తల్లహాసీ : హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీ ( హెచ్‌టీటీ) ఆధ్వర్యంలో ఫ్లోరిడా రాష్ట్ర రాజధాని తల్లహాసీ నగరంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. 800మందికి పైగా హాజరైన ఈ వేడక అత్యంత వినోదంగా సాగింది. ఈ వేడుకలలో 80 మంది ఫుడ్ వాలంటీర్లు పాల్గొన్నారు. 12 లైవ్ ఫుడ్ స్టాల్సు లో 54 రకాల వంటకాల తో పసందైన విందుతో పాటు పిల్లలకు కోసం వినోద కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచారు. 22 అడుగుల ఎత్తు లో పదితలల రావణాసురుడి భారీ కటౌటు ఏర్పాటు చేసి దహనము చేసారు, ఆ రావణకాష్ట ధూమము మింటికి ఎగయగానే అక్కడ చేరిన వారు భక్తి పారవశ్యం తో జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ అని చేసిన విజయ ఘోషలతో రామ నామ స్మరణలతో ,మిరుమిట్లుగొలిపే బాణాసంచాతో దసరా రామలీల కార్యక్రమములు ముగిసాయి.
ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సాయి శశిధర్ రెడ్డి చిన్నమల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి అవిశ్రామముగా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీవారికి , వాలంటీర్లకి, ఈవెంట్ మరియు లోకల్ బిజినెస్ స్పాంసర్ల కు పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేసారు.తల్లహాసీ అంటే సెవన్ హిల్సు ( సప్తగిరి ) అని అక్కడి నేటివ్ రెడ్ ఇండియన్ పరిభాష లో అర్ధము. సప్తగిరి ఆఫ్ ద వెస్టు లో స్థిరపడిన ప్రవాస భారతీయులు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమము ను ప్రమోట్ చేసే ఫండ్ రైసింగ్ ప్రోగ్రాము లో ఓక బాగమే ఈ దసరా రామలీల. ఆనవాయితిగా గత 6 సంవత్సరాల నుండి ఈ మహోత్సవము నిర్విఘ్నముగా చేస్తున్నారు. 2000 కు పైగా హిందువుల ఫ్యామీలీలు ఉన్న ఆ సప్తగిరి నగరము లో అత్యుత్సాహంతో అక్కడ ప్రజలు ప్రతిపండుగ ను కన్నుల పండగ గా జరుపుకుంటూనే తమ ఊరిలో ఓక దేవాలయము ఉండాలని, ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈ సందర్భము గా ఆలయ నిర్మాణ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి నందినేని మాట్లాడుతూ సప్తగిరి గా పిలువ బడుతున్న ఆఊరి లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని , తల్లహాసీ ప్రజలే కాక ఇతర సిటీల నుంచి స్నేహితులు భక్తులు కొన్ని సంస్థలు ముందుకు రావటముతో 20 ఏకరాల స్థలము కొన్నామని, 11500 చదరపు అడుగుల విస్తీర్ణంతో పలు వసతులతో కూడిన శ్రీవారి ఆలయ ఫేస్-1 నిర్మాణానికి 1.6 మిలియన్ డాలర్ల ఎస్టిమేషన్ లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల విరాళాలు అందాయని, ఇంకొక 0.6 మిలియన్ డాలర్ల విరాళాలకు భక్తులు పలు సంస్థలు ముందుకు వచ్చి ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమము లో పాలుపంచుకోవాలని కోరారు. హిందు టెంపుల్ ఆఫ్ తల్లహాసీ స్వచ్ఛంధ సంస్థకు ఇచ్చే విరాళాల కు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. వివరాల కు ఇంకా ఆన్ లైన్ డోనోషన్ లకు టెంపుల్ వెబ్ సైటు చూడగలరు.
Comments
Please login to add a commentAdd a comment