Diwali celebration
-
కాళ్లకు నమస్కరించి.. కాల్చి చంపారు!
ఢిల్లీ: సంతోషంగా జరుపుకుంటున్న దీపావళి పండుగ నాడు విషాదం చోటు చేసుకుంది. మేనమామను చంపింది ఎవరో తెలుసుకుందామని వెళ్లిన మేనల్లుడిపై సైతం అగంతకులు కాల్పులు జరిపారు. ఈ దర్ఘుటనలో మేనల్లుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు.ఢిల్లీ షహదారాలో నివాసం ఉంటున్న ఆకాష్ శర్మ(44),అతని మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (10) గురువారం రాత్రి 8 గంటల సమయంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటి బయట టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై అక్కడికొచ్చారు. అందులో ఓ వ్యక్తి ఆకాష్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. మరో వ్యక్తిపై అనుమానం రావడంతో ఆకాష్ శర్మ భయపడి ఇంట్లోకి పరిగెత్తాడు. వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో ఇంట్లోకి వెళ్లిన ఆకాష్‌ను వెంటాడి మరి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మేనమామ ఆకాష్ శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి బయట బాంబులు అంటించే ప్రయత్నంలో ఉన్న రిషబ్ శర్మ తొలుత ఇదేమీ పట్టించుకోలేదు. తుపాకి పేలిన శబ్దం రావడంతో అప్పుడు గమనించి పారిపోతున్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు మేనల్లుడిపై కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనతో ఉలిక్కి పడ్డ కుటుంసభ్యులు, స్థానికులు గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రి తరలించగా ఆకాశ్, రిషబ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. క్రిష్‌కు చికిత్స కొనసాగుతోంది. Farsh Bazaar double murder cctvA man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024కాగా, ఆశీర్వాదం తీసుకున్న యువకుడు ఆకాష్ శర్మకు డబ్బులు ఇచ్చాడు. ఆడబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన యువకుడు ఆకాష్ శర్మను హతమార్చేలా నిందితుడికి సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో హత్యకోసం నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. మైనర్, బాధితుడు ఆకాష్ ,అతని కుటుంబంపై గతంలో కేసులు ఉన్నాయి అని పోలీసులు తెలిపారు. -
సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ విలక్షణమైన ఫ్యాషన్‌తో సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంటుంది. ఫ్యాషన్ ఐకానిక్‌గా ఆమెకు సాటి లేరెవ్వరు. ఈ దీపావళి పండుగకి ఈ బ్యూటీ సరికొత్త అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ హైలెట్‌గా నిలిచింది. చెప్పాలంటే ఎకో-ఫ్రెండ్లీ డిజైనర్వేర్తో ఫ్యాషన్‌కి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇంతకీ ఏంటా బ్లౌజ్ ప్రత్యేకత అంటే..సోనమ్ స్టైలిష్ డిజైనర్ వేర్లు చాలా వరకు ఆమె సోదరి రియా కపూరే డిజైన్ చేస్తుంది. ఈ ఇద్దరు సోదరిమణులు అధునాతన గ్రాండ్ లుక్కే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది సోనమ్ ఈ సారి నారింజ ఆరెంజ్ లెహంగ్లో డిఫెరెంట్‌గా కనిపించింది. ముఖ్యంగా ఆ లెహంగాకు జత చేసిన బ్లౌజ్ అత్యంత విలక్షణమైనది. చెప్పాలంటే దీన్ని శరీర ఆభరణంగా పేర్కొనవచ్చు. దీన్ని ప్రత్యేకంగా కర్ణాటక ఎర్ర మట్టి, ముల్తానీ క్లేతో రూపొందించారు.ఈ క్లే బ్లౌజ్ ఆమె శరీరాకృతికి కరెక్ట్‌గా ఇమిడిపోయింది. ఇక్కడ సోనమ్ ధరించిన టెర్రకోట ఖాదీ లెహంగాను డిజైనర్లు అబూ జానీ-ఖోస్లా ద్వయం రూపొందించారు. ఇక ఈ వెరైటీ బ్లౌజ్‌ని బెంగళూరుకి చెందిన ది వెర్నాక్యులర్ మోడరన్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఆ లెహంగాకు సరిపోయేలా ధరించిన పచ్చల హారం రాయల్ లుక్‌ని తెచ్చిపెట్టింది. మ్యాచింగ్ ఇయర్ స్టడ్స్, స్టేట్మెంట్ రింగ్స్, వదులైన హెయిర్ స్టైల్, తక్కువ మేకప్‌తో మహారాణిల మెరిసిపోయింది. ఆ లెహంగాకి చుట్టు ఉన్నా గోల్డెన్ గోటా బార్డర్ మంచి గ్రాడ్లుక్ ఇచ్చింది. ఇక్కడ క్లే బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ ఉండి స్లీవ్‌లెస్‌లో డిజైన్ చేశారు. అయితే లెహంగాకి మ్యాచింగ్ దుప్పట భుజాలు చుట్టూ ధరించడంతో స్లీవ్స్ కవర్ అవ్వడం తోపాటు సంప్రదాయ లుక్‌లో హుందాగా కనిపించింది ఈ అందాల భామ. ఈ దీపావళి పండును పర్యావరణ హితంగా చేసుకోవాలని సందేశమిచ్చేందుకు తాను ఇలాంటి విలక్షణమైన డిజైనర్ వేర్ని ధరించానని ఇన్‌స్టాలో పేర్కొంది. నిజానికి మట్టి ఖాదీతో రూపొందించిన ఈ డిజైనర్‌వేర్‌లో సంప్రదాయం, దైవత్వం రెండూ దాగున్నాయి కదూ..!.(చదవండి: దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..) -
దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..
అమావాస్య నాడు జరుపుకునే ఈ వెలుగుల పండుగ అంటే అందరికి ఇష్టం. అన్ని మతాల వారు జరుపుకునే గొప్ప పండుగా. ముఖ్యంగా ఈ దీపాల వెలుగులో అద్భతంగా కనిపించేలా ముస్తాబవ్వాలని మగువలు భావిస్తారు. అందుకోసం స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే సంప్రదాయబద్ధంగా హుందాగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి..దీపావళి అంటే దీపాల వెలుగులు, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు. పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేయడంలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయంగా స్టైలిష్ లుక్‌లో కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి..రిచ్ లుక్ చీర..దీపావళి వెలుగులు విరజిమ్మిలే కనిపించేందుకు రిచ్ లుక్ ఉన్న శారీని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. బంగారు పసుపు, ఎరుపు, నారింజ, ఊదా రంగులు పండుగ వాతావరణాన్ని తలిపించేలా చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న సీక్విన్ చీరలను ఎంచుకుంటే స్టైలిష్‌గా ఉంటారు. అనార్కలి గౌనుగ్రాండ్గా కనిపించేలా డ్రెస్ ధరించాలంటే మాత్రం అనార్కలీని ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పొడవాటి గౌన్లు మొత్తం రూపాన్ని కొత్తగా కనిపించేలా చేయడమే గాక వేడుకకే ఓ లుక్ వస్తుంది. .లెహంగాస్లెహంగాలు సాంప్రదాయ ఆధునిక సౌందర్యాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. క్లాసిక్ చోలిస్ నుండి ట్రెండీ క్రాప్ టాప్స్ వరకు విభిన్న బ్లౌజ్ స్టైల్స్‌తో జత చేస్తే ఆ లుక్కే వేరు. అందుకోసం క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్‌తో అలంకరించిన గ్రాండెడ్ కలర్ లెహంగాలు ఎంచుకోండిచీరకట్టు స్టైల్ డిజైర్వేర్..గ్రాండెడ్ చీరతో డిఫెరెంట్ లుక్‌లో కనిపించాలనుకుంటే..రెడీమేడ్ డ్రెస్డ్ స్కర్ట్‌లను ఎంచుకోండి. వాటిని అద్భుతమైన బ్లౌజ్‌లతో జత చేయండి. సల్వార్ సూట్పండుగలకు ఇష్టమైన, సల్వార్ సూట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి సరైన ఆభరణాలను జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో వివిధ రకాల సల్వార్లు దర్శనమిస్తున్నాయి. మంచి కలర్‌తో కూడిన సల్వార్ సూట్లు వేడుకలను మరింత కలర్‌ఫుల్ మయం చేస్తాయి.(చదవండి: ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!) -
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా నిరంతరం కృషి చేస్తున్న శ్రీ శివ విష్ణు సాయిదత్త పీఠం.. దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నిర్వహించిన దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయ అర్చకులు అత్యంత వైడుకగా, సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.దీపావళి సందర్భంగా బాబాకు ప్రత్యేక హారతులను నివేదించారు. ధనలక్ష్మీ అమ్మవారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయంలో దీపాలు, విద్యుత్ కాంతులు, రంగోలీలతో సుందరంగా అలంకరించారు. అనంతరం చిన్నా పెద్ద తేడాలేకుండా అందరూ కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సాయి దత్త పీఠంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకలకు చక్కటి స్పందన లభించిందని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేసిన భక్తులకు, వాలంటీర్లకు, కమిటీ సభ్యులకు, దాతలకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఇక ఈ వేడుకలకు గ్రాండ్‌గా జరగటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
Diwali 2023 : అంబరాన్నంటిన దీపావళి సంబురాలు (ఫొటోలు)
-
Team India Diwali Bash: దీపావళి సంబురాల్లో టీమిండియా.. చూడటానికి రెండు కళ్లు చాలవు (ఫోటోలు)
-
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?బీపీ నుంచి హార్ట్ఎటాక్ వరకు..
ఇవాళ ధనత్రయోదశి. దీనినే ధన్ తేరస్ అని కూడా అంటారు. ఈ పర్వదినాన సాధారణంగా అందరికీ బంగారం, వెండి, గృహోపకరణాలు, వస్తు వాహనాల వంటి వాటి మీదికే దృష్టి మళ్లుతుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు అని గుర్తు రాదు. అయితే ఆరోగ్యం కూడా ధనమే కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుని అందుకు తగినట్లు నడుచుకుంటే ఆరోగ్య ధనం, ఆరోగ్య మహాభాగ్యం సమకూరుతుంది. ధన త్రయోదశి సందర్భంగా ఆరోగ్య సంపదను ఏవిధంగా పెంపొందించుకోవాలో చూద్దాం... సంపూర్ణ ఆరోగ్యానికి ఆహార విహారాలు ఎంత అవసరమో, నిత్యం నడక, వ్యాయామం, యోగా కూడా అంతే అవసరం. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటిస్ వరకు.. బీపీ నుంచి హార్ట్ ఎటాక్ వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. సమయానికి తగు... మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి రోజూ ఉదయాన్నే టిఫిన్ చేయడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొందరికి అలా బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు ఉండదు. అలాంటి వారు అల్పాహారంగా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజాపండ్లు, కూరగాయల ముక్కలు లాంటివి అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. లంచ్‌గా ఇవి... మధ్యాహ్నపు భోజనంగా సగం కంచంలో తాజా కూరగాయలు, మిగతా సగంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపులో ఉంచుకోవడానికి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మరేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక దృఢత్వం మానసిక ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. ఇందుకోసం నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. కంటినిండా నిద్ర కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతే ఏ జబ్బూ ఉండదని పెద్దవాళ్లనేవారు. వేళకు తగినంత రాత్రి నిద్ర ఉంటే పొద్దున లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే నిస్సత్తువగా... ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. నిద్ర లేమి వల్ల రకరకాల ఇతర జబ్బులు వస్తాయి. అందువల్ల వీలయినంత వరకు వయసును బట్టి, చేసే శారీరక శ్రమను అనుసరించి తగినంత నిద్ర పోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ధన త్రయోదశి నాడు అందరూ ఆరోగ్య ధనాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తారని, వేయారనీ ఆశిద్దాం. -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
మేరీల్యాండ్ లో దీపావళి వేడుకలు
-
Diwali 2023: ఈసారి దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే ఈసారి దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? అన్న విషయాలపై పండితులు ఏమంటున్నారంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు.అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే సోమవారం(నవంబర్13)న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీపదానాలు, యమ తర్పణాలు ఇతరత్ర దీనం చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైధిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. -
న్యూయార్క్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్( TLCA) దీపావళి వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది. న్యూయార్క్‌లోని క్రాన్సాఫ్ థియేటర్ వేదికగా తెలుగుదనం ఉట్టిపడేలా దీపావళి వేడుకలు కన్నుల పండగ్గా జరిగాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ పరిసర ప్రాంతాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నాంటాయి. రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు, పిల్లల సందడులుతో ప్రాంగణం కళకళ లాడింది. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని పలువురు కొనియాడారు. TLCA సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు. TLCA చేస్తున్న పలు కార్యక్రమాలకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. గత 10 ఏళ్లుగా మీడియా రంగంలో అందిస్తున్న సేవలను కొనియాడుతూ.. సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహబలుడు హనుమంతుడుని ఘనంగా సన్మానించి.. మెమొంటొలతో సత్కరించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రేక్షకులని ఉర్రుతలూగించింది. మణిశర్మ తన ట్రూప్ తో కలిసి మ్యూజిక్‌తో అందరినీ ఎంటర్టైన్ చేశారు. సింగర్స్ వైష్ణవి, శృతిక, స్వరాగ్, పవన్ తదితరులు సూపర్ హిట్ పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. నటి స్పందన పల్లి ఫ్యాషన్ వాక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, Raffles బహుమతులు, మెహందీ, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి వేడుకలు అసాంతం ఉత్సాహంగా సాగాయి. -
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్‌గా జరిగింది. పాపాయిని పార్క్‌లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు
లండన్: యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్ మేయర్ సాధిక్ ఖాన్ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన పలువురు మాట్లాడుతూ.. మొదటిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని, ఇదొ ఒక అద్భుతమైన అనుభవం అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. That Mayor has a name, Sadiq Khan. https://t.co/U7jSV9PtG6 — Sushant Singh (@SushantSin) October 29, 2023 -
దీపావళి - ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
-
మచిలీపట్నం సీతానగర్ లో పండుగ రోజు విషాదం
-
కార్గిల్ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
-
గాంధీభవన్‌లో ‘సదర్’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా యాదవ కులస్తులు ఘనంగా జరుపుకునే సదర్ పండుగ వేడుకలను సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. యూత్‌కాంగ్రెస్ ఆలిండియా కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున యాదవులు గాంధీభవన్‌కు వచ్చారు. దున్నపోతుల ప్రదర్శనతో వచ్చిన యాదవులకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు దున్నపోతులపై ఎక్కి అభివాదం చేస్తూ సందడి చేశారు. పెద్ద సంఖ్యలో యాదవులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావడంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో కొంతసేపు గాంధీభవన్‌లో సదర్ కోలాహలం కనిపించింది. -
సంజూ బాబా ఇంట్లో సూపర్ స్టార్
ముంబై: సినీ ప్రముఖలు ఏ పండగైనా చాలా వైభవంగా జరుపుకుంటూ వాటికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. పలు సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండే సినీ సెలబ్రెటీలు ఈ సారి కరోనా వైరస్ కారణంగా సినిమాలు ఏమి లేకపోవడంతో దీపావళీ పండగ వేడకను తమ ఇళ్లలో జరుపుకున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ఆయన భార్య మాన్యతా దత్ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పాల్గొన్నారు. సంప్రదాయమైన దుస్తులు ధరించి వారంతా ఫొటోలు దిగారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్‌లాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ‘సంజయ్, మాన్యతా నా స్నేహితులు’ అని కాప్షన్ జతచేశారు. ఈ ఫొటోల్లో సంజయ్ దత్త్, మోహన్‌లాల్ ఒకరికొకరు నమస్కరించుకొని పలకరించుకోవటం, సరదాగా మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సంజయ్ దత్ కన్నడ కేజీఎఫ్-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోహన్‌లాల్ దృశ్యం-2 రెండో విడత షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం మోహన్‌లాల్ దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) -
‘గ్రీన్ క్రాకర్స్’కు ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి వేళ రాష్ట్రంలో బాణ సంచా డీలర్లు, విక్రేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి, వాయు కాలు ష్యం దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా టపాసుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును సర్వో న్నత న్యాయస్థానం శుక్రవారం స్వల్పంగా సవ రించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా గాలి నాణ్యత సూచీల ప్రకారం రాష్ట్రంలో గ్రీన్ క్రాకర్స్ (తక్కువ కాలుష్యంతో ఉండేవి) విక్రయాలు, వినియోగానికి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సమయాన్ని నిర్దేశించకపోతే దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి ప్రత్యేక తేదీల్లో గాలి నాణ్యత సాధారణంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను తెలంగాణలోనూ అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ తెలంగాణ ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ (టీఎఫ్డబ్ల్యూడీఏ) దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో మా జీవన హక్కుకు విఘాతం... ఈ పిటిషన్‌పై తెలంగాణ ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. బాణసంచా తయారీ, విక్రయం చేపట్టే వ్యక్తుల జీవన హక్కుకు హైకోర్టు తీర్పు విఘాతం కలిగించేలా ఉందని వాదించారు. అందువల్ల హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. అయితే ప్రతివాదులు శుక్రవారం విచారణకు రాలేకపోయిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం... ప్రతివాదుల వాదన వినికుండా హైకోర్టు తీర్పుపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులు విచారణలో పాల్గోనప్పటికీ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ప్రతివాదులైన పి. ఇంద్రప్రకాశ్ (హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన న్యాయవాది), తెలంగాణ సీఎస్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా గతేడాది నవంబర్‌లో నమోదైన గాలి నాణ్యతతో పోలిస్తే ఈసారి అంతకంటే తక్కువకు పడిపోయిన అన్ని నగరాలు, పట్టణాల్లో టపాసుల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ ఎన్జీటీ ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసింది. కాగా, గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది. ‘గ్రీన్ క్రాకర్స్’ అంటే ? తక్కువ వాయు, ధ్వని కాలుష్యం విడుదల చేసే ముడిపదార్థాలతో తయారయ్యే టపాసులనే గ్రీన్ కాకర్స్ అంటారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసే టపాకాయల కంటే ఇవి 30–35 శాతం తక్కువగా కాలుష్యాన్ని వెదజల్లుతాయి. గ్రీన్ క్రాకర్స్‌లో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 కాలుష్య కణాలు తగ్గించే ప్రత్యామ్నాయ ముడి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని పేల్చినప్పుడు దుమ్మును సంగ్రహించేందుకు ‘వాటర్ మాలిక్యూల్స్’ వెదజల్లేలా కెమికెల్ ఫార్ములేషన్ ఉంటుంది. వీటిలో లిథియం, బేరియం, లెడ్, అర్సెనిక్ వంటి రసాయనాలు ఉండవు. సాధారణ టపాకాయల నుంచి దాదాపు 160 డెసిబుల్స్ దాకా శబ్దాలు వస్తే గ్రీన్ క్రాకర్స్ నుంచి 110–125 డెసిబుల్స్ లోపే శబ్దాలు వెలువడతాయి. ఇవి మామూలు టపాసుల ధరలతో పోలిస్తే 15–20 శాతం చవకగా తయారవుతాయి. వీటిలో సేఫ్ వాటర్ రిలీజర్ (శ్వాస్), సేఫ్ థర్మయిట్ క్రాకర్ (స్టార్), సేఫ్ మినిమల్ అల్యూమినియమ్ (సఫల్) అనే మూడురకాల గ్రీన్ క్రాకర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్–నీరి) ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేశారు. గ్రీన్ క్రాకర్స్‌ను తయారు చేసే ఉత్పత్తిదారులు ముందుగా గ్రీన్ క్రాకర్స్ ఫార్ములేషన్‌ను ఉపయోగించేందుకు సీఎస్ఐఆర్తో ఒప్పందంపై సంతకాలు చేయాలి. వీటిని గుర్తించేందుకు వీలుగా ఈ టపాకాయల ప్యాకెట్లపై ‘గ్రీన్ ఫైర్వర్క్స్’ లోగో, క్యూర్కోడ్స్ ఉంటాయి. -
విద్యుత్ కాంతులతో అమృత సర్,అయోధ్య
-
బంగారం దుకాణాలు కళకళ
-
దీపావళి రాకముందే...
న్యూఢిల్లీ: దీపావళి పండుగకు రెండు రోజుల ముందే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వానంగా మారింది. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి శుక్రవారం నాడు అత్యల్ప గాలి నాణ్యత నమోదైంది. గురువారం సాయంత్రం నగరంలో గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) 311గా ఉండగా.. శుక్రవారం 284 నుంచి 315 మధ్య నమోదైంది. గాలి కదలికలో వేగం మందగించడంతో కాలుష్యం తీవ్రత పెరిగింది. ముఖ్యంగా నెహ్రూ నగర్, అశోక్ విహార్, జహంగీర్‌పురి, రోహిణి, వాజీర్‌పూర్, బావన, ముండ్కా, ఆనంద్ విహార్ ప్రాంతాల్లోనూ ఇదే తీరుందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. చుట్టు్టపక్కలున్న బాఘ్పట్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, నోయిడాల్లోనూ ఇలాగే ఉంది. మరోవైపు ఢిల్లీ, శాటిలైట్ టౌన్లలో శనివారం నుంచి బుధవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు మూసివేయాలని ఆదేశించింది. -
హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీలో ఘనంగా దీపావళి వేడుకలు
తల్లహాసీ : హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీ ( హెచ్‌టీటీ) ఆధ్వర్యంలో ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని తల్లహాసీ నగరంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. 800మందికి పైగా హాజరైన ఈ వేడక అత్యంత వినోదంగా సాగింది. ఈ వేడుకలలో 80 మంది ఫుడ్ వాలంటీర్లు పాల్గొన్నారు. 12 లైవ్ ఫుడ్ స్టాల్సు లో 54 రకాల వంటకాల తో పసందైన విందుతో పాటు పిల్లలకు కోసం వినోద కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచారు. 22 అడుగుల ఎత్తు లో పదితలల రావణాసురుడి భారీ కటౌటు ఏర్పాటు చేసి దహనము చేసారు, ఆ రావణకాష్ట ధూమము మింటికి ఎగయగానే అక్కడ చేరిన వారు భక్తి పారవశ్యం తో జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ అని చేసిన విజయ ఘోషలతో రామ నామ స్మరణలతో ,మిరుమిట్లుగొలిపే బాణాసంచాతో దసరా రామలీల కార్యక్రమములు ముగిసాయి. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సాయి శశిధర్ రెడ్డి చిన్నమల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి అవిశ్రామముగా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీవారికి , వాలంటీర్లకి, ఈవెంట్ మరియు లోకల్ బిజినెస్ స్పాంసర్ల కు పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేసారు.తల్లహాసీ అంటే సెవన్ హిల్సు ( సప్తగిరి ) అని అక్కడి నేటివ్ రెడ్ ఇండియన్ పరిభాష లో అర్ధము. సప్తగిరి ఆఫ్ ద వెస్టు లో స్థిరపడిన ప్రవాస భారతీయులు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమము ను ప్రమోట్ చేసే ఫండ్ రైసింగ్ ప్రోగ్రాము లో ఓక బాగమే ఈ దసరా రామలీల. ఆనవాయితిగా గత 6 సంవత్సరాల నుండి ఈ మహోత్సవము నిర్విఘ్నముగా చేస్తున్నారు. 2000 కు పైగా హిందువుల ఫ్యామీలీలు ఉన్న ఆ సప్తగిరి నగరము లో అత్యుత్సాహంతో అక్కడ ప్రజలు ప్రతిపండుగ ను కన్నుల పండగ గా జరుపుకుంటూనే తమ ఊరిలో ఓక దేవాలయము ఉండాలని, ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సందర్భము గా ఆలయ నిర్మాణ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి నందినేని మాట్లాడుతూ సప్తగిరి గా పిలువ బడుతున్న ఆఊరి లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని , తల్లహాసీ ప్రజలే కాక ఇతర సిటీల నుంచి స్నేహితులు భక్తులు కొన్ని సంస్థలు ముందుకు రావటముతో 20 ఏకరాల స్థలము కొన్నామని, 11500 చదరపు అడుగుల విస్తీర్ణంతో పలు వసతులతో కూడిన శ్రీవారి ఆలయ ఫేస్-1 నిర్మాణానికి 1.6 మిలియన్ డాలర్ల ఎస్టిమేషన్ లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల విరాళాలు అందాయని, ఇంకొక 0.6 మిలియన్ డాలర్ల విరాళాలకు భక్తులు పలు సంస్థలు ముందుకు వచ్చి ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమము లో పాలుపంచుకోవాలని కోరారు. హిందు టెంపుల్ ఆఫ్ తల్లహాసీ స్వచ్ఛంధ సంస్థకు ఇచ్చే విరాళాల కు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. వివరాల కు ఇంకా ఆన్ లైన్ డోనోషన్ లకు టెంపుల్ వెబ్ సైటు చూడగలరు. -
అయోధ్యలో ఘనంగా దీపోత్సవం
అయోధ్య: పురాణ పురుషుడు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య పులకించింది. సరయు నదీ తీరం ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మార్మోగింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా దీపోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. శ్రీరాముడు, సీతాదేవి వేషధారణలో ఉన్న కళాకారులు పష్పక విమానాన్ని పోలిన ప్రత్యేక హెలికాప్టర్లో రామ్ కథా పార్కుకు చేరుకున్నారు. 14 ఏళ్ల వనవాసం ముగించుకుని శ్రీరాముడు, సీతాదేవి అయోధ్యలో అడుగుపెట్టిన క్షణాలను గుర్తుచేసేలా ఉన్న ఆ దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. రామాయణంలోని వివిధ పాత్రలు ధరించిన కళాకారులు రామ్‌లీలా వేదికకు చేరుకుంటున్న సమయంలో వారిపై పూల వర్షం కురిసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రామ్ నాయక్, కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ తదితరులు హాజరయ్యారు. దీపోత్సవంలో భాగంగా నదీ తీరంలో 1.71 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక సౌండ్ ఎఫెక్ట్స్‌తో నిర్వహించిన 22 నిమిషాల లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దాదాపు ప్రభుత్వ యంత్రాంగమంతా అయోధ్యలోనే మకాం వేయడం గమనార్హం. అయోధ్యను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేయడానికే ‘త్రేతా యుగం నాటి దీపావళి’ని ప్రజల కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేశామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అయోధ్య నగర్ నిగమ్‌లో ఉన్న జనాభా 1.71 లక్షలని దానికి సమాన సంఖ్యలోనే దీపాలు వెలిగించినట్లు తెలిపారు. నిజమైన రామరాజ్యమిదే: సీఎం యోగి పేదరికం, వివక్ష, దుఃఖం లేని రాజ్యమే రామరాజ్యమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్య పట్టణాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ కోణంలో చూడొద్దని విమర్శకులను కోరారు. దీపోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...తానేం చేసినా కొందరు పనికట్టుకుని విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘రామరాజ్యం అనే భావనను ఇచ్చింది అయోధ్యే. ఇక్కడ పేదరికం, బాధలు, వివక్షలకు చోటు లేద’ని అన్నారు ఈ భావనకు నిజమైన అర్థం..అందరికీ ఇళ్లు, విద్యుత్, ఎల్పీజీ సిలిండర్లు కల్పించడమేనని వివరించారు. గత ప్రభుత్వాల మాదిరిగా తాము కులం, మతం ఆధారంగా పక్షపాతం చూపట్లేదని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరును రామరాజ్యంతో పోల్చిన యోగి...అయోధ్యకు పూర్వ వైభవం తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ‘అయోధ్య ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. ఎన్నో దాడులను ఓర్చుకుంది. ఇకపై అలా కుదరదు. ఇక్కడ రూ.133 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించాం.అయోధ్య ఘాట్లను సుందరీకరిస్తాం. ఉత్తరప్రదేశ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుగా అయోధ్యపై దృష్టిపెట్టాం ’ అని అన్నారు. -
నా ఫేవరెట్ ఫెస్టివల్ – రితూ వర్మ
చిన్నప్పట్నుంచి దీపావళి నా ఫేవరెట్ ఫెస్టివల్. చిన్నప్పుడు అమ్మానాన్నలతో షాపింగ్‌కు వెళ్లేదాన్ని. కొత్త బట్టలు కొనుక్కోవడమంటే చిన్నపిల్లలకు సరదాగా ఉంటుంది కదా! కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కు స్వీట్స్, గిఫ్ట్స్ షాపింగ్ కూడా మనదే. దీపావళిలో నాకు ఇష్ట్టమైనది ఇల్లంతా ప్రమిదలతో అలంకరించ డం! పండగలకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తోనే టైమ్ స్పెండ్ చేస్తా. చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ నాకిష్టమైన హల్వా చేసేవారు. ప్రతి దీపావళికి అమ్మ రైస్ ఖీర్, హల్వా చేస్తారు. దీపావళి అంటే... జీవితాల్లో వెలుగులు నింపడం, సంతోషాన్ని పంచడం! నేను క్రాకర్స్ కాల్చను. పలు కారణాల వల్ల మంచిది కాదు కూడా! ప్రజలూ కాల్చరని ఆశిస్తున్నా. -
వంద మంది గెస్ట్‌లతో దీపావళి– హన్సిక
పండగల టైమ్‌లో షూటింగ్‌కి బ్రేక్ దొరికితే భలే ఉంటుంది. ఈసారి నాకా ఛాన్స్ దక్కింది. అందుకే ముంబై వెళ్లా. దీపావళి పండగని మేం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. స్నేహితులు, బంధువులు.. మొత్తం అంతా కలిపి దాదాపు వంద మంది మా ఇంటికొచ్చారు. రెండు రోజులు లక్ష్మీ పూజ చేస్తాం. ఆల్రెడీ బుధవారం ఒక పూజ చేశాం. గురువారం ఇంకో పూజ. ఫస్ట్ డే పూజకి నా కోసం మా అమ్మగారు గాగ్రా చోళీ కొన్నారు. రెండో రోజు పూజకు హాఫ్ శారీ (లంగా, ఓణీ) కుట్టించారు. ఇంట్లో సందడి గురించి పక్కన పెడితే, నేను దత్తత తీసుకున్న పిల్లలను కూడా ఆనందపరచడం నా బాధ్యత అందుకే వాళ్లని కలిసి, దీపావళి గిఫ్ట్స్ ఇచ్చి, కాసేపు స్పెండ్ చేయాలను కుంటున్నాను. నిన్న కుదరలేదు. పిల్లలకు క్రాకర్స్ మాత్రం ఇవ్వను. అవి కాల్చడానికి సరదాపడతారు కానీ, పర్యావరణానికి మంచిది కాదు. అందుకే, ఎంకరేజ్ చేయను. -
క్రికెటర్ల పండగ
న్యూఢిల్లీ: విరామం దొరకడంతో టీమిండియా ఆటగాళ్లు వేడుకల్లో మునిగి తేలుతున్నారు. న్యూజిలాండ్ తో సిరీస్ ముగియడంతో భారత క్రికెటర్లకు ఖాళీ దొరికింది. దీంతో కుటుంబ సభ్యులతో క్రికెటర్లు సరదాగా గడుపుతున్నారు. వరుస పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆటగాళ్లకు కాస్త విరామం లభించడంతో ఈ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తున్నారు. దీపావళికి ముందు రోజు కివీస్ తో సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకున్నారు. ఎంఎస్ ధోని తన భార్య, కూతురు కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. పండుగ సందర్భంగా తీసుకున్న ఫొటోను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ దీపావళి ఇంట్లో కుటుంబసభ్యులతో జరుపుకోవడం పట్ల అజింక్య రహానే ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు తన భార్య వేసిన ముగ్గు ఫొటో ఇన్ స్టామ్ లో పోస్టు చేసి అందరికీ దీపావళి విషెస్ చెప్పాడు. స్నేహితులతో కలిసి వీరు సరదాగా గడిపారు. హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు దీపావళి శుభాకంక్షలు తెలిపాడు. అజింక్య రహానే తన భార్య వరుసగా ఐదు వారాలు మ్యాచ్ లు ఆడిన తర్వాత కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు విరామం దొరికిందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. విదేశీ క్రికెటర్లు కూడా దీపావళి జరుపుకోవడం విశేషం. ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించిన వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. తన పిల్లలతో పాటు తాను కూడా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి పండగ చేసుకున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి ఉత్సాహంగా దీపావళి జరుపుకున్నామని వెల్లడించాడు. -
మెగా దీపావళి... ఆనందకేళి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పండుగ రోజును కుటుంబ సభ్యుల మధ్య గడిపారు. మెగా హీరోలంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి వేడుకలు జరుపుకునేందుకు మెగా హీరోలు అందరూ ఒక్కచోట చేరారు. వీరంతా కలిసివున్న ఫొటో బయటకు విడుదల చేయడంతో మెగా అభిమానులకు పండగ సంతోషం రెట్టిపయింది. మెగా హీరోయిన్, నాగబాబు తనయ నిహారిక కూడా పెద్దనాన్న చిరంజీవితో కలిసి ఫొటో దిగింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు, వైష్టవ్ తేజ్.. చిరంజీవి చుట్టూ చేరి ఫొటోకు ఫోజుయిచ్చారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, ప్రస్తుతం చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
గోవాలో టాప్ హీరో సందడి
ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ గోవాలో ప్రత్యక్షమయ్యాడు. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో జరుపుకున్నాడు. తన వారందరితో కలిసి పండుగ చేసుకున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'ట్యూబ్ లైట్' సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలో వాలిపోయాడు ఈ కండలవీరుడు. సముద్రపు ఒడ్డునున్న ప్రైవేటు రిసార్ట్ లో సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు. ఆటపాటలతో సందడి చేశాడు. బావ అతుల్ అగ్నిహోత్రి, సోదరుడు సోహైల్ భార్య సీమా, వారి కొడుకులు, సోదరి అర్పిత, ఆమె భర్త ఆయుష్ వీరి కుమారుడు ఆహిల్ తో కలిసి సల్మాన్ దీపావళి జరుపుకున్నాడు. ఈ ఫొటోలను సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ సోహల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హీరో సూరజ్ పంచోలీ సహా కుర్రాళ్లతో కలిసి దిగిన మరో ఫొటోను సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ పేజీలో పెట్టాడు. కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ట్యూబ్ లైట్ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్ సినిమాలు ఘన విజయం సాధించాయి. Dj Willy in the house! @aaysharma @NirvanKhan15 @atulreellife @soorajpancholi9 pic.twitter.com/URSo5EFmM2 — Salman Khan (@BeingSalmanKhan) 30 October 2016 -
దీపావళి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ
-
సంప్రదాయ వెలుగులు..
-
కొనసాగుతున్న కర్ఫ్యూ
న్యూఢిల్లీ: నగరంలో ఇటీవల అల్లర్లు చోటుచేసుకొన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆదివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకొన్న దాఖలాలు లేవు. దీపావళి పండుగ సందర్భంగా చిన్న విషయమై రెండు వర్గాల పరస్పరం ఘర్షణకు దిగడంతో ఈ ప్రాంతంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలోనే శనివారం మరో ఐదుగురికి తుపాకీ గాయాలైన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతం త్రిలోక్‌పురి ప్రాంతంలో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నదని డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజయ్‌కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో, ఆ ప్రాంతంలో ప్రజలు గుంపులుగా ఉండరాదని అధికారులు నిషేధ విధించారని చెప్పారు. శుక్రవారం జరిగిన సంఘటనకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన 70 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకొన్నారని చెప్పారు. శనివారం సాయంత్రం మరోసారి జరిగిన ఘటనలో ఐదుమందికి తుపాకీ గాయాలయ్యాయని చెప్పారు. రాళ్లు రువ్వుకోవడంతో 14 మంది ప్రజలు, 13 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. వారంతా నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. త్రిలోక్‌పురి ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించినట్లు చెప్పారు. 30 పోలీసు వాహనాలు, వాటర్ క్యానన్స్, అల్లర్ల నియంత్రణ వాహనాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. ఇరువర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. -
దీపావళికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు తెలిపారు. సికింద్రాబాద్ - సిర్పూర్కాగజ్నగర్, భువనేశ్వర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్ - అహ్మదాబాద్, తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతారు. సికింద్రాబాద్-సిర్పూర్కాగజ్నగర్ (07035)స్పెషల్ ట్రైన్ ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్కాగజ్నగర్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్కాగజ్నగర్-సికింద్రాబాద్ (07036) స్పెషల్ ట్రైన్ 25వ తేదీ సాయంత్రం 7 గంటలకు సిర్పూర్కాగజ్నగర్ నుంచి బయలుదేరి రాత్రి 2 గంటల సమయంలో సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-అహ్మదాబాద్ (07018/07017) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ నవంబర్ 1వ తేదీ ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15కి అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్-శ్రీ మాతా వైష్ణోదేవి కాత్రా స్టేషన్ (02679/02680) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ నవంబర్ 1, 8 తేదీలలో (శనివారం) ఉదయం 11.30 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి 4.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సోమవారం రాత్రి 7.45 గంటలకు వైష్ణోదేవి కాత్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 4, 11 తేదీలలో (మంగళవారం) ఉదయం 5.15 గంటలకు వైష్ణోదేవి కాత్రా నుంచి బయలుదేరి బుధవారం సాయంత్రం 7.25 గంట లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరి గి 7.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌కు ఈ నెల 23 ఉదయం 8 గంటలకు ఐఆర్ సీటీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఆర్ఆర్సీ ఎగ్జామ్స్‌కు ప్రత్యేక రైళ్లు... రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఎగ్జామ్స్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వీక్లీ స్పెషల్ ట్రైన్స్ నడుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. ఈ మేరకు భువనేశ్వర్-సికింద్రాబాద్ వీక్లీ (08403/08404) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 31, నవంబర్ 7, 14, 21, 28 తేదీలలో రాత్రి 10.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. అదనపు బోగీలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు తెలిపారు. ఒక ఏసీ చైర్‌కార్, 2 సెకెండ్‌క్లాస్ చైర్‌కార్ బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఈ నెల 31 వరకు 720 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. -
శబ్ధరహిత దీపావళి!
న్యూఢిల్లీ: ఈ ఏడాది రాజధాని నగరంలో శబ్ధ రహితంగా దీపావళి పండుగను జరుపుకొనేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర హర్షవర్ధన్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. నివాసిత ప్రాంతాల్లో భారీ శబ్ధం చేసే బాణసంచాను కాల్చడాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాందినీచౌక్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్ధన్ ఈ మేరకు గురువారం నజీబ్ జంగ్కు ఒక లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని, ఢిల్లీలో మాత్రం అది కనిపించడం లేదని పేర్కొన్నారు. బాణసంచా భారీ పేలుళ్ల శబ్ధం కారణంగా పిల్లలు, వయోవృద్ధులు ఆరోగ్య సంబంధమైన సమస్యలకు గురవుతారని స్వయంగా వైద్యుడైన వర్ధన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి పరిపాలన యంత్రాంగం గతంలో సాకులు చెప్పిందని ఆయన ఆరోపించారు. పోలీసు సిబ్బంది సరిపోను లేరని, బాణసంచా పేల్చడం మన సంస్కృతి వంటి కారణాలు వినిపించారని పేర్కొన్నారు. ఈ కారణాలు ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ దీపావళి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఢిల్లీలో మార్పు కనిపించాలని వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2005 జూలైలో ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగకు మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసే విధంగా వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వర్ధన్ కోరారు. బాణసంచా నుంచి వెలువడే శబ్ధ కాలుష్యం వల్ల అన్ని వయస్సుల వారికి భౌతికంగా అసౌకర్యం కలగడంతో పాటు మానసిక రుగ్మతలకు కూడా దారి తీయవచ్చని వర్ధన్ హెచ్చరిం చారు. శబ్ధ కాలుష్యం వల్ల జరిగే అనర్ధాలపై పిల్లలకు అవగాహన కల్పించేం దుకు స్కూళ్లు, కాలేజీలను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.