Thretended
-
Delhi : స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు శుక్రవారం ఉదయం ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని తెలిపారు. స్కూల్స్‌లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సల్వాన్ స్కూల్, మోడరన్ స్కూల్,కేంబ్రిడ్జ్ స్కూల్స్‌తో పాటు ఇతర పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించాలని అధికారులు సూచించారు. ఈరోజు పిల్లలను స్కూళ్లకు పంపొద్దని, ఒకవేళ పంపితే వెనక్కి తీసుకుని వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. బాంబు బెదింపులు ఇ-మెయిల్స్ డార్క్ వెబ్ నుంచి పంపినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఆ బెదిరింపుల్లో ‘మీ విద్యార్థులు స్కూల్లోపలికి వచ్చే సమయంలో మీరు తనిఖీలు చేయరని నమ్ముతున్నాను. మేం అమర్చిన బాంబులు భవనాలను ధ్వంసం చేయడంతో పాటు, ప్రజలకు ప్రాణనష్టం జరగుతుంది. డిసెంబర్ 13,14, రెండు రోజులు మీ స్కూళ్లలో ఈ తరహా విధ్వంసం జరగొచ్చు. డిసెంబరు 14న పలు పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగడం బాంబులు పేల్చేందుకు మాకు ఇదొక మంచి అవకాశం.మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాటిని మీరే నెరవేర్చాలి. అందుకు మీరు అంగీకరిస్తే వెంటనే మేం పంపిన మెయిల్స్‌కు రిప్లయి ఇవ్వండి ’అని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగంతకులు వచ్చిన ఇ-మెయిల్స్‌పై అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ, పోలీసులు, బాంబు డిటెక్షన్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు పాఠశాలలకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఇ-ఇమెల్స్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు. -
బెదిరింపులు చెల్లవ్
మగాళ్లనైతే చంపుతామంటారు. స్త్రీలను?... రేప్ చేస్తామంటారు. స్త్రీలు స్వేచ్ఛను కోరినా, స్వతంత్రాన్ని సాధించుకున్నా, నిరసన వ్యక్తం చేసినా, అన్యాయంపై గళమెత్తినా, కొత్తమార్గం చేపట్టినా, ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా నచ్చని వారి నుంచి వచ్చే ఒకే ఒక బెదిరింపు ‘రేప్ చేస్తాం’. ఈ మాటతో బెదిరించవచ్చని, దీనికి ఆమోదం ఉందని అనుకునేవారు మన దేశంలో ఉన్నారు. కాని ఇలా నోరు పెగలితే లాకప్‌లోకి వెళ్లాల్సుంటుందని తాజా ఉదంతం చెబుతోంది. మనుషులు ఒక్కోసారి నచ్చనిది మాట్లాడతారు. ఒక్కోసారి హేళన కొద్దీ మాట్లాడతారు. ఒక్కోసారి పొరపాటుగా మాట్లాడతారు. మరోసారి అనాలోచితంగా మాట్లాడతారు. ప్రతిసారీ అందరూ అన్ని మాటలను ‘నమ్మి’ మాట్లాడకపోవచ్చు. తర్వాత చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించవచ్చు. క్షమాపణలు కోరవచ్చు. ఇలాంటి సందర్భాలలో పురుషులను ‘శారీరకంగా హింసిస్తాం’ అని బెదిరింపులు వస్తుంటాయి. స్త్రీలకు మాత్రం ‘లైంగికంగా హింసిస్తాం’ అని బెదిరింపులు వస్తాయి. స్త్రీలను లైంగికంగా హింసించే అనుమతి ఉందని అనుకోవడం అల్పమైన పురుష భావజాలం. దీనిని సరి చేయడానికి స్త్రీ, పురుష ఆలోచనాపరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ భావజాలం మారాల్సి ఉంది. తాజాగా స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువా ఉదంతం పురుషులు మాట్లాడే ‘బెదిరింపు భాష’ను సరి చేయించాల్సిన అవసరాన్ని తెలియ చేసింది. ఆమెను వడోదరాకు చెందిన శుభమ్ మిశ్రా అనే వ్యక్తి ‘రేప్ చేస్తానని’ బెదిరించాడు. ఆమె చేసిన పనితో అతనికి అసమ్మతి ఉండటం వల్ల అతడు ఇచ్చిన వార్నింగ్ ఇది. అగ్రిమా జాషువా ఏం చేసింది? పూణెకు చెందిన అగ్రిమా (28) ముంబైలో ఇంజినీరింగ్ చదువుతూ చివరి సంవత్సరంలో చదువు మానేసి స్టాండప్ కమెడియన్‌గా మారింది. ‘ఇదే తన అసలు సత్తా’ అని ఆమె నిశ్చయించుకొని తన తల్లితండ్రుల స్వరాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ మీద ‘ఉత్తర ప్రదేశ్ మన దేశపు టెక్సాస్’ అని ఒక వీడియో చేసింది. దానికి చాలా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆమె చేసిన షోస్ అభిమానులు పెరిగారు. అయితే సంవత్సరం క్రితం ఒక షోలో ఆమె ముంబై సముద్ర తీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన భారీ ఛత్రపతి శివాజీ విగ్రహం గురించి కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు శివాజీ గురించి కాకపోయినా రాజకీయ నాయకులను వెర్రిగా అభిమానించేవారి మూఢభక్తి గురించే అయినా అవి కొంతమంది మనోభావాలను గాయపరిచాయి. వెంటనే ఆ వీడియోను అగ్రిమా తొలగించింది. క్షమాపణలు చెప్పింది. తాజాగా మళ్లీ ఆ వీడియోను ఎవరో సర్క్యులేషన్లో పెట్టారు. మహారాష్ట్రకు చెందిన ఒక ఎం.ఎల్.ఏ అగ్రిమాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో మళ్లీ అందరి దృష్టి అగ్రిమాపై పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రే దీనిపై పోలీసు విచారణకు ఆదేశించారు. కొందరు ఆమెను చంపుతామని బెదిరించారు. కాని వడోదరాకు చెందిన శుభమ్ మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాను ‘రేప్ చేస్తానని’ బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. నిరసన అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని, కాని స్త్రీలను హెచ్చరించాల్సి వచ్చినప్పుడల్లా రేప్ భాషను ఎందుకు వాడతారని శుభమ్ మిశ్రా వీడియో దరిమిలా దేశవ్యాప్త స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. అయితే శుభమ్ మిశ్రా ఈ బెదిరింపుపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాని వడోదరా పోలీసులు రంగంలోకి దిగి శుభమ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. శుభమ్ పెట్టిన వీడియోను ‘సు మోటో’గా తీసుకున్నామనీ అతనిపై ఐ.పి.సి 294, 354 (ఏ), 504, 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలియ చేసింది. మహిళా కమిషన్ విచారణ స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువాకు వచ్చిన రేప్ బెదిరింపు దృష్టికి రావడంతోటే జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ‘మహిళలకు ఆన్లైన్ స్పేస్ కల్పించడంలో, సైబర్ సెక్యూరిటీని ఇవ్వడంలో, వారు స్వేచ్ఛగా సైబర్ స్పేస్‌ను వాడుకునేలా చేయడంలో జాతీయ మహిళా కమిషన్ రక్షణగా ఉంటుంది’ అని దాని చైర్పర్సన్ రేఖా శర్మ గుజరాత్ డి.జి.పికి లేఖ రాశారు. మర్యాదగా వ్యవహరించాలి సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే విషయాలు అనేకం జరుగుతుంటాయి. భావోద్వేగాల తక్షణ స్పందనను కోరుతుంటాయి. ఆ సమయంలో సంయమనం పాటించాలి. ముఖ్యంగా స్త్రీల విషయంలో మాట్లాడే భాష ప్రజాస్వామికంగా, సమస్థాయిలో, చర్చకు యోగ్యంగా ఉండాలి. లేని పక్షంలో బాధితులు ఊరుకున్నా చట్టం ఊరుకోదని ఈ ఉదంతం తెలియచేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
లాయర్ దీపిక సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్ : బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతుంటే తోటి న్యాయవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని లాయర్ దీపికా సింగ్ రాజవత్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం చేసిన కతువా గ్యాంగ్ రేప్, హత్య కేసులో బాధితుల తరపున ఆమె వాదిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కతువా జిల్లాలో నోమాడియక్ బకెర్వాల్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల సాంజి రామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బాలిక తల్లిదండ్రుల పక్షాన జమ్మూ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న దీపిక సంచలన వాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో బాధితుల తరపున నిలబడ్డ క్షణం నుంచి అనేక రకాల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా న్యాయం కోసం వాటిని పట్టించుకోను. హైకోర్టులో తోటి న్యాయవాదులే నన్ను దూషిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ స్థానిక లాయర్లు కేసు నమోదు కాకుండా నిందింతులకు సహాయం చేశారు. దీని వెనుక వారి ఉద్దేశం అర్థవవుతుంది. జమ్మూ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు బీఎస్ సలాథియా నన్ను ఈ కేసు వాదించవద్దన్నారు. ఒకవేళ నువ్వు వాదిస్తే నిన్ను ఎలా అడ్డుకోవాలో తెలుసని ఆయన బెదిరించారు. భయంతో నేను భద్రత కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించానని.. వారు తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించార’ని దీపిక వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఇరోమ్ షర్మిలకు బెదిరింపులు
16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను ఆపి వివాహం చేసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్న మణిపూరి ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళకు బెదిరింపులు వచ్చాయి. ఓ కారణం కోసం పోరాడి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారందరూ ఆ తర్వాత హత్యకు గురైనట్లు సెసెస్సనిస్ట్ అలయన్స్ ఫర్ సోషల్ యూనిటీ(ఏఎస్ యూకే) షర్మిళకు గుర్తుచేసింది. అంతగా ప్రచారం లేని ఈ సంస్థ ఢిల్లీ కంట్రోల్ నుంచి మణిపూర్ ను స్వతంత్ర రాజ్యంగా చేయాలనే ఆలోచనకు దన్నుగా నిలుస్తూ వస్తోంది. ఏఎస్ యూకే కు చెందిన రెండు మిలిటెంట్ గ్రూపులు కాంగ్లయ్ యవోల్ కన్నా లుప్, కాంగ్లాయ్ పక్ కమ్యూనిస్ట్ పార్టీలు షర్మిళలను దీక్ష కొనసాగించాలని కోరాయి. ఈ నెల 9న దీక్ష విరమిస్తానని షర్మిళ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షర్మిళ స్థానికుడినే వివాహం చేసుకోవాలని ఏఎస్ యూకే చైర్మన్, వైస్ చైర్మన్ లు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా షర్మిళ బ్రిటిష్ యాక్టివిస్ట్ డెస్మాండ్ కౌటిన్హో తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. -
బీజేపీ నేత దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్ కతా: రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ లీడర్లను వాళ్ల ఇళ్లలోనే చావగొట్టి వట్టి చేతులతోనే తల నరుకుతానని తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ కేడర్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఏర్పాటుచేసిన మీటింగ్ లో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కు ఆయన నియోజకవర్గం ఖరగ్ పూర్ సర్దార్ లో ఓట్లు వేసిన వారిపై థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తానని అన్నారు. ఖరగ్ పూర్ లో తనకు 8 వేల మంది కార్యకర్తలున్నారనీ నియోజవర్గం నుంచి మొత్తం 34 వేల ఓట్లు తృణమూల్ కు పోలయ్యాయని తెలిపారు. ఈ క్షణం మేం వారందరనీ ఉతికి ఆరేస్తే అడగడానికి వాళ్ల తల్లిదండ్రులు కూడా రారని అన్నారు. దిలీప్ సంఘ్ పరివార్ పేరును వాడుతూ ఇచ్చిన స్పీచ్ వీడియో ఇప్పుడు ఇంటర్నట్ లో హల్ చల్ చేస్తోంది. తమపై దాడులు జరిగితే సహించబోమని ప్రత్యర్ధులకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. మాలో సగం మందిని ఆర్ఎస్ఎస్ తయారుచేసిందనీ మేం దేనికైనా తెగిస్తామని అన్నారు. మేం గెలిచింది మూడు సీట్లు మాత్రమే కానీ ఆ బలం చాలు మాకు తృణమూల్ కు తగిన బుద్ధి చెప్పడానికి అని విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి బయటకు వెళ్తే తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర పరిణామాలను చూస్తారని హెచ్చరించారు.