Production company
-
మెగా ఫామిలీ లో మరో బ్యానర్...చరణ్ కు పోటీగా!
-
ముచ్చటగా మూడు
తెలుగు పరిశ్రమ లోకి ‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్’ అనే నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో మూడు సినిమాల్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు సంస్థ అధినేత విజయ్ రెడ్డి. తొలి ప్రయత్నంగా ప్రసాద్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సోషల్ వర్కర్స్’ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర ప్రధాన పాత్రలో మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో ‘కోబలి’ని రెండో చిత్రంగా నిర్మిస్తున్నారు. మూడో మూవీగా ‘హ్యాపీ విమెన్స్ డే’ రూపొందనుంది. తొలి సీన్‌కి నటుడు బాబూ మోహన్ క్లాప్ కొట్టారు. విజయ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ఆఫీసులను ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రారంభించాం. ఔత్సాహిక దర్శకులు, నూతన నటీనటులు మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా తెలంగాణ
గచ్చిబౌలి (హైదరాబాద్): పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రాంతం ఎంతో అనువైనదని, అందులో హైదరాబాద్ నగరం మరింత అనువైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో మలబార్ గ్రూపు ఆధ్వర్యంలో మహేశ్వరంలో ఏర్పాటు చేసే మలబార్ గోల్డ్, డైమండ్స్ ఆభరణాల ఉత్పత్తి సంస్థ ఫ్యాక్టరీకి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టెక్నాలజీ, బయాలజీ, ఏరోస్పేస్, లాజిస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. జువెలరీ సంస్థలు మరిన్ని తెలంగాణలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే జువెలరీ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2,750 మందికి ఉపాధి కల్పించేలా రూ.750 కోట్లతో మలబార్ గోల్డ్, జువెలరీ ఆభరణాల సంస్థ రాష్ట్రంలో అతిపెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకురావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మలబార్ గ్రూపు చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్‌చైర్మన్ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ ..ప్రస్తుతం మలబార్ గోల్డ్, డైమండ్స్ రిటైల్ షోరూమ్స్ తెలంగాణలో 17 ఉన్నాయని వాటిద్వారా 1,000 మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. కేరళ, కర్ణాటక తర్వాత హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడంతో వినియోగదారుల మన్ననలు పొందుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, మలబార్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: భారత్ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్లను సృష్టిస్తుంది. తక్కువ కాస్ట్.. ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లు అందుబాటులోకి రావడంతో కొనుగోలు దారులు ఎగబడిమరి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021– 22) మొబైల్ ఫోన్ ఎగుమతులు రూ. 43,500 కోట్ల స్థాయిని అధిగమించవచ్చని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వెల్లడించింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీము దీనికి తోడ్పడగలదని పేర్కొంది. భారత్ నుంచి మొబైల్స్ ఎగుమతులు ఈ నెల తొలివారాని కల్లా 5.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 42,000 కోట్లు) చేరాయని ఐసీఈఏ వివరించింది. 2020–21 ఆఖరు నాటికి నమోదైన 3.16 బిలియన్ డాలర్లతో పోలిస్తే (దాదాపు రూ. 24,000 కోట్లు) ఇది 75 శాతం అధికమని పేర్కొంది. ‘మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు దాదాపు రూ. 43,500 కోట్ల స్థాయిని దాటగలవు‘ అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్లు, చిప్‌ల కొరత వంటి ఎన్నో సవాళ్లతో కుదేలైన పరిశ్రమ తిరిగి పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎక్కువగా దక్షిణాసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం.. తూర్పు యూరప్‌లోని కొన్ని దేశాలకు భారత్ నుంచి మొబైల్స్ ఎగుమతయ్యేవని మహీంద్రూ వివరించారు. అయితే, ప్రస్తుతం కంపెనీలు యూరప్, ఆసియాలోని సంపన్న మార్కెట్లను కూడా లక్ష్యంగా పెట్టుకుంటున్నాయని తెలిపారు. ‘ఈ మార్కెట్లకు ఎగుమతి చేయాలంటే అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. భారత్‌లోని తయారీ కేంద్రాలు ఇందుకు అనుగుణంగానే ఉంటున్నాయి‘ అని మహీంద్రు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీము కోసం అయిదు అంతర్జాతీయ కంపెనీలు (శాంసంగ్, ఫాక్స్‌కాన్ హోన్ హాయ్, రైజింగ్ స్టార్, విస్ట్రాన్, పెగాట్రాన్‌తో పాటు దేశీ సంస్థలు లావా, భాగ్వతి (మైక్రోమ్యాక్స్), ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, యూటీఎల్ నియోలింక్స్, ఆప్టీమస్ ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఎంపికయ్యాయి. -
ఉత్పత్తి మొదలెట్టండి.. మినహాయింపులు తర్వాత చూద్దాం!
న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పన్ను మినహాయింపులు కోరుతున్న అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు కేంద్రం కీలక సూచన చేసింది. ముందుగా భారత్‌లో తయారీ మొదలుపెట్టాలని, ఆ తర్వాత మినహాయింపుల గురించి పరిశీలించవచ్చని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏ ఆటోమొబైల్ సంస్థకూ సుంకాలపరమైన మినహాయింపులు ఇవ్వడం లేదని, ఇప్పుడు టెస్లాకు గానీ ఇచ్చిన పక్షంలో భారత్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరుతోంది. ప్రస్తుతం పూర్తిగా తయారై దిగుమతయ్యే వాహనాలపై (సీబీయూ) కస్టమ్స్ సుంకాలు 60 శాతం నుంచి 100 శాతం దాకా ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను (వాహన ధర) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 40,000 డాలర్ల పైగా ఖరీదు చేసే వాహనాలపై 110 శాతం దిగుమతి సుంకాలను విధించడమనేది .. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపచేయొద్దంటూ కేంద్రాన్ని టెస్లా కోరుతోంది. కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా టారిఫ్‌ను 40 శాతానికి పరిమితం చేయాలని, 10 శాతం సామాజిక సంక్షేమ సుంకం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. -
TNR కుటుంబానికి అండగా ప్రముఖ నిర్మాణ సంస్థ
ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. టీఎన్ఆర్ మృతి పట్ల సనీ ప్రముఖులు దిగ్భ్రాంతి తెలపడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ‘ప్రముఖ సినీ జర్నలిస్ట్,యాంకర్, సినీ నటుడు టీఎన్ఆర్ ఆకస్మిక మరణవార్త విని మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. తక్షణ ఖర్చుల నిమిత్తం టీఎన్ఆర్ కుటుంబానికి రూ.1 లక్షను ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఓం శాంతి’అని నిర్మాణ సంస్థ పేర్కొంది. చదవండి: TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట -
కంగనా రనౌత్ కీలక నిర్ణయం.. ‘మణికర్ణిక’గా నామకరణం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్‌బ్రాండ్.. త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన 'మణికర్ణిక' చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా 'టికు వెడ్స్ షేరు' పేరుతో సినిమా తీయబోతున్నట్టు ట్వీటర్ వేదికగా కంగనా వెల్లడించింది. అలాగే తన ప్రొడక్షన్ హౌస్ లోగోను శనివారం ఆమె ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమకు ఆశీర్వదించాలని ఆమె కోరింది. ‘టికు వెడ్స్ షెరు సినిమాతో మణికర్ణిక ఫిలిమ్స్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ. కొత్త రకం వినోదాన్ని ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక, మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాము. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా భావన’’ అని కంగనా తెలిపింది. ఇదిలా ఉంటే... కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదలకు సిద్ధంగా ఉంది. Launching the logo of @ManikarnikaFP with the announcement of our debut in digital space with a quirky love story Tiku weds Sheru .... Need your blessings 🙏 pic.twitter.com/ulaMK62m7l — Kangana Ranaut (@KanganaTeam) May 1, 2021 -
నిర్మాతగా మారిన రవితేజ!
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన జాబితాలో మాస్ మహారాజ రవితేజ ముందు వరుసలో ఉంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, సెకండ్ హీరో నుంచి ప్రధాన హీరో స్థాయికి ఎదిగాడు. మాస్ పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ఈ మధ్యే క్రాక్‌తో క్రాకింగ్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం 'ఖిలాడీ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నిర్మాతగా మారినట్లు ఫిల్మీ దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను వెలికి తీయడంతో పాటు చిన్న, మధ్య తరహా బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాడట. అందులో భాగంగా ఆర్టీ వర్క్స్ పేరిట రవితేజ తన బ్యానర్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా రవితేజ ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇతడి సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్, యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 28న విడుదల కానుంది. చదవండి: బర్త్‌డే స్పెషల్: రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలు ఓటీటీ: భారీ రేటు పలికిన క్రాక్! -
ప్రతిభను ప్రోత్సహించడానికి..
నాగశౌర్య హీరోగా ‘ఛలో’, ‘అశ్వద్ధామ’ లాంటి సినిమాలను నిర్మించిన ఐరా క్రియేషన్స్ సంస్థ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఆలోచనతో శనివారం హైదరాబాద్‌లో ‘ఐరా సినిమాస్’ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బేనర్‌పై రూపొందనున్న తొలి చిత్రానికి సన్నీ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తారు. నవంబర్ 9న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత ఉషా శంకర్‌ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శనివారం పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఐరా సినిమాస్ పతాకంపై నిర్మిస్తాం. నూతన దర్శకుడు సన్నీ ఈ చిత్రాన్ని థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. నటుడు, ఏఎన్పి మీడియా హౌస్ అధినేత అభినవ్ సర్దార్ ఈ చిత్రానికి సహనిర్మాత’’ అన్నారు. -
అది నిజం కాదు బ్రదర్
ఓ నెటిజన్ వ్యంగ్య వ్యాఖ్యకు హీరో రానా అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అసలేం జరిగిందంటే... ‘‘నేను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. అయినా ఆ ఫలితం నా కలలను నేరవేర్చుకునే ప్రక్రియను నిరుత్సాహపరచలేదు’’ అని రానా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ హెడ్‌లైన్‌ను ట్వీటర్లో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. ‘ఎందుకంటే మా కుటుంబానికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఉంది’ (రానాను ఉద్దేశిస్తూ) అంటూ వ్యంగ్య ధోరణిలో ఓ కామెంట్‌ని ఆ పోస్ట్‌కు జోడించాడు నెటిజన్. ఈ కామెంట్‌కు హీరో రానా తనదైన శైలిలో బదులు చెప్పారు. ‘‘నువ్వు చెప్పింది నిజం కాదు బ్రదర్. నువ్వు నటన అనే కళను నేర్చుకోకపోతే నిర్మాణ సంస్థ ఉన్నా ఏ ఉపయోగం ఉండదు. మంచి కథలను ప్రేక్షకుల మందుకు తీసుకువెళ్లడానికి చాలా నిర్మాణ సంస్థలు పని చేస్తున్నాయి’’ అంటూ, ‘నువ్వు ఒక ఫెయిల్యూర్వి అని ప్రపంచం అంతా అంటున్నా నీ కలలను వెంటాడు’ అని కూడా సూచించారు రానా. ఏప్రిల్ 2న అరణ్య: రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’. తమిళంలో ‘కాడన్’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్స్‌ను పెట్టారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. -
మరోసారి?
హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళిది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీళ్ల కలయికలో వచ్చిన ‘ఛత్రపతి’ పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్‌కి ప్యాన్ ఇండియా పాపులారిటీ తెచ్చిపెట్టింది. కలెక్షన్లు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి కొత్త మార్కెట్లు చూపెట్టింది. కాగా, మరోసారి ప్రభాస్– రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. వారిద్దరూ కలసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనే ఉద్దేశంలో ఉన్నారని సమాచారం. ఆ నిర్మాణ సంస్థలో తొలి సినిమా వీళ్ల కాంబినేషన్లోనే చేయాలనుకుంటున్నార ట. ఈసారి పక్కా కమర్షియల్ సినిమా చేయాలనుకుంటున్నారనీ, 2021 చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందనే వార్త ప్రచారంలో ఉంది. -
కొత్త అడుగులు?
మహేశ్‌బాబు, రామ్‌చరణ్, రానా, నాని.. ఇలా టాలీవుడ్లో కొందరు హీరోలు నిర్మాతలుగా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో అడుగులు వేయాలనుకుంటున్నారట ఎన్టీఆర్. ప్రస్తుతం ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారట ఎన్టీఆర్. కొత్త ఏడాదిలో ఈ విషయంపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నది తాజా సమాచారం. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్ మరో హీరో. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
ఉత్పత్తి సంస్థలతో రెట్టింపు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం పిలుపునకు అనుగుణంగా రైతు ఉత్పత్తి సంస్థలు ప్రోత్సహించేందుకు ఎస్‌ఎఫ్‌ఏసీ, ఫిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమని వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతు సమస్యల పరిష్కారానికి రైతు ఉత్పత్తి కేంద్రాలు(ఎఫ్‌పీవో)లు ఉపయోగపడతాయన్నారు. ఫ్యాప్సీ భవన్లో శుక్రవారం ఫిక్కీ , ఏపీఈడీఏ సహకారంతో నిర్వహించిన ‘రెట్టింపు ఆదా యం కోసం రైతు ఉత్పత్తుల సంస్థలు’అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2017–18లో భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషించిందని, దేశ జనాభాలో 55% ప్రజలకు వ్యవసాయం ఉపాధి అవకాశం కల్పిస్తోందన్నారు. చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులను రైతు ఉత్పత్తి సంస్థలు ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేయడం వలన ఆర్థికంగా మరింత లబ్ధి పొందుతారన్నారు. 2019 ఆగస్టు 31 నాటికి 8.82 లక్షల మంది రైతులను రైతు ఉత్పత్తి సంస్థల్లో సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 7.56 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులను గుర్తించి 44,467 ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ (ఎఫ్ఐసీ)లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కామతాన్ ఫార్క్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, సీఈవో ప్రవేశ్ శర్మ, ఎస్‌ఎఫ్‌ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ నీల్కమల్ దర్బారి, ఎస్‌ఎఫ్‌ఏసీ టీం లీడర్ రాకేశ్ శుక్లా, రైతు ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ బొగ్గు దిగుమతిని నియంత్రించాలి
రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి ఐఎన్టీయూసీ {పధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్ గోదావరిఖని : సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే విదేశాల నుంచి వచ్చే పెట్‌కోక్ బొగ్గు దిగుమతిని నియంత్రించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు, కోల్‌ఇండియాకు లేఖ రాయాలని ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్ కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి టన్నుకు రూ.2,700 ధర పలికే బొగ్గు అధికంగా దిగుమతి అవుతున్నా కేంద్రప్రభుత్వం కానీ, కోల్ఇండియా గానీ అడ్డుకోలేకపోతున్నాయని ఆరోపించారు. దీని వల్ల సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 70 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. గత నాలుగు నెలలుగా పెట్‌కోక్ బొగ్గును సిమెంట్, ఇతర ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయని, దీనివల్ల కాలుష్యం కూడా అధికంగానే వస్తోందని, అయినా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు కానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బొగ్గు కొనుగోలు చేసిన తెలంగాణ, ఏపీ, మహా జెన్కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ సంస్థలు సింగరేణికి డబ్బులు ఇవ్వడం లేదని, మరోవైపు విదేశీ బొగ్గుతో సంస్థకు గడ్డు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీని కోరినట్టు చెప్పారు. నాయకులు బడికెల రాజలింగం, కుమారస్వామి, పి.ధర్మపురి, రవికుమార్, లక్ష్మణ్‌బాబు, వెంకటేశ్వర్లు, శేఖర్, కుమార్, ప్రసన్న, యుగంధర్, పోచం తదితరులు ఉన్నారు. -
వెలుగులేని జీవితాలు
దయనీయ స్థితిలో డిస్మిస్డ్ కార్మికుల కుటుంబాలు నాగాల పేరుతో తొలగించిన సింగరేణి సంవత్సరాల తరబడి నిత్య నరకం సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆశలు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అప్పటి ప్రభుత్వం, యాజమాన్యం కలిసి తీసుకున్న ఒక నిర్ణయం వేలాది మంది కార్మికుల జీవితాలను ఛిద్రం చేసింది. అది ఎంతగా అంటే.. వారు తరతరాలు కోలుకోలేనంతగా దెబ్బతీసింది. కేవలం విధులకు సక్రమంగా హాజరుకావడం లేదనే సాకుతో నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి డిస్మిస్ చేసింది. ఈ ప్రక్రియ 1993 నుంచి 2010 వరకు కొనసాగింది. సుమారు 12000 మంది రోడ్డున పడ్డారు. ఇలా కొలువు పోయిన రందితో అనారోగ్యం పాలై కొందరు తనువు చాలించారు. మరి కొందరు కనీసం తిండిగింజలు కూడా దొరక్క ఆకలి చావులకు గురయ్యారు. మరి కొందరు ప్రాణాలతో మిగిలి ఉన్నా దీనమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొలువుతోపాటు ఇంటి పెద్దనూ కోల్పోయిన కుటుంబాల సభ్యులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఏ తప్పూ చేయకుండానే ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ ఏనాటికైనా న్యాయం చేస్తుందనే నమ్మకంతో వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసానే నేడు వారిని బతికిస్తోంది. ఈ సందర్భంగా ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన పలువురు డిస్మిస్డ్ కార్మికుల కుటుంబ సభ్యులు తమ గోసను ‘సాక్షి’తో చెప్పుకున్నారు. - మందమర్రి(ఆదిలాబాద్) అప్పుచేసి పిల్లల పెండ్లి చేసిన నా పెనిమిటి కాంపెల్లి రాజిరెడ్డి మందమర్రి కేకే-5 గనిలో టింబర్‌మెన్‌గా పనిచే సిండు. కాళ్ల నొప్పులు, ఛాతినొప్పులతోని డ్యూటీకి సక్కగ పోలేదు. 1999లో నాగాలు ఎక్కువైనయని డిస్మిస్ చేసిండ్లు. అప్పటి వరకు ఏ లోటు లేకుంట బతిక మాకు కష్టాలు మొదలైనయి. ఆ బాధలతోనే ఆయన 2002లో చనిపోయిండు. కూలి పనుల కు పొయ్యి ఐదుగురు పిల్లలను సాదు కుంటాన. అప్పులు చేసి ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లి చేసిన. అప్పులు తీరక నానా తంటాలు పడుతున్న. - కాంపెల్లి కనకమ్మ, ఎర్రగుంటపల్లె బడికి పంపే స్థోమత లేక.. మా ఆయన చెన్నూర్-1 ఇన్క్లైన్లో పనిచేసిండు. గ్యాస్, దుమ్ముకు తట్టుకోలేక డ్యూటీకి నాగాలు పెట్టేది. సింగరేణోళ్లు 2002 సంవత్సరం నాగాలు ఎక్కువ చేత్తాండని డిస్మిస్ చేసిండ్లు. రెండేండ్లు కూలి పనులు చేసి మమ్ములను సాదిండు. 2004ల ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయిండు. పెద్దదిక్కును కోల్పోవడం తో ముగ్గురు పిల్లలను చదివించే స్థోమత లేక నాతో పాటే కూలి పనికి తీసుకపోయి వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటానం. - మల్లెత్తుల సత్తమ్మ, భీమారం చేతిలో చిల్లిగవ్వ లేదు మా ఆయన గోలేటి-2లో మైనింగ్ సర్దార్‌గా పనిచేసిండు. కొన్నేండ్ల కింద బాయిపని చేయబట్టి అనారోగ్యానికి గురికావడంతో డ్యూటీకి సక్రమంగా పోలేదు. దీంతో 1998 సంవత్సరంల సింగరేణి సార్లు గైర్హాజరైతాండని పెనిమిటిని బాయి నౌకరి నుంచి తీసేండ్లు. కూలి నాలి చేసి మమ్ములను సాదిండు. పూట పూటకూ ఇబ్బందులే. ఎట్ల బతకాలనే రంది పెట్టుకున్నడు. దాంతోనే ఆయన 2002లో పానమిడిసిండు. అప్పటి నుంచి నేను.. ముగ్గురు పిల్లలు.. పడరాని కష్టాలు పడుతున్నం. రోజు గడవడమే కష్టంగా ఉంది. పిల్లలు పెండ్లికి ఎదిగిండ్లు. చేతిలో చిల్లి గవ్వ లేదు. - ఎలికటి మరియ, గోలేటి కూలి పనికిపోయి బతుకుతానం నా భర్త పొట్ట రాములు కాసిపేట గనిలో కోల్ ఫిల్లర్‌గా పనిచేసేది. పానం బాగలేక నౌకరికి నాగాలు పెడితే 2000 సంవత్సరంల కంపెనీ డిస్మిస్ చేసింది. గప్పటి నుంచి జీతం లేదు. ఐదుగురు పిల్లలను సాదలేక రందితోని మంచం పట్టి 2005లో చనిపోయిండు. కూలి పనులు చేసుకుంట పిల్లలను బతికించుకుంటాన. - పొట్ట లక్ష్మి, మందమర్రి అందరికీ న్యాయం చేయాలి గైర్హాజర్ పేరుతో డిస్మిస్ చేసిన కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగం ఇవ్వాలి. వృద్ధాప్యానికి చేరిన వారితోపాటు మృతి చెందిన డిస్మిస్డ్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కంపెనీ ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలి. డిస్మిస్డ్ కార్మికులకు న్యాయం చేయాలని 12 ఏళ్లుగా ఎన్నో ఆందోళనలు, దీక్షలు చేస్తూనే ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తమ సమస్యను సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిస్మిస్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నం. - బీదబోయిన రవీందర్, డిస్మిస్డ్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
ఉత్పత్తికి ఊతం
ఈ ఏడాదిలో తొమ్మిది కొత్త ప్రాజెక్టులు లక్ష్యం 64.5 లక్షల టన్నుల ఉత్పత్తి కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నూతన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి నూతన గనుల ద్వారా సుమారు 64.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ విస్తరించి ఉన్న 11 ఏరియాల్లో 16 ఓపెన్‌కాస్టులు, 30 భూగర్భగనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. నూతన గనుల ఏర్పాటుతో 2016-17 వార్షిక ఉత్పత్తి లక్ష్యం 66 మిలియన్ టన్నులు చేరుకోవడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. బెల్లంపల్లి ఓసీ-2 గని గ్రౌండింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యూరుు. ఈనెలలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ గని ద్వారా ప్రతి ఏడాది 10 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయడమే లక్ష్యం. కాసిపేట-2 ఇన్‌క్లైన్ గని గ్రౌండింగ్ పను లు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశాలున్నాయి. ఏడాదికి 4.70 లక్షల టన్నుల ఉత్పత్తి తీయూలని అంచనా.కేఓసీ పిట్-1 గని గ్రౌండింగ్ పనులు ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమై ఆగస్టు నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలు కానుంది. ఈ గని నుంచి ఏటా 30 లక్షల టన్నులు లక్ష్యం. ఈ ఏడాది మాత్రం 25 లక్షల టన్నులు తీయనున్నారు. శాంతిఖనిలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ఈ ఏడాది జూన్ నెలలో ప్రవేశపెట్టి ఏటా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. జేవీఆర్ ఓసీ-2 గనిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రౌండింగ్ ప్రారంభించి అక్టోబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఏడాదికి 40 లక్షల టన్ను లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది 15 లక్షల టన్నుల ఉత్పత్తి నిర్దేశించారు.మణుగూరు ఓపెన్‌కాస్టును నవంబర్‌లో ప్రారంభించి ఈ ఏడాది 5 లక్షల టన్ను లు బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఏటా 15 లక్షల టన్నులు లక్ష్యం. కేటీకే ఓసీ-2 గని గ్రౌండింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఏటా 12.50 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం. ఈ ఏడాది 2 లక్షల టన్నులు వెలికితీయనున్నారు. పీవీకే కంటిన్యూయస్ మైనర్ యంత్రా న్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి 2లక్షల టన్నులు ఉత్పత్తి చేయనున్నారు.