Ritu Verma
-
Rashmita Thapa: సింపుల్ సిగ్నేచర్
రశ్మితా పుట్టి పెరిగిందంతా ముంబైలోనే! సినిమాలు అంటే పిచ్చి! వారానికో సినిమా చూసి అందులోని హీరోయిన్ స్టయిలింగ్‌ను కాపీ చేసేది. అలా గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీదున్న ఆసక్తితో డిగ్రీ చదువుతుండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత గ్రహించింది తన అసలు ఆసక్తి స్టయిల్ని కాపీ చేయడంలో కాదు క్రియేట్ చేయడంలో అని! అందుకే చదువుతున్న డిగ్రీకి గుడ్ బై చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేరింది. ఆ కోర్స్ పూర్తయిన తర్వాత పలు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పనిచేసింది. స్టయిలింగ్‌లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల వద్ద ఇంటర్న్‌గా చేరింది. ఆమె పరిశీలన, పనితీరుకు చాలామంది సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యి, ఆమెను స్టయిలిస్ట్‌గా పెట్టుకున్నారు. వారిలో శ్రీలీల, రీతూ వర్మ, లావణ్యా త్రిపాఠీ, నేహా శెట్టీ, నిధీ అగర్వాల్, చాందినీ చౌదరి, రుహానా శర్మ, నభా నటేశ్, ఆకాంక్షా సింగ్, అనుపమా పరమేశ్వరన్, కీర్తీ సురేష్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, అవికా గోర్, సోనాల్ చౌహాన్ కూడా ఉన్నారు. రశ్మితా స్టయిలింగ్ మంత్ర.. సింపుల్ అండ్ కంఫర్ట్! దానివల్లే ఎందరో సెలబ్రిటీలకు ఆమె ఫేవరట్ స్టయిలిస్ట్ అయింది. క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్ల దాకా.. సందర్భానికి తగ్గట్టు సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేసి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలబెడుతుంది. అందుకే ఆమెకు ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఫ్యాన్సే! వాళ్లలో అల్లు శిరీష్ ముందుంటాడు. తర్వాత విజయ్ దేవరకొండ. ఆ ఇద్దరికీ రశ్మితానే స్టయిలింగ్ చేస్తోంది. తన క్రియేటివ్ జీల్‌తో ఫ్యాషన్ వ్లాగ్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీ సంపాదించింది. వీటితోపాటు అప్పుడప్పుడు మోడల్‌గానూ మెరుస్తోంది. -
'మార్క్ ఆంటోని'.. గత సినిమాలతో పోలిస్తే డిఫరెంట్: విశాల్
‘‘ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు.. వారి ఆదరాభిమానాలతోనే నేనీ స్థాయికి వచ్చాను’’ అని హీరో విశాల్ అన్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. కాగా నేడు విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ‘మార్క్ ఆంటోని’ వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలు చేశా. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది’’ అన్నారు. -
బంగారం.. ఏమని చెప్పను.. ఐ లవ్ యూనే..
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్. ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యూ నే..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ చిత్రంలో విశాల్ లుక్ సరికొత్తగా ఉంటుంది. ‘ఐ లవ్ యూ నే..’ పాటలో హీరోహీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగ్గట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చాన్స్ వస్తే ఆ రోజులకి వెళ్లిపోతా!
‘‘ఆడని ఓ సినిమాను హిట్ అని ప్రేక్షకులను, విమర్శకులను మభ్య పెట్టలేం. ఫెయిల్యూర్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇది నేను నా గురించి మాత్రమే చెబుతున్నాను’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ చెప్పిన విశేషాలు... ► టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ‘ఒకే ఒక జీవితం’ అన్నప్పుడు రిస్క్, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసు కుంటారు? అనేకన్నా కూడా విమర్శకులు ఎలా స్పందిస్తారోననే భయం ఉండేది. విమర్శకులు కూడా మా సినిమాను యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. మేము ఊహించినట్లే ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతుండటంతో ఓ బరువు దిగిపోయిందనే ఫీలింగ్ కలిగింది. ఇక టైమ్ మిషన్‌తో నాకు అవకాశం వస్తే నా ఇంటర్ కాలేజ్ డేస్‌కి వెళతా. కాలేజ్ లైఫ్ బెస్ట్. ఎందుకంటే రేపటి గురించి ఆలోచన, నిన్నటి గురించిన బాధ అంతగా ఉండదు. హార్ట్‌బ్రేక్ అందరికీ ఉంటుంది.. నాకూ ఉంటుంది (నవ్వుతూ). ► ‘ఒకే ఒక జీవితం’లో ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఎంత లేదనుకున్నా సబ్కాన్షియస్లోనైనా ప్రెజర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయొద్దని మా డాక్టర్ సలహా ఇచ్చారు. ఈ సినిమాతో నాగార్జున, అమలగార్లతో బాగా దగ్గర కాగలిగాను. నాగార్జునగారు నన్ను మూడో కొడుకుగా భావించాననడం హ్యాపీగా ఉంది. ► శ్రీ కార్తీక్ మొదటి రోజే దాదాపు 200 షాట్స్ తీశాడు. ఏంటి ఇంత స్పీడ్‌గా తీస్తున్నాడు? అనే భయం కలిగింది. అయితే అమలగారి సీక్వెన్సెస్ స్టార్ట్ అయ్యాక ఎంత క్లారిటీగా తీస్తున్నాడో అర్థం చేసుకున్నాను. ► ఈ మధ్య పద్నాలుగు కేజీల బరువు తగ్గా. నా తర్వాతి సినిమా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఉంటుంది. ► ఇండస్ట్రీలో నాకు గైడింగ్ ఫోర్స్ లేదు. ఒక ఫ్లాప్ రాగానే కొందరు హీరోలకు పెద్ద డైరెక్టర్‌తో సినిమాలు సెట్ అవుతుంటాయి. మాకలా చేసేవారు లేరు. మమ్మల్ని మేమే కాపాడుకోవాలి. నా కెరీర్‌లోని ఒప్పులకు, తప్పులకు నేనే బాధ్యుణ్ణి. ఎందుకంటే ఇలా వెళితే బాగుంటుంది అని చెప్పేవాళ్లు లేరు. -
ఫిక్సయిపో... ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని చెప్పా!
‘‘కెరీర్ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ‘టక్ జగదీష్’. ఫుల్ ఎమోషనల్ డ్రామా. ఇది మన మట్టి సినిమా. మన తెలుగు సినిమా’’ అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది . ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాని మాట్లాడుతూ –‘‘టక్ జగదీష్’ ఫైనల్ కట్ చూసి, బయటకు రాగానే.. ఫిక్సయిపో.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని డైరెక్టర్‌తో చెప్పాను. సమ్మర్ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్. మా సినిమానే కాదు... వేసవిలో విడుదలవుతున్న సినిమాలన్నీ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఫ్యామిలీ కూడా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. నా కెరీర్లో మళ్లీ ఇలాంటి ఓ ఫ్యామిలీ డ్రామా తీస్తానో.. లేదో తెలియదు. అందుకే నాకు తెలిసిన అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాను’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘గ్రేట్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ ఉన్న సినిమా ఇది. విడుదలయిన కొంతకాలం తర్వాత కూడా ఈ సినిమాలోని పాటలు, ఎమోషన్స్, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు’’ అన్నారు తమన్ . ‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌కు, యూత్‌కు నచ్చే ఓ మంచి సినిమా తీశాం’’ అన్నారు సాహు. -
నాని ‘టక్ జగదీశ్’ నుంచి క్రేజీ అప్డేట్
నాచ్యురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నానిని పెళ్లి కొడుకును చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఇందులో జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు నాని . టక్ జగదీష్ చిత్రం మంచి ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుందని తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే అర్థమవుతుంది తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 🤗 APRIL 16th, 2021 పేరు గుర్తుందిగా..... :)#TuckJagadish pic.twitter.com/ZFHEUGi44F — Nani (@NameisNani) January 9, 2021 -
డబ్బింగ్ జగదీష్
తాజా చిత్రం కోసం టక్ జగదీష్గా మారారు నాని. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. ‘నిన్ను కోరి’ తర్వాత నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీష్’. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ కథానాయికలు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను సోమవారం ప్రారంభించారు నాని. ఈ సినిమాను వేసవికి విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
చలో దుబాయ్
నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ దుబాయ్‌లో జరగనుంది. ఇందుకోసం చిత్రబృందం దుబాయ్ ప్రయాణమయ్యారు. అక్కడి షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారని సమాచారం. దీపావళికి ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
తల్లీ కొడుకుల అనుబంధం
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ పూర్తయింది. శ్రీకార్తీక్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్లో 30వ చిత్రం కావడం విశేషం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు (‘ఖైదీ’ నిర్మాత) నిర్మించారు. రీతూ వర్మ కథానాయికగా నటించగా, నటి అక్కినేని అమల ఒక ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాయడం విశేషం. ‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకుల్లో శర్వానంద్‌కు అమితమైన ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులనే కాకుండా అటు యూత్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంగీతం: జేమ్స్ బిజోయ్, కెమెరా: సుజీత్ సారంగ్. -
టక్‌తో రెడీ
నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో గురువారం పునః ప్రారంభమైంది. ప్రస్తుతం వరి పొలాల్లో నైట్ ఎఫెక్ట్‌తో నాని, మరికొంతమంది నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘జగదీశ్ జాయిన్స్, టక్ బిగిన్స్’ అని షూటింగ్ మళ్లీ మొదలుపెట్టిన సందర్భంగా నాని పేర్కొన్నారు. జగపతిబాబు, రావు రమేశ్, సీనియర్ నరేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను
‘‘కథ నచ్చితే ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు చేయడానికి ముందుంటాను. ప్రస్తుతం నేను పని చేస్తున్న (మలయాళం, హిందీ, తెలుగు, తమిళం) ఇండస్ట్రీలన్నీ నాకెంతో ప్రేమను ఇస్తున్నాయి. మంచి మంచి అవకాశాలు ఇస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దుల్కర్, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఆంటోనీ జోసెఫ్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ – ‘‘కనులు కనులను దోచాయంటే’ కథను మొదటిసారి విన్నప్పుడే ఈ సినిమా తెలుగులో కూడా చేయొచ్చు అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. బాగానే వచ్చింది అనుకుంటున్నాను (నవ్వుతూ). ఇందులో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్గా చేసింది. దర్శకుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్. సినిమా ఫుల్ స్పీడ్‌గా పరిగెడుతుంటుంది. ఇలాంటి స్టయిల్లో నేను సినిమా చేయలేదు. ప్రతీ సినిమాతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడుతుంటాను. ప్రస్తుతం మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయడంతో ఏ ఇండస్ట్రీకి వెళ్లినా మా భాషలో ఎక్కువ సినిమాలు చేయడం లేదేంటి అని అడుగుతున్నారు. అన్ని ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. భాష నా ప్రధాన సమస్య. భాష తెలియకపోతే పాత్రకు పూర్తి న్యాయం జరగదని నమ్ముతాను. గత ఏడాది నేను నటించిన 2–3 సినిమాలు విడుదల ఆలస్యం అయ్యాయి. ఆ టైంలో నిర్మాతనయ్యి మూడు సినిమాలు నిర్మించాను. రీమేక్ సినిమాలు, సీక్వెల్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడను. ఏదైనా కొత్తగా, ఎగ్జయిటింగ్‌గా చెప్పాలనుకుంటాను. తెలుగులో ఓ సినిమా అంగీకరించాను. త్వరలోనే ప్రారంభం అవుతుంది’’ అన్నారు. -
హైదరాబాద్‌లో కేశవ సినిమా టీం సందడి
-
పగ... ప్రతీకారం
నిఖిల్, రీతూ వర్మ జంటగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. హిందీ భామ ఇషా కొప్పికర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ జరిపిన చిత్రీకరణతో 90 శాతం సినిమా పూరై్తంది. హైదరాబాద్‌లో జరగనున్న చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణంతా పూర్తవుతుంది. నిఖిల్–సుధీర్‌వర్మ కలయికలో వచ్చిన ‘స్వామి రారా’ తరహాలో ‘కేశవ’ కూడా ట్రెండ్ సెట్టింగ్ సబ్జెక్ట్. మే 12న చిత్రాన్ని విడుదల చేయాలనేది మా ప్లాన్’’ అన్నారు. ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రమిది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: దివాకర్ మణి, సంగీతం: యం.ఆర్. సన్నీ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
కేశవ కేక
తెలుగు చిత్రసీమలో ఎంత స్నేహపూర్వక, ఆరోగ్యకర వాతావరణం ఉందనేది చెప్పడానికి ఈ సంఘటన ఓ చిన్న ఉదాహరణ. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ‘కేశవ’ నైజాం హక్కులను మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘ఏషియన్’ సునీల్ నారంగ్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. ‘‘సునీల్ నారంగ్, నేనూ కలసి ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం. నాకు మంచి ఫ్రెండ్. ‘కేశవ’ గురించి ఆయనకు తెలుసు. అందువల్ల, ఫ్యాన్సీ రేటుకి నైజాం హక్కులు తీసుకున్నారు. మార్చిలో చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం. ఈ ‘కేశవ’ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా కేక అని చూసినవాళ్లు అంటారు’’ అన్నారు అభిషేక్. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
కేశవ పరుగు
‘‘ప్రాణం కన్నా పగ, ప్రతీకారాలకు విలువ ఇస్తే ఏం జరుగుతుంది? రక్తంతో ఎరుపెక్కిన నదిలో పరుగులు తీస్తోన్న ఆ యువకుడి కథేంటి? తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగండి’’ అంటున్నారు దర్శకుడు సుధీర్‌వర్మ. నిఖిల్, రితూ వర్మ జంటగా ఆయన దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. అభిషేక్ నామా మాట్లాడుతూ – ‘‘జనవరి 2 నుండి 10 వరకూ నరసాపురంలో జరిపే చిత్రీక రణతో సినిమా పూర్తవుతుంది. నిఖిల్, సుధీర్ వర్మ కలయికలో వచ్చిన ‘స్వామి రారా’లా ఈ సినిమా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. ఇషా కొప్పికర్, రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ, ప్రియదర్శి నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్., సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: దేవాన్ష్ నామా. -
కుర్రాడు చాలా హుషారు
నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రానికి ‘కేశవ’ టైటిల్ ఖరారు చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘తీర ప్రాంత నేపథ్యంలో నడిచే రివెంజ్ డ్రామా ఇది. హుషారైన యువకుడిగా నిఖిల్ నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ పోలీసాఫీసర్‌గా కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది’’ అన్నారు. రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్. -
మన సినిమాలకు కొత్త చూపు
చిత్రం: ‘పెళ్ళిచూపులు’, నిర్మాతలు: రాజ్ కందుకూరి, యశ్ రంగినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ జీవితం సినిమాలా ఉండదు. కానీ, సినిమా గనక జీవితంలా ఉండగలిగితే? కచ్చితంగా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ నుంచి రిలీఫ్‌గా ఉంటుంది. ‘పెళ్ళి చూపులు’ అలాంటిదే! ఇంజనీరింగ్ పూర్తి చేయలేని ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) వంటల్లో దిట్ట కావాలనుకుంటాడు. పెళ్ళయితే జీవితం కుదుటపడుతుందన్న జోస్యుడి మాటలతో, హీరోని పెళ్ళిచూపులకు తీసుకువెళతాడు తండ్రి (కేదార్ శంకర్). అక్కడ పెళ్ళిచూపుల్లో విచిత్ర పరిస్థితుల్లో చిత్ర (రీతూ వర్మ)ను కలుస్తాడు. ఎం.బి.ఏ చదివిన చిత్ర ఆస్ట్రేలియా వెళ్ళి, పై చదువులు చదవాలనుకుంటుంది. అందుకు డబ్బు సంపాదించడానికి వీలుగా సంచార ఆహారశాలగా ‘ఫుడ్ ట్రక్’ను పెట్టడానికి సిద్ధపడుతుంది. ఆమె తండ్రి (గురురాజ్ మానేపల్లి) మాత్రం పెళ్ళి చేయాలనుకుంటూ ఉంటాడు. వచ్చిన సంబంధాల్ని హీరోయిన్ తిప్పికొడుతుంటుంది. ఆ టైమ్‌లో పొరపాటు అడ్రస్‌కు హీరో వెళ్ళడంతో, హీరో హీరోయిన్ల పెళ్ళిచూపుల వుతాయి. ‘ఫుడ్ ట్రక్’ ఐడియాకూ, ‘షెఫ్’ కావాలన్న హీరో కలకూ ముడి కుదురుతుందని హీరోయిన్, హీరోని అడుగుతుంది. మరి, ఫుడ్ ట్రక్ ఐడియా, హీరోయిన్ ఆస్ట్రేలియా కల ఏమయ్యాయన్నది మిగతా ఫిల్మ్. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌లో ఫస్టాఫ్ అంతా ఈ కాలపు కాలేజీ కుర్రాళ్ళ ప్రవర్తన, పిల్లల్ని స్థిరపడేలా చేయడంపై తల్లితండ్రుల ఆందోళనతో వినోదాత్మకంగా నడుస్తుంది. స్ట్రెయిట్ నేరేషన్లో సెకండాఫ్ అంతా సినిమాలో అసలు కథ, పాత్రల మధ్య సిసలైన అంతః సంఘర్షణ, కెరీర్ తొలి దశలో కుర్రకారుకుండే శంకలు, స్వతహాగా మంచివాళ్ళయినా స్నేహితుల మధ్య వచ్చే సగటు ఇగో సమస్యలు, ప్రేమను వ్యక్తీకరించడానికి అహం అడ్డొచ్చే సందర్భాలు - ఇలా మరింత బలమైన భావోద్వేగాలతో నడుస్తుంది. పాత్రల ప్రవర్తనలో, స్క్రిప్టులో ఎన్నో పొరలున్నట్లు, తెలివిగా అల్లుకున్నట్లు అర్థమవుతుంది. వీడియో కుకింగ్ పాఠాలు, వైరల్ వీడియో, వెర్రివేషాల ప్రాంక్ వీడియోల లాంటి నేటి ట్రెండ్స్ చాలా ఫిల్మ్‌లో ఉన్నాయి. గతంలో ‘అనుకోకుండా’, ‘సైన్మా’ లాంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన యువకుడు తరుణ్ భాస్కర్‌కు ఇది తొలి సినిమా. దాదాపు పూర్తిగా స్థానిక హైదరాబాద్ టాలెంట్ నటించిన చిత్రమిది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, హీరో ఫ్రెండ్స్‌గా తెలంగాణ మాండలికంలో మాట్లాడే ప్రియదర్శి, అభయ్ - ఇలా ప్రతి ఒక్కరూ చాలా సహజమైన పాత్రలుగా అనిపిస్తారే తప్ప, నటించారన్న ఫీలింగ్ రాదు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్కీ ఇదే తొలి చిత్రం. పరిమిత బడ్జెట్లో తీసినప్పటికీ తెరపై సినిమా రిచ్‌గా కనిపించడం (కెమేరా నాగేశ్), అనుభూతి పెంచే నేపథ్య సంగీతం, గానం ఈ సినిమాకున్న పెద్ద బలం. మనసుకు పట్టే సీన్లూ చాలా ఉన్నాయి. సినిమాలో చాలా పాత్రలు నిత్యం మనకు తారసపడేవే! అందుకే, తెరపై మనల్ని మనం చూసుకుంటాం. సహజమైన డైలాగులు, జోక్‌లు నవ్విస్తాయి. ఒక్కముక్కలో నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ ట్రెండ్‌కి కొనసాగింపు... తెలుగు సిన్మా ఆలస్యంగానైనా అసలంటూ మారుతోందనడానికి నిదర్శనం... సకుటుంబ సత్కాలక్షేపం - ఈ ‘పెళ్ళిచూపులు’. - రెంటాల జయదేవ -
ఇది ఒక వినూత్న ప్రయత్నం!
‘‘అందరూ వినూత్న ప్రయత్నం అని అభినందిస్తున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని బెక్కెం వేణుగోపాల్ అన్నారు. హర్షవర్ధన్‌రాణే, శ్రీవిష్ణు, హరీష్, వితిక శేరు, రీతు వర్మ, శ్రీముఖి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’. పవన్ సాధినేని దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ చిత్రం విజయవంతం ప్రదర్శించబడుతోందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అందరూ ఈ సినిమాలోని చివరి 20 నిమిషాల గురించే మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. మంచి కథాబలం ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది’’ అని చెప్పారు. చెప్పాలనుకున్న పాయింట్‌ని ధైర్యంగా చెప్పడంలో దర్శకుడు సఫలుడయ్యాడని మధురా శ్రీధర్ అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.