కథకు చాలా ముఖ్యం | Jagapathi Babu doing a crucial role in Naga Shaurya Film | Sakshi
Sakshi News home page

కథకు చాలా ముఖ్యం

Published Fri, Sep 4 2020 6:37 AM | Last Updated on Fri, Sep 4 2020 6:37 AM

Jagapathi Babu doing a crucial role in Naga Shaurya Film - Sakshi

నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న 20వ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టై¯Œ మెంట్‌ పతాకాలపై నారాయణదాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్మోహ¯Œ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్న విషయాన్ని గురువారం ప్రకటించారు.

ఈ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కోవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ  ఈ నెల 18 నుండి మా సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుతాం. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీగా అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. కేతికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: కాలభైరవ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement