ఢిల్లీ: సంతోషంగా జరుపుకుంటున్న దీపావళి పండుగ నాడు విషాదం చోటు చేసుకుంది. మేనమామను చంపింది ఎవరో తెలుసుకుందామని వెళ్లిన మేనల్లుడిపై సైతం అగంతకులు కాల్పులు జరిపారు. ఈ దర్ఘుటనలో మేనల్లుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు.
ఢిల్లీ షహదారాలో నివాసం ఉంటున్న ఆకాష్ శర్మ(44),అతని మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (10) గురువారం రాత్రి 8 గంటల సమయంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటి బయట టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై అక్కడికొచ్చారు. అందులో ఓ వ్యక్తి ఆకాష్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. మరో వ్యక్తిపై అనుమానం రావడంతో ఆకాష్ శర్మ భయపడి ఇంట్లోకి పరిగెత్తాడు. వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో ఇంట్లోకి వెళ్లిన ఆకాష్‌ను వెంటాడి మరి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మేనమామ ఆకాష్ శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటి బయట బాంబులు అంటించే ప్రయత్నంలో ఉన్న రిషబ్ శర్మ తొలుత ఇదేమీ పట్టించుకోలేదు. తుపాకి పేలిన శబ్దం రావడంతో అప్పుడు గమనించి పారిపోతున్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు మేనల్లుడిపై కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనతో ఉలిక్కి పడ్డ కుటుంసభ్యులు, స్థానికులు గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రి తరలించగా ఆకాశ్, రిషబ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. క్రిష్‌కు చికిత్స కొనసాగుతోంది.
Farsh Bazaar double murder cctv
A man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024
కాగా, ఆశీర్వాదం తీసుకున్న యువకుడు ఆకాష్ శర్మకు డబ్బులు ఇచ్చాడు. ఆడబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన యువకుడు ఆకాష్ శర్మను హతమార్చేలా నిందితుడికి సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో హత్యకోసం నిందితులు 17 రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశారు. మైనర్, బాధితుడు ఆకాష్ ,అతని కుటుంబంపై గతంలో కేసులు ఉన్నాయి అని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment