బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ విలక్షణమైన ఫ్యాషన్‌తో సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంటుంది. ఫ్యాషన్ ఐకానిక్‌గా ఆమెకు సాటి లేరెవ్వరు. ఈ దీపావళి పండుగకి ఈ బ్యూటీ సరికొత్త అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ హైలెట్‌గా నిలిచింది. చెప్పాలంటే ఎకో-ఫ్రెండ్లీ డిజైనర్‌వేర్‌తో ఫ్యాషన్‌కి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇంతకీ ఏంటా బ్లౌజ్ ప్రత్యేకత అంటే..
సోనమ్ స్టైలిష్ డిజైనర్ వేర్‌లు చాలా వరకు ఆమె సోదరి రియా కపూరే డిజైన్ చేస్తుంది. ఈ ఇద్దరు సోదరిమణులు అధునాతన గ్రాండ్ లుక్‌కే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది సోనమ్ ఈ సారి నారింజ ఆరెంజ్ లెహంగ్‌లో డిఫెరెంట్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆ లెహంగాకు జత చేసిన బ్లౌజ్ అత్యంత విలక్షణమైనది. చెప్పాలంటే దీన్ని శరీర ఆభరణంగా పేర్కొనవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కర్ణాటక ఎర్ర మట్టి, ముల్తానీ క్లేతో రూపొందించారు.
ఈ క్లే బ్లౌజ్ ఆమె శరీరాకృతికి కరెక్ట్‌గా ఇమిడిపోయింది. ఇక్కడ సోనమ్ ధరించిన టెర్రకోట ఖాదీ లెహంగాను డిజైనర్లు అబూ జానీ-ఖోస్లా ద్వయం రూపొందించారు. ఇక ఈ వెరైటీ బ్లౌజ్‌ని బెంగళూరుకి చెందిన ది వెర్నాక్యులర్ మోడరన్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఆ లెహంగాకు సరిపోయేలా ధరించిన పచ్చల హారం రాయల్ లుక్‌ని తెచ్చిపెట్టింది. మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్, స్టేట్‌మెంట్ రింగ్స్, వదులైన హెయిర్ స్టైల్, తక్కువ మేకప్‌తో మహారాణిల మెరిసిపోయింది.
ఆ లెహంగాకి చుట్టు ఉన్నా గోల్డెన్ గోటా బార్డర్ మంచి గ్రాడ్‌లుక్ ఇచ్చింది. ఇక్కడ క్లే బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ ఉండి స్లీవ్‌లెస్‌లో డిజైన్ చేశారు. అయితే లెహంగాకి మ్యాచింగ్ దుప్పట భుజాలు చుట్టూ ధరించడంతో స్లీవ్స్ కవర్ అవ్వడం తోపాటు సంప్రదాయ లుక్‌లో హుందాగా కనిపించింది ఈ అందాల భామ. ఈ దీపావళి పండును పర్యావరణ హితంగా చేసుకోవాలని సందేశమిచ్చేందుకు తాను ఇలాంటి విలక్షణమైన డిజైనర్ వేర్‌ని ధరించానని ఇన్‌స్టాలో పేర్కొంది. నిజానికి మట్టి ఖాదీతో రూపొందించిన ఈ డిజైనర్‌వేర్‌లో సంప్రదాయం, దైవత్వం రెండూ దాగున్నాయి కదూ..!.
(చదవండి: దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..)
Comments
Please login to add a commentAdd a comment