rithu varma
-
మొత్తం లుక్కే మార్చేసిన రీతూ.. అషూ రెడ్డి హాట్ హాట్!
సోయగాలతో చంపేస్తున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్రోజురోజుకీ హీట్ పెంచేస్తున్న అషూ రెడ్డికొడుకు పుట్టినరోజు.. అనసూయ ఫుల్ హ్యాపీ పోస్ట్గుర్తుపట్టలేనట్లు లుక్ మార్చేసిన రీతూ వర్మవావ్ అనిపించేలా షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దక్ష నగర్కార్జిగేలు మనే డ్రస్సులో అందాలన్నీ చూపించేస్తున్న రీతూ చౌదరి View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rinku Asha Mahadeo Rajguru (@iamrinkurajguru) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Shwetha R Prasad 2.0 (@shwetharprasad) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Jamie Lever (@its_jamielever) View this post on Instagram A post shared by Shivaji Storm Sen (@stormshivajisen) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Nivedhithaa Sathish (@nivedhithaa_sathish) View this post on Instagram A post shared by Asha Bhat (@asha.bhat) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న తాజా చిత్రం మార్క్ ఆంటోని. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రీతూ వర్మ కనిపించనుంది. ఎస్జే సూర్య ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. అయితే తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి! ) విశాల్ మాట్లాడుతూ..'మార్క్ ఆంటోని షూటింగ్ సమయంలో ఓ ప్రమాదం జరిగింది. ఓ ఫైట్ సీన్ చేసి విశ్రాంతి తీసుకుంటున్నా. అదే సమయంలో ఓ పెద్ద ట్రక్కు నా వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో దాన్ని నేను చూశా. అందువల్లే తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా. నా అదృష్టం కొద్ది అది సెట్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో చావును దగ్గరి నుంచి చూశా. ఆ సంఘటనతో షాక్‌కు గురయ్యా. నిజంగా నాకు ఆరోజు పునర్జన్మే. పది నిమిషాలు ఒంటరిగా ఉన్నా. చాలా సేపు ఏం తోచని స్థితిలో ఉండిపోయా.' అంటూ విశాల్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తన కోస్టార్ ఎస్జే సూర్య పై విశాల్ ప్రశంసలు కురిపించారు. అతన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడని తెలిపారు. ప్రేక్షకులంతా హీరో కోసం వెయిట్ చేస్తే.. తాను మాత్రం సూర్య కోసం వెతికేవాన్ని అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: చంద్రముఖి–2 అభిమానులకు అప్డేట్ ఇచ్చిన మేకర్స్ ) -
Kanam Movie: సైన్స్ ఫిక్షన్‌గా అక్కినేని అమల 'కణం'.. రిలీజ్ అప్పుడే!
Akkineni Amala Kanam Movie Release Date Out: వైవిధ్య భరిత కథా చిత్రాల నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్. ఈ సంస్థ అధినేతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'కణం'. నటి అమల అక్కినేని, శర్వానంద్, రీతూవర్మ, నాజర్, సతీష్, రమేష్ తిలక్, ఎమ్మెస్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. దీనికి సుజిత్ సరాంగ్ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇది వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంగళవారం (ఆగస్టు 9) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని, గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన చిత్రంలోని అమ్మ పాటకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ద్విభాషా చిత్రంగా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళంలో 'కణం' పేరుతోనూ, తెలుగులో 'ఒకే ఒక జీవితం' పేరుతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తామన్నారు. చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
అమెజాన్ ప్రైమ్ కొత్త సిరీస్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..
Modern Love Hyderabad: Amazon Prime Announces Release Date: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. సొంతగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మిస్తూ యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో చిన్న హీరోలు, నటీనటులంతా ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకునే వాటిలో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ పేరుతో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ అలరిస్తోంది. తాజాగా 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ రానుంది. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్, రీతూ వర్మ, హీరో ఆది పినిశెట్టి, బిగ్‌బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్‌తోపాటు సీనియర్ నటి సుహాసిని, కోమలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 6 ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌కు నలుగురు డైరెక్టర్లు నగేష్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా నెల క్రితం అమెజాన్ సంస్థ 'మోడ్రన్ లవ్ ముంబై' పేరుతో సిరీస్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఏప్రిల్ 28న 'మోడ్రన్ లవ్ చెన్నై' కూడా రిలీజ్ కాగా ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ bringing you 6 heartfelt stories of love all the way from Hyderabad 😍#ModernLoveOnPrime, July 8 #SICProductions @nareshagastya @hasinimani @komaleeprasad @MenenNithya #RevathyAshaKelunni #UlkaGupta #NareshVijayaKrishna @Abijeet #MalavikaNair @AadhiOfficial @riturv pic.twitter.com/lK7OdTzOv6 — amazon prime video IN (@PrimeVideoIN) June 22, 2022 -
వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన అల్లు అర్జున్
-
నాగశౌర్య అందగాడు, మంచి మనసున్న వ్యక్తి : అల్లు అర్జున్
‘‘కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్‌ల సీజన్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. తెలుగులో ‘వరుడు కావలెను, రొమాంటిక్’, తమిళ్లో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగీ 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలవుతున్నాయి.. అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు.. ఇదే పాజిటివిటీ కొనసాగాలి.. అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలి. ఈ డిసెంబరు 17న ‘పుష్ప’ తో మేము కూడా వస్తున్నాం.. మా సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నా. ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆల్ ది బెస్ట్. ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘వరుడు కావలెను’లోని ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఈ పాటకి తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. చాలా అందగాడు. తనలో ఒక ఇన్నోసెన్స్, స్వీట్నెస్ ఉంటుంది. అంత మంచి మనసున్న వ్యక్తి కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.. అవ్వాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్యకూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రీతూ వర్మ మంచి నటి. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ వర్మ వద్ద చాలా ఉంటుంది. ముంబయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లోనూ సగం మంది మహిళలు ఉన్నారు.. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అలా కాకుండా ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి.. లక్ష్మీ సౌజన్యకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి విశాల్, తమన్ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి చేయడానికి అహం ఉంటుంది.. అలాంటివేమీ లేకుండా చేసినందుకు వారిద్దరికీ అభినందనలు. ఈ వేడుకకి రావడం ‘అల వైకుంఠపురములో..’ సినిమాకి కొనసాగింపుగా ఉన్నట్లు ఉంది. చినబాబు, త్రివిక్రమ్, నవీన్ నూలి, తమన్... ఇలా అందరూ ఉన్నారు. గీతా ఆర్ట్స్ తర్వాత నేను సొంత సంస్థగా భావించేది చినబాబు, నాగవంశీగారి బ్యానరే. ‘జెర్సీ’ కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మన చుట్టుపక్కల ఇళ్లలోని మనకు తెలిసిన ఒక ఆడపిల్ల తాలూకు సినిమా ఇది. ఇలాంటి కథలెప్పుడూ మన మనసుకు దగ్గరగా అనిపిస్తాయి. ఈ కథని ఎంచుకోవడంలోనే సౌజన్య సగం సక్సెస్ అయ్యింది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు కాబట్టి మిగతా సగం కూడా సక్సెస్ అయినట్టే. ఇంట్రవెల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో శౌర్య చాలా బాగా చేశాడు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రాధాకృష్ణ, వంశీగార్లకు థ్యాంక్స్. ఓ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండటం చాలా కష్టం (నవ్వుతూ). విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ వంశీ, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్ నవీన్ నూలి, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది
దుల్కర్ సల్మాన్, రీతూవర్మ, రక్షణ్, నిరంజని అహతియాన్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. తమిళంలో ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్లయడిత్తా’గా విడుదలైంది. వయాకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసఫ్ ఫిలిమ్ కంపెనీ నిర్మించిన ఈ చిత్రంతో దేశింగ్ పెరియస్వామి దర్శకునిగా పరిచయమయ్యారు. తెలుగులో కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్ కమలాకర్ రెడ్డి, జనార్థన్ రెడ్డితో కలిసి డా. రవికిరణ్ విడుదల చేశారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. బుధవారం ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ– ‘‘నేను నటించిన 25 సినిమా ఇది. తమిళంలో, తెలుగులో ఒకేసారి విడుదలైంది. చూసినవాళ్లందరికీ సినిమా నచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ (డిజిటల్)లో చూసే సినిమా కాదిది. థియేటర్లో చూడాల్సిన చిత్రం. నన్ను బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. డా. రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి కంటెంట్ నచ్చటంతో కేఎఫ్సి వాళ్లతో కలిసి తెలుగులో విడుదల చేశాను. ప్రేక్షకుల ఆదరణతో కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించింది’’ అన్నారు. రీతూవర్మ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మీ ముందున్నాను. ఈ సినిమాకి దర్శకుడు, కెమెరామెన్ రియల్ హీరోలు’’ అన్నారు. అనీష్ కురువిల్లా, రక్షణ్, నిరంజని, కె.యం భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తియ్యొద్దే
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లయడిత్తా’. ఈ సినిమాకు తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు హక్కులను దక్కించుకున్న కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం ‘గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే’ అనే పాటను విడుదల చేశారు. సమ్రాట్ చారి, పూర్ణాచారి సాహిత్యం అందించారు. ‘‘మొబైల్ అప్లికేషన్ డెవలెప్పర్ సిద్ధార్థ్ పాత్రలో కనిపిస్తారు దుల్కర్ సల్మాన్. సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డ సిద్దార్థ్, అతని స్నేహితుడు కల్లీస్ ఏం చేశారు? వారు చేసిన పనుల వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు? అన్నదే కథ’’ అన్నారు దేసింగ్ పెరియసామి. -
పొల్లాచిలో షురూ
‘నిన్ను కోరి’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మరోసారి కలిశారు హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ. వీరిద్దరి కాంబినేషన్లో ‘టక్ జగదీష్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పొల్లాచిలో నేడు ప్రారంభం కానుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను, పాటలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
టక్ జగదీష్‌కి క్లాప్
నాని టక్ చేసుకోటానికి రెడీ అయ్యారు. ఎందుకంటే తాజా సినిమా ‘టక్ జగదీష్’ కోసం. నాని నటిస్తున్న ఈ 26వ సినిమా గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ వంటి హిట్ తర్వాత శివ నిర్వాణ–నాని చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇవగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు శివ కొరటాల దర్శక, నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందించారు. నానీతో ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో జంటగా నటించిన రీతూ వర్మ ఇందులో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. మరో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. ‘సామజవరగమన...’ అంటూ ఈ మధ్య మంచి స్పీడు మీదున్న యస్.యస్. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. -
నాలుగేళ్ల తర్వాత...
‘నిన్ను కోరి’ వంటి హిట్ తర్వాత మళ్లీ హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అంటే? ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూవర్మ. ‘ఎవడే సుబ్రమణ్యం’లో నాని ప్రేయసిగా రీతూవర్మ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ నాలుగేళ్లకు ఇద్దరూ జంటగా నటించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెలలో లాంఛనంగా ప్రారంభం కానుంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది. -
తల్లీ కొడుకు
వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్న అమల ‘మనం’ (2014) సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా కంటే ముందు 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో అమల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించారామె. కథ, పాత్ర నచ్చడంతో తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో ఎస్. ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు ఓ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించనున్నారు అమల. తండ్రి పాత్రలో సంగీతదర్శకుడు అనిరు«ద్ రవిచంద్రన్ తండ్రి, నటుడు రవి రాఘవేంద్ర నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, అమల, రవి పాత్రలపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ‘‘స్నేహం, ప్రేమల మధ్య విడదీయరాని బంధాన్ని తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
శర్వా ఎక్స్‌ప్రెస్
ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సినిమాలను ట్రాక్ ఎక్కిస్తున్నారు శర్వానంద్. ఆల్రెడీ రెండు సినిమాలు (96 రీమేక్, శ్రీకారం) లైన్లో ఉండగానే మూడో సినిమాకు ముహూర్తం జరిపించారు. శర్వానంద్ హీరోగా శ్రీకార్తిక్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రభు, యస్.ఆర్ ప్రకాశ్‌బాబు నిర్మిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక. ఈ చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభం అయింది. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ‘‘విడదీయలేని స్నేహం, ప్రేమ’ అనే అంశాలతో ఈ కథ ఉంటుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: జాక్స్ బీజోయ్, కెమెరా: సుజిత్ సారంగ్. -
మూడు భాషల్లో బిజీ
మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఫుల్ బిజీ. ఒక్క భాషలో కాదు. ఏకంగా మూడు భాషల్లో. మాలీవుడ్–టాలీవుడ్–బాలీవుడ్ ఇలా మూడు భాషల చిత్రాల్లో షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యారీ మలయాళ హీరో. తెలుగులో సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్లో ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి ‘కర్వాన్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. డబ్బింగ్ మూవీ ‘ఓకే బంగారం’ ద్వారా ఆల్రెడీ దుల్కర్ తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘కర్వాన్’తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇక, దుల్కర్ చేస్తున్న తాజా మలయాళ చిత్రం ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ విషయానికొస్తే... ఇందులో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారట. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రితూ వర్మ ఇందులో హీరోయిన్. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. వేలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇది దుల్కర్‌కి 25వ సినిమా కావడం విశేషం. హీరో అయిన ఐదేళ్లల్లో దుల్కర్ 25 సినిమాల మైలురాయి చేరుకోవడం గొప్ప విషయం. -
నా ఫేవరెట్ ఫెస్టివల్ – రితూ వర్మ
చిన్నప్పట్నుంచి దీపావళి నా ఫేవరెట్ ఫెస్టివల్. చిన్నప్పుడు అమ్మానాన్నలతో షాపింగ్‌కు వెళ్లేదాన్ని. కొత్త బట్టలు కొనుక్కోవడమంటే చిన్నపిల్లలకు సరదాగా ఉంటుంది కదా! కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కు స్వీట్స్, గిఫ్ట్స్ షాపింగ్ కూడా మనదే. దీపావళిలో నాకు ఇష్ట్టమైనది ఇల్లంతా ప్రమిదలతో అలంకరించ డం! పండగలకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తోనే టైమ్ స్పెండ్ చేస్తా. చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ నాకిష్టమైన హల్వా చేసేవారు. ప్రతి దీపావళికి అమ్మ రైస్ ఖీర్, హల్వా చేస్తారు. దీపావళి అంటే... జీవితాల్లో వెలుగులు నింపడం, సంతోషాన్ని పంచడం! నేను క్రాకర్స్ కాల్చను. పలు కారణాల వల్ల మంచిది కాదు కూడా! ప్రజలూ కాల్చరని ఆశిస్తున్నా. -
పుస్తకంలో పట్టేంత రొమాన్స్!
‘‘ఓ పుస్తకం రాస్తే బాగుంటుంది. అతి తక్కువ రోజుల్లో ధృవ, నేను ఎలా ప్రేమలో పడ్డాం? మా మధ్య ఏం జరిగింది? అనేది వర్ణించడానికి ఓ పుస్తకం రాస్తే బాగుంటుంది’’ అంటున్నారు అనుపమ. ఎవరీ అనుపమ? అంటే... తెలుగమ్మాయి రీతూ వర్మే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘ధృవ నక్షత్రం’. ఇందులో మాంచి స్టైలిష్ యాక్షన్ ఉంటుందనేది ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు తన మార్క్ రొమాన్స్ కూడా ఉంటుందని గౌతమ్ మీనన్ చెబుతున్నారు. ఇటీవల యూరప్ దేశాల్లో పూర్తయిన షెడ్యూల్లో విక్రమ్, రీతూ వర్మలపై రొమాంటిక్ సీన్స్ తీశారు. మరో 30 రోజులు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుందని దర్శకుడు ట్వీట్ చేశారు. -
తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా..!
ప్రస్తుతం పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు నాలుగు వారాలకు మించి నడిచే పరిస్థితిలేదు. చాలా రోజులుగా సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడింది అన్న లెక్కలతో కాకుండా, ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో చెపుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా.. కేవలం కథా కథనాలను నమ్ముకొని తెరకెక్కించిన పెళ్లి చూపులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లోనూ చరిత్ర సృష్టించింది. గతంలో మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని విధంగా అమెరికాలో 50 రోజులుగా ఈ సినిమా ప్రదర్శితమౌతూనే ఉంది. అది కూడా పది సెంటర్లలో కావటం మరో విశేషం. టాప్ స్టార్లకు కూడా సాధ్యం కానీ ఈ అరుదైన రికార్డ్ సృష్టించిన పెళ్లి చూపులు టీంకు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈసినిమాను ధర్మపత్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ కందుకూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. -
'పెళ్లిచూపులు' మూవీ రివ్యూ
టైటిల్ : పెళ్లిచూపులు జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : విజయ్ దేవరకొండ, రీతూ వర్మ సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : తరుణ్ భాస్కర్ నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని మాస్ కమర్షియల్ మూస సినిమాల నుంచి బయటికి వస్తున్న సగటు ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనానికి మంచి విజయాలను అందిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా టేకింగ్‌తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే బాటలో ఆడియన్స్ ముందుకు వచ్చిన అందమైన ప్రేమ కథ 'పెళ్లిచూపులు'. మరి ఈ పెళ్లి చూపులు తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకున్నాయి. కథ : జీవితం మీద పెద్దగా క్లారిటీ లేనట్టుగా కనిపించే, ఈ తరం యువకుడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). ఓ మంచి చెఫ్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. దీంతో ప్రశాంత్‌కు భవిష్యత్తు మీద ఆలోచన లేదన్న భావనతో పెళ్లి చేస్తే కుదురుకుంటాడని చిత్ర( రీతూ వర్మ) అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయిస్తారు పెద్దలు. కానీ చిత్రకు కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఎలాగైన ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది చిత్ర కల. చిత్ర పెళ్లికి నో చెప్పటంతో ప్రశాంత్‌కు వేరే అమ్మాయిని చూస్తారు. కానీ ఆ సంబంధం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవ్వటంతో ముందు జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న ప్రశాంత్, చిత్రతో కలిసి ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలు పెడతాడు. ఏ మాత్రం పొంతన లేని వేరు వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది..? చివరకు ప్రశాంత్, చిత్రలు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఎవడే సుబ్రమణ్యంతో సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విజయ్ మ్యాన్లీ లుక్ సినిమాకు ప్లస్ అయ్యింది. స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా రీతూ నటన బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించింది. సినిమా అంతా హీరో హీరోయిన్లు చుట్టూ నడిచే కథ కావటంతో ఇతర పాత్ర దారుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అయితే ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : తొలి సినిమాతోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రచయితగా, దర్శకుడిగా రెండు విభాగాలలో సక్సెస్ అయ్యాడు. తొలి భాగాన్ని ఎంతో పక్కాగా నడిపించిన తరుణ్ ద్వితీయార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. రొమాంటిక్ కామెడీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను అందిస్తూనే ఎక్కడగా గీత దాటకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమాకు మరో మేజర్ హైలెట్ సినిమాటోగ్రఫి, నగేష్ బెగెల్లా అందించిన సినిమాటోగ్రఫి.. ఎక్కడా ఇది చిన్న సినిమా అన్న ఆలోచన రాకుండా చేసింది. పరిమిత బడ్జెట్లో కూడా అద్భుతమైన క్వాలిటీ అందించాడు నగేష్. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : తరుణ్ భాస్కర్ దర్శకత్వం విజయ్, రీతూల నటన మైనస్ పాయింట్స్ : ప్రిడిక్టబుల్ స్టోరి సెకండ్ హాఫ్ స్లో నారేషన్ ఓవరాల్‌గా పెళ్లిచూపులు, ఈ తరం యువత మనోభావాలను తెలిపే సరికొత్త ప్రేమకథ