Shah Rukh Khan Shirtless Pic Leaked From Pathaan Movie, Photo Viral On Social Media - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: 8ప్యాక్స్‌ బాడీతో షాకిచ్చిన షారుక్‌... ఫోటో వైరల్‌

Published Wed, Mar 16 2022 12:33 PM | Last Updated on Wed, Mar 16 2022 12:54 PM

Pathaan: Shah Rukh Khan Shirtless Pic From Spain Shooting Goes Viral - Sakshi

Shah Rukh Khan Shirtless Pic From Spain Shooting Goes Viral: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత నటిస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్‌లో షారుక్‌ పఠాన్‌ అనే యాక్షన్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ షరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న షారుక్‌ లేటెస్ట్‌ ఫోటో ఒకటి లీక్‌ అయ్యింది.

ఇందులో కండలు తిరిగిన దేహంతో 8ప్యాక్స్‌ బాడీతో షారుక్‌ కనిపించాడు.షూటింగ్‌ లొకేషన్‌లో చొక్కా లేకుండా పొడవాటి జుట్టుతో షారుక్‌ దర్శనమిచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. షారుక్‌ 8ప్యాక్స్‌ బాడీని చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 57ఏళ్ల షారుక్‌ ఇప్పటికీ యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారని, ఏజ్‌ ఈస్‌ జస్ట్‌ ఏ నెంబర్‌ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. మరోవైపు షారుక్‌ సొంతంగా SRK+ అనే ఓటీటీని నెలకొల్పుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఒటీటీ ప్లాట్‌ఫాం ద్వారా షారుక్‌ తన పఠాన్‌ మూవీని విడుదల చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement