ఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు శుక్రవారం ఉదయం ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని తెలిపారు. స్కూల్స్‌లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి.
ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సల్వాన్ స్కూల్, మోడరన్ స్కూల్,కేంబ్రిడ్జ్ స్కూల్స్‌తో పాటు ఇతర పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించాలని అధికారులు సూచించారు. ఈరోజు పిల్లలను స్కూళ్లకు పంపొద్దని, ఒకవేళ పంపితే వెనక్కి తీసుకుని వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
బాంబు బెదింపులు ఇ-మెయిల్స్ డార్క్ వెబ్ నుంచి పంపినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఆ బెదిరింపుల్లో ‘మీ విద్యార్థులు స్కూల్‌లోపలికి వచ్చే సమయంలో మీరు తనిఖీలు చేయరని నమ్ముతున్నాను. మేం అమర్చిన బాంబులు భవనాలను ధ్వంసం చేయడంతో పాటు, ప్రజలకు ప్రాణనష్టం జరగుతుంది. డిసెంబర్ 13,14, రెండు రోజులు మీ స్కూళ్లలో ఈ తరహా విధ్వంసం జరగొచ్చు. డిసెంబరు 14న పలు పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగడం బాంబులు పేల్చేందుకు మాకు ఇదొక మంచి అవకాశం.మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాటిని మీరే నెరవేర్చాలి. అందుకు మీరు అంగీకరిస్తే వెంటనే మేం పంపిన మెయిల్స్‌కు రిప్లయి ఇవ్వండి ’అని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అగంతకులు వచ్చిన ఇ-మెయిల్స్‌పై అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ, పోలీసులు, బాంబు డిటెక్షన్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు పాఠశాలలకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఇ-ఇమెల్స్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment