Lehanga
-
నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..
ఓ టెక్కీ ఫ్యాషన్ రంగంలోకి అడుపెట్టి అద్భుతమైన డిజైన్లను క్రియేట్ చేసి ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చాడు. మహామహా ఫ్యాషన్ డిజైనర్లకు పోటీ ఇచ్చేలా లెహాంగాలు తీర్చిదిద్ది ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏడాదికి రూ 5 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతూ స్టైలిష్ రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఎవరతను..? ఎలా ఈ రంగంలోకి వచ్చారు. మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, నాన్సి త్యాగి వంటి ప్రముఖ డిజైనర్లు భారతీయ ఫ్యాషన్‌ని తమదైన శైలిలో పునర్నిర్వచించారు. ఆ కోవలోకి సూరత్‌కి చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మయూర్ భరత్‌భాయ్(Mayur Bharatbhai) కూడా చేరిపోయాడు. ఆయన మహిళల కోసం తయారు చేసే ప్రసిద్ధ పెళ్లి లెహంగాల(Lehenga Business) బీఎల్ ఫ్యాబ్రిక్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ మూడు రకాల ఎంబ్రాయిడరీ లెహంగాలను తయారు చేస్తుంది. థ్రెడ్‌వర్క్, జరీ వర్క్, సీక్విన్ వర్క్‌లతో రూపొందిస్తుంది. ఈ కంపెనీకి చెందిన సెమీ-స్టిచ్డ్ లెహంగాలు చాలా సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి. ఈస్టార్టప్ వెంచర్ తన ఉత్పత్తులను సాంప్రదాయ మార్కెట్ల కంటే దాదాపు 65% నుంచి 70% వరకు తక్కువ ధరకే విక్రయిస్తుంది. అంతేగాదు వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో లెహంగాలను డిజైన్ చేయించుకునే వెసులబాటు కూడా అందిస్తోది. అందుకోసం ఈ కంపెనీలో దాదాపు 25 మంది అంతర్గత కళాకారుల బృందం ఉంటారు. ప్రస్తుతం ఈ ఎల్బీ ఫ్యాబ్రిక్ వద్ద దాదాపు 200 డిజైన్ల అద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయి ప్రారంభమైంది..మయూర్ తన దుస్తుల వ్యాపారాన్ని 2021లోనే ప్రారంభించారు. అంతకుముందు తన సోదరుడి దుస్తుల వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేశారు. ఆయన సృజనాత్మకతతో కూడిన పనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ ఆసక్తే ఆయన్ను సాఫ్ట్వేర్ రంగం నుంచి ఫ్యాషన్వైపు అడుగులు వేసేలా చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికి బీఎల్ ఫ్యాబ్రిక్ 10 శాతం నికర లాభల మార్జిన్‌తో సుమారు రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే ఈ కంపెనీ 2025 నాటికి రూ. 18 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంతేగాదు సోనీ టెలివిజన్ సీరీస్ షార్క్‌ట్యాంక్ ఇండియా 4(Shark Tank India 4)సీజన్లో న్యాయూమర్తులుగా వ్యవహరించే కునాల్ బహల్, రితేష్ అగర్వాల్ నుంచి కూడా 5% ఈక్విటీకి ఒక కోటి రూపాయల ఉమ్మడి షరతులతో కూడిన ఆఫర్‌ని అందుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అంతేగాదు ఈ షో కోసం తానే స్వయంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు మయూర్. కుర్తా డిజైన్ కోసం నల్లటి ఫాక్స్ జార్జెట్ ఫాబ్రిక్ను ఎంచుకున్నారు. నీలం, గులాబీ, ఆకుపచ్చ , తెలుపు రంగుల బహుళ వర్ణ షేడ్స్‌లో సంక్లిష్టమైన ప్రకృతి-ప్రేరేపిత అలంకరణతో పరిపూర్ణ వైవిధ్యాన్ని అందించారు. ఒక ఇంజనీర్ ఫ్యాషన్ పరిశ్రమలో తన క్రియేషన్స్‌తో అద్భుతాలు సృష్టించి, ఆధాయాలు ఆర్జించడం విశేషం. View this post on Instagram A post shared by 🅑🅛 🅕🅐🅑🅡🅘🅒 (@blfabric) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ విలక్షణమైన ఫ్యాషన్‌తో సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంటుంది. ఫ్యాషన్ ఐకానిక్‌గా ఆమెకు సాటి లేరెవ్వరు. ఈ దీపావళి పండుగకి ఈ బ్యూటీ సరికొత్త అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ హైలెట్‌గా నిలిచింది. చెప్పాలంటే ఎకో-ఫ్రెండ్లీ డిజైనర్వేర్తో ఫ్యాషన్‌కి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇంతకీ ఏంటా బ్లౌజ్ ప్రత్యేకత అంటే..సోనమ్ స్టైలిష్ డిజైనర్ వేర్లు చాలా వరకు ఆమె సోదరి రియా కపూరే డిజైన్ చేస్తుంది. ఈ ఇద్దరు సోదరిమణులు అధునాతన గ్రాండ్ లుక్కే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది సోనమ్ ఈ సారి నారింజ ఆరెంజ్ లెహంగ్లో డిఫెరెంట్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆ లెహంగాకు జత చేసిన బ్లౌజ్ అత్యంత విలక్షణమైనది. చెప్పాలంటే దీన్ని శరీర ఆభరణంగా పేర్కొనవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కర్ణాటక ఎర్ర మట్టి, ముల్తానీ క్లేతో రూపొందించారు.ఈ క్లే బ్లౌజ్ ఆమె శరీరాకృతికి కరెక్ట్‌గా ఇమిడిపోయింది. ఇక్కడ సోనమ్ ధరించిన టెర్రకోట ఖాదీ లెహంగాను డిజైనర్లు అబూ జానీ-ఖోస్లా ద్వయం రూపొందించారు. ఇక ఈ వెరైటీ బ్లౌజ్‌ని బెంగళూరుకి చెందిన ది వెర్నాక్యులర్ మోడరన్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఆ లెహంగాకు సరిపోయేలా ధరించిన పచ్చల హారం రాయల్ లుక్‌ని తెచ్చిపెట్టింది. మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్, స్టేట్మెంట్ రింగ్స్, వదులైన హెయిర్ స్టైల్, తక్కువ మేకప్‌తో మహారాణిల మెరిసిపోయింది. ఆ లెహంగాకి చుట్టు ఉన్నా గోల్డెన్ గోటా బార్డర్ మంచి గ్రాడ్లుక్ ఇచ్చింది. ఇక్కడ క్లే బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ ఉండి స్లీవ్‌లెస్‌లో డిజైన్ చేశారు. అయితే లెహంగాకి మ్యాచింగ్ దుప్పట భుజాలు చుట్టూ ధరించడంతో స్లీవ్స్ కవర్ అవ్వడం తోపాటు సంప్రదాయ లుక్‌లో హుందాగా కనిపించింది ఈ అందాల భామ. ఈ దీపావళి పండును పర్యావరణ హితంగా చేసుకోవాలని సందేశమిచ్చేందుకు తాను ఇలాంటి విలక్షణమైన డిజైనర్ వేర్ని ధరించానని ఇన్‌స్టాలో పేర్కొంది. నిజానికి మట్టి ఖాదీతో రూపొందించిన ఈ డిజైనర్‌వేర్‌లో సంప్రదాయం, దైవత్వం రెండూ దాగున్నాయి కదూ..!.(చదవండి: దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..) -
అతుకులే అదుర్స్! ఏకంగా 180 క్లాత్ ప్యాచ్‌లు..
నటి ఆలియా భట్ 180 ఫ్యాబ్రిక్ ప్యాచ్‌లతో రూపొందించిన లెహంగాను ధరించి అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం రాత్రి ముంబైలో డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌కు హాజరైన నటి ఆలియా భట్ తన కస్టమ్ మేడ్ వెడ్డింగ్ సంగీత్ లెహంగాను తిరిగి ధరించి మళ్లీ స్థిరమైన ఫ్యాషన్‌ను ప్రోత్సహించింది. సస్టెయినబులిటీ ప్రాముఖ్యతను పదే పదే తెలియజేయడమే కాకుండా, అలాంటి డ్రెస్సులను ధరిస్తూ తనే ఒక ఉదాహరణగా నిలుస్తోంది.మనీష్ ఏర్పాటు చేసిన స్టార్–స్టడెడ్ దీపావళి బాష్ కోసం వచ్చిన వారిలో ఆలియాభట్ కూడా ఉంది. ఏప్రిల్ 2022లో రణబీర్‌తో పెళ్లికి ముందు ఈ నటి తన సంగీత్ వేడుక కోసం మనీష్ స్వయంగా డిజైన్ చేసిన లెహంగాను ఇప్పుడు మళ్లీ ధరించి, మరింత అందంగా కనిపించింది. ఈ అందమైన డ్రెస్‌ను తయారు చేయడానికి దాదాపు 180 క్లాత్ ప్యాచ్‌లను కలిపి కుట్టారు. జాకెట్టుకు అచ్చమైన బంగారం, వెండి నక్షి, కోరా పువ్వులు, పాతకాలపు గోల్డ్ మెటల్ సీకెన్స్లతో అలంకరించారు. అలియా తన పెళ్లినాటి దుస్తులను తిరిగి ధరించడం, దానికి భిన్నమైన హెయిర్‌స్టైల్‌తో పాటు చమ్కీ చాంద్బాలిస్తో స్టైల్ చేసి, మరో తాజా రూపాన్ని ఇచ్చింది. ఈ గంగూబాయి కథియావాడి నటి తన వివాహ దుస్తులను రీసైకిల్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కిందటేడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నప్పుడు, ఆమె తన పెళ్లినాటి చీరను ధరించడానికి ఎంచుకుంది. అయినప్పటికీ ఆమె క్లాసీ ఆభరణాలు, చక్కని బన్నుతో విభిన్నంగా స్టైల్ చేసింది. అలియా ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘ఆల్ఫా‘ కోసం పని చేస్తోంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!) -
Sreemukhi: లంగా ఓణీలో రాములమ్మ.. ఎంత చక్కగా ఉందో! (ఫొటోలు)
-
Rashmika Mandanna: డిజైనర్ డ్రస్‌లో వజ్రంలా మెరిసిపోతున్న రష్మిక (ఫొటోలు)
-
అందాల శ్రీమతికి అందమైన లెహెంగా (ఫోటోలు)
-
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్‌కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్‌వర్క్‌కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్‌కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. పెయింటింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్‌గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్‌ది. -
అంబానీ పెళ్లికి రాశీ ఖన్నా ఇలా ముస్తాబైంది! (ఫోటోలు)
-
ఫ్యావరెట్ ఎల్లో లెహెంగాలో.. ‘శ్రీవల్లి’ లుక్స్ అదుర్స్ (ఫోటోలు)
-
హుందాగా గాగ్రా, అందంగా లెహెంగా... కళ్లు తిప్పుకోలేరు! (ఫోటోలు)
-
లెహెంగాలో వధువు రాధిక మనోహరంగా, మహరాణిలా (ఫోటోలు)
-
Shanaya Kapoor: పిస్తా కలర్ లెహంగాలో హీరోయిన్.. ఇప్పుడిదే ట్రెండ్ (ఫోటోలు)
-
ఆలియా లుక్ చూశారా? వావ్ అనాల్సిందే! (ఫోటోలు)
-
లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే..!
మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ వివిధ రకాల డిజైనర్ దుస్తులతో అబిమానులను అలరిస్తుంది. అంతకుమునుపు ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ధరించిన చీర కూడా హైలెట్‌గా నిలిచింది. ఆ చీరపై ఏకంగా మొత్తం క్రికెట్ స్టేడియంనే చక్కగాత్రీకరించారు. అదికూడా 1983 ప్రపంచకప్‌లో జరిగిన ఘట్టాన్ని చక్కగా చేతితో ఆవిష్కరించారు. అది మరువక మునుపే క్రికెట్ నెక్లెస్‌తో మనముందుకు వచ్చింది జాన్వీ.డిజైనర్ అర్పితా మెహతా పూలా లెహంగా ధరించి మరీ చెన్నైలో మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌కు వచ్చింది. క్రికెట్‌తో తీసిన మూవీకి ఆమె ధరించిన పూల లెహంగాకి సంబంధం ఎలా అని ఆశ్యర్యంగా ఉన్నా.. ఆమె ధరించిన నెక్లెస్ అందుకు చక్కటి సమాధానం ఇచ్చేలా నిలిచింది. ఆమె ధరించిన నెక్లెస్‌లో బ్యాట్, బాల్, వికెట్‌తో కూడిన లాకెట్‌ని చాల చక్కగా తీర్చిదిద్దారు. ఇది ఆమెకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ని ఇచ్చింది. ఏదీఏమైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను పెంచేలా జాన్వీ ఆహార్యం డ్రెస్సింగ్ స్టయిల్ హైలెట్‌గా ఉండటం విశేషం. View this post on Instagram A post shared by Arpita Mehta Official (@arpitamehtaofficial) అంతేగాదు జాన్వీ ధరించే ప్రతి డిజైనర్ డ్రెస్, చీరలు ఫేమస్ అయ్యి మూవీ ప్రమోషన్స్ రేంజ్‌ని పెంచాయి. పైగా ఈ ప్రమోషన్స్ ముగిసేలోగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తుందేమో అన్నట్లు ఉంది ఆమె లుక్. చీర దగ్గర నుంచి లెహంగా వరకు ప్రతీది ఆమె మూవీకి తగ్గట్టు చాలా చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మూవీ సారాంశాన్ని పరోక్షంగా తెలియజేసేలా నెక్లెస్ నుంచి చెవిపోగుల వరకు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశారు. ఆ క్రికెట్ నెక్లెస్, ఆ అద్భుతమైన లెహంగాలో కొత్త జాన్వీని చూస్తున్నామనేలా మిస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) (చదవండి: అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!) -
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
-
లంగా ఓణీలో తేజస్విని గౌడ.. ఇంత అందంగా ఉందేంటి! (ఫొటోలు)
-
లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!
మన దేశంలో అమ్మాయిలు చీరకట్టులో లేదా లెహెంగాలో కనిపించని అంత స్పెషల్‌గా ఏం ఉండదు. బహుశా ఈ రోజు ఏదైనా పండుగ లేదా వేడుక అయ్యి ఉండొచ్చు అనే అనుకుంటారు. అదే విదేశాల్లో మన దేశీ సంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో హల్చల్ చేస్తే..పరిస్థితి ఓ రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా అందరీ ముఖాల్లో వివిధ రకాల ఎక్స్ప్రెషన్లు కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే స్టన్నింగ్ లుక్స్‌తో ఒక్కసారిగా అటెన్షన్ అయ్యిపోతారు. అలానే ఇక్కడొక మహిళ లెహంగాతో లండన్ వీధుల్లో షికారు చేసింది. అంతే వారి అటెన్షన్ అంతా ఆమెపైనే నిలిపి నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో శ్రద్ధ అనే భారత సంతతి స్పానిష్ మోడల్ ఎరుపు రంగు ఎంబ్రాయిడర్‌తో కూడిన లెహెంగా ధరించి, నిండుగా ఆభరణాలతో ధగ ధగ మెరిసిపోయింది. లండన్‌లోని మెట్రో రైలు ఎక్కగానే అందరి చూపు ఆమెపైనే ఉంది. ఇక ఆమె తన గమ్యాన్ని చేరుకుని, అక్కడ వీధుల్లో కాసేపు షికారు చేసింది. అయితే అక్కడ ఉన్న కొందరూ ఆమె చిత్రాలను క్లిక్‌మనిపించగా కొందరూ ఆసక్తికరమైన రీతీలో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ మేరకు శ్రద్ధ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తూ..ఈ వీడియోకి 'లండన్ దేశీ టాప్ అండ్ స్కర్ట్‌కి వచ్చిన విశేష స్పందన' అనే క్యాప్షన్ ఇచ్చి మరీ పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లు ఆమె ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరూ భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం మీరు అని మరోకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shraddha✨ (@shr9ddha) (చదవండి: ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!) -
లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!
టాప్ వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోవాలన్నా.. యంగ్లుక్తో మెరిసిపోవాలన్నా.. ఆధునికతతో జోడీ కట్టాలన్నా.. సంప్రదాయంతో జత చేరాలన్నా ..అన్నింటికీ ఒకే ఆన్సర్‌గా సమాధానం లెహంగా టాప్ అనేది నవతరం మాట. దానికి తగ్గట్టు ఇండోవెస్ట్రన్ లుక్‌తో మెరిసిపోయే ఈ డిజైన్స్ రానున్న పెళ్లిళ్ల సీజన్‌కు మరింత వైవిధ్యంగా ముస్తాబై రానున్నాయి. ఏ పట్టు, జార్జెట్, బ్రొకేడ్... మెటీరియల్ ఏదైనా లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోతుంది. దానిమీదకు ధరించే టాప్ మాత్రం కాలర్టైప్, పెప్లమ్, సింగిల్ షోల్డర్ .. వంటి డిజైన్స్ అయితే మోడర్న్‌గా ఆకట్టుకోవచ్చు. సంప్రదాయ వేడుకలకు ప్రత్యేక కళను తీసుకురావచ్చు. ఏ లెహంగా టాప్ ఒకే కలర్లో ఎంచుకున్నప్పుడు దానికి తగిన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్, మెటీరియల్‌ను బట్టి స్పెషల్‌గా క్రియేట్ చేయచ్చు. ఏ ప్లెయిన్ కాలర్ నెక్ టాప్ ఎంచుకున్నప్పుడు కొద్దిపాటి ఎంబ్రాయిడరీ డిజైన్‌తో మెరిపించవచ్చు. దీనికి ప్లెయిన్ లెహంగా లేదా ప్రింటెడ్ లెహంగా సరైన కాంబినేషన్ అవుతుంది. ఏ గ్రాండ్‌గా ఉన్న లెహంగాకి సింగిల్ షోల్డర్ కేప్ స్టైల్ టాప్ ప్రత్యేకతను తీసుకువస్తుంది. (చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!) -
ఐటీ జాబ్ వదిలేసి హాయిగా లెహంగాలు అమ్ముకోండి !
ప్రస్తుతం ప్రపంచంలో పెళ్లి అనేది కాస్ట్లీ వ్యవహారం. పెళ్లి పందిరి మొదలు, విందు భోజనాలు, పెళ్లి దుస్తులు దాకా అన్నీ ఖరీదైనవీ. ఇక ఫోటోలు,వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు వీటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కలకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఒక ఎత్తయితే, ఫోటోలు ఇంతకు మున్నెడులేని విధంగా ఎవరికీ తీసిపోని విధంగా దుస్తులు ధరించడం ఒక ఎత్తు. ఇందులో పెళ్లి కుమార్తెలు ఫ్యాషన్ లెహంగాలు, డిజైనరీ గౌన్లు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాజాగా దీనికి సంబంధించి ఒక వాదన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే లెహంగాలు అమ్ముకోవడం మేలు అంటూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో అమిత్ జగ్లాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు, ఢిల్లీలోని పాపులర్ షాపింగ్ సెంటర్ చాందినీ చౌక్‌లో రెండే రెండు గంటలు ఉన్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు లక్ష రూపాయల విలువ చేసే లెహంగాలు కూడా అలా హాట్ కేకుల్లా అమ్ముడు బోతున్నాయి. ఇలా ఎగరేసుకుపోతున్నారంతే.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి, లెహంగాలు అమ్మడంపైనే దృష్టి పెట్టండి అంటూ ఒక సలహా ఇచ్చిపడేశాడు. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ సార్ కొంతమంది అంటే.. ఈ పోలిక అస్సలు బాగాలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే లెహంగాస్ అమ్మడం చాలా కష్టం అని ఒకరు,. ఉద్యోగాలు వల్ల రెగ్యులర్‌గా జీతం వస్తుంది.. కానీ వ్యాపారంలో ఆదాయం సీజనల్‌గా వస్తుంది, 100 రెట్లు మూలధనం కావాలి అంటూ స్పందించారు. అయితే లెహంగాలు విక్రయించడం అంటే అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఏదైనా పరిశ్రమలో వృద్ధి చెందాలంటే, వృత్తి ఏదైనా హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. లెహంగా సేల్స్ అయినా. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయినా అంటూ ఒకరు స్పందించారు. అసలు"లెహంగా అమ్మే ప్రయత్నం చేశారా అమిత్?" ఇందుకోసం ఎలాంటి లక్షణాలు కావాలో కూడా మీకు తెలుసా? అసలు కామెంట్లు పాస్ చాలా ఈజీ. కానీ కష్టపడితే తెలుస్తుంది అని ఒకరు రిప్లై ఇచ్చారు. మొత్తంగా ఈ ట్వీట్ పది లక్షల వ్యూస్‌ను, సుమారు 7వేల కామెంట్లను సాధించింది. Been in Chandni chowk only 2 hours. One advice: Leave your software job and just sell lehngas. I am at a loss of words. Lehngas north of 1 lakh rupees flying off the counters. — Amit Jaglan (@iamjaglan) December 2, 2023 -
పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్) పరిణీతి లెహంగాపై చర్చ ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్ ధరించిన లెహంగా డిజైన్ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్‌తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా పరిణీతి డ్రెస్‌పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by @parineetichopra -
సెలబ్రిటీలకు చీరలు కట్టేది ఈమే.. ఎంత సంపాదిస్తోందో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రత్యేకతే వేరు. మగువ అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది చీర. సినిమా హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు పలు ఈవెంట్లలో చీరలో మెరుస్తుంటారు. అయితే వారి చీరకట్టు వెనుక ఉన్నది మాత్రం డాలీ జైన్. పెళ్లి వేడుకలైనా లేదా ఏదైనా ఈవెంట్ అయినా సరే చీర కట్టడం లేదా దుపట్టా కట్టడం విషయంలో డాలీ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఆమె కేవలం 18 సెకన్లలో చీర కట్టగలదు. అది నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అయితే ఆమె సంపాదన చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! డాలీ జైన్ చీరకట్టుతో మెరిసిన కొంతమంది సెలిబ్రిటీల గురించి ఇటీవల రెడ్డిట్‌లో షేర్ చేశారు. తనకు 325 రకాల డ్రేపింగ్ స్టైల్స్ తెలుసని డాలీ చెబుతుంటారు. దీపికా పదుకొణె రిసెప్షన్ చీర, సోనమ్ మెహందీ, అలియా భట్, నయనతారల పెళ్లి చీరలు కట్టింది ఆమె. కాగా డాలీ జైన్ చీర కట్టడానికి ఒక్కొక్కరితో తీసుకుంటున్న మొత్తం గురించి తెలిసి నెటిజెన్లు నోరెల్లబెడుతున్నారు. పలు నివేదికల ప్రకారం, చీర కట్టడానికి డాలీ ఒక్కో సెలబ్రిటీ నుంచి రూ. 35,000 నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆమె అద్భుతమైన ప్రతిభను చూసి కొంతమంది ప్రశింసించగా మరికొంత మంది ఆమె సంపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకల్లో అంతర్జాతీయ సెలెబ్రిటీ జిగి హడిద్కు డాలీ అందంగా చీర కట్టి ప్రశంసలు అందుకుంది. ఇది మాత్రమే కాదు, మెట్ గాలా 2022 ఈవెంట్లో నటాషా పూనావాలా ధరించిన బంగారు చీరను కూడా కట్టింది డాలీనే. డాలీ జైన్ డ్రేపింగ్ (చీరలు, లెహంగాలు కట్టడం) వృత్తిగా తీసుకోవడానికి వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇంత అందంగా చీరలు కట్టే డాలీకి మొదట్లో చీరలు కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ తన అత్త ఆమెను చీర తప్పా మరో డ్రెస్‌ను ధరించనిచ్చేది కాదు. దీంతో చీరకట్టును అలవాటు చేసుకున్న డాలీ జైన్ దాంట్లోనే ప్రావీణ్యం సంపాందించి దాన్ని వృత్తిగా స్వీకరించారు. ఇండియన్ ఐడల్ 13 అనే రియాలిటీ షో పాల్గొన్న ఆమె ఆమె తన ప్రయాణం గురించి వివరించారు. ఏదో ఒకటి సాధించాలని కలలు కనే గృహిణులందరికీ డాలీ జైన్ నిజమైన స్ఫూర్తి. ఇదీ చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా -
లెహంగా తయారీకి 10 వేల గంటలా.. ఎందుకంత స్పెషల్?
క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టి ఈనెల 23 వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఒక్కటైంది ఈ ప్రేమజంట. సునీల్ శెట్టి ఫామ్‌హౌస్ ఖందాలాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లిరోజు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే అతియా శెట్టి ధరించిన పింక్ కలర్ లెహంగాపైనే బీ టౌన్లో చర్చ నడుస్తోంది. ఈ వేడుకలో అతియా ధరించిన లెహంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది అయితే ఆ డ్రెస్ ఎందుకంత స్పెషల్? అందులో ప్రత్యేకత ఏంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) పెళ్లిలో అతియా శెట్టి ధరించిన లెహంగా తయారీకి దాదాపు 10,000 గంటల సమయం పట్టిందని ప్రముఖ డ్రెస్ డిజైనర్ అనామిక ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతియా శెట్టి లెహంగా తయారీకి 416 రోజులు, 10 వేల గంటలు పట్టిందని ఆమె తెలిపారు. అతియా శెట్టి వివాహ లెహంగాను పూర్తిగా చేతితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు వివరించారు. డిజైనర్ మాట్లాడుతూ.. 'అతియా చాలా చక్కగా,అందమైన అమ్మాయి. ఆమె వధువు కాబోతుందన్న వాస్తవాన్ని ప్రతిధ్వనించేలా లెహంగా డిజైన్ చేశాం. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేశాం. అతియాపై ప్రేమతో ఆ వధువు ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం.' అని అనామిక చెప్పకొచ్చింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) (ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ) -
ఈ నటి ధరించిన డ్రెస్ ధర 74,975! ఏకయా బ్రాండ్ స్పెషాలిటీ అదే
Mithila Palkar- Fashion Brands: సినిమా అభిమానులకు ‘కారవాన్’, వెబ్ ప్రియులకు ‘లిటిల్ థింగ్స్’ తెలిస్తే.. మిథిలా పాల్కర్ తెలిసినట్టే! ఆమె నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ గ్లామర్‌ను మెరిపిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. ఏకయా... చేనేత బట్టలకు కూడా లగ్జరీని అందించిన మొదటి బ్రాండ్ ‘ఏకయా’. నాలుగు తరాలకు పైగా బనారస్ సిల్క్ దుస్తుల సంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఈ బ్రాండ్ పేరుగాంచింది. సుమారు పదివేల మందికి పైగా చేనేత కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవి చేనేత దుస్తులే అయినా సామాన్యుడికి ధరించడం అసాధ్యమే. కారణం ధరలే. డిజైన్ని బట్టి ఆ ధరలు అందనంత ఎత్తులో ఊరిస్తుంటాయి. ఆన్లైన్ లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఆమ్రపాలి జ్యూయెలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. అయితే ధర మాత్రం లక్షల్లో ఉంటుంది. అందుకే ఆ యాంటిక్ జ్యూయెలరీకి రెప్లికా డిజైన్స్‌ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు. ఆమ్రపాలి ట్రైబల్ డిజైన్ ఆభరణాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ వీటిని ఇష్టపడతారు. ఆన్లైన్ లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ బ్రాండ్: ఏకయా ధర: రూ. 74,975 జ్యూయెలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మా అక్క బట్టలే వేసుకుంటా షాపింగ్ చాలా తక్కువగా చేస్తా. ఎందుకంటే మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. చాలా మంది ఇళ్లల్లో చెల్లెళ్లు.. అక్కల బట్టలు వేసుకుంటున్నట్టే మా ఇంట్లోనూ నేను మా అక్క బట్టలే వేసుకుంటా ఎక్కువగా! – మిథిలా పాల్కర్ -దీపికా కొండి చదవండి: Retro Style: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్! చీర ధర ఎంతంటే -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర రూ. 79,500! స్పెషాలిటీ?
లైట్ పర్పుల్ కలర్ లెహెంగాలో .. అంతకన్నా లైట్ మేకప్‌తో .. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మెరిసిపోతున్న ఆ సెలబ్రిటీని గుర్తుపట్టారా? రుక్సర్ థిల్లాన్ అంటున్నారు కదా యూత్ అంతా ముక్త కంఠంతో. కరెక్ట్! గతేడాది ఆమె సోదరి పెళ్లి వేడుకలోని ఆ దృశ్యం. రుక్సర్ను పరిచయం చేయడానికి ఆమె నటించిన తెలుగు సినిమాల పేర్లు .. ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం! తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం! ఈ ఫంక్షన్లో ఆమె అటైర్గా మారిన బ్రాండ్స్ వివరాల మీదకూ చూపు మరల్చండి.. వివాణి ‘మనం వేసుకునే దుస్తులు మన అభిరుచినే కాదు మన ఐడెంటినీ వ్యక్తపరుస్తాయి’ అంటారు వాణి వాట్స్. అనడమే కాదు నమ్ముతారు కూడా. ఆ నమ్మకంలోంచి వచ్చిందే మహిళల డ్రెస్ డిజైన్ బ్రాండ్ వివాణి. 2015లో ప్రారంభించింది. ప్రాచీన భారతీయ ఎంబ్రాయిడరీ కళకు మోడర్న్ ఫ్యాషన్ జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడమే వివాణి వాల్యూ. కాబట్టే ఆ బ్రాండ్ ఇప్పుడు భారతీయ హస్తకళా రాజసానికి పర్యాయంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్నప్పటి నుంచి ఆమెకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తే కొద్దే పర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. వివాణిని సృష్టించింది. ది చాంద్ స్టూడియో ఏమ్‌బీఏ చదివిన అన్న దేవేశ్, ఎమ్మే సైకాలజీ చేసిన చెల్లి రిమ్ఝిమ్ల కలల ప్రాజెక్టే ‘ది చాంది స్టూడియో’ జ్యూయెలరీ. 1990లో రత్నాలు, వెండి నగల ఎగుమతితో ప్రారంభమైంది ఆ అన్నాచెల్లెళ్ల ఈ ప్రయాణం. వెండి నగల పట్ల ఈ ఇద్దరికీ ఉన్న అభిరుచి.. ఆ నగలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఈ వ్యాపారంలో వాళ్లు గడించిన అనుభవం.. ఈ మూడు ‘ది చాంద్ స్టూడియో’ ఏర్పాటుకు ప్రేరణనిచ్చాయి. ఆకట్టుకునే డిజైన్స్, అందుబాటు ధరలు ఈ బ్రాండ్ యూఎస్పీ. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ : లెహెంగా బ్రాండ్: వివాణి ధర: రూ. 79,500 జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ ధర: రూ.2,800 మాంగ్ టీకా బ్రాండ్: ది చాంది స్టూడియో ధర: రూ.4,800 సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనుంది. అంతేకాదు ప్రతిభావంతులైన ఎంతోమంది డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్లందరితోనూ పనిచేయాలనుంది. – రుక్సర్ థిల్లాన్ చదవండి👉🏾Varsha Mahendra: అక్కడ కేవలం బ్లవుజులే! ఒక్కో దాని ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు.. -
Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే!
Latest Fashion In Wedding Season- Matching Trends: వధువుకు వరుడిని మ్యాచ్ చేసినట్టే.. డ్రెస్‌కి ఆభరణాలను మ్యాచ్ చేసినట్టే... చేత పట్టుకునే బ్యాగ్‌నూ కాళ్లకు ధరించే చెప్పులనూ మ్యాచ్ చేద్దాం. చెవి జూకాలను, కాలి జూతీలను మ్యాచ్ చేద్దాం. లెహంగా అంచులను షూస్ ఎంబ్రాయిడరీతో మ్యాచ్ చేద్దాం. మ్యాచింగ్‌లో కొత్త ట్రెండ్‌కు వేదిక వేద్దాం. ఇది వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్. సాధారణంగా పెళ్లిలో పట్టు రెపరెపలు, ఎంబ్రాయిడరీ జిలుగులు కళ్లను మెరిపిస్తుంటాయి. వాటికి మ్యాచింగ్‌గా ఆభరణాల ఎంపిక ఉంటుంది. ఇప్పుడిక లెహంగా డిజైన్‌కు సరిపోయే మ్యాచింగ్ క్లచ్‌లు, పాదరక్షల ఎంపిక సరికొత్త ట్రెండ్ అయ్యింది. అందుకే నవ వధువులు కూడా తమ అలంకరణలో ప్రత్యేకత చాటాలనుకుంటున్నారు. వధువు తన వరుడి ఇంటి పేరును బ్యాగులపై జత చేర్చి భద్రంగా మండపానికి తీసుకువస్తుంది. లెహంగా పైన ఉన్న ఎంబ్రాయిడరీ జిలుగులను పొట్లీ వాలెట్‌తో మ్యాచ్ చేస్తుంది. విభిన్నంగా కనిపించాలనే తాపత్రయానికి కొత్త కొత్త హంగులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఒక సర్వే ప్రకారం తేలిందేమంటే.. ఎవరైనా మనల్ని కలిస్తే, ముందుగా వారి కళ్ళు మన పాదాలపైకి వెళ్తాయి. అందువల్ల మేకప్, డ్రెస్సింగ్‌పై ఎంత శ్రద్ధ చూపుతారో, పాదరక్షల పట్ల కూడా సమాన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. గతంలో వధువులకు పాదరక్షల గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. గోల్డెన్, రెడ్ మెరూన్ వంటి సాధారణ రంగుల ఫుట్‌వేర్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేవి. బ్రైడల్ లెహంగాలు కూడా పరిమిత రంగులతో ఉండటమే దీనికి కారణం. నేడు వధువులు తమ మేకప్లోకి ప్రతి రంగునూ ఆహ్వానిస్తున్నారు. అందుకు సరిపోయే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్లకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. వివాహాది శుభకార్యాల వంటి ప్రత్యేక సందర్భాలలో రూపొందించిన పాదరక్షలు, బ్యాగ్‌ల మెటీరియల్‌ను. సిల్క్, వెల్వెట్, శాటిన్, వేగన్ లెదర్‌తో రూపొందిస్తారు. వాటిపై మోటిఫ్, జర్దోసీ, మోతీ, జరీ, దబ్కా, థ్రెడ్ వర్క్‌తో మెరిపిస్తారు. దీనివల్ల ఈ అలంకారాలన్నీ మరింత అందంగా కనిపిస్తాయి. చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాం
సెట్స్ మీద స్క్రిప్ట్‌లోని పాత్రల పట్లే కాదు ఆఫ్సెట్స్లో అటెండ్ అవబోతున్న అకేషన్స్‌కి ధరించబోయే అవుట్ ఫిట్స్ మీదా అంతే శ్రద్ధ పెడుతుంది శ్రద్ధా కపూర్! అందుకే హీరోయిన్గా ఆమెకు ఎంత క్రేజో... ఫ్యాషన్ దివాగానూ ఆమె పట్ల అంతే అభిమానం సినీప్రియులకు. ఆమెను దివానీగా మార్చిన బ్రాండ్స్ ఇవే.. సౌకర్యంగా ఉండే దుస్తులనే ఇష్టపడతా. సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాం. అందుకే నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యం. ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. – శ్రద్ధా కపూర్ ఐవరీ లెహెంగా డిజైనర్: అనీతా డోంగ్రే ధర:రూ. 1,99,000 త్యానీ బంగారు, వజ్రాభరణాలను భారతీయులు ఇష్టపడ్డంతగా ప్రపంచంలో ఇంకెవరూ ఇష్టపడరు. నగలు చేయించడమంటే ఒకరకంగా ఆస్తిని కూడబెట్టడమే మన దగ్గర. అదో ఆనవాయితీగానూ స్థిరపడింది. ఈ పాయింటే ‘త్యానీ’ బ్రాండ్ స్థాపనకు ప్రేరణనిచ్చింది. దీని వెనకున్న వ్యక్తి కరణ్ జోహార్. మీరు సరిగ్గానే చదివారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహారే. తన సృజన తృష్ణకు మరో విండోనే ఈ ‘త్యానీ’. భారతీయ సంప్రదాయ నగలను ఆధునిక మహిళ అభిరుచికి తగ్గట్టుగా మలుస్తోందీ త్యానీ. అదే దాని మార్క్.. బ్రాండ్ వాల్యూనూ! 27 వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతుంది త్యాగీ జ్యూయెలరీ. అనీతా డోంగ్రే బాల్యంలోని సెలవులను జైపూర్‌లోని అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో గడపడం వల్ల స్థానిక సంప్రదాయ కుట్లు, అల్లికలను చూస్తూ పెరిగింది అనీతా డోంగ్రే. దాంతో చిన్నప్పుడే ఫ్యాషన్, డిజైనింగ్ పట్ల మక్కువ పెంచుకుంది. అందుకే పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది. సంప్రదాయ కళకు ఆధునిక హంగులను జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించింది. ఆ సృజనే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. అంతేకాదు ఎంతో మంది గ్రామీణ మహిళలకు చక్కటి ఉపాధినీ ఇస్తోంది. ఆమె ప్రత్యేకతల్లో ఇంకో మాటా చేర్చాలి. అనీతా డోంగ్రే డిజైన్స్ పర్యావరణ ప్రియంగా ఉంటాయి. రసాయన రంగులు, లెదర్, ఫర్ వంటివి ఉండవు. -
Trending Style: పెయింటింగ్ లెహంగా.. కొంచెం వెస్ట్రన్ స్టైల్లో..!
ఏ వేడుక అయినా అమ్మాయిలకు వెంటనే గుర్తుకు వచ్చేది లెహంగా! పూర్తి సంప్రదాయంగా కాకుండా... కొంచెం వెస్ట్రన్ స్టైల్ కూడా మిక్స్ అవాలని కోరుకుంటారు. అందుకు సరైన ఎంపిక ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌తో ముస్తాబు చేసిన ముచ్చటైన లెహంగా!! దినచర్యలో భాగంగా ఉదయాన్నే పూలను సేకరించే చేతులు, అందంగా అలంకరించుకుంటున్న అతివలు, ఆనంద నృత్యకేళీ, అంబారీ యాత్ర... బొమ్మలా కనిపించే అమ్మాయిల లెహంగా పైన రూపుదిద్దుకున్న అందమైన ఈ బొమ్మలు మరింత ఆకర్షణీయంగా చూపులను కొల్లగొడుతున్నాయి. సంప్రదాయ వేడుకలకు, వెస్ట్రన్ గెట్ టు గెదర్‌లకు మరిన్ని వన్నెలను అద్దుతున్నాయి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లో వచ్చిన కొత్త నైపుణ్యాలు, మరిన్ని డిజైన్లు లెహంగాలను మరింత వైభవంగా అలంకరిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ–పెయింటింగ్ కాంబినేషన్లోనూ వచ్చే డిజైన్లు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. చదవండి: మందారం- ఉసిరి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! -
Geethika Kanumilli: అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్.. చూపు తిప్పుకోలేరు!
నుదుటన ధరించే సిందూరం ఎరుపు.. చేతిన పూసిన గోరింటాకు ఎరుపు.. నవ వధువు చెక్కిళ్లు ఎరుపు .. ‘పెళ్లి సంప్రదాయంలో ఎరుపు రంగుకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఈ ఎరుపు మెరుపులను బ్రైడల్ కలెక్షన్ ద్వారా తీసుకువచ్చాను’ అంటున్నారు హైదరాబాద్ డిజైనర్ గీతికా కానుమిల్లి. ‘‘మన ఇతిహాసాలు, పురాణాల నుంచి కొన్ని ఆకట్టుకునే థీమ్స్ తీసుకొని, వాటిని బేస్ చేసుకుంటూ డిజైన్ చేయడం ప్రత్యేకాంశంగా ఎంచుకున్నాను’ అని వివరించారు డిజైనర్ గీతికా కానుమిల్లి. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన గీతిక కరోనా తర్వాత చేసిన వెడ్డింగ్ డిజైన్స్‌ని పరిచయం చేస్తూ ‘ఇటీవల కవి పుష్యమిత్ర ఉపాధ్యాయ రాసిన ‘ద్రౌపదీ అందుకో ఆయుధాలను, ఇప్పుడు రక్షించడానికి గోవిందుడు రాడు’ అనే వాక్యం నన్ను అమితంగా ఆకట్టుకుంది. నేటి అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో అన్నింటా ముందడుగు వేస్తున్నారు. అలాగే వారు ధరించే దుస్తుల ద్వారా కూడా తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలింపజేస్తున్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచేలా ఈ బ్రైడల్ కలెక్షన్లో శారీస్, లెహంగాలకి బెల్ట్స్, పాకెట్స్ డిజైన్ చేశాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనూ, అలాగే మన సంప్రదాయానికి కొంత వెస్ట్రన్ స్టైల్‌ని జత చేశాను. కాన్సెప్ట్ డిజైన్ రాబోయే కలెక్షన్లో గరళకంఠుడి థీమ్‌తో నీలం రంగును ఎంచుకొని డిజైన్ చేయబోతున్నాను. ఆ తర్వాత ఐవరీ అంటే దంతం రంగుతో భారతంలోని శకుంతల దుస్తులను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేస్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో డిజైనర్లు ఏదైనా ఒక కాన్సెప్ట్ ద్వారా తమ ప్రత్యేకతను తమ డిజైన్స్‌లో చూపుతారు. మన దగ్గర ఇంకా అంతగా ఈ కాన్సెప్ట్ డిజైన్ థీమ్ రాలేదు. ముఖ్యంగా మన చారిత్రక కథనాలతోనే ఎన్నో స్ఫూర్తిమంతమైన డిజైన్లు తీసుకురావచ్చు. చేనేత యువత మన చేనేతల ప్రత్యేకత అంతర్జాతీయంగా వెళ్లాలంటే ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయాలి. అందుకు తగిన ప్లాన్లు చేస్తున్నాను. చేనేతలతో డిజైన్లు ఖరీదైనవి చేయచ్చు. తక్కువ ధరలో వచ్చేలా ఫ్యాన్సీ డ్రెస్సులనూ రూపొందించవచ్చు. ఆ విధంగా కలంకారీ చేనేతతో చేసిన డిజైన్స్ ఉన్నాయి. లవ్ స్టోరీస్... కేవలం సంప్రదాయ డిజైన్స్ మాత్రమే కాకుండా ‘లవ్ స్టోరీస్’ పేరుతో జీరో టు ప్లస్ సైజ్ వరకు అన్ని రకాల వెస్ట్రన్ వేర్, ఇతర అలంకరణ వస్తువుల తయారీ కూడా చేపట్టాను’’ అంటారు తన డిజైన్స్ గురించి పరిచయం చేసిన గీతికా కానుమిల్లి. – గీతికా కానుమిల్లి, ఫ్యాషన్ డిజైనర్ -
Half Saree: వేడుక వేళ సంప్రదాయ కళ
మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ కొంచెం వెనకంజ వేసినా.. పండగలు, వ్రతాలు, పెళ్లిళ్లు అంటూ ఇప్పుడిప్పుడే సందడి మొదలయ్యింది. వేడుకల వేళ వైవిధ్యంగా వెలిగిపోవాలంటే లంగా ఓణీ జోడీ కట్టాల్సిందే. ఆధునికపు హంగులు కోరుకునే నవతరమైనా సంప్రదాయ కట్టుతో మెరిసిపోవాల్సిందే! వేడుకల్లో మనదైన మార్క్ కనిపించాలంటే కొంచెం వినూత్నంగా ఆలోచించవచ్చు. ప్లెయిన్ లెహంగా మీద లైట్‌వెయిట్ పట్టు శారీని ఓణీలా కట్టుకోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు, పచ్చ, నీలం వంటి రంగుల ఎంపిక, టెంపుల్ జ్యువెలరీతో చక్కని సంప్రదాయ కళ తీసుకురావచ్చు. కంచిబార్డర్ను హాఫ్‌వైట్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ జత చేసిన లెహంగా, అంచులు ఎంబ్రాయిడరీ చేసిన ఓణీ, మగ్గం వర్క్ బ్లౌజ్.. ఈ పర్పుల్ కాంబినేషన్ వేడుకకు వన్నెతెస్తుంది. కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి కంచిబార్డర్ జత చేసి, అదే రంగు మగ్గం వర్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ దుపట్టా వేయడంతో మంచి కళ వచ్చేసింది. వేడుకలకు ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్లెయిన్ హాఫ్‌వైట్ రాసిల్క్ మెటీరియల్పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసి డిజైన్ చేసిన లెహంగా. మగ్గం వర్క్ చేసిన రెడ్ కలర్ ట్యునిక్, నెటెడ్ దుపట్టాతో సంప్రదాయ కట్టుతోనే ఆధునికపు హంగులు తీసుకురావచ్చు. సంప్రదాయ డ్రెస్సులోనే ఆధునికంగా కనిపించాలనుకుంటే ఫిష్‌కట్ లెహంగాలు సెట్అవుతాయి. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగా, జర్దోసీ వర్క్ చేసిన షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్, నెటెడ్ ఓణీ ముచ్చటైన కాంబినేషన్‌గా ఆకట్టుకుంటుంది. - రజితారాజ్ రావుల డిజైనర్, హైదరాబాద్ -
‘నీ పర్సనాలిటీ చూసుకున్నావా.. నీ సైజ్‌కు సరిపోయే డ్రెస్ లేదు’
ముంబై: పెళ్లి గురించి ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. అందుకోసం ప్రత్యేకంగా దుస్తులు, నగలు డిజైన్ చేయించుకుంటారు. పెళ్లిలో ధరించే ప్రతి దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక చాలా మంది పెళ్లిలో నాజుకుగా కనిపించడం కోసం వివాహానికి కొన్ని రోజుల ముందు నుంచే డైటింగ్ వంటివి పాటిస్తుంటారు. ఇదంతా సరే. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను కాదనే హక్కు ఎవరికి లేదు. అలానే ఒకరి శరీరాకృతి గురించి విమర్శించే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ ఈ విషయాన్ని ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని మర్చిపోయినట్లున్నాడు. పెళ్లి లెహంగా కోసం వచ్చిన వైద్యురాలు, ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ని దారుణంగా అవమానించడట. ‘‘నీ ఆకారం చూసుకున్నావా.. నీ భారీ కాయానికి సెట్ అయ్యె డ్రెస్ మా దగ్గర లేదు’’ అన్నాడట. అతడి మాటలకు బాధపడిన సదరు డాక్టర్ ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్ల వద్దని నిర్ణయించుకుంది. మరో డిజైనర్ దగ్గరకు వెళ్లి డ్రెస్ కుట్టించుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించింది. దీనిపై స్పందించిన తరుణ్ తహిలియాని సదరు వైద్యురాలికి క్షమాపణలు తెలిపాడు. ఆ వివరాలు.. సదరు డాక్టర్ పేరు తనయా నరేంద్ర. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు. ‘‘పెళ్లికి ముందు చాలా మంది మీద బరువు తగ్గమని ఒత్తిడి పెంచుతారు. నా విషయంలో కూడా అలానే జరిగింది. నువ్వు కూడా డైటింగ్ చేయోచ్చు కదా అని నా ఫ్రెండ్స్ అడిగారు. బరువు తగ్గడానికి చిట్కాలు కూడా చెప్పారు. కానీ నేను అవే పాటించలేదు. నన్ను నన్నుగా ప్రేమించుకోవడం నాకు బాగా తెలుసు. అందుకే వారి సూచనలు పట్టించుకోలేదు’’ అన్నారు. ‘‘పెళ్లి దుస్తుల విషయంలో నాకు చిన్నప్పటి నుంచే ఓ కోరిక ఉండేది. నా 12వ ఏట నుంచే నేను నా పెళ్లికి తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన పెళ్లి లెహంగా ధరించాలని అనుకునేదాన్ని. ఆ ప్రకారమే పెళ్లికి నెల రోజుల ముందు అంబవట్టాలో ఉన్న తరుణ్ బ్రైడల్ స్టోర్‌కు వెళ్లాను. అక్కడ నాకు తీవ్ర అవమానం జరిగింది. నా శరీరాకృతి గురించి దారుణంగా మాట్లాడారు. నీ భారీ పర్సనాలిటీకి మా దగ్గర డ్రెస్ లేదు అనే సెన్స్‌లో కామెంట్ చేశారు. వారి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్లకూడదని నిర్ణియంచుకున్నాను’’ అన్నారు. ‘‘పెద్ద శరీరం, వక్షోజాలు ఉంటే డిజైనర్లకు ఎందుకు అంత భయమో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అనితా డోంగ్రే స్టోర్‌కు వెళ్లి నాకు కావాల్సిన లెహంగా గురించి వారికి వర్ణించాను. ఇవారు కేవలం మూడు వారాల వ్యవధిలోనే నాకు నేను కోరిన అందమైన లెహంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇందుకు తనను ఎంత పొగిడినా తక్కువే’’ అన్నారు. ‘‘నన్ను చూడండి. పెళ్లిలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నాకు డబుల్ చిన్ ఉంది.. నా పొట్ట బయటకు కనిపిస్తుంది. కానీ ఇవన్ని నా సంతోషాన్ని పాడు చేశాయా.. లేదు కదా. ఎందుకంటే నా కుటుంబం, నా సన్నిహితులు, నా భర్త, నన్ను ప్రేమిస్తున్నాడు... మరీ ముఖ్యంగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా పెళ్లి ద్వారా నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఇదే. ఆనందంగా ఉండండి. ఎందుకంటే సంతోషంగా ఉన్నవారే ఉత్తమ పెళ్లికుమార్తెలు’’ అంటూ షేర్ చేసిన ఈ స్టోరి ఎందరినో ఆకట్టుకుంది. ఇది చదివిన నెటిజనులు తరుణ్ తహిలియాని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తరుణ్ తహిలియాని క్షమాపణలు తెలిపారు. తాను సదరు డాక్టర్ శరీరాకృతిని విమర్శించలేదని.. కరోనా కారణంగా ఆమెకు సెట్ అయ్యే డ్రెస్ తమ స్టోర్‌లో లేదని చెప్పాను అన్నారు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. ఇక మూడు వారాల్లో లెహంగా డిజైన్ చేయడం సాధ్యం కాదని.. ఒకవేళ చేసినా నాసిరకంగా ఉంటుందని తెలిపారు. -
సీజ్: లెహెంగా చాటున కోట్ల దందా
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో మాదక ద్రవ్యాలు జనబాహుళ్యంలోకి వస్తున్నాయి. తాజాగా అమ్మాయి డ్రెస్‌లో డ్రగ్స్ పెట్టి విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నారు. ఈ మేరకు డ్రెస్‌లో కోటి 70 లక్షల విలువైన డ్రగ్స్ పెట్టి తపాలా నుంచి ఆస్ట్రేలియాకు పంపించాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. వారిని ఢిల్లీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అందమైన లెహెంగను ఆస్ట్రేలియాకు పంపేందుకు ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలో ఉన్న విదేశీ పోస్టాఫీస్‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు పోస్టాఫీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన తీసుకువచ్చిన లెహెంగాను పరిశీలించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ డ్రెస్‌ను నిశితంగా పరిశీలించగా అందులో రూ. కోటి 70 లక్షలు విలువ చేసే 3,900 గ్రాముల డ్రగ్స్ బయటపడ్డాయి. ఇది చూసి అధికారులు ఖంగు తిన్నారు. డ్రగ్స్ సరఫరా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు సరఫరా చేయాలనుకున్న డ్రగ్స్ చాలా ప్రమాదకరమని, కాలేయం, మూత్రపిండాలు, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు. మొత్తం 7 లెహెంగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లో మూలాలు ఉన్నాయని తెలుస్తోంది. -
సెలబ్రిటీల పెళ్లి వేడుక.. అదిరిపోయే డిజైన్స్
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించి ప్రతీ అంశాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీంతో వేడుకకు కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అనుష్క- విరాట్ కోహ్లీ అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకుంటారు. కానీ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, కాజోల్ వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రం వారి పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్ కలర్స్‌ని ఎంచుకున్నారు. వారి అభిరుచికి తగ్గట్లు వాటిని డిజైన్ చేయించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో హాఫ్ వైట్ అండ్ పింక్ కూడా సెలబ్రిటీలకు ఫేవరెట్ కలర్‌గా మారింది. అనుష్క శర్మ, మిహీకా, నటాషా సహా పలువురు ప్రముఖులు ఈ తరహా కలర్స్ లెహంగాల్లో యువరాణుల్లా కనిపించారు. అబిషేక్- ఐశ్వర్యారాయ్ సోహా అలీఖాన్- కునాల్ కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ అమృతా పూరి- ఇమ్రూన్ సేతి నేహా దూపియా-అంగడ్ బేడీ గజిని ఫేం ఆసిన్- రాహుల్ శర్మ వరుణ్ ధావన్- నటాషా రానా -మిహీకా కాజోల్- అజయ్ దేవగణ్ సంజయ్ కపూర్- కరీష్మా కపూర్ -
పెళ్లి కళ వచ్చేసింది..
సాక్షి,ముంబై: మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీకి పెళ్లి కళ వచ్చేసింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన సంప్రదాయ లెహంగ దుస్తులు, ఖరీదైన అన్‌కట్ సిండికేట్ డైమండ్స్, జాంబియన్ ఎమరాల్డ్స్ పొదిగిన నెక్లెస్, దానికి జతగా మ్యాచింగ్ చెవి రింగులతో పెళ్లి కళ వచ్చేసిందే బాలా అన్నట్టుగా తళుక్కున మెరిసింది. తాజాగా ఇషా అంబానీ ఈ అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేశారు. సాంప్రదాయకంగా వధువు నిర్వహించే గృహ శాంతి పూజకోసం ఈ అందమైన లెహంగాను, నెక్లెస్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. మరోవైపు తన కుమార్తె పెళ్లి వేడుక ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ ఇటీవల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని, కేరళలోని గురువాయూర్ దేవాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాలను దర్శించుకొని విలువైన కానుకలను సమర్పించుకున్నారు బిలియనీర్ , రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. కాగా ఇషా అంబానీ, ఆనంద్ పిరామల్ వివాహం ముహూర్తం డిసెంబర్ 12వ తేదీగా నిర్ణయించారు. వీరి పెళ్లి వేడుకకు ముందు నిర్వహించే పూజా కార్యక్రమాలు, ఇతర వేడుకలు డిసెంబర్ 8నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. సంప్రదాయ రాజస్థానీ శైలిలో ఉదైపూర్ ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారని భావిస్తున్నారు. కాస్ట్లీ వెడ్డింగ్‌గా చెబుతున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల వివాహప్రక్రియలో ప్రతీ అంశమూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇటలీలోని లేక్ కామోలో ఒక విలాసవంతమైన విల్లాలో జంట నిశ్చితార్థ కార్యక్రమంతోపాటు, వీరి వివాహ ఆహ్వాన పత్రికలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram Isha Ambani @_iiishmagish for her Graha Shanti Pooja in a custom hand-painted, hand-embroidered tilla-work lehenga and antique bandhej dupatta. The outfit is a part of the India Revival Project by Sabyasachi. Her look is accessorised with a necklace and earring set featuring uncut Syndicate diamonds and Zambian emeralds. Jewellery Courtesy: Sabyasachi Heritage Jewelry @sabyasachijewelry Photo Courtesy: Tarun Vishwa #TarunVishwa Styled by: @stylebyami Makeup by: @subbu28 Hair by: @sangeetahairartist . #Sabyasachi #IshaAmbani #SabyasachiJewelry #TheWorldOfSabyasachi A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on Nov 27, 2018 at 6:38am PST -
అనార్వచనీయం
ప్యార్ కియా తో డర్నా క్యా అని అడిగింది నాటి అనార్కలి. ఉత్తరం, దక్షిణాలను కలిపితే తప్పేంటి అని అడుగుతోంది నేటి అనార్కలి. ఉత్తరాది అనార్కలి డ్రస్సును, దక్షిణాది లంగా ఓణీని కలిపి ఈ ‘హాఫ్ శారీ అనార్కలి’ డ్రస్సును తయారుచేశారు.ఈ కొత్త అందం అనార్వచనీయంగా ఉంది. ►‘డ్రెస్సింగ్ పూర్తి పాశ్చాత్య స్టైల్లో ఉండకూడదు. అలాగని మరీ సంప్రదాయబద్ధంగా ఓల్డ్ మోడల్లా అనిపించకూడదు’ అనేది నేటితరం మగువల కాన్సెప్ట్. అందుకే ఇండోవెస్ట్రన్ స్టైల్ కాన్సెప్ట్ అతివలను ఆపాదమస్తకం పట్టేసింది. లంగాఓణీ స్టైల్లో కనువిందు చేసే అనార్కలీ గౌన్లు సింగిల్‌పీస్ కంఫర్ట్నెస్తో మగువల మదిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ►క్రీమ్, గోల్డ్, బ్లాక్.. మూడు రంగులూ ఒకే డ్రెస్‌లో.. అదీ అచ్చూ లంగా ఓణీలా ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. లంగాఓణీలా ఈ డ్రెస్‌తో కుస్తీ అక్కర్లేదు. గౌన్లా ధరించవచ్చు. బ్యాక్ సైడ్ జిప్ అటాచ్‌తో పూర్తి ఫిటింగ్ తీసుకురావచ్చు. ►పెద్ద అంచు ఉన్న లెహెంగా, డిజైనర్ బ్లౌజ్, ఓణీ, నడుముకు వడ్డాణం .. ఈ గెటప్ చూడగానే లంగాఓణీ అనేస్తారు. కానీ, ఇది అనార్కలీ డ్రెస్. దీనికి బాటమ్‌గా చుడీ లెగ్గింగ్ ధరిస్తే న్యూలుక్‌తో ఆకట్టుకుంటారు. ►చర్మం రంగును పోలీ ఉండే నెట్ ఫ్యాబ్రిక్‌తో నడుము, వీపు భాగంతో డిజైన్ చేశారు, ఆరెంజ్ ఓణీ, క్రీమ్ కలర్ లెహంగా, గోల్డ్ కలర్ బ్లౌజ్పార్ట్ కాంబినేషన్స్‌తో అనార్కలీ డ్రెస్‌ను అందంగా తీర్చిదిద్దారు డిజైనర్లు. ►చెస్ట్, హిప్ కొలతల ప్రకారం లెహెంగా స్టైల్ అనార్కలీ గౌన్ని ధరిస్తే చాలు. ఈ స్టైల్ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది కాబట్టి ఇతరత్రా అలంకారాల గురించి అదనపు శ్రమ అవసరం లేదు. బన్, ఫిష్‌టెయిల్ స్టైల్స్ కేశాలంకరణ ఈ డ్రెస్‌లకు బాగా నప్పుతుంది. ►లాంగ్ అనార్కలీ గౌన్‌కి అందంగా సెట్ చేసిన డిజైనర్ దుపట్టా, బ్లౌజ్ పార్ట్.. ఈవెనింగ్ గెట్ టుగెదర్ పార్టీలకే కాదు, వివాహాది సంప్రదాయపు వేడకులకూ ఈ డ్రెస్ మేలైన ఎంపిక. -
వహ్వాళి
పండగ వేళ అమ్మాయిలునట్టింట తిరగాడుతూ ఉంటే..ఆ ఇంట లక్ష్మీ కళ తొణికిసలాడుతుంది. దీపకాంతులతో పోటీపడుతూ అమ్మాయిలు లంగా ఓణీలతో ముస్తాబు అయితే..స్వయంగా లక్ష్మీదేవియే నట్టింట్లో కోటికాంతులై కొలువుదీరుతుంది. చూపుల తోరణాలన్నీఈ దీపావళి వేళ వహ్వాళి అనకుండా ఉండలేవు. సంప్రదాయ వేడుక అంటే చాలు ఈ తరం అమ్మాయిలతో పాటు యంగ్ అమ్మలు కూడా ముచ్చటపడి ధరించే దుస్తులు లంగా ఓణీలు. వీటిని పండగ వేళ మరికాస్త కళగా ఇలా ధరించవచ్చు. సిల్క్ శాటిన్ ఈ లెహెంగాలన్నీ సిల్క్ శాటిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసినవి. రాసిల్క్, వెల్వెట్..తో డిజైన్ చేసిన లెహంగాలు బరువుగా ఉంటాయి. అదే, సిల్క్ శాటిన్ అయితే మంచి ఫాల్ ఉండటంతో పాటు ఫ్యాబ్రిక్ బరువు ఉండదు. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ లుక్‌ని మరింత బ్రైట్‌గా మార్చేస్తాయి. ఈ లెహెంగాల మీద జర్దోసీ, సీక్వెన్స్, థ్రెడ్, గోల్డ్ జరీతో పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడంతో గ్రాండ్‌గా మెరిసిపోతున్నాయి. నాటి కాలంలో బాగా ఆకట్టుకున్న మోటివ్ డిజైన్స్‌లో మార్పులు తీసుకొచ్చి ఎంబ్రాయిడరీ చేయడంతో వీటికి మరింత కళ వచ్చింది. నెటెడ్ దుపట్టా జర్దోసీ, గోల్డ్ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్ దుపట్టాలు ఇవన్నీ. లెహెంగా– బ్లౌజ్‌కు మరింత కాంతిమంతమైన లుక్ రావాలంటే దుపట్టా కలర్‌కాంబినేషన్ ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ లేదా వేడుక సందర్భాన్ని బట్టి ఇలాంటి రంగుల కాంబినేషన్లో డిజైన్ చేయించుకోవచ్చు. సిల్క్ చందేరీ బ్లౌజ్ బాడీ పార్ట్ మొత్తం చెక్స్ ఉన్న సిల్క్ చందేరీ ఫ్యాబ్రిక్‌ను తీసుకున్నాం. చేతుల భాగాన్ని పూర్తి ఎంబ్రాయిడరీ చేశాం. రంగుల ముచ్చట సాధారణంగా లంగాఓణీ ధరించేవారు లెహెంగా రంగులోనే జాకెట్టు కూడా ఎంపిక చేసుకుంటారు. కానీ లంగా, ఓణీ, జాకెట్టు.. ఇలా మూడూ మూడు విభిన్నరంగుల కాంబినేషన్లోనూ ధరించవచ్చు. ఫ్యాబ్రిక్స్లోనూ ఆ తేడా చూపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన డిజైనర్ లంగా ఓణీలకు సిల్క్ శాటిన్, నెటెడ్, చెక్స్ చందేరీ క్లాత్‌లను ఉపయోగించాను. మూడు ముచ్చటైన రంగుల కాంబినేషన్‌తో డిజైన్ చేస్తే వచ్చిన లంగా ఓణీ కళ ఇది. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వర్ణా లంకరణ
సప్తవర్ణాలు ఆకాశాన ఇంద్రధనుస్సులో ఇమిడి ఉంటాయి. నవవర్ణాలు దసరా నవరాత్రులలో ఇల మీద కనువిందు చేస్తుంటాయి. దుర్గాదేవి ప్రతిరూపాలుగా అవనిపై వెలిసిన స్త్రీ మూర్తులు వర్ణరంజితమైన వస్త్రాలను అలంకరించుకొని ఆనంద నృత్యాలతో అమ్మవారి మనసును పరవశింపజేస్తారు. తొమ్మిది రోజులు... తొమ్మిది వర్ణాల అలంకరణలు చూసే కనులకు ఇవి వర్ణించనలవి కాని వర్ణాలంకారాలు. 1వ రోజు రాయంచ దేవికి రాయల్ బ్లూ మొదటి రోజు పాడ్యమి నాడు దుర్గాదేవి శైలపుత్రిగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. శైలపుత్రి అంటే యువరాణిలా ఆమె అలంకారం ఉండాలి. రాయల్ బ్లూ (ముదురు నీలం రంగు) రాజసానికి పెట్టింది పేరు. అందుకే ఈ రోజు నీలం రంగు దుస్తులను ధరించాలి. ప్లెయిన్ టస్సర్, క్రేప్ లెహంగాల మీద అద్దాలు, చమ్కీలు, స్వరోస్కి, జర్దోసి వర్క్‌లు మరింత ముచ్చట గొలుపుతాయి. 2వ రోజు బంగారు మేనికి పసుపు పండగల్లో పసుపు రంగుది ప్రత్యేక స్థానం. పవిత్ర భావనతో మనసును కట్టిపడేస్తుంది. దుర్గాదేవి బ్రహ్మచారిణిగా పూజలు అందుకునే ఈ రోజు ఆమెకు నచ్చే రంగు పసుపు. సంప్రదాయ వేడుకలన్నింటిలోనూ పసుపు రంగు దుస్తులు చూపులను కట్టడి చేస్తాయి. పసుపు రంగుతో ఎరుపు, నీలం, పచ్చ.. ఇలా అన్ని రకాల కాంబినేషన్స్‌ని జత చేయవచ్చు. 3వ రోజు నిండైన జీవితానికి పచ్చ కోటి నెలవంకలను పోలిన అందం ఈ రోజు అమ్మవారిది. అందుకే అమ్మవారు చంద్రఘంటగా భక్తులకు ఆశీస్సులు అందిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలంకరణ ఈ రోజు ప్రత్యేకం. çగ్రీన్‌కు ఎరుపు, గులాబీ, పసుపు మంచి కాంబినేషన్. 4వ రోజు విశ్వశక్తికి ప్రతీక బూడిద రంగు ఈ రోజు అమ్మవారు విశ్వశక్తిని నింపుకుని దర్శనమిస్తుంది. ఆ అనంతశక్తి మనలో ప్రవహించేందుకు బూడిదరంగు సరైన వాహకం. గ్రేకలర్ ప్రత్యేకతను చాటుతుంది. ఎంబ్రాయిడరీ చేసిన దుస్తుల మీదకు అదేరంగును పోలిన సిల్వర్ ఆభరణాల అలంకరణ సరైన ఎంపిక. 5వ రోజు అగ్ని జ్వాలల ఉత్సాహం నారింజ స్కందుడు అంటే కార్తికేయుడు. అతని తల్లి దుర్గాదేవి స్కందమాతగా ఈ రోజు పూజలందుకుంటుంది. అగ్ని నారింజ (ఆరెంజ్) రంగులో గోచరమవుతుంటుంది. కనుక ఈ రోజు ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. ఈ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకొని ఈ రోజు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి దాండియా నృత్యాలలో పాల్గొంటే రెట్టించిన ఆనందం, మానసిక ఉద్దీపనలు కలుగుతాయి. 6వ రోజు స్వచ్ఛమైన తెలుపు అమ్మవారు తెల్లటి వస్త్రాలు ధరించి కాత్యాయనిగా దర్శనమిస్తారు ఈ రోజు. అమ్మవారి స్వరూపులైన అతివలు తెలుపు వర్ణ దుస్తులు ధరించి గర్భానృత్యం చేస్తూ ఉంటే ఆ దేవి ఆశీస్సులు అపారంగా అందుతాయి. తెలుపు రంగు శాంతికి, మానసిక ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నం. నెటెడ్ లెహంగా–చోలీ–దుపట్టా పూర్తిగా తెలుపు రంగు. అక్కడక్కడా తళుక్కుమనే అద్దాలు, చమ్కీలు.. నృత్యంలో ఎటూ చూసినా కలువపూల అందమే. 7వ రోజు ఉత్సాహానికి రూపు ఎరుపు చెడుపై కాళికగా ధ్వజమెత్తిన దుర్గాదేవికి ఎరుపు రంగు దుస్తులను అలంకరించి ఆశీస్సులను అందుకుంటారు భక్తులు. ఆ అమ్మవారికి నచ్చిన దుస్తులను ధరించి ఆమె కృపకు పాత్రులు కావాలని కోరుకునే అతివలు ఎరుపు వర్ణం దుస్తులు అలంకరణకు ఉపయోగిస్తారు. 8వ రోజు నీలాకాశమే హద్దు నీలం మహాగౌరిగా పరమేశ్వరుని ఇష్టసఖిగా నీరాజనాలు అందుకునే అమ్మవారు ఆకాశమే తనుగా భాసిల్లుతుంది. అందుకే ఈ రోజు నీలాకాశం రంగు దుస్తులు «ధరిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. దీనికి ఆరెంజ్, ఎరుపు రంగుల కాంబినేషన్ సరైన ఎంపిక. 9వ రోజు సకల శుభాల అందం గులాబీ చివరి రోజున సిద్ధిధాత్రిగా కోరినవరాలు ఇచ్చే కల్పతరవుగా ప్రసన్నవదనంతో, గులాబీరంగు చెక్కిళ్లతో దర్శనమిస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ రోజు గులాబీ రంగు వస్త్రాలంకరణ శ్రేష్టం. -
త్రీ ఫోర్త్ శారీ
హాఫ్ శారీ కాదు...ఫుల్ శారీ కాదు... ఇది త్రీ ఫోర్త్ శారీ! లంగా ఓణీ కాంబినేషన్‌ని హాఫ్ శారీ అని ముచ్చటగా పిలుస్తాం. చీర కట్టును ఫుల్ శారీ అని హుందాగా చెబుతాం. ఈ రెండింటి నడుమ ఇప్పుడు మరో స్టైల్ వచ్చింది. అదే త్రీ ఫోర్త్ శారీ! పొడవాటి లెహంగా లేదా పొట్టి స్కర్ట్ ధరించి దాని మీద అదే కాంబినేషన్ లేదా కాంట్రాస్ట్ చీరను మోకాలు కింది వరకు లెహెంగా కనిపించేలా కట్టాలి. ఇది కాటన్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో హైలైట్ అయిన స్టైల్. ఇతరత్రా అలంకరణలు అవసరం లేదు. కావాలనుకుంటే ఫంకీ ఫ్యాషన్ జువెల్రీని అలంకరించుకోవచ్చు. – నిఖిత, డిజైనర్,ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ -
తన లైఫ్‌ని తనే కుట్టుకుంది
షబ్నమ్. వయసు 17. ఈ వయసు పిల్లలు అడిగినట్లు ‘నాన్నా! పండక్కి నాకు కొత్త బట్టలు కొనివ్వు, నాన్నా పది రూపాయలివ్వు జడ పిన్నులు కొనుక్కుంటాను’ అని అడగడంలేదీ అమ్మాయి. రివర్స్‌లో ఆ తండ్రే ‘నువ్వు నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు బిడ్డా’ అని మురిసిపోతున్నాడు. ఆ తండ్రి.. కూతుర్ని పెద్ద ముందుచూపుతో నడిపించిన దార్శనికుడేమీ కాదు. ‘ఆడపిల్లవు ఊరు దాటి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకుంటావా, వద్దే వద్దు. ఊళ్లో బడిలో ఉన్నంత వరకు ఏడు తరగతులు చదివావు ఇక చాలు’ అనేశాడు ఐదేళ్ల కిందట. ఆడపిల్లకు వంట వండటం నేర్పించి పెళ్లి చేయడమే అమ్మానాన్నల బాధ్యత అన్నట్లు రెండేళ్ల కిందట ఓ పెళ్లి సంబంధం కూడా తెచ్చాడు. కూతురు తల వంచలేదు! బడి మాన్పిస్తే చేసేదేమీ లేక ఊరుకుంది. కానీ పెళ్లి చేసి పంపించేస్తానంటే ఊరుకోనంటే ఊరుకోనని మొండికేసింది షబ్నమ్. ‘ఆడపిల్లలు 18 ఏళ్లకంటే ముందు పెళ్లి చేసుకోకూడదట’ అని కూడా వాదించింది. పిల్ల సంతోషంగా తల వంచితే తాళి కట్టించాలి తప్ప మెడలు వంచి కట్టించకూడదని షబ్నమ్ నానమ్మ నచ్చచెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడా తండ్రి.కూతురికి లోకజ్ఞానాన్నంతా నూరిపోశాడని టైలరింగ్ టీచర్‌ను మాత్రం బాగానే తిట్టుకున్నాడు. తండ్రి తల ఎత్తుకున్నాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైచ్ జిల్లా, రాయ్‌పూర్ షబ్నమ్ ఊరు. అక్కడ ఓ ఎన్జీవో నిర్వహించిన టైలరింగ్ సెంటర్లో మూడు నెలలపాటు దుస్తులు కుట్టడం నేర్చుకుంది. అదే ఆమె జీవితానికి పెద్ద మలుపు అవుతుందని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడామె నెలకు రెండు మూడు వేలు సంపాదిస్తోంది. రంజాన్, దసరా వంటి పండుగ సీజన్లలో నాలుగైదు వేలు సంపాదిస్తోంది. ఇంట్లో కొంత ఇచ్చి మిగిలిన డబ్బును బ్యాంకులో దాస్తోంది. ఆమె బ్యాంకు అకౌంట్లో డబ్బుని చూసి ఆ తండ్రి పుత్రికోత్సాహంతో ఇప్పుడు మురిసిపోతున్నాడు. రాయ్‌పూర్ ‘రోల్ మోడల్’! షబ్నమ్ తాను టైలరింగ్ క్లాస్‌లో నేర్చుకున్న మోడల్స్ దగ్గర ఆగిపోలేదు. అదే బ్లవుజ్‌లు, లెహెంగాలు కుడుతూ ఉంటే ఈ రోజు ఇంతలా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండకపోయేది. ఆమె వాల్‌పోస్టర్ మీద హీరోయిన్ డ్రస్ చూస్తే అది ఏ ప్యాటర్న్ అయి ఉంటుందో ఊహించగలుగుతుంది. సినిమాకు వెళ్తే హీరోయిన్ వేసుకున్న డ్రస్‌లు మైండ్‌లో ప్రింట్ అయిపోతాయి. సినిమా నుంచి వచ్చాక వాటిని పేపర్ మీద గీసుకుంటుంది. అలా పెద్ద నోట్స్ తయారు చేసుకుంది. ఆ మోడల్స్‌ని రాయ్‌పూర్ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. తండ్రి స్నేహితుని కూతురికి పెళ్లి డ్రస్ కుట్టిచ్చింది. ఆ పెళ్లిడ్రస్ షబ్నమ్ పనితీరుకు ఓ ప్రచారాస్త్రంగా మారింది. చదువుకుంటూ, నేర్పిస్తోంది షబ్నమ్ సాధించిన మరో విజయం ఏమిటంటే.. ఏడవ తరగతి తర్వాత ‘చదువు కోసం మరొక ఊరికి పోవడమా... వీల్లేదంటే వీల్లేదు’ అన్న తండ్రిని ఒప్పించి కాలేజ్‌లో చేరడం. నాన్ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి నిషార్ షరీఫ్ అహ్మద్ ఇంటర్ కాలేజ్‌లో చేరింది. తానింకా పెద్ద చదువులు చదువుతానంటున్న షబ్నమ్ టైలరింగ్‌ను కొనసాగిస్తూనే ఉంది. కొత్త మోడల్స్ నేర్పించమని వచ్చిన తోటి అమ్మాయిలకు మెళకువలు నేర్పిస్తోంది. – మంజీర -
గ్రాండ్ లెహంగా!
ఏ చిన్న వేడుక అయినా లెహంగా డ్రెస్ తప్పనిసరి అవుతుంది. అమ్మాయి లెహంగా ధరిస్తే ఇంటికి పండగ వచ్చినట్టే! కానీ, ఈ రోజుల్లో డిజైనర్ లెహంగాలకు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు తగ్గించుకుంటూ లెహంగాకు గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేయవచ్చు. సహజంగా లెహంగాలో రెండు రకాలున్నాయి. ఒకటి ప్యానెల్స్‌తో డిజైన్ చేస్తాం. రెండవది వృత్తాకారం (సర్కిల్) వచ్చేలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డిజైన్ చేసుకునే లెహంగా సర్కిలర్ కట్ చేసినది. ఇలాంటి లెహంగా మీదకు క్రాప్‌టాప్ జత చేసి వెస్ట్రన్ వేర్‌గానూ ధరించవచ్చు. ఏదైనా వెస్ట్రన్ టాప్ వేసుకొని బర్త్‌డే, గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీస్‌కు హాజరవ్వచ్చు. ♦ ముందుగా కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలి. ♦ సర్కిలర్ లెహంగాకు 4 నుంచి 5 మీటర్ల ఫ్యాబ్రిక్ సరిపోతుంది. ♦ లతలు, పువ్వులు, బుటీస్ డిజైన్స్ ఉన్న రెడీమేడ్ నెట్ ఫ్యాబ్రిక్ మార్కెట్లో లభిస్తుంది. (ఒరిజనల్ లెహంగా మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు) ఈ ఫ్యాబ్రిక్ మీటర్ ధర 300 నుంచి 400 రూపాయల వరకు లభిస్తుంది. ♦ లెహెంగాకు అంచు ఎంబ్రాయిడరీ చేసినది ♦ వాడాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని, లెహంగా కలర్ సెమీ సిల్క్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌ని అంచుగా జత చేయాలి. ♦ లెహంగా మీదకు ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేలా ఏ టాప్ అయినా ధరించవచ్చు. సంప్రదాయపు లుక్ కోసం, ఇంకాస్త గ్రాండ్ లుక్ రావాలని లాంగ్ బ్లౌజ్‌ను డిజైన్ చేశాం. ♦ లెహంగాలో ఎరుపు, నలుపు రంగుల కాంబినేషన్ ఉంది. అందుకని బ్లౌజ్ పార్ట్‌లో ఈ రెండు షేడ్స్ వచ్చేలా ఎరుపు రంగు నెట్, బంగారు రంగు టిష్యూ ఫ్యాబ్రిక్స్‌ని ఎంపిక చేసుకున్నాం. ♦ బ్లౌజ్ నెక్కి స్వరోస్కి స్టోన్స్ వాడాను. ఖర్చు తగ్గాలంటే వైట్ స్టోన్స్‌ని గ్లూతో అతికించవచ్చు. ♦ సెమీ టిష్యూ ఫ్యాబ్రిక్ మీటర్ ధర 250 రూపాయల నుంచి లభిస్తుంది. ♦ లెహంగా, బ్లౌజ్ సిద్ధం చేసుకున్నాక ఇలా కూడా పార్టీలకు హాజరవ్వచ్చు. ఇంకాస్త గ్రాండ్‌గా, సంప్రదాయత ఉట్టిపడేలా రెడీ అవ్వాలంటే ఒక ట్రెడిషనల్ దుపట్టా ధరించాలి. అది కూడా లెహంగా, బ్లౌజ్‌కి సెట్ అవ్వాలి. అందుకని, ప్లెయిన్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని, బార్డర్‌కి, బుటీస్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఖర్చు తగ్గించుకోవాలంటే రెడీమేడ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్స్‌ని దుపట్టాకు జత చేసుకోవచ్చు. ఇంకా ఖర్చు తగ్గించుకోవాలంటే లెహంగా ఫ్యాబ్రిక్‌నే దుపట్టాకు బార్డర్‌గా వేసుకోవచ్చు. మిషన్ ఎంబ్రాయిడరీ అంచులు మార్కెట్లో లభిస్తాయి. ఇవి మీటర్‌కు 100 రూపాయల నుంచి ధర ఉంటుంది. సెమీ నెట్ ఫ్యాబ్రిక్ మీటర్‌కి 300 రూపాయల నుంచి ధర ఉంటుంది. ఆహ్లాదాన్ని కలిగించే పరిమళం వాతావరణం చల్లగా ఉన్న కాలంలో ఘాటుగా ఉండే పెర్ఫ్యూమ్స్ వాడినా పర్వాలేదు. కానీ, వేసవిలో మాత్రం చాలా మైల్డ్‌గా అంటే గాఢత తక్కువగా ఉండే సెంట్ వాడకం మేలు. ∙పూలు, పుల్లటి పండ్లు నిమ్మ, ఆరెంజ్ వాసనలు వేడిమిలోనూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ♦ నేచరల్ ఆయిల్స్ గల సెంట్స్ రోజంతా తాజాదనాన్ని కలిగిస్తాయి. ♦ గాఢమైన సెంట్ వల్ల తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ♦ పెర్ఫ్యూమ్ని కొనుగోలు చేసే ముందు చెవి వెనకాల, ముంజేతి మీదుగా ఒకసారి స్ప్రే చేసుకొని చెక్ చేసుకోవాలి. ♦ రోజూ నేరుగా చర్మానికి కాకుండా ధరించిన దుస్తుల మీద స్ప్రే చేసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. సిగలో బంగారం 1. చెవికి చిన్న చిన్న రాళ్ల స్టడ్స్ వాడుతుంటాం. వేడుకకు సింపుల్‌గా హాజరవ్వాలంటే నీటుగా కొప్పు వేసి, చెవికి వాడే ఆ చిన్న స్టడ్ని హెయిర్ పిన్నుకు జత చేసి కొప్పుకు సెట్ చేస్తే ఇలా చూడముచ్చటగా ఉంటుంది. 2. అర్ధచంద్రాకారంలో లేయర్లుగా ఉండే చాంద్‌బాల్ జుంకాలు పెద్ద పెద్దవి ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక చెవి జుంకా తీసుకొని, కొప్పున సింగారిస్తే.. ముచ్చటైన అందం. 3. కుందన్స్‌తో ఉండే హారాన్ని కొప్పు చుట్టు పెట్టి, పిన్నులతో పువ్వులను ముడిచినట్టు జాగ్రత్తగా సెట్ చేయాలి. ఆ సింగారం చూడ్డానికి రెండు కళ్లు చాలవు. సంప్రదాయపు దుస్తుల మీద ఈ తరహా సింగారం చూపుతిప్పుకోనివ్వవు. విన్నారా! చెవులున్నవి మాటలు వినడానికేనా అందాన్ని పొందికగ్గా చూపడానికి కూడా అనిపిస్తుంది కదా ఈ జంకాల డిజైన్లు చూస్తుంటే! గుండెను బరువెక్కించే మాటల తూటాల దాడిని తప్పించుకుంటూ ... తేలికగా సౌందర్యానికి చిరునామాగా మారుతున్న జుంకాలను చెవులకు చేర్చేస్తుంది నేటితరం. ధరించే దుస్తులు కాస్త డల్‌గా ఉన్నా సరే బ్రైట్‌గా ఉండే జుంకాలను చెవికి తగిలించి లుక్‌ని స్టైలిష్‌గా మార్చేస్తున్నారు. చాంద్బాల్స్కే ఓటు ఇవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నప్పటికీ ‘రామ్‌లీలా’ అనే సినిమా వచ్చినప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. వీటిలోనే ఎన్నో మోడల్స్. చుట్టూతా అల్లుకుపోతూ చెవినిల్లు కట్టుకున్నాయి. ‘చాంద్‌కి తుక్డా’ అంటూ అతివల మదిని దోచుకుంటున్నాయి. ‘బుట్ట’లో పడేస్తున్నాయి గుండ్రంగా గొడుగును తలపించే బుట్టల డిజైన్లు మరో వైపు కదలనివ్వవు. కుందన్స్, ముత్యాలు, రకరకాల రాళ్లు.. అన్నింటినీ చేర్చుకొని అందంగా మెరిసిపోతున్నాయి. హాఫ్, ఫుల్శారీ సంప్రదాయ దుస్తులు ఏవైనా బుట్టల జతలు ఎన్నున్నా మరోటి అని మనసు లాగేస్తుంది. బంగారం, ఇమిటేషన్ జువెల్రీలో ఎన్నో డిజైన్లు హల్ చల్ చేస్తున్నాయి. ‘వరుస’లు కలిపేస్తున్నాయి పేటల హారాలు మెడను అలంకరించుకోవడమేనా అని తరుణిలు దబాయించారేమో! అందుకే ఆభరణాల నిపుణులు చెవి సింగారాలకు వరసలు కట్టేస్తున్నారు. ప్రతీ డిజైన్ని పొందికగా అమర్చుతున్నారు. వీటిలో కాక్టెయిల్ జుంకాలూ కదం తొక్కుతున్నాయి. ఫ్యాషనబుల్ దుస్తులమీద మరింత స్టైల్‌ని క్రియేట్ చేస్తున్నాయి. -
లెహంగామా
ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ప్రతి ఇంట్లో సంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ సంప్రదాయానికి రంగులు అద్ది మన అమ్మాయిలు లెహంగాలు వేసుకుంటే అది అచ్చమైన లెహంగామా! ►టాప్ అండ్ బాటమ్ ఒకే రంగు. ఈ హంగులు నవ్వులతో పోటీపడితే ఏ వేదిక అయినా బ్రైట్‌గా మారాల్సిందే! ►బూడిదరంగు లెహంగాకు నలుపురంగు డిజైనరీ అంచు తోడైతే ఆ లెహంగా ఎక్కడున్నా ప్రత్యేకతను చాటడంలో ముందుండాల్సిందే! ►నీలాకాశం రంగులు లెహంగా మీద కనిపిస్తే... అది చూపులను తిప్పుకోనివ్వని అద్భుతం అవుతుంది. అందుకే అమ్మాయిల లెహంగా ఎంపికలో నీలిరంగు ముచ్చట తప్పనిసరి. ►పట్టు ధరిస్తే వేడుకలో ఎన్నో మెరుపులు. మరెన్నో హంగులు. ప్రత్యేకతను చాటే లెహంగా ఎప్పుడైనా ఎవర్గ్రీన్ ఎంపికే. ►వేసవిలోనూ కూల్‌గా మార్చేసే రంగులు, గాడీగా లేని డిజైన్లు గల లెహంగాను ఎంచుకుంటే సౌకర్యంగా ఉండటంతో పాటు స్పెషల్‌గా కనిపిస్తారు. ►సంప్రదాయాన్ని చాటుతూనే వెస్ట్రన్ స్టైల్‌తో కనువిందు చేయాలంటే ఓ చక్కని కాంబినేషన్ ఈ లెహంగా డ్రెస్!