
నాచ్యురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.
ఇందులో నానిని పెళ్లి కొడుకును చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఇందులో జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు నాని . టక్ జగదీష్ చిత్రం మంచి ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుందని తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే అర్థమవుతుంది తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 🤗
— Nani (@NameisNani) January 9, 2021
APRIL 16th, 2021
పేరు గుర్తుందిగా..... :)#TuckJagadish pic.twitter.com/ZFHEUGi44F
Comments
Please login to add a commentAdd a comment