హస్త వర్ణాలు
ఆ చేతులు కదిలితే ప్రపంచం చేతులెత్తి జై కొడుతోంది. ఆ చేతలే చే‘నేత’లై ఫ్యాషన్ ధోరణుల్ని తిరగరాస్తున్నాయి. కొమ్ములు తిరిగిన డిజైనర్లు సైతం సొమ్ములు కావాలంటే తమను ఆశ్రయించాల్సిందే అని శాసిస్తూ... అద్భుతాలను అలవోకగా ఆవిష్కరిస్తూ... హస్తవర్ణాల శోభితమై కొత్త కాంతులీనుతున్నాయి. ఆ చేతులకూ... ఆ చేతలకూ... మన చేనేతల ఘనతకూ ఇవి కొన్ని మెచ్చు తునకలు మాత్రమే...
మన చేనేతలు ప్రపంచానికే ప్రత్యేకం
సంప్రదాయ చేనేతల గొప్పదనాన్ని వెలికితీయడమే నా ఉద్దేశ్యం. ఇటీవల ‘కౌసల్యం’ పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాషన్ షో లో ప్రదర్శించిన వస్త్ర శైలులు ఇవి.
దాదాపు 700కు పైగా చేనేతకారుల నైపుణ్యాలు ఈ డిజైనరీ దుస్తులలో ప్రతిఫలిస్తాయి. జమదాని చేనేత పనితనం ఇక్కడే కాదు దేశం మొత్తం మీద, ఇతర దేశాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల జరిగిన లాక్మేఫ్యాషన్ వీక్‌లోనూ, బెర్లిన్‌లో జరిగిన లవేరా ఎకో ఫ్యాషన్ వీక్‌లోనూ చేనేతలు తమ ప్రత్యేకతను నిలుపుకున్నాయి. ఫ్యాషన్ ప్రపంచానికి ఓ ఐకాన్‌గా గుర్తింపును సాధిస్తున్నాయి మన హ్లాండ్లూమ్స్!
- గౌరంగ్ షా, ఫ్యాషన్ డిజైనర్
బంగారు జరీ అంచు.. ఆకట్టుకునే రంగులతో రూపొందించిన లెహంగా ఛోలీ ప్రతి వేడుకను దేదీప్యం చేస్తుంది.
కాటన్ హ్యాండ్లూమ్ శారీ మీద సన్నని ప్రింట్. నేటి మహళను హుందాగా నిలపడంలో ఎప్పుడూ ముందుంచే ‘కళ’నేత.
చూపులను కట్టడి చేసే రంగుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ పనితనం పెళ్లికూతురు సింగారంలో హైలైట్‌గా నిలుపుతాయి. బ్రైడల్ కలెక్షన్‌లో భాగంగా లెహంగా చోళీతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.
సంప్రదాయకట్టు, పాశ్చాత్య కట్... ఇంపైన నిండుతనాన్ని కలిగించే చేనేతలు ప్రతి వేడుకలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటాయి. డిజైనర్ల సృష్టికి జోహార్లు చెబుతాయి.