చలో దుబాయ్‌ | Naga Shaurya and Varudu team to fly to Dubai | Sakshi
Sakshi News home page

చలో దుబాయ్‌

Published Mon, Nov 30 2020 6:22 AM | Last Updated on Mon, Nov 30 2020 6:22 AM

Naga Shaurya and Varudu team to fly to Dubai - Sakshi

నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఫుల్‌ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ దుబాయ్‌లో జరగనుంది. ఇందుకోసం చిత్రబృందం దుబాయ్‌ ప్రయాణమయ్యారు. అక్కడి షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారని సమాచారం. దీపావళికి ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement