అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
Published
Fri, Jul 19 2024 10:22 AM
| Last Updated on Fri, Jul 19 2024 5:07 PM
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.
రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్ చేయడానికి
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.
రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్‌కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్‌వర్క్‌కు కేటాయించినట్టుగా వివరించింది.
కోల్‌కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. పెయింటింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్‌గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్‌ది.