కేకేకే ఓసీ ప్రాజెక్టును వచ్చే మార్చిలో ప్రారంభించి 3.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఈ కొత్త గనుల అసలు లక్ష్యం 138.2 లక్షల టన్నులు. నిర్దేశించిన సమయాల్లో ప్రారంభమైతే ఈ ఏడాది 64.5 లక్షల టన్నుల బొగ్గు అదనంగా కంపెనీకి సమకూరుతుంది. వచ్చే ఏడాది నుంచి 138.2 లక్షల టన్నులు వస్తుంది. -
జైపూర్‌లో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం
మొదటి ప్లాంటు ద్వారా 587 మెగావాట్లు గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు సరఫరా మే చివరికల్లా 1,200 మెగావాట్ల ఉత్పత్తి జైపూర్: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో చేపట్టిన 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులోని యూనిట్-1(600 మెగావాట్లు)లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ మొదటి యూనిట్ ప్లాంటును సింక్రనైజేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. సింగరేణి, బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో, ఎన్టీపీసీ ఉన్నతాధికారుల నేతృత్వంలో కీలకమైన సింక్రనైజేషన్ ప్రక్రియ కొనసాగింది. మొదటి యూనిట్ బాయిలర్‌లో టర్బైన్, జనరేటర్(టీజీ)వద్ద సీఎండీ శ్రీధర్ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం సీసీఆర్ కంట్రోల్‌రూం వద్ద కంప్యూటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివిధ భాగాలు, యంత్రాల సమూహాన్ని అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. మొదటిరోజు యూనిట్-1 ప్లాంట్ ఒక నుంచి ప్రారంభమై 587 మెగావాట్ల ఉత్పత్తిని సాధించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను 400 కేవీ స్విచ్ యార్డు ద్వారా గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు వెళ్లింది. కేసీఆర్ చేతులమీదుగా జాతికి అంకితం.. జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మేలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా జాతికి అంకితం చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ కేంద్రంలోని రెండో యూనిట్‌ను వచ్చేనెలలో సింక్రనైజేషన్ చేసి.. మే వరకు సీవోడీ చేస్తామని, తద్వారా 1,200 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ఆయన వివరించారు. యూనిట్-1 సింక్రనైజేషన్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లను ఆరేళ్లలో సింక్రనైజేషన్ చేస్తే.. సింగరేణి సంస్థ పవర్‌ప్లాంటులో నాలుగేళ్లలోనే విజయవంతంగా సింక్రనైజేషన్ చేశామని చెప్పారు. జైపూర్ ప్లాంటు ద్వారా వచ్చే రెండు నెలల్లో పూర్తిస్థాయిలో 1,200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని, దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ, వాణిజ్య, గృహాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలి పారు. ప్లాంటు నిర్వహణ జర్మనీకి చెందిన స్టిగ్ కంపెనీకి అప్పగించామని తెలిపారు. భూనిర్వాసితులకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్లు రమేశ్‌బాబు(ఈ అండ్ ఎం), మనోహర్‌రావు(పీపీ), పవిత్రన్‌కుమార్(ఫైనాన్స్), ఈడీ సంజయ్కుమార్సూర్, జీఎంలు సుధాకర్‌రెడ్డి, మురళీకృష్ణ, సుభానీ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు, ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి సీతారామయ్య, హెచ్ఎంఎస్ ప్రధానకార్యదర్శి రియాజ్ అహ్మద్,వివిధ కంపెనీల అధికారులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. -
గ్రూప్-2 యథాతథం
వాయిదా వదంతులను నమ్మవద్దు: టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి అన్ని పరీక్షలు టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే యోచన టీచర్ పోస్టుల భర్తీపై ఇంకా ఇండెంట్ రాలేదని వెల్లడి ఏఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలు ఆయా శాఖలకు అందజేత హైదరాబాద్: గ్రూప్-2 రాతపరీక్షలను వచ్చే నెల 24, 25 తేదీల్లో యథాతథంగా నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ పరీక్షను వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, అభ్యర్థులందరూ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన 904 మంది అభ్యర్థుల జాబితాల (శాఖల వారీగా కేటాయించిన ఉద్యోగుల జాబితాలు)ను ఆయా శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని తెలిపారు. గ్రూప్-2 మినహా నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులన్నింటి భర్తీని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. బయోమెట్రిక్ విధానం అమలుతోపాటు కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చే స్తామన్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయాలని యోచిస్తోందని వెల్లడించారు. సింగరేణి సంస్థ కూడా తమ వద్ద ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరిందని, అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని చెప్పామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఇండెంట్ ఇంకా తమకు రాలేదని చెప్పారు. పరీక్షల్లో ఆన్లైన్ విధానం తీసుకువచ్చి పారదర్శకతకు, నిష్పక్షపాతానికి పెద్దపీట వేశామని... 2 వేల వరకు సివిల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఇలా చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ సివిల్ ఇంజనీర్ పోస్టుల రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 394.5 మార్కులతో సుంకేపల్లి సాయికిరణ్ టాపర్‌గా నిలిచారని... తరువాత స్థానంలో వరుసగా నడిపల్లి శ్రీధర్, పాలమాకుల అశ్విన్, బండి శిరీష, గుగులోతు బావుసింగ్, రూపావత్ శ్రావంత్ ఉన్నారని చక్రపాణి వెల్లడించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, రోడ్లు భవనాల శాఖలో భర్తీకి నోటిఫై చేసిన 931 పోస్టుల్లో 904 పోస్టులను భర్తీ చేశామని.. వారిలో 335 మంది మహిళ లు ఉన్నారని తెలిపారు. -
పైపులైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలి
జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టుకు షెట్పల్లి గోదావరి నుంచి ఒక టీఎంసీ నీరు తరలించేందుకు నిర్మిస్తున్న పైపులైన్ పనులకు రైతులు సహకరించాలని తహశీల్దార్ మేకల మల్లేశ్ కోరారు. షెట్పల్లి, నర్సింగాపూర్, గంగిపల్లి గ్రామ శివారులోని పొలాల నుంచి పైపులైన్ వేస్తుం డగా, భూములు కోల్పోతున్న రైతులో గురువారం అధికారులు మాట్లాడారు. షెట్పల్లి గ్రా మంలోని పులి బాపునకు చెందిన బోరు బావి, మరుగుదొడ్లు, మెడగొని రాజయ్య వ్యవసా య బావి పైపులైన్ నిర్మాణంలో పోతున్నాయని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తహశీల్దార్ మల్లేశ్, సింగరేణి సివిల్ ఎస్ఈ సత్యనారాయణ, ఎస్టేట్ అధికారి బాలసుబ్రమణ్యం బాధితులతో మాట్లాడారు. ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం చెల్లిస్తామన్నా రు. అలాగే గంగిపల్లి శివారులోని పాలమాకుల సతీశ్‌తోపాటు మరి కొంత మంది రైతుల పొలాల నుంచి పైపులైన్ నిర్మా ణం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి పైపులైన్ పనులు చేపట్టాలని వారు కోరారు. వారితో వీఆ ర్వోలు భూమన్న, భిక్షపతి ఉన్నారు.