
చిన్నప్పట్నుంచి దీపావళి నా ఫేవరెట్ ఫెస్టివల్. చిన్నప్పుడు అమ్మానాన్నలతో షాపింగ్‌కు వెళ్లేదాన్ని. కొత్త బట్టలు కొనుక్కోవడమంటే చిన్నపిల్లలకు సరదాగా ఉంటుంది కదా! కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కు స్వీట్స్, గిఫ్ట్స్ షాపింగ్ కూడా మనదే. దీపావళిలో నాకు ఇష్ట్టమైనది ఇల్లంతా ప్రమిదలతో అలంకరించ డం! పండగలకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తోనే టైమ్ స్పెండ్ చేస్తా.
చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ నాకిష్టమైన హల్వా చేసేవారు. ప్రతి దీపావళికి అమ్మ రైస్ ఖీర్, హల్వా చేస్తారు. దీపావళి అంటే... జీవితాల్లో వెలుగులు నింపడం, సంతోషాన్ని పంచడం! నేను క్రాకర్స్ కాల్చను. పలు కారణాల వల్ల మంచిది కాదు కూడా! ప్రజలూ కాల్చరని ఆశిస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment