
హరీష్, శివ నిర్వాణ, నాని, సాహు గారపాటి
నాని టక్ చేసుకోటానికి రెడీ అయ్యారు. ఎందుకంటే తాజా సినిమా ‘టక్ జగదీష్’ కోసం. నాని నటిస్తున్న ఈ 26వ సినిమా గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ వంటి హిట్ తర్వాత శివ నిర్వాణ–నాని చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇవగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు శివ కొరటాల దర్శక, నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందించారు. నానీతో ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో జంటగా నటించిన రీతూ వర్మ ఇందులో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. ‘సామజవరగమన...’ అంటూ ఈ మధ్య మంచి స్పీడు మీదున్న యస్.యస్. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment