ప్రతిభను ప్రోత్సహించడానికి.. | Nagashourya Starts New Production Company, | Sakshi
Sakshi News home page

ప్రతిభను ప్రోత్సహించడానికి..

Published Sun, Nov 8 2020 6:07 AM | Last Updated on Sun, Nov 8 2020 6:08 AM

Nagashourya Starts New Production Company, - Sakshi

బుజ్జి, అభినవ్, సన్నీ, శంకర్‌ ప్రసాద్, ఉషా

నాగశౌర్య హీరోగా ‘ఛలో’, ‘అశ్వద్ధామ’ లాంటి సినిమాలను నిర్మించిన ఐరా క్రియేషన్స్‌ సంస్థ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఆలోచనతో శనివారం హైదరాబాద్‌లో ‘ఐరా సినిమాస్‌’ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బేనర్‌పై రూపొందనున్న తొలి చిత్రానికి సన్నీ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తారు. నవంబర్‌ 9న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత ఉషా శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శనివారం పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించాం. ఫ్రెష్‌ కంటెంట్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను ఐరా సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తాం. నూతన దర్శకుడు సన్నీ ఈ చిత్రాన్ని థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. నటుడు, ఏఎన్‌పి మీడియా హౌస్‌ అధినేత అభినవ్‌ సర్దార్‌ ఈ చిత్రానికి సహనిర్మాత’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement