Hand paints
-
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్‌కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్‌వర్క్‌కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్‌కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. పెయింటింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్‌గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్‌ది. -
చూపులను కట్టడి చేసేలా!
హ్యాండ్ పెయింట్స్‌లో మనదైన ఆత్మ కనిపిస్తుంటుంది. ఫ్యాబ్రిక్‌నే కాన్వాస్‌గా మలిచి, రంగుల కలయికతో కూర్చి తీర్చిదిద్దిన డిజైన్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. ఏ డిజైన్‌కి అదే ప్రత్యేకత. ఇక అవి గతం నుంచి ప్రేరణ పొందినవైతే అలనాటి హుందాతనాన్నీ, గాంభీర్యాన్నీ ఆహ్లాదాన్ని మనకూ పంచుతాయి.సాగరిక ఘాట్గే భారతీయ నటి, మోడల్ కూడా. ఆమె తన తల్లి ఊర్మిళ ఘాట్గేతో కలిసి ఫ్యాబ్రిక్‌పై చేసిన హ్యాండ్ పెయింట్ అందాన్ని కిందటేడాది డిసెంబర్ నుంచి ‘అకూటీ’ ద్వారా మన కళ్లకు కడుతున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉండే ఊర్మిళ ఘాట్గే, సాగరిక ఘాట్గే. తమ సొంత లేబుల్‌తో హ్యాండ్పెయింట్ చీరలు, బ్లేజర్లు, దుపట్టాలు, సల్వార్సెట్లు డిజైన్ చేస్తున్నారు. ప్రకృతి సంబంధించిన మోటిఫ్‌లతో మన కళ్లకు కడుతున్నారు ఈ తల్లీకూతుళ్లు.తల్లి పెయింటింగ్స్ నుంచి ప్రేరణ పొంది అందరి ముందుకు వాటిని తీసుకు రావడంలో చేసిన ప్రయత్నాన్ని ఎంతో ఆనందంగా మనకు పరిచయం చేస్తారు సాగరిక. ‘నా చిన్నతనంలో మా కుటుంబంలో స్త్రీలు షి΄ాన్లు, టిష్యూలు, బ్రోకేడ్లను ధరించే విధానం, వారి ఆభరణాలు.. ఎంతో అందంగా కనిపించేవి. మా అమ్మ మహారాష్ట్రలోని రాచకుటుంబానికి చెందిన వ్యక్తి. కొల్హాపూర్‌లో తన గార్డెన్లో ఆమె పెంచిన పూల తోటలో ఎన్నో పూలు ఆమె అభిరుచికి అద్దం పట్టేలా ఉండేవి. నా చిన్నతనంలో మా అమ్మ వేసే పెయింటింగ్స్, బట్టల ముక్కలను కళాత్మక కళాఖండాలుగా మార్చే విధానం ఆశ్చర్యాన్ని కలిగించేది.ప్రకృతిని ఇష్టపడి ఆమె చేతితో చేసిన పెయింట్ పూల నమూనాలు ఆమె ధరించిన వస్త్రాలపైకి వచ్చేవి. కొన్నాళ్లకు అవి ఆమె బ్రాండ్‌గా పేరొందాయి. దానికి జీవం పోయడానికి కొంతమంది కళాకారులకు శిక్షణ ఇచ్చింది. ఈ రోజు ‘అకూటి’ పేరుతో రిచ్ టెక్స్టైల్స్, హ్యాండ్పెయింటెడ్ గార్మెంట్స్‌తో కొలువుదీరింది. నా కుటుంబంలోని ప్రసిద్ధ మహిళల చుట్టూ రూపొందించబడిన ఈ బ్రాండ్ మా మూలాలకు కట్టుబడి ఉంటుంది. నిజమైన అందం, గాంభీర్యం ఈ డిజైన్లలో ప్రతిఫలిస్తుంటుంది. ఆకూటీలో చీరలు, కో–ఆర్డ్ సెట్లు, బ్లేజర్లు, దుపట్టాలు, సల్వార్ సెట్స్ ఉన్నాయి. అన్నీ ప్రకృతికి సంబంధించిన మోటిఫ్‌లతో చేతితో పెయింట్ చేయబడ్డాయి’ అంటూ తమ ఫ్యాబ్రిక్ కళను పరిచయం చేస్తున్నారు.ఇవి చదవండి: Tech Talk: యూట్యూబ్‌లో కామెంట్‌ను ఎడిట్, డిలీట్ చేయడానికి.. -
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పెయింట్ పట్టు
చీరకు ప్రాణం వస్తే అది రవివర్మ చిత్రం!చీరపై చిత్రాన్ని గీస్తే అది రవివర్మకే విచిత్రం! స్త్రీని, ప్రకృతిని కలిపి అలా గీసినఈ హ్యాడ్ పెయింట్..ప్లెయిన్ పట్టు చీరలు పెళ్లిళ్లలో.. ఫంక్షన్లలో..రిసెప్షన్.. సంగీత్..ఇంకా కాక్టైల్ పార్టీలలో మీకు తెలియకుండానేమీ చేత క్యాట్‌వాక్ చేయిస్తాయి.మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గానిలబెడతాయి. చీరే కాన్వాస్ స్పెషల్‌గా కనిపించాలంటే అందరూ ఎంచుకునేవి, ట్రెండ్‌లో ఉన్నవి, రెగ్యులర్ మార్కెట్లో ఉన్నవి పక్కన పెట్టేయాలి. ‘కళ’కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకే ఒక పీస్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం కాటన్, ఆర్గంజా చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింట్ చూశాం. అలాంటి చీరలు కట్టుకున్నాం. అదే తరహాలో పూర్తి ప్లెయిన్ పట్టు చీరను ఎంచుకొని దాని మీద చేత్తో పెయింట్ వేయడంతో ఇలా సరికొత్తగా ఆకట్టుకునేలా రెడీ అయ్యాయి. పక్షులు, లతలు, పువ్వులు.. ఇలా అభిరుచిని బట్టి వేసుకున్న లేదా వేయించిన పెయింటింగ్ శారీని కట్టుకుంటే వందమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్యూర్ ప్లెయిన్ పట్టు చీరలు నాలుగైదు వేల రూపాయల్లో లభిస్తాయి. వీటిపై చేసిన హ్యాండ్ పెయింటింగ్‌ని బట్టి ధర వేలల్లో ఉంటుంది ►ప్రింట్ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉండాలి. కొంత డిజైన్ కావాలనుకుంటే లేస్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకోవచ్చు ►చీర ప్రత్యేకత తగ్గకూడదు కాబట్టి ఇలాంటి స్పెషల్ వేర్కి బంగారు ఆభరణాలు పూసల హారాలను ఎంచుకోవాలి. వాటిలో ముత్యాలు, కెంపులు, పచ్చలు.. వంటి బీడ్స్ హారాలు తీసుకోవాలి ►చేతులకు గాజులు కాకుండా ఒక చేతికి బ్రేస్లెట్, మరో చేతికి మంచి వాచీ ధరించాలి. మోడ్రన్ క్లచ్ చేత్తో పట్టుకోవాలి ►కేశాలంకరణకు వస్తే జుట్టును ముడివేయకుండా వదిలేయాలి. లేదంటే, ప్రెంచ్ ప్లాట్ వంటి పాశ్చాత్య హెయిర్‌స్టైల్స్‌ను మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు ►ఫ్రింట్‌ని హైలైట్ చేయాలనుకుంటే మిగతా మన అలంకరణ అంతా సింపుల్‌గా ఉండాలి మేకప్‌తో సహా! -
హస్త వర్ణాలు
ఆ చేతులు కదిలితే ప్రపంచం చేతులెత్తి జై కొడుతోంది. ఆ చేతలే చే‘నేత’లై ఫ్యాషన్ ధోరణుల్ని తిరగరాస్తున్నాయి. కొమ్ములు తిరిగిన డిజైనర్లు సైతం సొమ్ములు కావాలంటే తమను ఆశ్రయించాల్సిందే అని శాసిస్తూ... అద్భుతాలను అలవోకగా ఆవిష్కరిస్తూ... హస్తవర్ణాల శోభితమై కొత్త కాంతులీనుతున్నాయి. ఆ చేతులకూ... ఆ చేతలకూ... మన చేనేతల ఘనతకూ ఇవి కొన్ని మెచ్చు తునకలు మాత్రమే... మన చేనేతలు ప్రపంచానికే ప్రత్యేకం సంప్రదాయ చేనేతల గొప్పదనాన్ని వెలికితీయడమే నా ఉద్దేశ్యం. ఇటీవల ‘కౌసల్యం’ పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాషన్ షో లో ప్రదర్శించిన వస్త్ర శైలులు ఇవి. దాదాపు 700కు పైగా చేనేతకారుల నైపుణ్యాలు ఈ డిజైనరీ దుస్తులలో ప్రతిఫలిస్తాయి. జమదాని చేనేత పనితనం ఇక్కడే కాదు దేశం మొత్తం మీద, ఇతర దేశాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల జరిగిన లాక్మేఫ్యాషన్ వీక్‌లోనూ, బెర్లిన్‌లో జరిగిన లవేరా ఎకో ఫ్యాషన్ వీక్‌లోనూ చేనేతలు తమ ప్రత్యేకతను నిలుపుకున్నాయి. ఫ్యాషన్ ప్రపంచానికి ఓ ఐకాన్‌గా గుర్తింపును సాధిస్తున్నాయి మన హ్లాండ్లూమ్స్! - గౌరంగ్ షా, ఫ్యాషన్ డిజైనర్ బంగారు జరీ అంచు.. ఆకట్టుకునే రంగులతో రూపొందించిన లెహంగా ఛోలీ ప్రతి వేడుకను దేదీప్యం చేస్తుంది. కాటన్ హ్యాండ్లూమ్ శారీ మీద సన్నని ప్రింట్. నేటి మహళను హుందాగా నిలపడంలో ఎప్పుడూ ముందుంచే ‘కళ’నేత. చూపులను కట్టడి చేసే రంగుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ పనితనం పెళ్లికూతురు సింగారంలో హైలైట్‌గా నిలుపుతాయి. బ్రైడల్ కలెక్షన్లో భాగంగా లెహంగా చోళీతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. సంప్రదాయకట్టు, పాశ్చాత్య కట్... ఇంపైన నిండుతనాన్ని కలిగించే చేనేతలు ప్రతి వేడుకలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటాయి. డిజైనర్ల సృష్టికి జోహార్లు చెబుతాయి.