ‘బేబీ, యూ కెన్ ఫైండ్ మీ అండర్ ది లైట్స్/డైమండ్స్ అండర్ మై ఐస్’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటుంది. ఈ పాట నేపథ్యంలో షారుఖ్, దీపికాలను ‘బార్బీ’ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన మార్గోవ్ రాబీ(బార్బీ), రెయాన్ గాస్లింగ్ (కెన్)లుగా ఊహించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment