హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.
కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే ఈసారి దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? అన్న విషయాలపై పండితులు ఏమంటున్నారంటే..
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు.అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది.
ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం.
కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు.
అయితే సోమవారం(నవంబర్13)న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీపదానాలు, యమ తర్పణాలు ఇతరత్ర దీనం చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైధిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment