ముచ్చటగా మూడు | Grand Opening Reddy Multiplex Movies | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడు

Apr 18 2023 12:50 AM | Updated on Apr 18 2023 12:50 AM

Grand Opening Reddy Multiplex Movies - Sakshi

విజయ్‌ రెడ్డి, మిత్ర, బాబూమోహన్‌

తెలుగు పరిశ్రమ లోకి ‘రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌ మూవీస్‌’ అనే నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో మూడు సినిమాల్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు సంస్థ అధినేత విజయ్‌ రెడ్డి. తొలి ప్రయత్నంగా ప్రసాద్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సోషల్‌ వర్కర్స్‌’ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

అలాగే మహేందర్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర ప్రధాన పాత్రలో మిత్ర మూవీస్‌ భాగస్వామ్యంతో ‘కోబలి’ని రెండో చిత్రంగా నిర్మిస్తున్నారు. మూడో మూవీగా ‘హ్యాపీ విమెన్స్‌ డే’ రూపొందనుంది. తొలి సీన్‌కి నటుడు బాబూ మోహన్‌ క్లాప్‌ కొట్టారు. విజయ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రెడ్డీస్‌ మల్టీప్లెక్స్‌ మూవీస్‌ ఆఫీసులను ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రారంభించాం. ఔత్సాహిక దర్శకులు, నూతన నటీనటులు మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement