nagashourya
-
ఇంటివాడైన టాలీవుడ్ హీరో నాగశౌర్య
-
నాగశౌర్య 'లక్ష్య' చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం 'లక్ష్య' విడుదల తేదీని ఖరారైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో దృఢమైన శరీరాకృతితో పోనీ టేల్‌తో వర్షంలో విల్లు, బాణాన్ని పట్టుకుని స్టైల్‌గా కనిపిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా ఆర్చరీ (విలువిద్య) క్రీడ నేపథ్యంలో రానుంది. దీంట్లో పార్థు అనే క్రీడకారుడి పాత్రలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా కోసం నాగశౌర్య భారీగా వర్క్అవుట్స్ చేసి శరీరాన్ని దృఢంగా తయారు చేసుకున్నాడు. నాగశౌర్య ఇంతకుముందు సినిమా 'వరుడు కావలెను' బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులను లక్ష్య సినిమా పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రబృందం భారీ ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది. సోనాలి నారంగ్ సమర్పించగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ శరత్ మరార్, నారయణ దాస్ కె, నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా కేతిక శర్మ చేస్తున్నారు. చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. -
గురి తప్పకుండా...
విల్లు ఎక్కుపెట్టారు నాగశౌర్య. గురి తప్పకుండా బాణం వదిలారు. మరి.. దేనికి గురిపెట్టారనేది ‘లక్ష్య’ సినిమాలో తెలుస్తుంది. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. కేతికా శర్మ హీరోయిన్ . ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య. అలాగే విలువిద్య నేర్చుకుని, ఈ సినిమా చేస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమ్యాక్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నాగశౌర్యతో పాటు జగపతిబాబు తదితరులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ. -
నాగశౌర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
శుక్రవారం (జనవరి 22) బర్త్‌డే సందర్భంగా నాగశౌర్య రెండు లుక్స్‌లో కనిపించారు. ఒకటి ఎయిట్ ప్యాక్ దేహంతో రఫ్‌గా, మరొకటి సంప్రదాయబద్ధమైన కుర్రాడి లుక్. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘లక్ష్య’లో మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు శౌర్య. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు శౌర్య. బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. మరో సినిమా ‘వరుడు కావలెను’ విషయానికొస్తే.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బర్త్‌డే సందర్భంగా ఓ ఆకర్షణీయమైన వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో నాగౌశర్య ముస్తాబవుతున్న సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ ఏడాది మేలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
హ్యపీ బర్త్ డే శౌర్య.. అదిరిపోయిన ‘లక్ష్య’ టీజర్
ఆర్చరీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''లక్ష్య''. యువ నటుడు నాగశౌర్య జన్మదినం సందర్భంగా గురువారం చిత్రబృందం లక్ష్య టీజర్ విడుదల చేసింది. ఈ సినిమా శౌర్యకు ఇది 20వ చిత్రం. ధీరేంద్ర సంతోశ్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పార్థు పాత్రలో ఆర్చరీ ఆటగాడుగా నాగశౌర్య నటిస్తున్నాడు. 'చాలా మందికి ఆడితే గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అంటూ జగపతిబాబు డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. 'పడి లేచిన వాడితో పందెం వేయడం చాలా ప్రమాదకరం' అంటూ వచ్చిన 'లక్ష్య' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శౌర్య సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్నాడు. హీరోయిన్గా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టీజర్ అదిరిపోవడంతో నాగశౌర్య ఖాతాలో మరో విజయం పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఆర్చరీ నేపథ్యంగా దేశంలో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే. -
చలో దుబాయ్
నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ దుబాయ్‌లో జరగనుంది. ఇందుకోసం చిత్రబృందం దుబాయ్ ప్రయాణమయ్యారు. అక్కడి షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారని సమాచారం. దీపావళికి ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఆనందంగా ఉంది
ఇంటర్నెట్ను బాగా ఫాలో అయ్యేవాళ్లు షిర్లీ సేతియా పేరు వినే ఉంటారు. యూట్యూబ్ సెన్సేషన్ తను. న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్కి చెందిన ఈ భామ పేరున్న గాయని. ‘బాలీవుడ్‌కి కాబోయే సెన్సేషన్’ అని ఫోర్బ్స్ మేగజీన్ రాసింది. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘మస్కా’లో కనిపించారు షిర్లీ. అలానే ‘నికమ్మా’ అనే హిందీ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. నాగశౌర్య హీరోగా అనీష్ కష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో షిర్లీ సేతియాని కథానాయికగా ఎంపిక చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించనున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు షిర్లీ. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, సహనిర్మాత: బుజ్జి, కెమెరా: సాయి శ్రీరామ్, సమర్పణ: శంకర్‌ప్రసాద్ ముల్పూరి, సహనిర్మాత: బుజ్జి. -
సిక్స్ ప్యాక్ శౌర్య
లాక్డౌన్ టైమ్‌ను ఫుల్‌గా ఉపయోగించుకుని బాడీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చారు నాగశౌర్య. సిక్స్‌ప్యాక్ ఫిజిక్‌కి మారిపోయారు. కౌబాయ్ లుక్‌తో ఓ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు నాగశౌర్య. అలాగే అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. -
ప్రతిభను ప్రోత్సహించడానికి..
నాగశౌర్య హీరోగా ‘ఛలో’, ‘అశ్వద్ధామ’ లాంటి సినిమాలను నిర్మించిన ఐరా క్రియేషన్స్ సంస్థ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఆలోచనతో శనివారం హైదరాబాద్‌లో ‘ఐరా సినిమాస్’ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బేనర్‌పై రూపొందనున్న తొలి చిత్రానికి సన్నీ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తారు. నవంబర్ 9న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత ఉషా శంకర్‌ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శనివారం పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఐరా సినిమాస్ పతాకంపై నిర్మిస్తాం. నూతన దర్శకుడు సన్నీ ఈ చిత్రాన్ని థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. నటుడు, ఏఎన్పి మీడియా హౌస్ అధినేత అభినవ్ సర్దార్ ఈ చిత్రానికి సహనిర్మాత’’ అన్నారు. -
నవ్వించడానికి రెడీ
నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగశౌర్య విభిన్న కథాచిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘అలా ఎలా?’తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తాను. సినిమా అంతా వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు అనీష్ కృష్ణ. ‘‘డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ కోవిడ్ టైమ్‌లో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో సహనిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సినిమా షురూ
నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించనున్నారు. శుక్రవారం ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీగా ఉంటుంది. నాగశౌర్య సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఛలో’కు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: బుజ్జి. -
జోరుగా.. హుషారుగా...
నాగశౌర్య, రీతూ వర్మ జోరుగా హుషారుగా షూటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. నాగశౌర్య, రీతూ వర్మ తదితర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
ఎయిట్ ప్యాక్ కష్టాలు
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగశౌర్య ఆర్చర్‌గా (విలుకాడు) కనిపించనున్నారు. లాక్‌డౌన్‌తో ఈ చిత్రం షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. ఇటీవలే హైదరాబాద్‌లో మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ సన్నివేశాల్లో నాగశౌర్య షర్ట్ లేకుండా 8 ప్యాక్ బాడీని ప్రదర్శించాల్సి ఉంది. దీంతో ఎయిట్ ప్యాక్ యాబ్స్ పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు శౌర్య. కచ్చితమైన డైట్ ఫాలో అవుతుండటంతో పాటు ప్రతి రోజూ జిమ్‌లో చెమట చిందిస్తున్నారు. ఐదు రోజులుగా ఆయన నీళ్లు కూడా తాగడం లేదు. ఆఖరుకి లాలాజలాన్ని కూడా మింగడం లేదంటే ఫిట్నెస్ కోసం ఆయన ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవాల్సిందే. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ నిజం’’ అన్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. -
కథకు చాలా ముఖ్యం
నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న 20వ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టై¯Œ మెంట్ పతాకాలపై నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ¯Œ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్న విషయాన్ని గురువారం ప్రకటించారు. ఈ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నెల 18 నుండి మా సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతాం. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. కేతికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: కాలభైరవ. -
నవ్వుల రాజా
నటుడు శివాజీ రాజా తనయుడు, ‘ఏదైనా జరగొచ్చు’ ఫేమ్ విజయ్ రాజా హీరోగా రెండో సినిమా షురూ అయింది. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. తమన్నా వ్యాస్ కథానాయిక. హీరో నాగశౌర్య ముహూర్తం సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ– ‘‘వినోద ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. విజయ్ రాజాకి కరెక్ట్‌గా సరిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నాను.. బాగుంది’’ అన్నారు శివాజీ రాజా. ‘‘ఇందులో అయిదు పాటలుంటాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా.. వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు తూము నరసింహ పటేల్. ‘‘కథ చాలా బాగుంది. మంచి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు విజయ్ రాజా. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యానీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
గురి తప్పదు
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. నాగశౌర్య నటిస్తోన్న 20వ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు శేఖర్ కమ్ముల సోమవారం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంతో శ్రమించి సిక్స్ ప్యాక్‌లోకి మారడం చూసి ఆశ్చర్యమేసింది. ‘ఛలో, ఓ బేబి, అశ్వథ్థామ’ వంటి చిత్రాలతో అలరించిన శౌర్య ఇప్పుడు మరింత మాస్ లుక్‌లోకి మారడం శుభ పరిణామం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. సిక్స్ ప్యాక్ దేహంతో గురి తప్పదనే నమ్మకంతో విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు!
నాగశౌర్య అనగానే లవర్ బాయ్ గుర్తొస్తాడు. పక్కింటి కుర్రాడిలా సాఫ్ట్‌గా కనిపిస్తూ కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ యువహీరో ‘ఆశ్వథ్థామ’ చిత్రంతో రూట్ మార్చి మాస్ ప్రేక్షకులకూ చేరువయ్యారు. ఇప్పుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంలో నాగశౌర్య మరింత మాస్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ లుక్‌ని ‘ది గేమ్ విల్ నెవర్ బీ ది సేమ్’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్‌తో విడుదల చేసింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కండలు తిరిగిన దేహంతో వెనకనుండి కనిపిస్తున్న నాగశౌర్య ప్రీ లుక్‌కి విశేష స్పందన లభించిందని చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్రం కోసం జుట్టు, గెడ్డం కూడా బాగా పెంచినట్టు ప్రీ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ నెల 27న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేయనున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. -
అమ్మకు థ్యాంక్స్
‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందన్నారు. ఆ పాజిటివ్ టాక్ వల్లే మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు థ్యాంక్స్’’ అన్నారు నాగశౌర్య. రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. జనవరి 31న విడుదలై మా చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది అన్నారు చిత్రబృందం. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘రమణ తేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం. అతడిని నమ్మినందుకు సినిమాని బాగా తీశాడు. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యను’’ అన్నారు. నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘శౌర్య రాసిన కథ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు సినీ పరిశ్రమకు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ చేసిన సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నానని, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని శౌర్య అన్నప్పుడు ఆశ్చర్యపోయా. తను కథ బాగా రాసుకున్నాడు’’ అన్నారు రచయిత, దర్శకుడు బి.వియస్ రవి. రమణ తేజ మాట్లాడుతూ– ‘‘శౌర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్. మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఉషా మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు ఫుల్ హ్యాపీ. ఐరా క్రియేషన్స్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్. ఇకముందు కూడా మా బ్యానర్ మంచి సినిమాలు అందిస్తుంది’’ అన్నారు. ‘‘ఐరా క్రియేషన్స్ ఏ సినిమా చేసినా టెక్నీషియన్లు, యాక్టర్లు అందరూ ఫ్యామిలీలా పనిచేస్తారు. అది వాళ్ల బలం’’ అన్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, సినిమాటోగ్రాఫర్ మనోజ్‌రెడ్డి, ఎడిటర్ గ్యారీ, నటుడు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకు మేము కారణం కాదు
సినిమా: పటాస్ చిత్రంతో మరోసారి కోలీవుడ్‌లో వార్తల్లో ఉంటున్న నటి మెహ్రీన్. 2016లో నటిగా రంగప్రవేశం చేసిన జాణ ఈమె. అంటే అప్పుడే ఐదో ఏటను టచ్ చేసేసింది. ఈ ఐదేళ్లలో తెలుగు, తమిళం, మాతృభాష పంజాబీ అంటూ పలు భాషల్లో నటిస్తూ బాగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా తెలుగులో మంచి క్రేజ్‌నే సంపాదించుకుంది. పోతే తమిళంలో ఇటీవలే సక్సెస్ రుచిని చూసింది. ఇంతకుముందే సుశీంద్రన్ దర్శకత్వంలో నెంజిల్ తునివిరుందాల్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం కారణం కావచ్చు ఇక్కడ ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది దర్శకుడు దురై సెంథిల్‌కుమార్ కంటపడింది. దీంతో ధనుష్‌తో పటాస్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సారి పటాస్ చిత్రం సక్సెస్‌ను, గుర్తింపును తెచ్చి పెట్టింది. కానీ మరిన్ని అవకాశాలను మాత్రం అందించలేదు. అందుకోసమేనేమో ఈ అమ్మడు తరచూ వార్తల్లో ఉండేలా చర్చనీయాంశ వ్యాఖ్యలు చేస్తోంది. చిత్ర అపజయాలకు తాము కారణం కాదని అంటోంది. మెహ్రీన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించే ప్రతి చిత్రం విజయం సాధించాలని ఆశిస్తానని చెప్పింది. కథా పాత్రల్లో లీనమై అంకితభావంతో ప్రాణం పణంగా పెట్టి నటిస్తానని అంది. అయినా తాను నటించిన కొన్ని తెలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యి నిరాశకు గురిచేశాయని చెప్పింది. నిజం చెప్పాలంటే అపజయాలకు నటీనటులు కారణం కాదని అంది. ఆ చిత్రాల కథలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, లేకుంటే ఎంతో శ్రమించి నటించినా వృధానే అని పేర్కొంది. ఈ అమ్మడు అంతగా ప్రాణాన్ని పణంగా పెట్టి నటించిన చిత్రాలేమిటో గానీ, ఇటీవల తెలుగు, తమిళంలో నటించిన చిత్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే తెలుగులో కల్యాణ్‌రామ్‌కు జంటగా నటించిన ఎంత మంచి వాడివిరా చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్ర రిజల్ట్ పైనే మెహ్రీన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుందేమో. అయినా, ఎన్నో అనుకుంటాం.అన్నీ జరుగుతాయా ఏంటి? లైట్‌గా తీసుకోవాలిగానీ. ఇకపోతే తెలుగులో ఈ బ్యూటీ నటించిన అశ్వథ్థామ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇది మినహా అక్కడ కూడా చేతిలో చిత్రాలు లేవు. అందుకే ఫ్రస్టేషన్లో ఈ అమ్మడు అలా మాట్లాడుతుందా అన్న భావన కలుగుతోందంటున్నారు సినీ వర్గాలు. -
ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను
‘‘మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద చెయ్యేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో ‘అశ్వథ్థామ’ సినిమాలో హీరో అదే చేస్తాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబమే’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ అందించి, హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘ఇదో నిజాయితీ గల కథ. నా స్నేహితుడి చెల్లికి జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. కథ రాస్తున్నాను అన్నప్పుడు అమ్మానాన్న ఎంతో సపోర్ట్ చేశారు. ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను ఈ కథ రాయడానికి సమాజంలో చాలా సంఘటనలు ప్రేరేపించాయి’’ అన్నారు. ‘‘ఈ కథ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు మెహరీన్. ‘‘సహజంగా నటించే నటుల్లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ‘‘ఈ సినిమాలో కొత్త నాగశౌర్యని చూస్తారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు రమణ తేజ.‘‘ మంచి కథా బలంతో వస్తున్న చిత్రం అశ్వథ్థామ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి. ‘‘సినిమాలో నాలుగు పాటలున్నాయి. అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. -
మా ఇద్దరి ఒప్పందం అదే
‘‘సాధారణంగా అందరం మన అమ్మలను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కసురుతాం.. విసుక్కుంటాం. అయినా అమ్మ మనకు చాలా ప్రేమను పంచుతారు. మనమందరం తల్లులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదేమో? ‘ఓ బేబీ’ సినిమాలో ఈ పాయింట్‌ని చూపించాం. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. సమంత లీడ్ రోల్లో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సునీత తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది. నందినీ రెడ్డి పలు విశేషాలు పంచుకున్నారు. ► కొరియన్ చిత్రం ‘మిస్. గ్రానీ’ చూస్తున్నంత సేపు నేను చాలా కనెక్ట్ అయ్యాను. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. అందరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. కథలో క్వాలిటీ ఉంది. బెస్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో పని చేశారు. లక్ష్మిగారు, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్‌గారు, సమంత అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. డైరెక్షన్లో నేను చే సిన చిన్నచిన్న తప్పులు కూడా వాళ్ల అద్భుతమైన యాక్టింగ్‌తో కవర్ చేసేశారు. ► ఆర్టిస్ట్‌కి కథ ప్లస్ అయ్యే సినిమాలు కొన్ని.. కథకు ఆర్టిస్ట్ ప్లస్ అయ్యే సినిమాలు మరికొన్ని. ‘ఓ బేబీ’ రెండు విభాగాల్లోకి వస్తుంది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ విందు భోజనంలా ఉంటారు. సినిమాలో బేబక్క పాత్ర చాలా కీలకం. లక్ష్మీగారు అద్భుతంగా చేశారు. ఆమె ఒప్పుకోకపోయి ఉంటే ఈ సినిమాను చేసేవాళ్లం కాదేమో? ఈ పాత్రకు ఆప్యాయత, వెటకారం అన్నీ ఉండాలి. లక్ష్మీగారే కరెక్ట్ అని భావించాం. ► రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా రాకపోతే పాడు చేశారు అంటారు. హిట్ అయితే అలానే తీశారు.. హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం. నా సినిమాలన్నీ 50 రోజుల్లోనే పూర్తి చేస్తాను. కానీ సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది? అని అడుగుతుంటారు. ఒక్కోసారి ఐడియా స్టేజిలో బావుంటుంది. కథ రాశాక నచ్చకపోవచ్చు. అలా లేట్ అవుతూ సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది. ఈసారి నుంచి అలా జరగుకుండా చూసుకుంటాను. ► ఈ సినిమాకు సమంత కేవలం యాక్టర్‌గానే కాకుండా అన్ని బాధ్యతలూ చూసుకున్నారు. ‘నువ్వేదైనా తప్పు చేస్తుంటే నేను చెబుతా.. నేనేదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు.. మన మధ్య ఈగో అనేది అడ్డురాకూడదు అని సినిమా స్టార్ట్ అవ్వక ముందే సమంత–నేను ఒప్పందం చేసుకున్నాం(నవ్వుతూ). ► దర్శకురాలిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ కామెడీ, స్పోర్ట్స్ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం వైజయంతీ బ్యానర్లో ఓ సినిమా చేయాలి. రెండు కథలున్నాయి. అందులో మల్టీస్టారర్ సినిమా ఒకటి. వెబ్ సిరీస్‌ల ట్రెండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇంకా స్టార్టింగ్ స్టేజిలోనే ఉంది. వెబ్ థియేటర్‌కి హాని చేస్తుందా? అంటే చెప్పలేం. ► ‘ఓ బేబీ’ సినిమా పూర్తయ్యాక అమ్మ మీద కసురుకోవడం కొంచెం తగ్గింది. ఒకవేళ బేబీలా నేను మళ్లీ వయసులో వెనక్కి వెళితే సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ని కూడా ట్రై చేస్తానేమో? ఇండస్ట్రీలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మెల్లిగా ఆ సంఖ్య పెరగాలి. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘ఓ బేబీ’ సినిమా సెట్లో మహిళా సాంకేతిక నిపుణుల సంఖ్య కొంచెం పెరిగింది. మహిళలు ఉండాలనే ఉద్దేశం కంటే కూడా వాళ్ల ప్రతిభని గుర్తించే తీసుకున్నాం. -
బేబీ ముస్తాబవుతోంది
పెళ్లయిన హీరోయిన్స్‌కు కెరీర్ సాగడం కష్టం అనే అపోహను ఈ ఏడాది నాలుగు సూపర్ హిట్స్ (రంగస్థలం, మహానటి, యు టర్న్, అభిమన్యుడు)తో బద్దలు కొట్టారు సమంత. అంతే కాదు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వచ్చే ఏడాదిని ప్లాన్ చేసేశారు కూడా. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సమంత. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఇందులో సమంత 70 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనున్నారు. దీని కోసం పూర్తిస్థాయి ప్రోస్థెటిక్ మేకప్‌ను ఉపయోగిస్తున్నారట. ఇందులో సమంత తనయుడిగా రావు రమేశ్ కనిపించనున్నారట. విశేషమేంటంటే ‘అత్తారింటికి దారేది, రాజుగారి గది 2’చిత్రాల్లో రావు రమేశ్ కూతురిగా సమంత యాక్ట్ చేశారు. ఈ సినిమాలో సమంతతో పాటు యంగ్ హీరో నాగశౌర్య కనిపిస్తారట. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ‘ఓ బేబీ– ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
మమ్మల్ని కించపరుస్తారా?
సాక్షి, హైదరాబాద్: కొంత మంది హిజ్రాలు మంగళవారం తెలుగు ఫిల్మ్‌చాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘@నర్తనశాల’ మూవీలో హిజ్రాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా చిత్రికరించిన సన్నివేశాలను తొలిగించాలని లేకుంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్లో నాగశౌర్య ‘గే’ లా నటించిన సీన్స్.. అతనికి తండ్రి పాత్ర పోషించిన శివాజీ రాజా ‘నా కొడుకు గే నా’ అని చెప్పిన డైలాగ్స్‌పై హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సముదాయించిన శివాజీరాజా హిజ్రాల ఆందోళనపై శివాజీరాజా స్పందించారు. తన చాంబర్ లోకి పిలిపించుకొని హిజ్రాలను సముదాయించారు. హిజ్రాల కోసం ప్రత్యేకంగా నర్తనశాల ప్రదర్శన వేయిస్తానని హామీయిచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలు, దృశ్యాలను తొలగించేందుకు నిర్మాతలతో చర్చిస్తానని తెలిపారు. -
ఏ పాత్రకి అదే ప్రత్యేకం
కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్... ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో మెరవబోతున్న కథానాయికలు. నాగశౌర్య హీరోగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. కశ్మీరా పరదేశి మాట్లాడుతూ – ‘‘నా మాతృభాష మరాఠి. పూణెలో పుట్టి, పెరిగా. ముంబై నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నప్పుడే మోడలింగ్ చేశా. ‘నర్తనశాల’ ఆడిషన్స్‌కి వచ్చా. నవరసాలను అభినయించమన్నారు. చేయగానే నచ్చడంతో కథానాయికగా తీసుకున్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో ఉషా ఆంటీ సాయం చేశారు. దర్శకుడు చక్రవర్తిగారు నాకు గురువులాంటివారు. ఈ చిత్రంలో నా పాత్ర లవబుల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. నా ప్రేమికుడే నా బలం అన్నట్టు ఉంటుంది. మరో హీరోయిన్ యామినీ ఉన్నప్పటికీ ఏ పాత్రకి అది స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి. నాకు హిప్హాప్, కథక్ డ్యాన్సులు వచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు. యామినీ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి, పెరిగింది విజయవాడ. గతంలో ‘కీచుక’ అనే సినిమా చేశా. అందులో నా నటనకి మంచి అభినందనలు వచ్చాయి. కానీ, ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ‘నర్తనశాల’ నా కెరీర్‌కి ప్లస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి అనుకునే పాత్ర. ప్రత్యేకించి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ప్రాక్టీస్ చేశాను. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా రెండు పాత్రలకి మధ్య వేరియేషన్ ఉంటుంది. ఏ పాత్రకి అదే ప్రత్యేకం. ప్రస్తుతం మారుతిగారి దర్శకత్వంలో చేసిన ‘భలే మంచి చౌకబేరం’ సెప్టెంబర్‌లో విడుదలవుతుంది’’ అన్నారు. -
పండగలాంటి సినిమా
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నర్తనశాల’. ఇందులో కాశ్మీరీ పరదేశి, యామినీ భాస్కర్ కథానాయికలుగా నటించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉషా ముల్పూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లతో పాటుగా రిలీజ్ చేసిన రెండు వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 24న రిలీజ్ చేసి, చిత్రాన్ని 30న విడుదల చేయనున్నాం. సినిమాలో నాగశౌర్య క్యారెక్టర్‌కు లేడీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. మహతి మంచి సంగీతం అందిచాడు. ఈ సినిమాపై ఆడియన్స్ నమ్మకం వమ్ము కాదు’’ అన్నారు. ‘‘ఛలో’ సక్సెస్ మా బ్యానర్‌కు ఊపిరిపోసింది. శ్రీనివాస్ బాగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఎంటర్టైన్ చేసేలా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్ ప్రసాద్. ‘‘రీలీజ్ చేసిన టీజర్లో సినిమా గురించి కొంచెమే చెప్పాం. ట్రైలర్లో కాస్త కథ కూడా చెబుతాం. సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ సంస్థను రన్ చేస్తుంటారు నాగశౌర్య. ఆయన క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. నాగశౌర్య గే క్యారెక్టర్ గురించి థియేటర్స్‌లో మరింత తెలుస్తుంది. నిర్మాతలు ఈ సినిమాను ఇష్టపడి నిర్మించారు. అందుకే లెక్కకు మించి ఖర్చు పెట్టారు. సినిమా పండగలా ఉంటుంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. పాత నర్తనశాలకి, ఈ నర్తనశాలకి ప్యారలల్‌గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. విజయ్‌కుమార్ మంచి విజువల్స్ అందించారు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్. -
అటూ ఇటూ తిరిగి నర్తనశాల నాకే వచ్చింది
‘‘కొడుకు కలల్ని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు సినిమాలు తీస్తున్నారు నాగశౌర్య తల్లిదండ్రులు. వారి ఆశీర్వాదానికి మించిన ఆశీస్సుల కంటే ఇంకేం కావాలి. ‘నర్తనశాల’ వంటి క్లాసిక్ టైటిల్‌తో తీసిన ఈ చిత్రంలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటించారు. టీజర్లో కొత్తదనం కనిపించింది. నా మిత్రుడు శ్రీనివాస్‌కి ఈ చిత్రం మంచి హిట్ తీసుకొస్తుంది. ఈ సినిమా కెమెరామేన్ విజయ్ సి.కుమార్ నాన్నగారు పాత ‘నర్తనశాల’ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘2013లో నేను హీరోగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు శ్రీనివాస్ చక్రవర్తి ‘నర్తనశాల’ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. అప్పు చేసి అయినా ఈ సినిమా నిర్మించాలనిపించింది. అప్పటి నుంచి ఈ కథ అటూ ఇటూ తిరిగి మళ్లీ నా వద్దకే రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా తీస్తా. 15 కోట్లు పెట్టండి? అంటే ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం నాపై ప్రేమతో చాలా ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘నా గురువు కృష్ణవంశీగారు. నాగశౌర్య, శంకర్ ప్రసాద్‌ల ప్రోత్సాహంతో నా కల తీరింది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. నటుడు శివాజీ రాజా, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిరోజూ పండుగే
‘ఛలో’ వంటి హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్, కాష్మీర పరదేశీ కథానాయికలు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది. భాస్కర భట్ల రచించిన ‘ఎగిరే మనసు..’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఉషా ముల్పూరి మాట్లాడుతూ – ‘‘ఛలో’ చిత్రాన్ని మ్యూజికల్‌గానూ సూపర్ హిట్ చేశారు. ఈ సినిమాను కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఛలో’ సినిమాకు నిర్మాతలు దొరక్కపోవడంతో ఐరా క్రియేషన్ పుట్టింది. ఐరాకి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్, మీడియా, తమ్మిరాజు, చంటి నాలుగు పిల్లర్స్’’ అన్నారు శంకర్ ప్రసాద్. ‘‘ఫస్ట్ లుక్ నుంచి మా సినిమాకు ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్దది అవుతుందనుకోలేదు. ప్రతిరోజూ షూటింగ్ పండుగలానే జరిగింది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. ‘‘ఛలో’లో ‘చూసీ చూడంగానే....’ సాంగ్ కంటే ఈ పాట పెద్ద సక్సెస్ అవ్వాలి’’ అన్నారు సంగీత దర్శకుడు సాగర్ మహతి. ‘‘నర్తనశాల’ అందరూ గుర్తుంచుకునే సినిమా అవుతుంది’’ అన్నారు యామినీ. -
‘నర్తనశాల’ సాంగ్ లాంచ్
-
నర్తనశాల పేరు నిలబెట్టేలా ఉంటుంది
‘‘మా ‘నర్తనశాల’ సినిమా షూటింగ్ పూర్తయింది. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా మా సినిమా ఉంటుంది. శ్రీనివాస్‌గారు చాలా బాగా తీశారు. ఫస్ట్ లుక్ ఎంత ఫ్రెష్‌గా ఉందో సినిమా కూడా అంతే ఫ్రెష్‌గా, అందర్నీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘నర్తనశాల’ చిత్రం ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం నాగశౌర్య. ఆయన పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. మా నిర్మాతలు శంకర్, ఉషా, బుజ్జి గార్లకు సినిమా అంటే ప్యాషన్. అందుకే ఈ బ్యానర్లో ఏ చిత్రం వచ్చినా అది బ్లాక్‌బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఛలో’ చిత్రాన్ని ఎంత ఘనవిజయం చేశారో ‘నర్తనశాల’ని కూడా అంతకు మించి హిట్ చేయాలి. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు ఉషా మూల్పూరి. ‘‘నర్తనశాల’ అందరి చిత్రంగా మీ ముందుకు వస్తుంది. అందరూ ‘ఛలో’ కంటే మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు శంకర్‌ప్రసాద్ మూల్పూరి. కష్మీర పరదేశి, యామిని భాస్కర్, నటులు శివాజీ రాజా, కొరియోగ్రాఫర్ విజయ్, కెమెరామేన్ విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, పాటల రచయితలు ఓరుగంటి, శ్రీమణి పాల్గొన్నారు. -
సంగీతశాల
‘ఛలో’ సక్సెస్ తర్వాత నాగ శౌర్య నటిస్తున్న చిత్రం ‘నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్‌ప్రసాద్, ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. శ్రీనివాసరావు దర్శకుడు. కాశ్మీరా కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన సంగీత్ సాంగ్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగ శౌర్య మాట్లాడుతూ ...‘‘మా బ్యానర్లో చేస్తున్న రెండో సినిమా ఇది. కథకు యాప్ట్ అవుతుందని ‘నర్తనశాల’ అని టైటిల్ పెట్టాం. ఆ టైటిల్‌ను చెడగొట్టం అని హామీ ఇస్తున్నాను’’ అన్నారు. ‘‘టాకీ పార్ట్, మూడు పాటల చిత్రీకరణ అయిపోయింది. ఆగస్ట్‌లో సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘సాగర్ మహతి అందించిన సాంగ్స్ ఆకట్టుకుంటాయి. నాగ శౌర్య క్యారెక్టర్ సినిమాకు హైలైట్‌గా నిలు స్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరావు. ఈ సినిమాకు సంగీతం: సాగర్ మహతి. -
వెంకటేశ్వరుని ఆశీస్సులతో...
‘ఛలో’ చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు నాగశౌర్య. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై రాజా కొలుసును దర్శకునిగా పరిచయం చేస్తూ వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియచేస్తామని ఆనందప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆనంద ప్రసాద్ సతీమణి కృష్ణకుమారి, హీరో నాగశౌర్య తల్లిదండ్రులు ఉషాబాల, శంకరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరాం, సంగీతం: సాగర్ మహతి, ఆర్ట్: వివేక్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కథ–స్క్రీన్‌ప్లే–మాటలు–దర్శకత్వం: రాజా కొలుసు. -
నా పన్నెండేళ్ల కల తీరింది
‘‘అమ్మమ్మగారిల్లు’ సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య. ఆ తర్వాత సుధ, శివాజీరాజా పాత్రలు. సినిమాలో ‘లాక్ యువర్ ఏజ్’ అనే కాన్సెప్ట్ బాగా కలిసొచ్చింది. నా లాక్ ఏజ్ ఏంటంటే.. 2008 నుంచి 2018 వరకూ. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు రావు రమేశ్. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సుందర్ సూర్య మాట్లాడుతూ– ‘‘ఇంత మంది సీనియర్ ఆర్టిస్టులతో ఎలా చేయాలని చాలా టెన్షన్ పడ్డా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్లనే నేను డైరెక్ట్ చేయడం వండర్ఫుల్ మూమెంట్. నేను తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్నది తెలియదు. కానీ, నా పన్నెండేళ్ల కలని ‘అమ్మమ్మగారిల్లు’ తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ ఏడాదిన్నర నా లాక్ ఏజ్’’ అన్నారు. ‘‘మా సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ చేసుకుంటున్నామంటే కారణం నా టీమ్’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘రాజేష్, కుమార్, సుందర్ చాలా మంచి వ్యక్తులు. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ల ముద్ర పడిపోవాలి. నా 45 ఏళ్ల పగ ఈ మధ్యనే తీరింది. అదే నా లాక్ ఏజ్’’ అన్నారు నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. ఈ వేడుకలో నటీనటులు సుధ, హేమ, మధుమణి, రూపాలక్ష్మి, శక్తి, చందు తదితరులు పాల్గొన్నారు. -
అదే బర్త్‌డే గిఫ్ట్
హలో ఎక్కడున్నావ్ హలో.. అంటున్నారు కల్యాణి ప్రియదర్శన్ అభిమానులు. అఖిల్ సరసన ‘హలో’లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడేం చేస్తున్నారంటే శర్వానంద్ సరసన ఓ సినిమా కమిట్ అయ్యారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గురువారం కల్యాణి బర్త్‌డే. ఈ పుట్టినరోజుకి మీరు అందుకున్న బెస్ట్ గిఫ్ట్ ఏంటి? అని కల్యాణిని అడిగితే – ‘‘ఇంతకంటే బెస్ట్ బర్త్‌డే ఉండదేమో. అలా ఎందుకన్నానంటే ఈరోజే నా కొత్త సినిమా లొకేషన్లోకి ఎంటరయ్యాను. నాకు గ్యాంగ్‌స్టర్ మూవీస్ అంటే ఇష్టం. శర్వానంద్‌తో చేస్తున్న ఈ సినిమా ఆ బ్యాక్డ్రాప్లోనిదే కావడం హ్యాపీ. బర్త్‌డే రోజున ప్రొఫెషనల్‌గా బిజీగా ఉండటంకన్నా బెస్ట్ గిఫ్ట్ ఇంకేముంటుంది? వైజాగ్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. మంచి టీమ్‌తో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. సినిమాల ఎంపిక విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నానని, మంచి కథ, పాత్ర అయితేనే ఒప్పుకుంటున్నానని, కొంచెం లేట్ అయినా ఫర్వాలేదు, హడావిడి పడదల్చుకోలేదని కల్యాణి చెప్పారు. -
ఇంటికి మంచి ఆఫర్స్
హీరో నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ 2.75 కోట్లకు అమ్ముడైంది. ఒక్క నిమిషం ఏవేవో ఊహించుకుని కంగారు పడకండి. ‘అమ్మమ్మగారిల్లు’ అనేది సినిమా టైటిల్ అండి బాబు. నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. టీజర్ రెడీ అవుతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను పైన చెప్పిన మొత్తానికి ఓ ప్రముఖ టీవీ చానల్ దక్కించుకుంది. ‘‘చక్కని కుటుంబ కథాచిత్రమిది. అచ్చ తెలుగు టైటిల్ పెట్టడంతో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఓవర్సీస్, హిందీ రైట్స్‌కు సంబంధించి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నాగశౌర్య కెరీర్లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ మూవీగా నిలుస్తుంది. దర్శకుడు బాగా తీశారు. వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
‘ఛలో’ దర్శకుడి కొత్త సినిమా అప్డేట్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రేమమ్, బాబు బంగారం లాంటి సినిమానలు తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాను నిర్మిస్తోంది. త్వరలో ఇదే బ్యానర్లో సుదీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించే అవకాశం ఉంది. -
తల్లీ బిడ్డకు ఉన్న అనుబంధమే కణం – సాయి పల్లవి
నాగ శౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్.విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించిన చిత్రం ‘కణం’. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ. ప్రసాద్ మాట్లాడుతూ –‘‘ఈ సినిమాను మా బ్యానర్‌పై తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. సాయి పల్లవి, నాగ శౌర్యకు ఈ సినిమా హ్యాట్రిక్ తెచ్చిపెడుతుంది అనుకుంటున్నాను. శ్యామ్ సి మ్యూజిక్, నిరవ్ షా విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. దర్శకుడు విజయ్ ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశారో ఆ ఉద్దేశం నెరవేరాలని కోరుకుంటున్నాను. 37 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయడం నిజంగా చిన్న విషయం కాదు. తెలుగులో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్ వాళ్లకు థ్యాంక్స్’’ అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ– ‘‘తల్లీబిడ్డకు మధ్య ఉన్న అనుబంధం, తపనే ఈ కథ. చాలా ఎమోషనల్ కనెక్ట్‌తో ఈ సినిమా చేశా. మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఆడియన్స్ థియేటర్ బయటకు రావాలని విజయ్ చక్కగా రూపొందించారు. నాగ శౌర్య చాలా బాగా నటించారు. ఇంత మంచి సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌కు థ్యాంక్స్. ‘ఫిదా, ఏంసీఎ’ సినిమాల్లాగే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మంచి సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. 2013లోనే ఈ సినిమా ఆలోచన వచ్చింది. టైమ్ తీసుకొని చేద్దాం అని వెయిట్ చేశాను. నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎన్.వీ.ప్రసాద్ గారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు’’ అన్నారు దర్శకుడు విజయ్. ‘‘నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా, దర్శకుడు విజయ్ అలాగే సినిమాకు పని చేసిన యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు జెమినీ కిరణ్. ‘‘సినిమాలో నటించిన అందరికి, అలాగే నా మిత్రుడు ఎన్.వి.ప్రసాద్‌కు అభినందనలు’’ అన్నారు నిర్మాత బీవీయస్ఎన్. ప్రసాద్. ‘‘నాగశౌర్య, సాయి పల్లవి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ సినిమా కూడా వాళ్లకు పెద్ద సక్సెస్ తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను’’ అన్నారు శానం నాగ అశోక్ కుమార్. ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ప్రేమ్. -
సాయిపల్లవి నో అంది!
తమిళసినిమా: కరు చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్ చెప్పారు. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్‌గానూ నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్ ఆంటోని ముఖ్యపాత్రలను పోషించారు. శ్యామ్.సీఎస్ సంగీతబాణీలు కట్టిన ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి మాట్లాడుతూ అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేసిన నటిని తానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి చేర్చారని అన్నారు. తన తొలి చిత్రాన్నే (ప్రేమమ్ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు. దర్శకుడు విజయ్ కురు చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. కురు చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ తన కెరీర్లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా కరు నిలిచిపోతుందన్నారు. రెండేళ్ల క్రితం ఈ చిత్ర కథను లైకా సంస్థకు చెప్పగా ఎప్పుడు చేసినా ఈ కథను లైకా సంస్థకే చేయాలని ఆ సంస్థ అధినేత అన్నారని చెప్పారు. ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో సాయిపల్లవి అయితే బాగుంటుందని భావించామని, ఆమెను కలిసినప్పుడు కరు చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారన్నారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవినేనని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్ అన్నారు. కరు చిత్ర ఆడియో ఆవిష్కరణ దృశ్యం -
సినిమా హిట్.. కారు గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు వారాల్లో సుమారు రూ.23.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. శాటిలైట్, రీమేక్ హక్కులతో మరో ఆరు కోట్లవరకూ బిజినెస్ చేసి 2018లో బ్లాక్‌బస్టర్‌గా నిలించింది. ఈ సందర్భంగా నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి సినిమాకు పనిచేసిన 24 రంగాలకు చెందిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సినిమా ప్రారంభం రోజునే అనుకున్నామని, హిట్ అవగానే సినిమాకు కష్టపడి పని చేసిన వారిని సత్కరించాలని అనుకున్నామని తెలిపారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి తాము ఇచ్చే చిరుకానుక అని అన్నారు. ఐరా బ్యానర్ ప్రారంభించడానికి కారణమైన వెంకీ కుడుములకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుములకు నిర్మాతలు కారు బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి సినిమా నిర్మించిన నిర్మాతల రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సినిమా చేసే అవకాశం ఇవ్వడం గిఫ్ట్ అయితే, హిట్ అవడం డబుల్ గిఫ్ట్ అని, ఇక నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా భావిస్తున్నానని తెలిపారు. నాగ శౌర్యలేకపోతే తాను లేనని, తన హీరోను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. -
ఆ కష్టం ‘ఛలో’తో తెలిసింది – నిర్మాత ఉష
‘‘మేం గతంలో మా ఫ్యామిలీతో సినిమాలు చూసేవాళ్లం. సినిమా తీయాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు ఉంటే చాలనుకునేవాళ్లం. కానీ మా ‘ఐరా క్రియేషన్స్ బ్యానర్’ ప్రారంభించాక ఓ విషయం అర్థమైంది. తెరమీద కనిపించే వారి వెనక వందలాది శ్రామికుల కష్టం ఉంటుందని’’ అన్నారు నిర్మాత ఉష మూల్పూరి. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఆమె నిర్మించిన చిత్రం ‘ఛలో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకెళుతోందని ఉష తెలిపారు. ఈ సందర్భంగా ‘ఛలో’ చిత్రానికి పని చేసిన 24 క్రాఫ్ట్స్ వాళ్లని సత్కరించారు. అనంతరం ఉష మాట్లాడుతూ– ‘‘వెంకీ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. ఐరా క్రియేషన్స్ మొదలు పెట్టడానికీ, ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన వెంకీకి కృతజ్ఞతగా కారు గిఫ్ట్‌గా ఇచ్చాం. తను మరిన్ని విజయాలు సాధించాలి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘సినిమాకి వెళతానంటే నా తల్లిదండ్రులు డబ్బులిచ్చారు. నాగశౌర్య తల్లిదండ్రులు డబ్బులిచ్చి సినిమా తీసారు. వారి రుణం మరచిపోను. ఈ చిత్రం చేసే అవకాశం ఒక గిఫ్ట్ అయితే.. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ హిట్ చేయటం డబుల్ గిఫ్ట్... ఇప్పుడు నాకు కారు గిఫ్ట్ ఇవ్వటం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా ఫీలవుతున్నా. నాగశౌర్య పరిచయం కాకపోతే నాకు ఈ జీవితం లేదు’’ అన్నారు. శంకర్ ప్రసాద్, నాగశౌర్యలతో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. -
అమ్మమ్మగారింట్లో...
‘‘అమ్మమ్మగారి ఇల్లు అంటే జ్ఞాపకాల పొదరిల్లు. ఆప్యాయతల అల్లర్లు, సంతోషాల మధురిమలు. అవన్నీ దండిగా మా ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలో ఉన్నాయి’’ అంటున్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగశౌర్య, బేబి షామిలి జంటగా శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై సుందర్ సూర్య దర్శకత్వంలో కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటించా. కథను నమ్మి సినిమా చేశాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో మరింత దగ్గరవుతాను. దర్శకుడు సూర్య బాగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. నాగశౌర్య నటన హైలైట్’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకునిగా నాకిది తొలి సినిమా. రిలేషన్ నెవర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు. ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతో మరో సినిమా చేయలేదు. కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు షామిలి. అమ్మమ్మ పాత్రలో సుమిత్ర నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, సుమన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ రమణ. -
హిట్ అనుకున్నాం.. సూపర్ హిట్ అయ్యింది – నాగశౌర్య
‘‘ఛలో’ ఓ ఎమోషనల్ జర్నీ. మంచి సినిమా తీశాం. హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ పెద్ద హిట్.. సూపర్‌హిట్ అయ్యింది. టికెట్లు దొరకడం లేదని కొందరు నన్ను టికెట్లు అడుగుతుంటే ‘వీళ్లు కావాలనే అడుగుతున్నారా.. లేకుంటే నిజంగానే పెద్ద హిట్ అయ్యిందా అన్నది అర్థం కావడం లేదు’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛలో’. శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఛలో’ సినిమాకి నేనొక్కడినే బలం కాదు. నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ. నాకు మా అమ్మానాన్న బలమైతే.. ఐరా క్రియేషన్స్‌కి బుజ్జి అంకుల్, శ్రీనివాసరెడ్డి అంకుల్ ఇద్దరే బలం. మరో నాలుగు సినిమాలు తీయొచ్చనే ధైర్యం ఇచ్చింది వారిద్దరే. ‘ఛలో’ని బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ రోజుల్లో డైరెక్టర్‌గా అవకాశం దొరకడం ఎంత కష్టమో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాకు తెలుసు. అటువంటిది నన్ను నమ్మి, సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఉషా ఆంటీ, శంకర్‌ప్రసాద్ అంకుల్. మిమ్మల్ని జీవితంలో మరచిపోలేను. శౌర్య, రష్మిక చాలా బాగా చేశారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘ఛలో’ సినిమాని ఆదరించడంతో పాటు నన్ను బాగా సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అన్నారు రష్మిక మండన్న. శంకర్‌ప్రసాద్, ఉషా, కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అప్పుడు నా ఫంక్షన్ తూతూ మంత్రంగా జరిగింది’
‘‘నాగశౌర్య సినిమాలు బిగ్ స్క్రీన్‌పై చూడలేదు. తను మా నిహారికతో చేసిన ‘ఒక మనసు’ చిత్రం టీవీలో చూశా. హ్యాండ్సమ్గా, మంచి పర్సనాలిటీతో ఉన్నాడు. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి కావాలి, రావాలి. అప్పుడే కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా ఉంటుంది’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛలో’. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ –రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ పరిచయం ఉందని నాగశౌర్య ఫంక్షన్‌కి చిరంజీవి వచ్చాడు అనుకుంటున్నారా? నన్ను కలవాలని నాగశౌర్య తన తల్లి ఉషగారితో మా ఇంటికొచ్చాడు. ‘మా ‘ఛలో’ ప్రీ–రిలీజ్ వేడుక మీ సమక్షంలో జరగాలి’ అని కోరితే ఆలోచించకుండా వస్తానన్నాను. అలా అనడానికి కారణం ఉంది. నా తొలినాళ్లలో నా సినిమా వంద రోజుల ఫంక్షన్‌కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్‌ని రమ్మని పిలిచాం. ఆయన వస్తే ఆ ఉత్సాహం.. ప్రోత్సాహం బాగుంటుందని. ఆయన బిజీగా ఉండి రాలేకపోయారు. ఆ రోజు ఫంక్షన్ తూతూ మంత్రంగా జరుపుకున్నాం. అప్పుడు చాలా నిరుత్సాహపడ్డా. ఇప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నా. నాలాంటి వాళ్లు వెళితే తనకి ఇచ్చే ప్రోత్సాహం.. ఉత్సాహం వేరు. అందుకే వస్తానన్నా. రెండు మూడేళ్లుగా టాలీవుడ్లో పెద్ద స్టార్ల సినిమాలు ఎంత హిట్ అయ్యాయో.. యంగ్‌స్టార్స్ సినిమాలూ అంతే హిట్ అయ్యాయి. ‘ఉయ్యాల జంపాల, పెళ్ళిచూపులు, ఊహలు గుసగుసలాడే, శతమానం భవతి, ఫిదా, అర్జున్‌రెడ్డి, హలో’ వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ‘ఛలో’ మంచి విజయం సాధించి, శౌర్య కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నా. ట్రైలర్ చూడగానే సినిమా ఎంత త్వరగా చూడాలా అనిపించింది. వెంకీ నాకు ఓ డైరెక్టర్లా అనిపించలేదు. మీలో ఒక్కడిగా అనిపించాడు. నా అభిమాని డైరెక్టర్ అయ్యాడంటే సంతోషంగా ఉంది. రేపు మీలో ఎవరైనా ఈ స్థాయికొస్తే ఆశీర్వదించేవాళ్లలో తొలి వ్యక్తి నేనే. మణిశర్మ అబ్బాయి సాగర్ పాటలు చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాల విజయం ఈ పరిశ్రమకు అవసరం. మీరందరూ ఈ సినిమాని ఆశీర్వదించాలి’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘చిరంజీవి సార్.. పదేళ్లు ఎక్కడికి వెళ్లిపోయారు? ఇలాంటి ఆడియో ఫంక్షన్స్.. ఇంతమంది జనాలు.. ఇండస్ట్రీలో మీరు లేకపోవడంతో ఆడియో రిలీజ్లు హోటల్స్‌లో చేసుకోవాల్సి వస్తోంది సార్. అది ఆడియో రిలీజా? రిసెప్షనా? అని అర్థం కాకుండా జరుపుకుంటున్నాం. మళ్లీ మెగాస్టార్ వచ్చారు. ఆడియో రిలీజ్ అంటే ఏంటో చూపించారు. చిరంజీవిగారు నటిస్తున్న రోజుల్లో 1,2,3,4.. అంటూ నాలుగు కుర్చీలుండేవి. ఆయన వెళ్లిపోయాక కుర్చీలు లేవు. అందరూ నిల్చోవడమే. మళ్లీ ఆయన వచ్చారు.. కుర్చీ తెచ్చుకున్నారు.. కూర్చున్నారు. ఇంకెవరూ రారు.. రాలేరు.. కూర్చోలేరు.. ఆ కుర్చీ ఆయనది కాదు. ఆయనకోసమే కుర్చీ పుట్టింది. మరో జన్మంటూ ఉంటే మళ్లీ మా అమ్మనాన్నలకు కొడుకుగా.. మెగాస్టార్ అభిమానిగానే పుడతా’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘చిరంజీవి సార్.. మీ ఫ్యాన్స్, ఫాలోయర్స్ లిస్టులో నేనూ ఒకడిని. ‘ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్’ సినిమాలకు బట్టలు చింపుకుని మరీ కటౌట్లు కట్టాను. మిమ్మల్ని లైఫ్‌లో ఒక్కసారి కలవాలనుకున్నా. కానీ మా సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో కలుస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు. కెమెరామెన్ సాయి శ్రీరామ్, నిర్మాత సి.కల్యాణ్, దర్శకులు వంశీ పైడిపల్లి, నందినీరెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పాటల రచయిత భాస్కరభట్ల, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా తీయడం పెద్ద అవస్థ – త్రివిక్రమ్
‘‘నాకు సినిమా తప్ప వేరే విషయాలు గురించి పెద్దగా తెలియదు. పెద్దది కావొచ్చు.. చిన్నది కావొచ్చు! రాజమౌళి నుంచి అవసరాల శ్రీనివాస్ వరకూ ఎవరైనా సినిమా తీస్తూనే ఉండాల్సిందే’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. నాగశౌర్య, రష్మికా మండన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఛలో’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని త్రివిక్రమ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిలో వెంకట్ ఒకడు. నాకిష్టమైన వాళ్లలో తనూ ఒకడు. వెంకీ డైరక్టర్ కావడం హ్యాపీ. సాయి కొర్రపాటి బ్యానర్‌తో నాగశౌర్య మొదలు పెట్టిన ప్రయాణం తన సొంత బ్యానర్ వరకూ వచ్చింది. కొత్త బ్యానర్లో సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసిన ‘స్వయంవరం’ సినిమాకు చాలా కష్టాలు పడ్డాను. సినిమా తీయడం పెద్ద అవస్థ. ఆ అవస్థను ‘ఛలో’ యూనిట్ అధిగమించిందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ యూనివర్సిటీలా భావిస్తే, అందులో త్రివిక్రమ్‌గారిని హయ్యస్ట్ కేడర్ ప్రొఫెసర్‌గా భావిస్తా. అటువంటి దర్శకుడి వద్ద పనిచేయడం గర్వంగా ఉంది. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్లో జరిగే కాలేజీ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘నాకిష్టమైన త్రివిక్రమ్ గారి చేతుల మీదగా టీజర్ విడుదల కావడం హ్యాపీ. ఆయన బ్యానర్లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారో.. నా బ్యానర్‌లోనూ అలాంటి చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తా’’ అన్నారు నాగశౌర్య. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు రష్మికా మండన్నా. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్. -
నటుడిగా మరో మెట్టు పైకి...
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘ఛలో’. నాగశౌర్య, రష్మికా మండన్న జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శంకర్‌ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఈ శనివారం రిలీజ్ చేస్తున్నారు. ఉషా ముల్పూరి మాట్లాడుతూ– ‘‘ఛలో’ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మంచి కథను కమర్షియాలిటీ మిస్ కాకుండా ఎంటర్టైనింగ్గా చెప్పారు వెంకీ. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. డిసెంబర్ 29న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నటుడిగా నాగశౌర్య అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన్ని ‘ఛలో’ సినిమాలో వైవిధ్యంగా చూపించబోతున్నాం. నటుడిగా తనను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 18న వచ్చే టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతాయి’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘దర్శకుడు వెంకీ కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. నాగశౌర్యకు మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుందని దీమాగా చెబుతున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 29న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం’’ అని శంకర్‌ప్రసాద్ ముల్పూరి అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్. -
నారా రోహిత్ సినిమాలో యువహీరో
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే బాటలో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఇద్దరు యంగ్ హీరోలు, ఓ మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారు. వారాహి చలనచిత్ర బ్యానర్ నిర్మిస్తున్న 'జ్యో అచ్యుతానంద' సినిమా కోసం క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్. సాయి కొర్రపాటి నిర్మాణంలో నారా రోహిత్ హీరోగా 'జ్యో అచ్యుతానంద' సినిమాను ప్రారంభించారు. అయితే సినిమా మొదలైనప్పుడు,జ్యోతి, అచ్యుతరావు, ఆనందరావు అనే ముగ్గురు వ్యక్తుల మధ్య కథ అని చెప్పాడు దర్శకుడు. దీంతో మరో హీరో కోసం అప్పటినుంచే వేట ప్రారంభించారు. ఫైనల్‌గా వారాహి బ్యానర్లో హీరోగా సక్సెస్ అయిన నాగశౌర్యను ఈ క్యారెక్టర్ కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం సావిత్రి, రాజా చెయ్యివేస్తే సినిమాల్లో నటిస్తున్న రోహిత్ ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే జ్యో అచ్యుతానంద టీంతో జాయిన్ అవుతాడు. నాగశైర్య కూడా మెగా వారసురాలు నిహారిక వెండితెరకు పరిచయం అవుతున్న ఒక్క మనసు సినిమాలో నటిస్తున్నాడు. దీంతో జ్యో అచ్చుతానంద సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర నటీనటులు సాంకేతిక వర్గ ఎంపిక కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.