అతుకులే అదుర్స్‌! ఏకంగా 180 క్లాత్‌ ప్యాచ్‌లు.. | Alia Bhatt Repeats Two-Year-Old Patchwork Lehenga For Diwali Party 2024 | Sakshi
Sakshi News home page

అతుకులే అదుర్స్‌! ఏకంగా 180 క్లాత్‌ ప్యాచ్‌లు..

Published Thu, Oct 24 2024 10:47 AM | Last Updated on Thu, Oct 24 2024 11:23 AM

Alia Bhatt Repeats Two-Year-Old Patchwork Lehenga For Diwali Party 2024

నటి ఆలియా భట్‌ 180 ఫ్యాబ్రిక్‌ ప్యాచ్‌లతో రూపొందించిన లెహంగాను ధరించి అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం రాత్రి ముంబైలో డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా దీపావళి బాష్‌కు హాజరైన నటి ఆలియా భట్‌ తన కస్టమ్‌ మేడ్‌ వెడ్డింగ్‌ సంగీత్‌ లెహంగాను తిరిగి ధరించి మళ్లీ స్థిరమైన ఫ్యాషన్‌ను ప్రోత్సహించింది. సస్టెయినబులిటీ ప్రాముఖ్యతను పదే పదే తెలియజేయడమే కాకుండా, అలాంటి డ్రెస్సులను ధరిస్తూ తనే ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

మనీష్‌ ఏర్పాటు చేసిన స్టార్‌–స్టడెడ్‌ దీపావళి బాష్‌ కోసం వచ్చిన వారిలో ఆలియాభట్‌ కూడా ఉంది. ఏప్రిల్‌ 2022లో రణబీర్‌తో పెళ్లికి ముందు ఈ నటి తన సంగీత్‌ వేడుక కోసం మనీష్‌ స్వయంగా డిజైన్‌ చేసిన లెహంగాను ఇప్పుడు మళ్లీ ధరించి, మరింత అందంగా కనిపించింది. ఈ అందమైన డ్రెస్‌ను తయారు చేయడానికి దాదాపు 180 క్లాత్‌ ప్యాచ్‌లను కలిపి కుట్టారు. జాకెట్టుకు అచ్చమైన బంగారం, వెండి నక్షి, కోరా పువ్వులు, పాతకాలపు గోల్డ్‌ మెటల్‌ సీకెన్స్‌లతో అలంకరించారు. 

అలియా తన పెళ్లినాటి దుస్తులను తిరిగి ధరించడం, దానికి భిన్నమైన హెయిర్‌స్టైల్‌తో పాటు చమ్‌కీ చాంద్‌బాలిస్‌తో స్టైల్‌ చేసి, మరో తాజా రూపాన్ని ఇచ్చింది. ఈ గంగూబాయి కథియావాడి నటి తన వివాహ దుస్తులను రీసైకిల్‌ చేయడం ఇదే మొదటిసారి కాదు. కిందటేడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నప్పుడు, ఆమె తన పెళ్లినాటి చీరను ధరించడానికి ఎంచుకుంది. అయినప్పటికీ ఆమె క్లాసీ ఆభరణాలు, చక్కని బన్నుతో విభిన్నంగా స్టైల్‌ చేసింది. అలియా ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘ఆల్ఫా‘ కోసం పని చేస్తోంది.  

 

(చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement