New Movies
-
నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫెస్టివల్..
-
రిపీట్ కాంబోస్‌తో ఊరిస్తున్న త్రిష..
-
హీరో లను మించిపోయిన హీరోయిన్స్
-
వరసగా తెలుగు సినిమా కమిట్ అవుతున్న దుల్కర్..
-
శ్రీదేవి డాటర్స్ దూకుడు...!
-
తెలుగు ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్న మృణాల్..
-
విజయ్ దళపతి చివరి 2 సినిమాలు ఇవే !
-
కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి
కొడితే కొట్టాలి రా కప్పు కొట్టాలి అనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు క్రికెటర్లు. క్రికెట్ వరల్డ్ కప్ హంగామా మొదలైపోయింది. ఇటు సిల్వర్ స్క్రీన్ క్రికెట్ కూడా రెడీ అవుతోంది. కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి అంటూ కొందరు స్టార్స్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో డాన్ ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ క్రికెట్ గ్రౌండ్లోకి దిగాడు. ఏం చేశాడనేది వచ్చే ఏడాది వెండితెరపై చూడాలి. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ క్రికెటర్స్‌గా నటించగా, ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా రజనీ నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170వ చిత్రం ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ కీలక పాత్రల్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ముత్తయ్య 800 లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోముత్తయ్య మురళీధరన్‌గా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. మురళీధరన్ భార్య మది మలర్ పాత్రను మహిమా నంబియార్ పోషించారు. ఈ సినిమాలో తన క్రికెట్ లైఫ్ గురించి 20 శాతం ఉంటే, తన జీవితంలోని ఆసక్తికర సంఘటనలు 80 శాతం ఉంటాయని మురళీధరన్ ఇటీవల పేర్కొన్నారు. అలాగే మురళీధరన్గారిలా నటించేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆయన అన్ని వీడియోలను చూశానని, తీవ్రంగా బౌలింగ్ సాధన చేశానని, మేకప్ కోసమే మూడు గంటలు పట్టేదనీ మధుర్ మిట్టల్ తెలిపారు. అంతేకాదు.. కొన్నాళ్ల క్రితం తనకు యాక్సిడెంట్ జరగడం వల్ల తన ఎల్బో కూడా ముత్తయ్య తరహాలోకే వచ్చిందనీ మధుర్ మిట్టల్ చెప్పుకొచ్చారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ది టెస్ట్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో తమిళంలో ‘టెస్ట్’ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్ చేస్తుండగా, నిర్మాత శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ పోస్టర్‌ను బట్టి ఈ సినిమా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్లలో ఎవరు క్రికెటర్స్‌గా కనిపిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. చక్దా ఎక్స్‌ప్రెస్ దాదాపు రెండు దశాబ్దాల పాటు హిట్ క్రికెట్ ఆడారు జులన్ గోస్వామి. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. జులన్గా అనుష్కా శర్మ నటించారు. నాలుగేళ్ల తర్వాత అనుష్కా శర్మ నటించిన చిత్రం ఇదే. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుందట. క్రికెటర్ మహి జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’. రాజ్‌కుమార్ రావు మరో లీడ్ రోల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం క్రికెట్లో ఆరు నెలల పాటు జాన్వీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. అయితే ఈ సోమవారం వినాయక చవితి. కాబట్టి అందరూ భక్తి మోడ్ పాటిస్తూ ఉంటారు. మరోవైపు కాస్త విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి కుదిరితే ఏదైనా కొత్త సినిమా చూద్దామని అనుకుంటూ ఉంటారు. అలాంటి మూవీ లవర్స్ కోసమా అన్నట్లు ఈ వారం (సెప్టెంబరు 18 నుంచి 24 వరకు) దాదాపు 20 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 14వరోజు హైలైట్స్.. వెళ్తూ వెళ్తూ షకీలా ఏడిపించేసింది!) గతవారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నంబర్ తగ్గింది. అయితే పలు స్ట్రెయిట్ మూవీస్, వెబ్ సిరీసులు కొన్ని ఆసక్తి కలిగిస్తున్నాయి. 'అతిథి' వెబ్ సిరీస్‌తోపాటు జానే జాన్, కింగ్ ఆఫ్ కొత్త, ఫాస్ట్ ఎక్స్ సినిమాలు.. కాస్త చెప్పుకోదగ్గ చిత్రాలని చెప్పొచ్చు. వీటితో పాటు మెగ్ 2 సినిమా కూడా కుదిరితే ప్రయత్నించొచ్చు. సరే అదంతా పక్కనబెడితే ఈ వారం ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (సెప్టెంబరు 18 -24 మధ్య) నెట్‌ఫ్లిక్స్ ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19 లవ్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 20 జానే జాన్ (హిందీ చిత్రం) - సెప్టెంబరు 21 కెంగన్ అసుర సీజన్ 2 (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 21 సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) - సెప్టెంబరు 21 సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 21 హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 22 లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 22 సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 22 స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22 అమెజాన్ ప్రైమ్ కసండ్రో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22 ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్విక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22 హాట్‌స్టార్ అతిథి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19 దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 20 కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 22 నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 22 ద కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 23 జియో సినిమా ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18 బుక్ మై షో మెగ్ 2: ద ట్రెంచ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18 ఆపిల్ ప్లస్ టీవీ స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22 (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) -
మహేష్ తో ప్రభాస్ ఫైట్
-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు
సోమవారం వస్తే చాలు ఆఫీస్, స్కూల్, కాలేజీలకు వెళ్లేవాళ్లు.. అబ్బ సోమవారం అప్పుడే వచ్చేసిందా అని ఫీలవుతారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఏమేం కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఏం చూడాలి అని తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. అయితే థియేటర్లో ఈ వారం 'మార్క్ ఆంటోని', 'చాంగురే బంగారురాజ' తప్ప వేరే చిత్రాలు ఏం రిలీజ్ కావట్లేదు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఏడోరోజు హైలైట్స్.. హౌసులో ఫస్ట్ ఎలిమినేషన్.. షకీలా కన్నీళ్లు) మరోవైపు ఈ వారం ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో భోళా శంకర్, రామబాణం, అనీతి, మాయపేటిక, బార్బీ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'కాలా', 'బంబై మేరీ జాన్' వెబ్ సిరీస్‌లు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ రేపుతున్నాయి. ఇంతకీ ఈ వీక్ ఏయే మూవీస్.. ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ (సెప్టెంబరు 11- సెప్టెంబరు 17) నెట్‌ఫ్లిక్స్ వైఫ్ లైక్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 11 క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 13 రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ (డానిష్ సినిమా) - సెప్టెంబరు 14 వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ మూవీ) - సెప్టెంబరు 14 రామబాణం (తెలుగు సినిమా) - సెప్టెంబరు 14 భోళా శంకర్ (తెలుగు చిత్రం) - సెప్టెంబరు 15 ఎల్ కొండే (స్పానిష్ మూవీ) - సెప్టెంబరు 15 ఇన్సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15 మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 ద క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) - సెప్టెంబరు 15 అమెజాన్ ప్రైమ్ కెల్సీ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12 ద కిడ్నాపింగ్ డే (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 13 బంబై మేరీ జాన్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 14 ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 వైల్డర్నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 15 ఆహా మాయపేటిక (తెలుగు సినిమా) - సెప్టెంబరు 15 హాట్‌స్టార్ ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 ఎలిమెంటల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 13 హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 13 కాలా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 15 ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15 ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 సోనీ లివ్ జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ చిత్రం) - సెప్టెంబరు 15 బుక్ మై షో బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 12 ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 15 సైనా ప్లే పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 14 ఈ-విన్ దిల్ సే (తెలుగు సినిమా) - సెప్టెంబరు 16 (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) -
రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ..
సినిమా సెట్ అనుకున్నప్పుడే చూచాయగా రిలీజ్ డేట్ కూడా సెట్ చేస్తుంటారు మేకర్స్. అలా కాకపోయినా షూటింగ్ సగం పూర్తయ్యాక సెట్ చేస్తారు. వన్ ఫైన్ డే ఆ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తారు. కానీ.. సెట్ చేసిన డేట్‌కి కొన్ని సినిమాలు విడుదల కాకపోవచ్చు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. అలా ప్రస్తుతం అరడజను చిత్రాల దాకా వాయిదా పడ్డాయి. ఏ సినిమా కారణం ఆ సినిమాది. ఇక అనుకున్న డేట్‌కి రాకుండా కొత్త డేట్ సెట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ‘సలార్’లో ప్రభాస్ ∙ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రభాస్ ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి పండగే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ‘సలార్’ రిలీజ్ వాయిదాపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేదానిపై పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముందుగా అనుకున్నట్లు ఈ నెల 28న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ‘స్కంద’లో రామ్, శ్రీలీల రామ్ పోతినేని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’ కూడా ముందు అనుకున్న తేదీకి కాకుండా వేరే తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 15న కాకుండా 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘చంద్ర ముఖి–2’లో కంగన రజనీకాంత్ హీరోగా జ్యోతిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’ (2005). పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తీశారు. అయితే సీక్వెల్లో హీరో, హీరోయిన్ మారారు. రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 15న కాకుండా 28న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్లే విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ‘చంద్రముఖి 2’ని తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. ‘ఆదికేశవ’లో వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు.. చేయలేదు. ఆ తర్వాత ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత అది కూడా వాయిదా పడి చివరికి నవంబర్ 10వ తేదీకి ఫిక్స్ అయింది. ఫారిన్లో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే విడుదల వాయిదా వేస్తున్నట్లు ‘ఆదికేశవ’ చిత్రబృందం ప్రకటించింది. ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రానికి డైరెక్టర్, హీరోయిన్ మారారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. ‘డీజే టిల్లు’ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీని కూడా ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడింది. ‘‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. ‘పెద కాపు’లో విరాట్ కర్ణ ∙‘నారప్ప’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు–1’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించినా, వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేదానిపై తాజాగా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 29న ‘పెదకాపు –1’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు
మరో వీకెండ్‌కి అంతా రెడీ అయిపోయింది. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి', 'జవాన్' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఓటీటీలోనూ.. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రజనీకాంత్ 'జైలర్' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' Day-3 హైలైట్స్.. టాస్క్‌లో గెలిచిన ఇద్దరు!) అయితే 'జైలర్' మూవీ ఒక్కటి మాత్రమే ఆసక్తికరంగా ఉందంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'హడ్డీ' అనే హిందీ చిత్రం, 'లవ్' అనే తమిళ చిత్రం కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‌గా 22 కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఆయా సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. దిగువన 'స్ట్రీమింగ్ అవుతున్నాయి', 'ఇప్పటికే స్ట్రీమింగ్' అని ఉన్నావి గురువారం రిలీజైపోయినట్లు అర్థం. ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ ఏ టైమ్ కాల్డ్ యూ - కొరియన్ సిరీస్ బర్నింగ్ బాడీ - స్పానిష్ సిరీస్ రోజా పెరల్స్ టేప్స్ - స్పానిష్ సినిమా సెల్లింగ్ ద ఓసీ: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ స్పై వూప్స్ - ఇంగ్లీష్ సిరీస్ డియర్ చైల్డ్ - జర్మన్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) గామేరా రీ బర్త్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) కుంగ్ ఫూ పాండ: ద డ్రాగన్ నైట్ సీజన్ 3 -ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) టాప్ బాయ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) వాట్ ఇఫ్ - ఇంగ్లీష్ సినిమా - తగలాగ్ సినిమా (స్ట్రీమింగ్) అమెజాన్ ప్రైమ్ సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ - ఇంగ్లీష్ మూవీ జైలర్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) క్యారీ ఆన్ జెట్టా - పంజాబీ చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్) జీ5 హడ్డీ - హిందీ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్) ఆహా లవ్ - తమిళ సినిమా ఫ్యామిలీ ధమాకా - తెలుగు రియాలిటీ షో జియో సినిమా యే హై ప్లానెట్ ఇండియా - హిందీ డాక్యుమెంటరీ సోనీ లివ్ లొక్కీ చెహ్లే - బెంగాలీ సినిమా టెన్ పౌండ్స్ పొమ్స్ - ఇంగ్లీష్ సిరీస్ బుక్ మై షో లవ్ ఆన్ ద రోడ్ - ఇంగ్లీష్ మూవీ లయన్స్ గేట్ ప్లే ద బ్లాక్ డీమన్ - ఇంగ్లీష్ చిత్రం ఆపిల్ ప్లస్ టీవీ ద ఛేంజ్లింగ్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?) -
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అందరూ తమ తమ హడావుడిలో పడిపోతారు. ఇకపోతే ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ-సమంత 'ఖుషి' సినిమా థియేటర్లలోకి రానుంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అయితే ఈ వారం ఓటీటీలో మాత్రం 22 కొత్త మూవీస్- వెబ్ సిరీస్ లు రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. 20కి పైగా సినిమాలు పలు ప్రముఖ ఓటీటీల్లో విడుదలవుతున్న వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ అయితే ఏం లేవు. డబ్బింగ్ చిత్రాలు మాత్రం రెండు ఉన్నాయి. వాటిలో 'డీడీ రిటర్న్స్' కామెడీ మూవీ కాగా, 'స్కామ్ 2003' మాత్రం ఓ మాదిరి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న వెబ్ సిరీస్. ఇంకా వీటితో పాటు లిస్టులో ఏమేం ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. (ఇదీ చదవండి: 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్) ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా నెట్‌ఫ్లిక్స్ లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 30 మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 30 చూజ్ లవ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 31 వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 31 ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) - సెప్టెంబరు 01 డిసెన్చాంట్మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01 ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 01 హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) - సెప్టెంబరు 01 లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01 ఈజ్ షీ ద ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 03 అమెజాన్ ప్రైమ్ ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01 జీ5 బియే బిబ్రాత్ (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 01 డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 01 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇండియానా జోన్స్ అండ్ ద డయిల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 29 NCT 127: ద లాస్ట్ బాయ్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 30 ద ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 01 సోనీ లివ్ స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 01 బుక్ మై షో ద అల్లేస్ (అరబిక్ సినిమా) - సెప్టెంబరు 01 హెచ్ఆర్ ఓటీటీ నీరజ (మలయాళ సినిమా) - ఆగస్టు 28 లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళ చిత్రం) - ఆగస్టు 29 నానుమ్ పిన్నోరు నానుమ్ (మలయాళ మూవీ) - ఆగస్టు 30 వివాహ ఆహ్వానం (మలయాళ సినిమా) - సెప్టెంబరు 02 -
మెగా హీరోస్ కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ..!
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. బయట అడుగుపెట్టే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు. మంచిగా తిని పడుకుంటారు. బోర్ కొడితే కొత్తగా వచ్చిన సినిమా లేదంటే వెబ్ సిరీస్ చూస్తారు. అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్(జూలై 27) బోలెడన్ని కొత్త మూవీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. వాటిలో 'సామజవరగమన', 'స్పై', 'నాయకుడు' లాంటి చిత్రాలతో పాటు పలు సిరీసులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) శుక్రవారం(జూలై 28) రిలీజయ్యే సినిమాలు-సిరీసులు అమెజాన్ ప్రైమ్ ద ఫ్లాష్ - ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్పై - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఏ ఫెర్ఫెక్ట్ స్టోరీ - స్పానిష్ వెబ్ సిరీస్ కెప్టెన్ ఫాల్ - ఇంగ్లీష్ సిరీస్ D.P. సీజన్ 2 - కొరియన్ సిరీస్ హిడ్డెన్ స్ట్రైక్ - ఇంగ్లీష్ సినిమా హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ - ఇంగ్లీష్ సిరీస్ మిరాక్యూలస్: లేడీ బగ్ & క్యాట్ నోయిర్, ద మూవీ - ఫ్రెంచ్ మూవీ ద టైలర్ సీజన్ 2 - టర్కిష్ సిరీస్ ద విచర్ సీజన్ 3: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నాయకుడు - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లేడీ ఆఫ్ సైలెన్స్: ద మటవిటస్ మర్డర్స్ - స్పానిష్ మూవీ (స్ట్రీమింగ్) ప్యారడైజ్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది) టుడే వుయ్ ఆల్ టాక్ అబౌట్ ద డే - ఇండోనేసియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద మర్డరర్ - థాయ్ మూవీ (స్ట్రీమింగ్) హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా సామజవరగమన - తెలుగు సినిమా ఈ-విన్ పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్ - తెలుగు సినిమా జియో సినిమా వన్ ఫ్రైడే నైట్ - హిందీ సినిమా అప్పత - తమిళ చిత్రం కాల్‌కూట్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్ ట్విస్టెడ్ మెటల్ - ఇంగ్లీష్ సిరీస్ మనోరమ మ్యాక్స్ కొళ్ల - మలయాళ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే) -
పాన్ ఇండియా సినిమాలకు షాక్ ఇస్తున్న చిన్న సినిమాలు
-
ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో బయటకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మరేం చేయాలి. ఇంట్లోనే కూర్చుని చిల్ అవ్వాలి. అలా కావాలంటే ఎంటర్ టైన్మెంట్ ఉండాలి. కట్ చేస్తే ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. వీటిలో 'అశ్విన్స్', 'ధూమమ్' చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?) ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్ నెట్‌ఫ్లిక్స్ దే క్లోన్డ్ టైరోన్ - ఇంగ్లీష్ చిత్రం స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అశ్విన్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) రేవన్ సాంగ్ - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ ధూమమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా బవాల్ - హిందీ మూవీ అన్‌స్టాపబుల్ - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్) గాయ్ రిచ్చీస్ ద కోవనెంట్ - ఇంగ్లీష్ సినిమా ఆహా నచ్చింది గర్ల్‌ఫ్రెండూ - తెలుగు సినిమా నేను సూపర్ ఉమెన్ - బిజినెస్ రియాలిటీ షో జీ5 మౌరా - పంజాబీ చిత్రం జియో సినిమా ట్రయల్ పీరియడ్ - హిందీ మూవీ చాంద్ లో - గుజరాతీ సినిమా- జూలై 22 స్పెషల్ ఊప్స్: లయనెస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 23 దో గుబ్బారే - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్
Tomorrow OTT Movies: ఓటీటీ మూవీ ప్రేమికులారా.. రెడీ అయిపోండమ్మా! వచ్చేస్తున్నాయ్ వచ్చేస్తున్నాయ్.. మీకోసం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. శుక్రవారం అనగా జూలై 14న ఒక్కరోజే దాదాపు 19 వరకు విడుదలవుతున్నాయి. ఇందులో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ మూవీస్-సిరీస్‌లు చాలా ఉన్నాయి. కాబట్టి లేట్ చేయకుండా ఏయే సినిమాలు వస్తున్నాయో లిస్ట్ చూసేయండి. ఏ టైమ్‌లో ఏది చూడాలో ప్లాన్ చేసుకోండి. వీకెండ్‌ని ఫెర్ఫెక్ట్గా ఎంజాయ్ చేసేయండి. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!) శుక్రవారం(జూలై 14) ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ అమెజాన్ ప్రైమ్ తండాట్టి - తెలుగు డబ్బింగ్ సినిమా ద సమ్మర్ ఐ టర్నెడ్ ప్రెట్టీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ హాస్టల్ డేస్ - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ బర్డ్ బాక్స్ బార్సిలోనా - ఇంగ్లీష్ సినిమా లవ్ టాక్టిక్ట్స్ 2 - టర్కిష్ మూవీ టూ హాట్ టూ హ్యాండిల్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ కోహ్రా - హిందీ చిత్రం - జూన్ 15 సోనిక్ ప్రైమ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) డెవిల్స్ అడ్వకేట్ - అరబిక్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) బర్న్ ద హౌస్ డౌన్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్) సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) కింగ్ ద ల్యాండ్ - కొరియన్ సిరీస్ (స్ట్రీమింగ్) ఆహా నేను స్టూడెంట్ సర్ - తెలుగు సినిమా మెన్ టూ - తమిళ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద ట్రయల్ - హిందీ సిరీస్ సోనీ లివ్ కాలేజ్ రొమాన్స్ సీజన్ 4 - హిందీ సిరీస్ జియో సినిమా ఇష్క్ ఈ నదాన్ - హిందీ సినిమా జీ5 మాయాబజార్ ఫర్ సేల్ - తెలుగు సిరీస్ ఎస్టేట్ - తమిళ సినిమా - జూన్ 16 ఆపిల్ టీవీ ప్లస్ ఫౌండేషన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ మనోరమ మ్యాక్స్ టిక్కక్కొరు ప్రేమొందరన్ - మలయాళ సినిమా (ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. తను కూడా!) -
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు
ఏదైనా సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ మీరు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా 24 కొత్త మూవీస్ విడుదలకు సిద్ధమైపోయాయి. ఈ సోమవారం చూసినప్పుడు 24 సినిమాల లిస్ట్ వచ్చింది. వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. ఇక ఈ శుక్రవారం కోసం మరికొన్ని కొత్తవి యాడ్ అయ్యాయి. దీంతో ఒక్కరోజే దాదాపు 24 చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి రానున్నాయని క్లారిటీ వచ్చేసింది. వీటిలో తెలుగు సినిమాలు చాలానే ఉండటం విశేషం. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ అమెజాన్ ప్రైమ్ అదురా - తెలుగు డబ్బింగ్ సిరీస్ ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ - ఇంగ్లీష్ సిరీస్ చక్రవ్యూహం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) స్వీట్ కారం కాఫీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్) ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ - ఫిలిప్పీన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) నెట్‌ఫ్లిక్స్ ఫేటల్ సెడక్సన్ - ఇంగ్లీష్ సిరీస్ టక్కర్ - తెలుగు సినిమా ద ఔట్ లాస్ - ఇంగ్లీష్ మూవీ ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ - ఇంగ్లీష్ చిత్రం హ్యాక్ మై హోమ్ - ఇంగ్లీష్ సిరీస్ గోల్డ్ బ్రిక్ - ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) డీప్ ఫేక్ లవ్ - పోర్చుగీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) వేక్ అప్ కార్లో - పోర్చుగీస్ సిరీస్ (స్ట్రీమింగ్) ఆహా 3:33 - తమిళ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ IB 71 - హిందీ సినిమా రుద్రమాంబపురం - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) జీ5 అర్చిర్ గ్యాలరీ - బెంగాలీ సినిమా కతర్భాషా ఎండ్ర ముత్తురామలింగం - తమిళ చిత్రం తర్లా- హిందీ మూవీ సోనీ లివ్ ఫర్హానా - తెలుగు డబ్బింగ్ మూవీ జియో సినిమా బ్లయిండ్ - హిందీ చిత్రం HR ఓటీటీ అనురాగం - మలయాళ మూవీ ముబీ రిటర్న్ టూ సియోల్ - ఇంగ్లీష్ సినిమా (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) -
విచిత్ర పరిస్థితుల్లో ఫాహద్ ఫాజిల్
-
టాలీవుడ్ కి ఆగస్టు నుంచి దసరా పండుగ
-
ఫాస్ట్ లుక్ పోస్టర్ల పై దారుణమైన ట్వీట్స్
-
అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి.. లేట్‌గా అయినా లేటెస్ట్గా
కొన్ని సినిమాలు లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంటాయి. రిలీజ్లు కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకపోవడమే ఈ వాయిదాలకు ఓ కారణం. మరో కారణం ఒకేసారి ఎక్కువ చిత్రాలు విడుదలైతే, థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడటం. కారణాలేమైనా అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి అన్నట్లుగా ఇటీవల పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. ఒకటికి మించి ఎక్కువసార్లు వాయిదా పడిన సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు, వాటి కొత్త విడుదల తేదీల గురించి తెలుసుకుందాం. ► వేసవికి రావాల్సిన ‘భోళా శంకర్’ ఆగస్టుకు షిఫ్ట్ అయ్యాడు. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమాను ముందు ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టు 11కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ► ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆదిపురుష్’ చిత్రం సిల్వర్ స్క్రీన్‌పైకి రావాల్సింది. కానీ మెరుగైన వీఎఫ్ఎక్స్ కోసం జూన్ 16కు వాయిదా వేశారు. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ దత్తా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి. సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ‘జై శ్రీరామ్..’ అనే తొలి పాటను విడుదల చేశారు. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ► మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు. ఫైనల్‌గా జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ‘ఖుషి’ సినిమాను సెప్టెంబరు1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వలో రాజశేఖర్ రెడ్డి, చరణ్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ 2023 సమ్మర్‌కు వాయిదా పడింది. అయితే ఈ వేసవికి ‘స్పై’ రాలేదు. ఫైనల్‌గా జూన్ 29న విడుదల కానుంది. ► బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ 2022 డిసెంబరులో రిలీజ్ కావాలి. కానీ రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ వీలుపడలేదు. తాజాగా జూన్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ఇది. ► దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్గా ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసినప్పటికీ మరోమారు వాయిదా పడి, జూన్ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. డేట్ ఫిక్స్ కాని చిత్రాలు ► వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ సందర్భంలో వెల్లడించింది. అయితే జూలైలో విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ► అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. కానీ రిలీజ్ కాలేదు. ► ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘డీజే టిల్లు స్క్వైర్’ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ అయ్యేందుకు రెడీ కానున్నట్లు టాక్. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ► శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ ఈ నెల 18న రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రెబా మౌనిక హీరోయిన్గా ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. ► తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను– మాన్’. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయాలను కున్నారు. కానీ వాయిదా పడింది. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. -
ముచ్చటగా మూడు
తెలుగు పరిశ్రమ లోకి ‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్’ అనే నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో మూడు సినిమాల్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు సంస్థ అధినేత విజయ్ రెడ్డి. తొలి ప్రయత్నంగా ప్రసాద్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సోషల్ వర్కర్స్’ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర ప్రధాన పాత్రలో మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో ‘కోబలి’ని రెండో చిత్రంగా నిర్మిస్తున్నారు. మూడో మూవీగా ‘హ్యాపీ విమెన్స్ డే’ రూపొందనుంది. తొలి సీన్‌కి నటుడు బాబూ మోహన్ క్లాప్ కొట్టారు. విజయ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ఆఫీసులను ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రారంభించాం. ఔత్సాహిక దర్శకులు, నూతన నటీనటులు మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
పరాక్రమవంతుడు
సూర్య, దిశా పటానీ జంటగా, యోగిబాబు కీలక పాత్రలో శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్‌లతో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సూర్య గంభీరంగా కనిపిస్తారు. ‘కంగువ’ మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. షూటింగ్‌ను పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘త్రీడీలో పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషల్లో ‘కంగువ’ టైటిల్‌ను ఫిక్స్ చేశాం. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంది.. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’అని చిత్రయూనిట్ పేర్కొంది. -
డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా..
‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాను. నా వరకు నిర్మాతగానే బావుంది. మనకి నచ్చిన కథతో సినిమా నిర్మించామనే సంతృప్తి ఉంటుంది’’ అన్నారు రాజేష్ దండా. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాలను అనిల్ సుంకర సమర్పణలో నిర్మించారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల గురించి రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘స్వామి రారా’తోపాటు దాదాపు 80 చిత్రాలు పంపిణీ చేశాను. ‘కేరాఫ్ సూర్య, ఒక్క క్షణం, నాంది’ చిత్రాలకి కోప్రొడ్యూసర్‌గా చేశాను. ‘టైగర్’ సినిమా నుంచి సందీప్ కిషన్, వీఐ ఆనంద్‌లతో ఉన్న పరిచయంతో హాస్య మూవీస్ బ్యానర్‌ని ప్రారంభించాను. ముందు ‘ఊరు పేరు భైరవకోన’ ప్రారంభించినా, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్ విడుదలైంది. ‘సామజవరగమన’ చిత్రాన్ని ఈ వేసవిలో, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని జులై లేదా ఆగస్ట్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. అలాగే సుబ్బు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌తో నిర్మించనున్న మరో సినిమాను ఆగస్ట్‌లోప్రారంభిస్తాం. శ్రీవిష్ణుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. సాయిధరమ్ తేజ్‌తో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది’’ అన్నారు. -
మార్చిలో థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలివే!
కంటెంట్ నచ్చితే చాలు ఏ సినిమా అయినా ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు ప్రేక్షకులు. భాషకు సరిహద్దులు లేకుండా సినిమాను అక్కున చేర్చుకుంటున్నారు. ప్రాంతీయ భాషలో వచ్చిన సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో హిట్ చేస్తున్నారు. ఓపక్క కమర్షియల్ కంటెంట్, మరోపక్క నేటివిటీకి దగ్గరగా ఉన్న కంటెంట్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండగా కథలో దమ్మున్న సినిమా అంతిమంగా విజయం సాధిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారిసు, తెగింపు, పఠాన్ వంటి పెద్ద సినిమాలు 2023కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పాయి. ఆ తర్వాత రిలీజైన హంట్, మైఖేల్, అమిగోస్ మాత్రం నిరాశపర్చాయి. ఆ వెంటనే సార్, రైటర్ పద్మభూషణ్, వినరో భాగ్యము విష్ణు కథ వరుసగా హిట్టవుతూ వచ్చాయి. మరి మార్చి నెలలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి? ఏయే హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుబోతున్నారో చూసేద్దాం.. మార్చి 3 బలగం ఇన్ కార్ ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు గ్రంథాలయం రిచి గాడి పెళ్లి సాచి మార్చి 10 సీఎస్ఐ సనాతన్ నేను స్టూడెంట్ సార్ ట్యాక్సీ మిస్టర్ కల్యాణ్ మార్చి 17 ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి కబ్జా మార్చి 22 దాస్ కా ధమ్కీ బెదురులంక 2012 మార్చి 30 దసరా మార్చి 31 భూతద్దం భాస్కర్‌నారాయణ -
Actresses: కథానాయికల క్యాలెండర్.. బిజీ బిజీ
హీరోలు దాదాపు ఒకే భాషకు పరిమితం అవుతారు. అయితే హీరోయిన్లు పలు భాషల్లో నటిస్తుంటారు. అందుకే కొందరు కథానాయికలు కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి డైరీని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని అవకాశాలు వస్తాయి. మరి.. ఈ ఏడాది క్యాలెండర్లో ఏ హీరోయిన్ డైరీలో ఎన్ని చిత్రాలున్నాయో తెలుసుకుందాం. అనుష్క: అనుష్క లీడ్ రోల్లో రూపొందిన ‘నిశ్శబ్దం’ సినిమా 2020 అక్టోబర్ 2న రిలీజైంది. ఆ తర్వాత రెండేళ్లు ఆమె తెరపై కనిపించలేదు. దాంతో అనుష్క నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపి, అందర్నీ ఆశ్చర్యపరిచారు అనుష్క. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రంతో బిజీగా ఉన్నారు అనుష్క. త్రిష: ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ‘సదురంగ వేట్టె 2, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్’ వంటి తమిళ చిత్రాలతో పాటు మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘రామ్’ ఉన్నాయి. ఇక 2016లో విడుదలైన ‘నాయకి’ తర్వాత త్రిష తెలుగులో నేరుగా ఏ సినిమాలోనూ నటించలేదు. తమన్నా: ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతున్నా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ‘బోళా శంకర్’, తమిళ్లో రజనీకాంత్ సరసన ‘జైలర్’, మలయాళంలో ‘బాంద్రా’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బోలే చూడియా’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాజల్ అగర్వాల్: ఈ ఏడాది నాలుగు సినిమాలతో అలరించనున్నారు కాజల్. ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘కురుంగాప్పియమ్, ఘోస్టీ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. హిందీలో చేసిన ‘ఉమ’ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) చిత్రంలో నటిస్తున్నారు. నయనతార: గత ఏడాది తెలుగులో ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటించిన నయనతార ఈ ఏడాది తెలుగు సినిమాలేవీ కమిట్ కాలేదు. హిందీ చిత్రం ‘జవాన్’లో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్నారామె. బాలీవుడ్లో నయనకి ఇది తొలి చిత్రం. తమిళంలో ‘ఇరైవన్’ చిత్రంలో నటిస్తున్నారు. శ్రుతీహాసన్: ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో అలరించారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌కి జోడీగా ‘సలార్’లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకానుంది. మరోవైపు ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నారు శ్రుతీహాసన్. కీర్తీ సురేశ్: ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు. కీర్తీ సురేశ్. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలి పాత్ర చేస్తున్నారు కీర్తి. నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘దసరా’లో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ్లో ‘మామన్నన్, సైరన్, రఘు తాతా, రివాల్వర్ రీటా’ వంటి చిత్రాలతో జోరుగా ఉన్నారు కీర్తీ సురేశ్. పూజా హెగ్డే: గత ఏడాది ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన పూజా హెగ్డే ప్రస్తుతం ఒక తెలుగు, మరో హిందీ సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్‌బాబుకి జోడీగా నటిస్తున్నారామె. అలాగే ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు. రష్మికా మందన్న: కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా ఈ సంక్రాంతికి ‘వారీసు’ (‘వారసుడు) తో తెరపైకి వచ్చారు. అలాగే హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ శుక్రవారం రిలీజైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్ సరసన హిందీ చిత్రం ‘యానిమల్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. కృతీ శెట్టి: గత ఏడాది ‘బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు కృతి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం ‘కస్టడీ’. ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్య సరసన ఆమె నటిస్తున్న చిత్రం ఇది. అలాగే ‘అజయింటే రందం మోషణం’ అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు. శ్రీలీల: దక్షిణాదిలో దూసుకెళుతున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఈ బ్యూటీ గత ఏడాది ‘ధమాకా’లో కనిపించారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తున్నారు. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు ‘అనగనగా ఒకరాజు, జూనియర్ (తెలుగు–కన్నడ) వంటి సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారీ బ్యూటీ. అదేవిధంగా బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకోన్, కియారా అద్వానీ, కృతీ సనన్ అటు తెలుగు, ఇటు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’తో దీపికా పదుకోన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్లో ఆమె నటించిన ‘పఠాన్’ ఈ నెల 25న రిలీజ్ కానుండగా, ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక. ఇక రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్–కియారా జంటగా నటిస్తున్న చిత్రమిది. అలాగే ‘సత్యప్రేమ్ కీ కథ’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు కియారా. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్’లో హీరోయిన్గా నటించారు కృతీ సనన్. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది. హిందీలో ‘షెహజాదా, గణపత్’తో పాటు మరో సినిమా చేస్తున్నారు కృతీ సనన్. సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ గత ఏడాది రిలీజైన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్ చేసిన ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ‘ఖుషి’లో విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు సమంత. మరోవైపు ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అయితే మయోసైటిస్ వ్యాధి చికిత్సలో భాగంగా ఆరు నెలలుగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారామె. ఇప్పుడు కోలుకున్న సమంత ముంబైలో ‘సిటాడెల్’ షూట్లో పాల్గొంటున్నారు. సమంతకు పేరు తెచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ 2’ వెబ్æసిరీస్‌కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి దర్శకులు. -
సంక్రాంతి స్టార్ వార్
-
అసలు సినిమా ముందుంది అంటున్న 2023
-
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే ..!
కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే అదే ఊపులో ఈవారం కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అల్లరి నరేష్, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. మనిషి తోడేలుగా మారితే... వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం 'భేదియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో వస్తున్న 'లవ్‌టుడే' తమిళంలో సూపర్ హిట్ మూవీ 'లవ్‌టుడే'. అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ టాక్ సాధించింది. నవంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. యాక్షన్ సినిమా 'రణస్థలి' మాటల రచయిత పరుశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్, శివజామి, నాగేంద్ర, విజయ్ రాగం తదీతరులు నటిస్తున్నారు. నవంబరు 26న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కథలో హింస అంశాన్ని స్పృశించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. ఈ కథలో రణం ఎవరెవరి మధ్య, ఎందుకు సాగిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లివే నెట్‌ఫ్లిక్స్ వెన్స్డే (వెబ్‌సిరీస్) నవంబరు 23 ద స్విమ్మర్స్ (హాలీవుడ్) నవంబరు 23 గ్లాస్ ఆనియన్ (హాలీవుడ్) నవంబరు 23 బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్) నవంబరు 23 ద నోయల్ డైరీ (హాలీవుడ్) నవంబరు 25 ఖాకీ: ది బిహార్ చాప్టర్ (హిందీ సిరీస్) నవంబరు 25 పడవేట్టు (మలయాళం) నవంబరు 25 అమెజాన్ ప్రైమ్ గుడ్ నైట్ ఊపీ (మూవీ) నవంబరు 23 జీ5 చుప్ (బాలీవుడ్) నవంబరు 25 డిస్నీ+హాట్‌స్టార్ ప్రిన్స్ (తెలుగు) నవంబరు 25 ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ (హాలీవుడ్) నవంబరు 25 ఆహా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు మూవీ) నవంబరు 25 ఎన్బీకే అన్‌స్టాపబబుల్ (సీజన్-2 ఎపిసోడ్ 4) నవంబరు 25 సోనీ లివ్ గర్ల్స్ హాస్టల్ (హిందీ సిరీస్) నవంబరు 25 మీట్ క్యూట్ (తెలుగు మూవీ) నవంబరు 25 -
ఓటీటీలో సినిమాల జాతర.. ఈ ఒక్కరోజే 14 చిత్రాల సందడి
ప్రస్తుతం బిగ్స్క్రీన్పై చిన్న సినిమాల హావా నడుస్తోంది. మరోవైపు ఓటీటీలో మాత్రం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే(శుక్రవారం) ఓటీటీలో దాదాపు 14 సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో నేరుగా ఓటీటీకి వచ్చే చిత్రాలు ఉండగా.. థియేట్రల్లోకి వచ్చిన ఇప్పుడు ఓటీటీ వేదిగా సందడి చేసేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. ఈక్రమంలో నేడు ఒక్కరోజే ఓటీటీకి వచ్చేస్తున్న ఆ చిత్రాలేవో ఇక్కడ ఓ లుక్కేయండి! డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar): బబ్లీ బౌన్సర్ – తెలుగు, హిందీ నెట్ ఫ్లిక్స్(Netflix): జంతారా – సిరీస్ 2(హిందీ) లౌ(Lou) – ఇంగ్లీష్ ఎ జాజ్ మెన్స్ బ్లూస్ – ఇంగ్లీష్ ఎథెనా – ఫ్రెంచ్ ది గర్ల్స్ ఎట్ ది బ్యాక్ -సిరీస్ 1 – స్పానిష్ ఆహా(AHA): ఫస్ట్ డే ఫస్ట్ షో – తెలుగు డైరీ – తమిళం సన్ నెక్ట్(Sun Nxt): తిరు – తెలుగు, తమిళం వూట్(Voot): షుగర్ లెస్ – కన్నడ సోనీలివ్(SonyLIV): చల్లే ముండియాన్ – పంజాబీ జీ5(Zee5): కళాపురం – తెలుగు అతిథి భూతో భవ – హిందీ సోరియా ద ఫింద్ – పంజాబీ -
హీరోగా మళ్లీ బిజీ కానున్న సునీల్ !.. రెండు చిత్రాల ప్రకటన
Sunil Shared Two Upcoming Movies Posters As Hero: ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా పేరు పొందాడు సునీల్. అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. పూల రంగడు మినహా భీమవరం బుల్లోడు, జక్కన్న, ఉంగరాల రాంబాబు, మిస్టర్ పెళ్లికొడుకు, కృష్ణాష్టమి, కనుబడుటలేదు వంటి తదితర సినిమాల్లో కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో పేరు గడించలేదు. ఇటీవల వచ్చిన 'పుష్ప', అప్పట్లో రవితేజ 'డిస్కోరాజా' సినిమాల్లో విలన్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం 'పుష్ప' రెండో పార్ట్‌లోనూ కంటిన్యూ అవుతున్నా సునీల్ హీరో ప్రాధాన్యత పాత్రలు చేయడం మానలేదు. ఫిబ్రవరి 28 సోమవారం సునీల్ పుట్టినరోజు సందర్భంగా తాను హీరోగా నటిస్తున్న సినిమాలను ప్రకటించాడు. తన ట్విటర్ అకౌంట్లో ఈ రెండు సినిమా పోస్టర్లను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'బుజ్జీ ఇలారా' అయితే రెండోది అభిరామ్ డైరెక్షన్లో 'కుంభకర్ణ'. 'బుజ్జీ ఇలారా' చిత్రంలో సునీల్ ఫోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా 'కుంభకర్ణ'లో సూరజ్ దేవ్ పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ సినిమాలతో సునీల్ మళ్లీ హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి. Thanks to the Team #BujjiIlaRaa#GarudavegaAnji #GNageswarReddy #RupaJagadeesh #SNSCreations pic.twitter.com/Kc51HpProC — Sunil (@Mee_Sunil) February 28, 2022 Thanks To The Team #kumbakarna 😍#AbhiramPilla #SaiKartheek #soorajdev pic.twitter.com/F6CZ1vnxzO — Sunil (@Mee_Sunil) February 28, 2022 -
కొత్త కథలతో ఎస్ ఒరిజినల్స్.. ఏకంగా 9 సినిమాలు
S Originals Coming With 9 Movies With Different Concepts: ఈ సంవత్సరం ఏకంగా 9 సినిమాలను నిర్మించేందుకు సిద్ధం అవుతుంది 'ఎస్ ఒరిజనల్స్'. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో కథను నమ్మి కొత్త తరం దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు నిర్మాత సృజన్. తమ సంస్థ నుంచి వస్తున్న సినిమాలపై గురించి సృజన్ మాట్లాడుతూ 'ఎస్ ఒరిజినల్స్‌ను టాలీవుడ్లో ప్రత్యేక స్థానంలో నిలుపాలన్నదే నా కోరిక. ఇప్పటి వరకు భాగస్వామ్యంలో కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు మా బ్యానర్ నుంచే 9 చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల షూటింగ్ సుమారు ముగింపునకు రావడం సంతోషంగా ఉంది. దీని ద్వారా కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నారు. టాలెంట్‌పై నమ్మకంతో వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇవే కాకుండా మరికొన్ని కథలను ఫైనలైజ్ చేసి ఈ ఏడాది ప్రారంభిస్తాం' అని తెలిపారు. ప్రస్తుతం పంచతంత్రం విడుదలకు సిద్ధంగా ఉందని సృజన్ పేర్కొన్నారు. 'సంతోష్ శోభన్ హీరోగా డిజిటల్ మీడియాలో బ్రాండ్‌గా ఎదిగిన సుభాష్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక అందమైన ప్రేమకథను రూపొదించాం. సుమంత్ హీరోగా అహాం చిత్రం షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయిన సినిమాతో సుబ్బు చెరుకూరిని కొత్త దర్శకుడిగా అరంగ్రేటం చేయనున్నారు. ఇంకొక కొత్త దర్శకుడిగా బ్రిజేష్‌తో వైరల్ సినిమా రానుంది. కిరణ్ డైరెక్షన్లో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నడలో బీర్బల్ ట్రయాలజీ తీసిన శ్రీని దర్శకత్వంలో ఓల్డ్ మంక్ మూవీని, కొత్త దర్శకుడు విష్ణును మరో సినిమాతో పరిచయం చేస్తున్నాం. బాలీవుడ్ పాపులర్ రైటర్స్ సిద్దార్ధ , గరీమ దర్శకత్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్లో ఉంది.' అని సృజన్ వెల్లడించారు. కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం బలంగా ఉందని నిర్మాత సృజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎస్ ఒరిజినల్స్ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. -
వచ్చే ఏడాది అలరించనున్న సినిమాలు ఇవే..
Upcoming Telugu And Hindi Movies In 2022 Year: కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు తెరచుకున్నాయి. దీంతో భారీ సినిమాలతో థియేటర్లు సందడిగా మారాయి. దీపావళి కానుకగా వచ్చిన హిందీ చిత్రం 'సూర్యవంశీ' బ్లాక్ బ్లస్టర్గా నిలిచింది. ఈ విజయంతో హిందీ చిత్రపరిశ్రమ వచ్చే ఏడాది మరిన్ని సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో ఖాన్ ద్వయం సల్మాన్, అమీర్, షారుఖ్ నటించిన మెగా భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఏప్రిల్‌లో విడుదల కానుండగా, షారుఖ్ ఖాన్ 'పఠాన్', సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'అఖండ' సినిమాతో మంచి ప్రారంభాన్ని సొంతం చేసుకుంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ. ఈ ఆరంభం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప'తో కొనసాగుతోంది. వచ్చే ఏడాది కూడా తెలుగు ప్రేక్షకులను భారీ సినిమాలు అలరించనున్నాయి. వాటిలో మోస్ట్ అవేటెడ్ మూవీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' 2022లో రిలీజ్ కానుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ మూవీ 'రాధేశ్యామ్' కూడా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్లో సీతగా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి', ఆమె ప్రియుడు రణ్‌బీర్ కపూర్ 'శంషేరా', 'బ్రహ్మాస్త్ర' సినిమాలు వచ్చే ఏడాదే అలరించనున్నాయి. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జయేష్ భాయ్ జోర్దార్' ఫిబ్రవరిలో, 'సర్కస్' జూలైలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటితో పాటు మరికొన్ని సినిమాలు కొత్త సంవత్సరంలోనే అలరించనున్నాయి. అవేంటో చూద్దాం. 1. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)- జనవరి 7 2. రాధేశ్యామ్- జనవరి 14 3. బంగార్రాజు- జనవరి 15 4. పృథ్వీరాజ్- జనవరి 21 5. ఆచార్య- ఫిబ్రవరి 4 6. ఖిలాడీ- ఫిబ్రవరి 11 7. మేజర్- ఫిబ్రవరి 11 8. గంగూబాయి కతియావాడి- ఫిబ్రవరి 18 9. 18 పేజీలు- ఫిబ్రవరి 18 10. భీమ్లా నాయక్- ఫిబ్రవరి 25 11. జయేష్ భాయ్ జోర్దార్- ఫిబ్రవరి 25 12. శంషేరా- మార్చ్ 18 13. భూల్ భులయా 2- మార్చ్ 25 14. రామారావు ఆన్ డ్యూటీ- మార్చ్ 25 15. అనేక్- మార్చ్ 31 16. సర్కారు వారి పాట- ఏప్రిల్ 1 17. సలార్- ఏప్రిల్ 14 18. లాల్ సంగ్ చద్దా- ఏప్రిల్ 14 19. కేజీఎఫ్ 2- ఏప్రిల్ 14 20. హరి హర వీరమల్లు- ఏప్రిల్ 29 21. ఎఫ్ 3- ఏప్రిల్ 29 22. మైదాన్- జూన్ 3 23. జుగ్ జుగ్గ్ జియో- జూన్ 24 24. ఆదిపురుష్- ఆగస్టు 11 25. రక్షా బంధన్- ఆగస్టు 11 26. లైగర్- ఆగస్టు 25 27. బ్రహ్మాస్త్ర- సెప్టెంబర్ 9 28. యోధ- నవంబర్ 11 -
నెట్‌ఫ్లిక్స్ కొత్త వెబ్సైట్.. ఎందుకో తెలుసా ?
Netflix Launched New Website For Most Watched Movies: ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మూవీస్, వెబ్ సిరీస్, యాప్ అప్డేట్ ఫీచర్స్‌తో ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఓటీటీలో ఎప్పుడూ కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటిలో ఎక్కువ ప్రేక్షకాధరణ పొందినవి, హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోవండ కష్టమైన పని. దీంతో ఏ సినిమా బాగుంది ? ఏ వెబ్ సిరీస్ చూడాలి ? అని తోటి స్నేహితుల్ని, సినిమా పిచ్చి ఉన్నవారిని అడుగుతుంటారు. అయితే ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ కొత్తగా ఆలోచించింది. తమ యూజర్లు ఇంకొకరిపై ఆధారపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం తాజాగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది నెట్‌ఫ్లిక్స్. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ 'టాప్10.నెట్‌ఫ్లిక్స్(https://top10.netflix.com/)' పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్), నాన్ ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్) కేటగిరీల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతోంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రేక్షకులు వీక్షించిన సమయం ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. ప్రతి మంగళవారం ఈ టాప్ 10 జాబితాను విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఒక సినిమా, వెబ్ సిరీస్ వేర్వేరు దేశాల్లో ఎంత వరకు ప్రేక్షకాధరణ ఉందనేది కూడా ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ ఇంగ్లీష్, స్పానిష్, భాషల్లో ఉండగా, వచ్చే సంవత్సరం నుంచి మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానుందట. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్.. మొబైల్ గేమ్స్.. ఆడటం ఎలా? -
ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కి, ఇంకొన్ని ఇటీవలే థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్ వేయండి. ‘ఉప్పెన’ తర్వాత ‘కొండపొలం’తో వస్తున్న వైష్ణవ్‌తేజ్ వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. రకుల్ ప్రీత్ సింగ్ కథనాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘వరుణ్ డాక్టర్’ ‘రెమో’ సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ నటుడు శివ కార్తికేయన్. ఇప్పటికే ఆయన నటించిన కొన్ని అనువాద సినిమాలు ప్రేక్షాకదరణని పొందాయి. నీల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా చేసిన తాజా చిత్రం ‘వరుణ్ డాక్టర్’. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. షూటింగ్ పూర్తై కోవిడ్ నేపథ్యంలో విడుదల ఆలస్యమైన ఈ సినిమా అక్టోబరు 9న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. ‘ఆరడుగుల బుల్లెట్’గా రానున్న గోపిచంద్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార హీరోహీరోయిన్లుగా చేసిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మించాడు. కొన్నేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తైన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల విడుదలకు కాలేదు. ఎట్టకేలకు అక్టోబర్ 8న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ప్రేమకథ చెబుతానంటున్న నవీన్ చంద్ర సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. నవీన్‌చంద్ర కథానాయకుడిగా గాయత్రి ఆర్.సురేష్, అదితి మ్యాకల్ కథానాయికలు చేస్తున్నారు. కల్యాణ్ కందుకూరి, అన్నదాత భాస్కర్‌రావు, నిమ్మకాయల దుర్గాప్రసాద్‌రెడ్డి, నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. అక్టోబరు 8న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీలోని ప్రేమకథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఇటీవల తెలిపారు. ఓటీటీలో విడులయ్యే చిత్రాలు! ఓటీటీలో అలరించనున్న శ్రీ విష్ణు శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని అలరించిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబరు 8 నుంచి ఓటీటీ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మేఘా ఆకాశ్, సునయన కథానాయికలుగా నటించారు. ‘అంధాదున్’ మలయాళ రీమేక్‌గా వస్తున్న ‘భ్రమమ్’ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ని నితిన్ ‘మ్యాస్ట్రో’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ హిందీ సినిమాని ‘భ్రమమ్’గా మలయాళంలో రిమేక్ చేస్తున్నాడు మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. రాశిఖన్నా హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలో నటిస్తోంది. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ మూవీ అక్టోబరు 7 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో సినిమా ‘కోల్డ్ కేస్’ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన మరో చిత్రం ‘కోల్డ్ కేస్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తను బాలక్ దర్శకుడు. జూన్ 30న మలయాళం భాషలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘ఆహా’లో అక్టోబరు 8న విడుదల కానుంది. ఓటీటీలో మరికొన్ని.. నెట్‌ఫ్లిక్స్ హౌస్ ఆఫ్ సీక్రెట్స్- 8 అక్టోబరు ఎస్కేప్ ది అండర్ టేకర్- 5 అక్టోబరు డేర్స్ సమవన్ ఇన్సైడ్ యువర్ హౌస్- 6 అక్టోబర్ అమెజాన్ ప్రైమ్ జస్టిన్ బీబర్ ఔర్ వరల్డ్- 8 అక్టోబరు మాడ్రెస్- 8 అక్టోబరు సోనీ లివ్ అప్పథావా ఆట్టయా పొట్టుటాంగా- 8 అక్టోబరు డిస్నీ+హాట్ స్టార్ ముప్పెట్స్ హంటెడ్ మాన్షన్- 8 అక్టోబరు -
ఏదో మిస్సవుతోంది!
నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్ట్రో’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘కళ్లు కనబడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు. కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’, ‘బట్ సమ్‌థింగ్ ఈజ్ మిస్సింగ్’ (ఏదో మిస్సవుతోంది)’ అనే సంభాషణలు ట్రైలర్లో ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
టాలీవుడ్లో కొత్త రెపరెపలు!
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, కొత్త పోస్టర్లు, విడుదల తేదీల ప్రకటనలు.. ఇలా పలు అప్డేట్స్తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ రెపరెపలాడింది. ఆ అప్డేట్స్ విశేషాలు.. హిందీ హిట్ ‘అంధాధున్’ తెలుగులో ‘మ్యాస్ట్రో’గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్ జంటగా, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాస్ట్రో’ కొత్త పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇక కెరీర్లో తొలిసారి ‘లక్ష్య’ చిత్రంలో విలుకాడుగా కనిపించనున్నారు నాగశౌర్య. ఈ చిత్రం కొత్త పోస్టర్ రిలీజైంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మరోవైపు సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, సుశాంత్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కొత్త పోస్టర్స్ వచ్చాయి. అలాగే జిల్లా కలెక్టర్ పంజా అభిరామ్‌గా థియేటర్స్‌లో చార్జ్ తీసుకోనున్నారు సాయిధరమ్ తేజ్. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ‘రిపబ్లిక్’లో కలెక్టర్ అభిరామ్‌గా చేస్తున్నారు సాయితేజ్. జె.భగవాన్, జె. పుల్లారావు, జీ స్టూడియోస్, జేబీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 1న విడుదల కానుంది. ఇక తన కెరీర్లో తొలిసారిగా నిఖిల్ గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ‘గూఢచారి’, ‘ఎవరు’వంటి సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బి.హెచ్ ఈ స్పై థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాకు కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మాత. ఇంకోవైపు గొడవలంటే భయపడే ఓ అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమకోసం విశాఖపట్నంలో ‘గల్లీరౌడీ’గా మారాడు. సందీప్ కిషనే ఈ వెండితెర గల్లీరౌడీ. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యానారాయణ నిర్మించిన ‘గల్లీరౌడీ’ చిత్రాన్ని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత జీవీ. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు కోన వెంకట్. ఇటు ఆది సాయి కుమార్ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు. వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ‘కిరాతక’, ‘బ్లాక్’ వంటి సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ తాజా చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. టీఎమ్‌టీ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కల్యాణ్ జి. గోగణ డైరెక్ట్ చేస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తిరుమల్ రెడ్డి యెల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సత్యదేవ్;సాయిధరమ్ తేజ్; సందీప్ కిషన్, నేహాశెట్టి టాలీవుడ్లో తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సత్యదేవ్ ‘హబీబ్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తన కొడుకు కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన ఓ ఆర్మీ ఆఫీసర్ కథే ‘హబీబ్’. సత్యదేవ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జెన్నీఫర్ అల్ఫోన్స్ దర్శకురాలు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను హబీబ్ సఫీ, కోటి రావ్ నిర్మిస్తున్నారు. ఆది, పాయల్ రాజ్‌పుత్; సుధీర్‌బాబు, ఆనంది; సుశాంత్, మీనాక్షి; ఇటు ‘బుజ్జి.. ఇలారా’ చిత్రం కోసం సీఐ కేశవ్ నాయుడిగా చార్జ్ తీసుకున్నారు ధన్‌రాజ్. ఇందులో సునీల్ మరో హీరో. ‘గరుడవేగ’ అంజి డైరెక్షన్లో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రూపా జగదీష్ సమర్పణలో అగ్రహారం సంజీవరెడ్డి, నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక డా.మోహన్, నవీన్‌చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘1997’. ఈ సినిమాలోని నవీన్‌చంద్ర లుక్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మీనాక్షీ రమావత్ ప్రొడ్యూసర్. ‘కోతికొమ్మచ్చి’ తర్వాత హీరో మేఘాంశ్ శ్రీహరి తాను నటించనున్న తర్వాతి సినిమాను తన తండ్రి, ప్రముఖ నటులు శ్రీహరి జయంతి సందర్భంగా ఆదివారం ప్రకటించారు. సి.కల్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘రాసి పెట్టుంటే’ టైటిల్‌ను ఖరారు చేశారు. నందు మల్లెల ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘గంధర్వ’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలయ్యాయి. అప్సర్ డైరెక్ట్ చేస్తున్న ‘గంధర్వ’ సినిమాను ఎమ్ఎన్ మధు నిర్మిస్తున్నారు. మరోవైపు ‘సింధూరపువ్వు’ రాంఖీ, హర్షిత్‌రెడ్డి, వికాస్ వశిష్ట, రాఖీ ప్రధాన పాత్రల్లో అమర్నాథ్ రెడ్డి గుంటక దర్శకత్వంలో ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ‘గగనవీధి’ సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు.1980 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరనే సందేశంతో వస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘1948: అఖండ భారత్’ సినిమా పోస్టర్స్, లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు. ‘ది మర్డర్ ఆఫ్ మహాత్మాగాంధీ’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో రఘునందన్, ఆర్యవర్ధన్‌రాజ్, శరద్ దద్భావల, ఇంతియాజ్, జెన్నీ, సమ్మెట గాంధీ ప్రధాన పాత్రధారులు. ఈశ్వర్ డి.బాబు దర్శకత్వంలో ఈ సినిమాను ఎమ్.వై. మహర్షి నిర్మించారు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది?, కోర్టులో గాడ్సే వాదనలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. ‘అజాద్ హింద్’ పేరుతో అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను ఓ ఫ్రాంచైజీలా నిర్మించనున్నట్లు వెల్లడించారు నిర్మాత విష్ణువర్ధన్. ఇందులో భాగంగా దుర్గా భాయ్ జీవితాన్ని ఫస్ట్ తెరకెక్కించనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ సినిమాలకు మాటలు అందించిన సయ్యద్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారనున్నారు. కోవిడ్ బ్రేక్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ అయి, వరుసగా సినిమాలు విడుదలవుతుంటే మరోవైపు నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్స్, కొత్త సినిమాల అప్డేట్స్తో టాలీవుడ్ కళకళలాడటం ఆనందించదగ్గ విషయం. -
ప్రేక్షకులకు పండగ కానుక.. కొత్త కళలు
సన్ ఆఫ్ ఇండియా సింగిల్‌గా వచ్చాడు.. నారప్ప ఫ్యామిలీతో ఎంట్రీ ఇచ్చాడు.. ప్రేమికుడు విక్రమాదిత్య ప్రేమలోకంలో విహరిస్తున్నట్లు కనిపించాడు.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జనాల్లోంచి గాల్లో పైకి లేచారు.. టక్ జగదీష్ కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు చిందించాడు... ఇలా ఉగాది సందర్భంగా నిర్మాణంలో ఉన్న చిత్రాల ఫస్ట్ లుక్స్, కొత్త పోస్టర్లు విడుదలై, పండగ కళ తెచ్చాయి. ఆ విశేషాలు డా. మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. టైటిల్‌ని బట్టి దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా న్యాయం కోసం పోరాడే పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారని ఊహించవచ్చు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విష్ణు మంచు నిర్మిస్తున్నారు. నారప్పగా వెంకటేశ్ గెటప్ ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చూశాం. పండగకి తన భార్య సుందరమ్మతో కలిసి వచ్చారు నారప్ప. సుందరమ్మ పాత్రను ప్రియమణి చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మించిన చిత్రం ‘నారప్ప’. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘అఖండ’ అనే టైటిల్ ప్రకటించి, లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది. స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం) . రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ జనాల మధ్యలోంచి గాల్లోకి ఎగురుతున్న కొత్త పోస్టర్ పండగకి వచ్చింది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ప్రేయసి ఏం చెప్పిందో ఏమో నవ్వుతూ కనిపించారు విక్రమాదిత్య (ప్రభాస్ పాత్ర పేరు). జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. సిద్ధ, నీలాంబరి ఒకరి కళ్లల్లోకి మరొకరు చూస్తూ ప్రపంచాన్ని మరచిపోయారు. వీరి ప్రేమకథను ‘ఆచార్య’లో చూడొచ్చు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ద పాత్రలో రామ్‌చరణ్, అతని సరసన నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకుంటున్నారు. అనుకున్నట్లు జరిగితే నాని ‘టక్ జగదీష్’ ఈ నెల 23న విడుదలయ్యుండేది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వాయిదా వేశారు. కుటుంబ సమేతంగా జగదీష్ (నాని పాత్ర) తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే నాగచైతన్య, సాయి పల్లవితో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్‌స్టోరీ’ని కూడా ఈ నెలే థియేటర్లలో చూసేవాళ్లం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశారు నిర్మాతలు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజైంది. బస్సులో ప్రేయసిని ఆరాధనగా చూస్తున్నాడు ‘గల్లీ రౌడీ’. సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. ఇందులో నేహా శెట్టి హీరోయిన్. షూటింగ్ జరుగుతోంది. పండగ వేళ నవ్వులు చిందించింది వెన్నెల. రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో వెన్నెల పాత్రలో కనిపిస్తారు సాయి పల్లవి. ఈ 30న సినిమాని విడుదల చేయాలనుకున్నారు కానీ వాయిదా పడే అవకాశం ఉంది. అబ్బాయి, అమ్మాయి చెరోవైపు చూస్తూ నిలబడ్డారు. కథ ఏంటనేది ‘వరుడు కావలెను’ సినిమాలో చూడాలి. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అద్దంలో బట్టతలతో, విడిగా చక్కని హెయిర్ స్టయిల్‌తో ప్రత్యక్షమయ్యాడు ‘101 జిల్లాల అందగాడు’. అవసరాల శ్రీనివాస్ హీరోగా రాచకొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, వై. రాజీవ్‌రెడ్డి, వై. సాయిబాబు నిర్మిస్తున్నారు. జీబీ కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ‘బ్లాక్’ లుక్ వచ్చింది. మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అలీ కీలక పాత్ర చేస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ బాబ, కొణతాల మోహన్, శ్రీచరణ్. ఆర్ నిర్మిస్తున్నారు. రంజాన్, ఉగాది శుభాకాంక్షలతో ఈ సినిమా కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొత్త పోస్టర్ వచ్చింది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మే 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
కొత్త సినిమాలపై ఓ లుక్కేద్దాం!
పండగ అంటే చాలు.. సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు సినీ లవర్స్. మహాశివరాత్రి సినీ అభిమానులను సంతోషపెట్టింది. వెంకటేశ్‌ని యంగ్ లుక్‌లో చూపెట్టింది. ప్రేయసితో కలసి ప్రత్యక్షమయ్యారు ప్రభాస్. గోపీచంద్‌తో కలిసి తమన్నా సీటీ కొట్టారు. ‘హరిహర వీరమల్లు’ అన్నారు పవన్ కల్యాణ్. ఇంకా కొత్త పోస్టర్లు పండగకి విడుదలయ్యాయి. కొత్త లుక్స్‌పై లుక్కేద్దాం. వెంకటేశ్ యువకుడిగాను, వృద్ధుడిగానూ కనిపించనున్న చిత్రం ‘నారప్ప’. తమిళ ‘అసురన్’కి రీమేక్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వృద్ధ లుక్ విడుదల కాగా పండగకు యంగ్ లుక్‌ని విడుదల చేశారు. డి. సురేష్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ సోలోగా వస్తే ప్రభాస్ తన ప్రేయసి పూజా హెగ్డేతో వచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధేశ్యామ్’లో ప్రభాస్, పూజా జంటగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఇక శివరాత్రి సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌తో వచ్చారు పవన్ కల్యాణ్. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. గోపీచంద్, తమన్నా సీటీ కొడుతూ సందడి చేశారు. ఈ ఇద్దరూ జంటగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘సీటీమార్’లోని తాజా ఫొటో విడుదలైంది. ‘అన్నం’.. పరబ్రహ్మ స్వరూపం అంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. అరిటాకులో ‘అన్నం’ అనే అక్షరాలు, పక్కనే వేట కొడవలితో పోస్టర్ని విడుదల చేశారు. శివరాత్రి శివుడి పండగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరునే టైటిల్‌గా చేసుకుని ‘శివుడు’ అంటూ వచ్చారు ఆది పినిశెట్టి. సుశీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లుక్ విడుదలైంది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి సమర్పణలో ఈ చిత్రాన్ని సత్యప్రభాస్ నిర్మిస్తున్నారు. భారీ చిత్రాలు నిర్మించే యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణంలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. పవన్ తేజ, సూర్య శ్రీనివాస్, రూపిక ముఖ్య తారలుగా కుంచమ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఛిల్ బ్రో’ లుక్ వచ్చింది. ఇంకా పలు చిత్రాల లుక్స్ రిలీజయ్యాయి. -
సర్ప్రైజ్: pspk27 టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేసింది
ఇటీవల ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే #PSPK27 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ మహా శివరాత్రికి టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ విడుదల చేస్తున్నట్లు నిన్న చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుందా అని అభిమానుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ముందుగా చెప్పినట్లుగానే దర్శకుడు మహా శివరాత్రికి టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ప్రేక్షకులు, అభిమానుల ఉత్కంఠకు తెరలెపాడు. ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి.. ది లెజెండరీ హీరోయిక్ జౌట్లా అనే ఉప శీర్షికతో పవన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. బంధిపోటు దుస్తుల్లో ఉన్న పవన్ కల్యాణ్ బిల్డింగ్‌పై నుంచి నౌకవైపు జంప్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో పవన్ వజ్రాల దొంగగా తెరపై ఆలరించనున్నట్లు సమాచారం. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. చదవండి: శివరాత్రికి టైటిల్ #pspkrana షూటింగ్ సెట్.. ఫొటో లీక్ పవన్ కల్యాణ్ న్యూలుక్.. షాకవుతున్న ఫ్యాన్స్ -
కొత్త ఏడాది, కొత్త పోస్టర్స్
కొత్త ఏడాదిని సరికొత్తగా స్వాగతించాలి. అందుకే నూతన సంవత్సరంలో సినీ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త లుక్స్‌తో, కొత్త పోస్టర్స్‌తో స్వాగతం చెప్పాయి కొన్ని సినిమాలు.. ఆ వివరాలేంటో చూసేద్దాం. ♦ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ స్టిల్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతికి టీజర్ ఉంటుందని సమాచారం ♦ ‘ఎఫ్ 2’తో సందడి చేశారు కో బ్రదర్స్ వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు డబుల్ ఫన్‌తో ‘ఎఫ్ 3’తో తిరిగొస్తున్నారు ♦ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో పవన్, శృతీ హాసన్ బైక్‌పై వెళుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేస్తారు ♦ రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడీ’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు ♦ ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఫుల్ జోష్‌తో సీటీ కొడుతున్న స్టిల్ రిలీజ్ చేశారు ♦ శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. ఇందులో ఆయన లుక్‌ను విడుదల చేశారు. ♦ సంక్రాంతికి సందడి చేయడానికి ‘అల్లుడు అదుర్స్’తో వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు ♦ నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’, రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘లక్ష్య’ లో అథ్లెట్‌లా రఫ్‌గా కనిపిస్తున్నారు నాగశౌర్య ♦ సుమంత్ ‘కపటధారి, సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’, అలీ, నరేష్ ముఖ్య పాత్రల్లో చేస్తున్న ‘అందరూ బావుండాలి అందులో మనముండాలి’, వశిష్ట సింహ, హెబ్బా పటేల్ ‘ఓదెల రైల్వేస్టేషన్’, సప్తగిరి హీరోగా చేస్తున్న ‘ఎయిట్’, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’, ‘ఆకాశవాణి’, ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్’ చిత్రాలు న్యూ ఇయర్‌కి న్యూ లుక్స్‌తో Ðð ల్కమ్ అన్నాయి. -
దీపికాతో తొలిసారి జోడీగా..
న్యూఢిల్లీ: దీపిక పదుకొనే, సిద్ధాంత్ చత్రుర్వేది మొదటిసారి జోడి కట్టనున్నారు. షకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రదేశాలను చూడటానికి ముంబయిలోని అలిబాగ్ను సందర్శించారు. వీరిద్దరు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. నిజ జీవితంలో వీరి మధ్య ఏ రిలేషన్ లేకపోయినప్పటికీ దీపిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తుంటే కెమిస్ట్రి బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో నటి అనన్య పాండే కూడా నటించనున్నట్ల తెలుస్తుంది. అలీబాగ్ షెడ్యూల్లో దీపికా, సిద్దాంత్లతో పాటు అనన్య తరచూ కనిపిస్తూనే ఉన్నారు. (చదవండి: నన్ను దారుణంగా తిడుతున్నారు..) ‘ఐ లవ్ యూ దీపిక పదుకొనే, నేను హగ్ చేసుకున్న ఒకే ఒక్క పర్సన్ నువ్వు’ అంటూ అనన్య పాండే తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. షకున్ బాత్రా తీయబోయే ఈ చిత్రం రిలేషన్ డ్రామాకు సంబంధించినది. ఈ ఏడాది గోవాలో షూటింగ్ ప్రారంభం అయ్యింది. చివరికగా ఛపాక్‌లో కనిపించిన దీపికా..రణవీర్ నేతృత్వంలో కబీర్ ఖాన్ 83 చిత్రంలో కూడా చిన్న పాత్రను పోషించింది. దీపిక భర్త రణ్వీర్ సింగ్‌తో ‘గల్లీ భాయ్’ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది కలిసి నటించాడు. యష్ రాజ్ నిర్మించనున్న ‘బంటి ఔర్ బబ్లీ2’లో కూడ సిద్దాంత్ కనిపించనున్నారు. అనన్య పాండే చివరిగా ‘ఖాలి పీలి’ చిత్రంలో కనిపించారు. -
దీపావళిలో కొత్త సినిమావళి
దీపావళి అంటే దీపాల వరుస. కరోనాతో షూటింగ్‌ల వరుస తప్పిన చిత్రపరిశ్రమ ఇప్పుడు వరుస సినిమాల సందడితో కళకళలాడుతోంది. దీపావళి వచ్చింది.. సందడి తెచ్చింది.. సినీప్రియులకు ఎన్నో తీపి వార్తలు అందించింది. పండగ ముందు రోజు.. పండగ నాడు వరుసగా బోలెడన్ని కబుర్లు అందించింది. ఈ దీపావళి... ‘సినిమావళి’. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఏషియన్ సినిమాస్‌పై కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతూ, పల్లవి పెళ్లి బట్టల్లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. రాధామోహన్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. నవంబర్ 23 నుంచి ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’. అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదో ఇంటెన్స్ లవ్‌స్టోరీ అని చిత్రబృందం తెలిపింది. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రామ్ తళ్లూరి నిర్మాత. ఈ సినిమాకు ‘కిన్నెరసాని’ అనే టైటిల్‌ను ప్రకటించారు. సుశాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. యస్. దర్షన్ దర్శకుడు. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంద్రగంటితో మూడో సినిమా సుధీర్ బాబు కమిట్ అయిన మరో సినిమాని కూడా ప్రకటించారు. సుధీర్‌తో ‘సమ్మోహనం, వి’ చిత్రాలు చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్. గాజులపల్లి సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ నటి సీత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భద్రకాళి’. కేఎం ఆనంద్ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో చిక్కవరపు రాంబాబు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఎ.మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రాధ పాత్రలో ఆమె పల్లెటూరి అమ్మాయిలా కనిపించనున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ‘అభిమన్యుడు, హీరో’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు పీయస్ మిత్రన్‌తో ఓ సినిమా కమిట్ అయ్యారు కార్తీ. ఈ సినిమా ప్రారంభం దీపావళి రోజు జరిగింది. ఇందులో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. మరోవైపు కార్తీ లేటెస్ట్ చిత్రం ‘సుల్తాన్’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. సురేందర్ కొంటాడి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నటన సూత్రధారి’. అమిత్ రంగనాథ్, సుశీల మాధవ పెద్ది జంటగా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ మోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇదో కొత్త తరహా సస్పెన్స్ థ్రిల్లర్ అని చిత్రబృందం పేర్కొంది. రాముడు లంకకు వెళ్లడానికి వంతెన నిర్మించాడు. ఆ గురుతులు ఇంకా ఉన్నాయి అనడానికి రామసేతు సాక్ష్యం అంటారు. ఇంతకీ నిజానిజాలు ఏంటి? అనే కథాంశంతో ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ‘రామ సేతు’ అనే చిత్రాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకుడు. చలం రాసిన ‘మైదానం’ నవల సినిమాగా తెరకెక్కనుంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రం ఫేమ్ వేణు ఊడుగుల నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. కవి సిద్ధార్థ్ దీనికి దర్శకుడు. ‘ఆహా’ ఓటీటీ కోసం ఈ సినిమాను చేస్తున్నారు. ‘తెలుగు సినిమా సంతకాన్ని రీజెనొవేట్ (చైతన్యం) చేసే అవకాశం ఇస్తుంది కనుక ఈ ‘మైదానం’లోకి దూకే సాహసం చేస్తున్నాం’ అన్నారు వేణు. -
పండిగై వందాచ్చే...
వందాచ్చే.. వందాచ్చే... ఈ పదాలు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘సూపర్ మచ్చి’ పాటలో విన్నాం. అంటే... వచ్చాడే/వచ్చిందే.. ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు తమిళ సినిమా కాదలర్గళుక్కు (సినిమా ప్రేమికులకు) అసలు సిసలైన దీపావళి పండిగై (పండగ) వందాచ్చే.. పండగకి తమిళ తెర కొత్త సినిమాలను చూడబోతోంది. ఇప్పటికే కొన్ని పాత సినిమాలు మంగళవారం తెరకొచ్చాయి. అయితే ఈ సినిమాల విడుదల వెనక కొన్ని రోజులుగా తమిళ పరిశ్రమలో ఓ వివాదం సాగింది. ఆ విషయం, కొత్తగా వచ్చిన చిత్రాలు, ఆడుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం వాంగ (రండి). కరోనా ఎంత పని చేసింది? సినిమా పరిశ్రమను భారీ నష్టాలవైపు నెట్టింది. ఆగిపోయిన షూటింగులతో వడ్డీలు పెరిగి, నష్టాల్లో నిర్మాత ఉంటే.. తెర మీద బొమ్మ పడక థియేటర్ యాజమాన్యం నష్టపోయింది. విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా ఆగాయి. ఈ నేపథ్యంలో 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు తెరవచ్చని ప్రభుత్వం అనుమతించడం ఓ ఊరట. పైగా దీపావళి పండగ సెలవులు ఎలానూ ఉంటాయి కాబట్టి ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ‘కొత్త సినిమాలను విడుదల చేయకూడదు’ అంటూ కొన్ని రోజుల క్రితం ‘తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (టీఎఫ్‌ఎపీఎ) ప్రకటించింది. ఎందుకూ అంటే.. ‘వర్చువల్ ప్రింట్ ఫీ’ (వీపీఎఫ్)ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్యూబ్ సినిమాస్, యూఎఫ్ఓ ‘వీపీఎఫ్’లో 60 శాతం తగ్గిస్తామని, థియేటర్ యాజమాన్యానికి నిర్మాతలు 40 శాతం చెల్లిస్తే చాలని పేర్కొన్నాయి. కానీ వంద శాతం తగ్గించాలన్నది టీఎఫ్‌ఎపీఎ డిమాండ్. తగ్గించకపోతే కొత్త సినిమాలను విడుదల కానివ్వమని కూడా పేర్కొన్నారు. కొన్ని రోజులుగా జరిగిన ఈ చర్చకు మంగళవారం ఫుల్ స్టాప్ పడింది. క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో రెండు వారాలకు వర్చువల్ ప్రింట్ ఫీ వసూలు చేయమని పేర్కొనడంతో కొత్త సినిమాల విడుదలకు టీఎఫ్‌ఎపీఎ అనుమతిచ్చింది. నవంబర్ 30 వరకు వర్చువల్ ప్రింట్ ఫీ వసూలు చేయమని క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులు ప్రకటించడంతో తమిళ సినిమా నిర్మాతలు కొత్త ఉత్సాహంతో 9 నూతన చిత్రాలను విడుదల చేయటానికి ముందుకు వచ్చారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, హీరోగా చేస్తున్న సంతానం నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘బిస్కోత్’, సంతోష్ పి జయకుమార్ నటించి, దర్శకత్వం వహించిన హారర్ మూవీ ‘ఇరండామ్ కూత్తు’, జీవా అరుళ్ నిధి హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కళత్తిల్ సందిప్పోమ్’, టీజే అరుణాచలం, ఫౌజీ నటించిన యాక్షన్ డ్రామా ‘తాట్రోమ్ తూక్రోమ్’ వంటి కొత్త సినిమాలు పండగకు విడుదలవుతున్నాయి. థియేటర్లో ఉన్న సినిమాలు మంగళవారం తమిళనాడులో థియేటర్లు తెరచుకున్నాయి. అయితే వీపీఎఫ్ విషయంలో మంగళవారం సాయంత్రం వరకూ ఒక క్లారిటీ లేకపోవడంతో లాక్ డౌన్‌కి ముందు విడుదలైన సినిమాలను ప్రదర్శించాలనుకున్నారు. విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’, దుల్కర్ సల్మాన్ ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లై అడిత్తాల్’, హిందీ చిత్రం ‘విక్కీ డోనర్’కి రీమేక్ గా రూపొంది, ఈ ఏడాది మార్చిలో థియేటర్లు మూతబడక ముందు విడుదలైన ‘దారాళ ప్రభు’ వంటి తమిళ చిత్రాలతో పాటు తెలుగు హిట్స్ ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’, ‘హిట్’ కూడా తమిళ తెరపై ప్రదర్శితమవుతున్నాయి. అలాగే హిందీ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘అంధాధూన్’ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ ఈ నెల 14 వరకూ థియేటర్లలో ఆడతాయని తెలిసింది. ఆ తర్వాత కొత్త సినిమాలను ప్రదర్శించేలా ప్లాన్ చేశారని కోలీవుడ్ టాక్. నిజానికి కేంద్ర ప్రభుత్వం థియేటన్ల రీ ఓపెన్‌కి అనుమతి ఇచ్చినా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ‘ఇప్పట్లో వద్దు’ అని పేర్కొంది. అందుకే ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా)ని ఓటీటీలో విడుదల చేయాలని హీరో, నిర్మాత సూర్య నిర్ణయించుకుని ఉండి ఉండొచ్చు. థియేటర్ల ఆరంభం, వీపీఎఫ్ విషయంలో ఓ స్పష్టత ఉండి ఉంటే.. పండగకి సూర్య లాంటి స్టార్ కూడా తెరపై కనిపించి ఉండేవారు. దీపావళికి ఏ సినిమానీ విడుదల చేయకూడదని ముందుగా నిర్ణయం తీసుకున్నాం. సినిమావారికి పండగ సీజన్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొని క్యూబ్, యూఎఫ్ఓ వంటి సంస్థలు ఈ నెల 30 వరకు వీపీఎఫ్ తీసుకోమని చెప్పడంతో కొత్త సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. నిర్మాతలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుని, ఒక్కరోజులో మీటింగ్ పెట్టుకుని ఇప్పటికే రెడీగా ఉన్న తొమ్మిది కొత్త సినిమాలను పండగకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది తమిళ సినిమా పరిశ్రమకు ఎంతో శుభ పరిణామం. – ధనుంజయ్, టీఎఫ్ఏపీఏ ఉపాధ్యక్షుడు -
ఓటీటీలో ఓనమ్
కేరళ పెద్ద పండగ ఓనమ్. మలయాళ సినిమాకి ప్రియమైన పండగ. ప్రతీ ఏడాది కనీసం నాలుగు కొత్త సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా థియేటర్లోకి వస్తాయి. అయితే ప్రతీ ఏడాది పండగ థియేటర్స్‌లో జరిగేది. ఈ ఏడాది ఇంట్లోనే జరగనుంది. పని ఆగిపోయుండొచ్చు. కానీ పండగ ఆగకూడదు. సంబరం అస్సలు ఆగకూడదు. తాజాగా మూడు మలయాళీ సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా ఇంటికి (ఓటీటీ)లోకి వస్తున్నాయి. ‘ఓటీటీలో ఓనమ్’ విశేషాలేంటో చూద్దాం. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ టోవినో థామస్ హీరోగా జో బేబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’. కేరళ టూరిజమ్‌ని ఆస్వాదించడానికి వచ్చిన ఓ విదేశీ అమ్మాయికి కేరళను పరిచయం చేసే పాత్రలో టోవినో పాత్ర ఉంటుంది. ఇదో రోడ్ మూవీ. హీరో హీరోయిన్ తమ బైక్ మీద కేరళను ఎలా చుట్టేస్తారనేది కథలో ముఖ్యభాగం. హీరోగా నటించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించారు టొవినో. ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అంతే కాదు ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని నేరుగా టీవీలోనూ (ఏషియానెట్ ఛానెల్) ప్రసారం చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. సీ యూ సూన్ లాక్డౌన్ వల్ల సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఓ కొత్త ఛాలెంజ్ స్వీకరించారు ఫాహద్ అండ్ టీమ్. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో ఫాహద్, రోషన్ మాథ్యూ, దర్శన ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సీ యూ సూన్’. ఈ చిత్రాన్ని చాలా శాతం వరకూ ఐ ఫోన్లోనే చిత్రీకరించారు. తప్పిపోయిన స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటర్నెట్ సహాయంతో ఎలా వెతికి పట్టుకున్నారన్నది కథాంశం. 98 నిమిషాలు నిడివి ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. మణియరాయిలే అశోకన్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే నిర్మాతగానూ మారారు. ఆయన నిర్మాణంలో వస్తున్న మరో సినిమా ‘మణియరాయిలే అశోకన్’. జాకోబ్, అనుమపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి షామ్జూ జేబా దర్శకత్వం వహించారు. అనుపమ హీరోయిన్గా నటించడం మాత్రమే కాకుండా ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేశారు. ‘‘ఇలాంటి ముద్దొచ్చే ప్రేమకథను నిర్మించడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు నటుడు దుల్కర్. ఈ సినిమాలో దుల్కర్ ఓ అతిథి పాత్ర చేశారని కూడా టాక్. ఈ చిత్రం నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. -
కరోనా కథలు
కరోనా అందర్నీ కుదిపేసింది. ఇలాంటి అనూహ్య ముప్పుని ఎవ్వరూ ఊహించలేదు. కరోనా మీద, కరోనా సమయంలో ఏర్పడ్డ సంక్షోభం మీద సినిమాలు చేస్తున్నట్టు ఆల్రెడీ పలువురు దర్శకులు ప్రకటించారు. తాజాగా కరోనా మీద మరో సినిమా ప్రకటన వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా మరికొందరు దర్శకులతో కలసి ఓ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా, కేతన్ మెహతా, సుభాష్ కపూర్ లతో కలసి అనుభవ్ సిన్హా ఓ ఆంథాలజీ (పలు కథల నేపథ్యంలో సినిమా) చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదుగురు దర్శకులు ఐదు కథలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అన్ని కథలూ కరోనా బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతాయని, స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అనుభవ్ సిన్హా తెలిపారు. ఈ సినిమాను ఆయనే నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ కథల్లో ప్రముఖ నటీనటులే కనిపిస్తారని సమాచారం. -
పండగ పోస్టర్లు
పండగ అనగానే సినిమా వాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందులోను సంక్రాంతి అనగానే ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వస్తుంది. కారణం వాళ్ల సినిమాలను విడుదల చేయటమే కాకుండా అనేక సినిమా ప్రమోషన్లను ఈ పండగకి ప్రారంభించటం ఆనవాయితీ. కొందరు తమ సినిమాల లుక్స్‌ను ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. రవితేజ, శ్రుతీహాసన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మలినేని గోపిచంద్ దర్శకుడు. సాయి మాధవ్ బుర్రా మాటల రచయిత. ఎస్. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘క్రాక్’ చిత్రం వేసవిలో విడుదల కానుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. మంగళవారం ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2న ‘లవ్‌స్టోరీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన పాత్రలను పోషించి మంచి మార్కులు కొట్టేసే నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను పండగ సందర్భంగా విడుదల చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కూడా వేసవి సందర్భంగానే విడుదల చేయాలనుకుంటున్నారు. -
కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్ ఇదే..!
హైదరాబాద్ : సైరాలో స్వాతంత్ర సమరయోధుడిగా వెండితెరపై అద్భుత నటనను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే తన 152వ సినిమాలో నక్సలైట్ పాత్ర పోషిస్తారనే ప్రచారం ఊహాగానమేనని వెల్లడైంది. కొరటాల మూవీలో మెగాస్టార్ లెక్చరర్ పాత్రలో అభిమానులను ఆకట్టుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదలైన సైరా రూ 250 కోట్ల కలెక్షన్లతో చిరు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంలా నిలిచింది. ఇక కొరటాల శివ మూవీలో తమ హీరోను కొరటాల ఎలా ప్రజెంట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో చిరును స్లిమ్‌గా కనిపించాలని దర్శకుడు కోరడంతో మెగాస్టార్ జిమ్ చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. క్లాస్ లుక్‌తో తనదైన మాస్ స్టైల్‌తో మెగా స్టార్ ఈసారి దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొరటాల మూవీలో మెగాస్టార్ 30 సంవత్సరాల యువకుడిగా, పెద్దవయసు వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. అయితే చిరంజీవి యువకుడిగా ఉన్న పాత్రలో దర్శకుడు కోరిన మీదట ఆయన కుమారుడు రామ్‌చరణ్ పోషస్తారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గోవింద్ ఆచార్య, గోవింద హరి గోవింద టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోంది. -
పండగ తెచ్చారు
ఈ దీపావళికి సినిమా అభిమానుల మనసుకి సంతోషమనే వెలుగును అందించింది టాలీవుడ్. కొత్త సినిమా ప్రకటనలు, చిత్రీకరణ విశేషాలు, కొత్త పోస్టర్స్‌తో దీపావళి సంబరాలను డబుల్ చేసింది. బాలకృష్ణ హీరోగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు బాలకృష్ణ. సి. కల్యాణ్, సి.వి. రావ్, పత్సా నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్మీ మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు విజయశాంతి. దీపావళి సందర్భంగా ఈ సినిమాలోని మహేశ్ కొత్త పోస్టర్‌తో పాటు, విజయశాంతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ‘అల.. వైకుంఠపురమలో..’ని ‘రాములో రాములా’ పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. ‘రాములో రాములా’ పూర్తి పాటను విడుదల చేశారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతలు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఖాకీ తొడిగి, లాఠీ పట్టి మరోసారి పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేయనున్నారు రవితేజ. పూజా హెగ్డే, అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా తన కొత్త సినిమా మొదలుకానున్నట్లు ప్రకటించారు రవితేజ. బి. మధు నిర్మించనున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. ‘‘టైటిల్‌ని బట్టి ఇది రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగే ఇతివృత్తం అనుకుంటారు కానీ, ఈ చిత్రకథాంశం అది కాదు. ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసి, సినిమాను నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’ సినిమా చిత్రీకరణ ఈ నెల 31 నుంచి నవంబరు 10వరకు కేరళలో జరగనుంది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో ఓ దృశ్యం శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది. సాయితేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్కేఎన్ సహ–నిర్మాత. డిసెంబరు 20న విడుదల కానుంది. ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఐబీ కార్తికేయన్ నిర్మాత. పి. ప్రభాప్రేమ్, మనోజ్, హర్ష సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కల్యాణ్‌రామ్, మెహరీన్ నిఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పులివాసు దర్శకుడు. నవీన్‌చంద్ర హీరోగా జి కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ‘హీరో హీరోయిన్’ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ దీపావళి పండగ ఇంకా చాలా పోస్టర్లను మోసుకొచ్చింది. బోలెడన్ని విశేషాలను తెచ్చింది. -
దసరా సరదాలు
దసరా పండగ వచ్చింది. సినీ ప్రియులకు కూడా పండగ తెచ్చింది. పలు సినిమాల అనౌన్స్మెంట్లు, ముహూర్తాలు, కొత్త లుక్స్ రిలీజ్‌తో సరదాలు తెచ్చింది. వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ట్రాక్టర్ మీద జంటలతో మామాఅల్లుళ్ల సందడి చూడొచ్చు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో...’ దసరా స్పెషల్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ‘నిశ్శబ్ధం’లో మాధవన్ మ్యూజీషియన్ ఆంథనీలా కనిపించనున్నారు. ఇందులో అనుష్క ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సుబ్బు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సాయితేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ అనే సినిమా ముహూర్తం జరిగింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా చేస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ లుక్ విడుదల అయింది. నందినీ రెడ్డి కొత్త చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకాదత్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. దసరా సందర్భంగా నేడు మరికొన్ని చిత్రాల టీజర్లు, ట్రైలర్లు విడుదలకానున్నాయి. ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్, ‘నిశ్శబ్ధం’లో మాధవన్ ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్‌బాబు బీవీఎస్ఎన్ ప్రసాద్, సాయి తేజ్ రాజ్ తరుణ్, షాలినీ పాండే -
డిసెంబర్లో షురూ
సినిమా తర్వాత సినిమా చేస్తూ స్పీడ్‌గా దూసుకెళ్లడం నాని స్టయిల్. ఒక సినిమా విడుదల అవ్వడం.. మరో సినిమా పట్టాలెక్కడం జరుగుతూనే ఉంది. నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్ అయింది. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్న ‘వి’ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌తో జరుగుతోంది. ఈ వారంలో థాయ్‌ల్యాండ్‌లో జరగనున్న షెడ్యూల్ కోసం ప్రయాణమయ్యారు నాని. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాని అంగీకరించారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో షురూ కానుంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తారు. ఇదిలా ఉంటే నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో ‘నిన్ను కోరి’ వంటి హిట్ సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. -
హాయ్ హైదరాబాద్
హిందీ హీరోలు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ హైదరాబాద్‌కు చాలాసార్లు హాయ్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి చిత్రాల షూటింగ్ ఇక్కడ జరగనుంది. అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమా కోసం ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో గుజరాత్ ప్రదేశాలను సెట్ వేయిస్తున్నారు. అది కూడా 1970 కాలం నాటివి కావడం విశేషం. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ సెట్లో త్వరలో ప్రారంభం కానుంది. 1971 ఇండియా–పాకిస్థాన్ కార్గిల్ వార్ సమయంలో గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను అభిషేక్ దుదియా తెరకెక్కిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి డైరెక్ట్‌గా... పది నిమిషాల యాక్షన్ సన్నివేశాల కోసం దాదాపు వారం రోజులు బ్యాంకాక్‌కు షిఫ్ట్ అయ్యారు అక్షయ్ కుమార్ అండ్ టీమ్. ఇప్పుడు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘సూర్యవన్షీ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ౖహైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియలో ప్రారంభం కానుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటుగా ఓ రొమాంటిక్ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. -
బిజీ నితీన్
‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తర్వాత ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించనున్నారు నితిన్. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండగా మరో రెండు సినిమాలను ప్రకటించారాయన. ‘‘చంద్రశేఖర్ యేలేటిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్‌గారు ఈ చిత్రం నిర్మిస్తారు. ఎం.ఎం. కీరవాణిగారు సంగీతం అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’ అన్నారు నితిన్. అలాగే ‘రైడ్, ఒక ఊరిలో, వీర’ వంటి సినిమాలను తెరకెక్కించిన రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం అంగీకరించారు నితిన్. హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్లో ‘ఎ’ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. నితిన్ నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల తరహాలో ఉంటుంది. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం (నట్టి) కెమెరామేన్‌గా పని చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
8 వారాలు ఆగాల్సిందే
సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో (అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్) కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో నడుస్తున్నప్పటికీ ఆన్లైన్లో ఉండటంతో రెవెన్యూ పరంగా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని కొందరి అభిప్రాయం. అందుకే ఈ నాలుగు వారాల సమయాన్ని ఎనిమిది వారాలకు పొడిగించాలని తెలుగు నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ‘‘ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాం అని రిలీజ్ అయిన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సినిమాను ఆన్లైన్లో పెట్టడంతో థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. అదే ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. -
ఇక తెలుగులో జోరుగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో గతేడాది జోరు చూపించారు ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ చిత్రం తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదామెæ. 2017 సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదలైంది. 2018లో ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొంచెం గ్యాప్ తర్వాత టాలీవుడ్‌పై మళ్లీ దృష్టి సారించినట్టున్నారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’లో చైతూతో జోడీ కట్టనున్నారు. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ సినిమాలో శ్రీదేవి పాత్ర చేసిన రకుల్ తాజాగా నితిన్ సరసన ఓ సినిమా అంగీకరించారట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో రకుల్‌ని తీసుకున్నా రట. ఇవి కాకుండా మరికొన్ని తెలుగు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట. -
బ్యాక్ టు బ్యాక్
లడ్డు కావాలా.. మరో లడ్డూ కావాలా ? అంటూ త్రిష ఫ్యాన్స్‌ని ఊరిస్తున్నారు తమిళ నిర్మాణ సంస్థ ఆల్ ఇన్ పిక్చర్స్. ఎందుకీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అంటే.. త్రిష చేయబోయే తదుపరి రెండు చిత్రాలు ఈ బ్యానరే నిర్మించనుంది కాబట్టి. త్రిష ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతోంది. ఇప్పటికీ సూపర్ హిట్స్ అందుకుంటూ, టాప్ స్టార్స్ సరసన నటిస్తున్నారామె. ఆల్రెడీ ఆమె నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉండగానే రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ‘‘తమిళంలో మా మొదటి చిత్రం ‘ గొరిల్లా’ విడుదల కాకముందే మరో రెండు సినిమాలు చేస్తున్నాం. త్రిషతో రెండు సినిమాలకు అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆ ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని పేర్కొంది నిర్మాణ సంస్థ. ‘‘ఆల్ ఇన్ పిక్చర్స్‌తో రెండు సినిమాలు చేయనుండటం ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాల కోసం వేచి చూడండి’’ అని త్రిష పేర్కొన్నారు. -
ఓ లుక్ వేయండి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సినిమా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’తో మాస్ టీజర్ అందిస్తే, వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఎలా ఉండబోతుందో అని చిన్న శాంపిల్ చూపించారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లో ఉన్న మనుషులు ఎలా ఉంటారో, రాజుగాడికి 50 ఏళ్లు వచ్చినా పెళ్లి అవుతుందో లేదో అనే టెన్షన్ పెట్టారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘భారత్’ అంటూ బలమైన డైలాగ్ వినిపిస్తే, ‘మణికర్ణిక’గా కంగనా వీరనారి ప్రతాపం చూపించారు. తమిళంలో జ్యోతిక ‘మహిళలూ వినండి... మీకు కొన్ని సూచనలు ఉన్నాయి’ అన్నారు. ఏది ఏమైనా అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్‌కు ఐ–ఫీస్ట్. ఓ లుక్ వేద్దాం. ఎంటబడ్డానా నరికేస్తా... ‘ఆది, సాంబ’ వంటి ఫ్యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్. మళ్లీ ఆ జానర్‌ని చాలా కాలంగా పూర్తి స్థాయిలో టచ్ చేయలేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో మళ్లీ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తుంది. సీమలో వీర రాఘవ రెడ్డి వీర విహారం ఎలా ఉంటుందో టీజర్ ద్వారా చిన్న శాంపిల్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?’ అంటూ మూడు వాక్యాల్లో హీరో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌ని జగపతిబాబు వాయిస్ ద్వారా మనకు పరిచయం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పట్టుకున్న కత్తికి తన కలంతో పదును పెట్టారు త్రివిక్రమ్. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డానా నరికేస్తా ఓబా..’ అంటూ సీమ యాసలో ఎన్టీఆర్ పలికిన సంభాషణలు టీజర్‌కి హైలైట్ అని చెప్పొచ్చు. జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కంచరపాలెం ప్రేమ ఫస్ట్ లుక్, ట్రైలర్స్ లాంటివి ఏమీ రిలీజ్ కాకముందే న్యూయార్క్ ఇండియన్æ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అఫీషియల్ ఎంట్రీ అందుకొని అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఇండిపెండెంట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. మొత్తం నూతన నటీనటులతోనే దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కంచరపాలెం అనే ఊరిలోని ప్రజలనే పాత్రలుగా.. వాళ్లందరికీ నటనలో వర్క్‌షాప్ చేసి కంచరపాలెం ఊళ్లోనే మొత్తం చిత్రాన్ని షూటింగ్ చేశారు దర్శకుడు వెంకటేశ్. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఒక ఊరిలోనే నాలుగు భిన్న వయసుల వారి మధ్య ప్రేమకథగా తెరకెక్కిందీ చిత్రం. మా సూచనలు వినండి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొన్ని సూచనలు ఇస్తున్నారు జ్యోతిక. ఇదంతా తన లేటెస్ట్ సినిమా ‘కాట్రిన్ మొళి’ ఫస్ట్ లుక్‌లో భాగమే. రాధామోహన్ దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘కాట్రిన్ మొళి’. హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులూ’కు రీమేక్ ఇది. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బుధవారం హీరో సూర్య రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో ‘‘మనసుకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఆకలేస్తే భర్త కంటే ముందే తినొచ్చు. భర్త ఒక చెంప మీద కొట్టాడని మరో చెంప చూపించాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినది మనం చేయొచ్చు. కావాలనుకుంటే బొద్దుగా ఉండొచ్చు. ఇంట్లో రోజువారి పనులను షేర్ చేసుకొమ్మని భర్తను అడగొచ్చు. సంపాదించొచ్చు, ఇంట్లో కూడా ఇవ్వాలి, నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనసులో కాదు.. అనుకున్నదాన్ని బయటకు అవును అని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. స్త్రీ, పురుషుడు ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అంటూ పది రూల్స్ ఉన్న బోర్డ్‌ని పట్టుకున్న జ్యోతిక ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు ‘కాట్రిన్ మొళి’ చిత్రబృందం. ఇందులో మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 18న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని జి. ధనుంజయ్ నిర్మించారు. నాకు రెండూ ఉన్నాయి సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్ ఖాన్ – అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘భారత్’. దేశభక్తి చిత్రంగా వస్తున్న ఈ చిత్రం డైలాగ్ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్ని బంధాలు రక్తం వల్ల ఏర్పడతాయి.. మరికొన్ని మట్టి వల్ల ఏర్పడతాయి. నా దగ్గర అవి రెండూ ఉన్నాయి’’ అంటూ సల్మాన్ ఖాన్ డైలాగ్స్ పలికారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సర్కస్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. పర్సనల్ కారణాలతో ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో నుంచి హీరోయిన్గా తప్పుకున్న తర్వాత కత్రినా కైఫ్ ఆ స్థానంలోకి వచ్చారు. మరో బ్యూటీ దిశా పాట్నీ కూడా ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం మాల్టాలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటమ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ కానుంది. వీరనారి ఝాన్సీ రణభూమిలో మణికర్ణిక ఎంత రౌద్రంగా, ఆవేశంగా ఉంటారో చిన్నప్పుడు ఎన్నో కథలు విన్నాం, చదువుకున్నాం. వెండి తెరపై చూపించదలిచారు దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్. ఝాన్సీ పోరాట పటిమ ఏ విధంగా ఉంటుందో మనకు సరిగ్గా అంచనా లేదు. ఆ ఆవేశాన్ని ఫస్ట్ లుక్ ద్వారా కొంచెంగా చూపించారు ‘మణికర్ణిక’ చిత్రబృందం. కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. భుజాన బిడ్డ, మొహంలో మొండి ధైర్యంతో యుద్ధ భూమిలో కత్తి పట్టుకున్న కంగనా రనౌత్ ఫొటోను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్లా రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రాన్ని రచించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లే అందించారు. వచ్చే ఏడాది జనవరి 25 ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్, తమిళంలో ‘జయం’ రవి ‘అడంగమారు’ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశాయి. మరో ప్రపంచంలోకి... వరుణ్ తేజ్ ఆకాశానికి నిచ్చెన వేశారు. అంతరిక్ష వీధిలో తన విధి నిర్వహించడానికి ఎన్నో సాహసాలు చే శారట. మరి ఆ విశేషాలన్నీ చూడాలంటే డిసెంబర్ 21 వరకూ వేచి చూడాల్సిందే. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపిహెచ్’. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఏదో మిషన్‌లో నిమగ్నమై ఉన్న వరుణ్ తేజ్ లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం జీరో గ్రావిటీ సెట్‌ని డిజైన్ చేశారు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు. దాని కోసం యూనిట్ అంతా జీరో గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కీమీ’ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మీ అందరి కోసం అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’’ అని వరుణ్ తేజ్ అన్నారు.. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. కెమెరా: జ్ఞానశేఖర్. -
థియేటర్లలో కాంబో దోపిడీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను అడ్డుపెట్టుకుని సినిమా థియేటర్లు దోపిడీకి తెరలేపారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో ప్యాక్ పేరుతో టిక్కెట్లను అమ్ముతున్నారు. కౌంటర్ల ద్వారా టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసి కాంబో ప్యాక్‌తో టిక్కెట్లను అమ్ముతూ థియేటర్ల యజమాన్యాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి టిక్కెట్‌పై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్యాక్‌లో కనీసం నాలుగు టిక్కెట్లు తీసుకోవాలని నిబంధన పెడుతున్నారు. మరోవైపు చిన్న థియేటర్లు కూడా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతూ దోచేస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు చూడాలన్న అభిమానుల ఆశలు తీరడం లేదు. ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైళ్ల చార్జీల రూపంలో అదనంగా వసూలు చేయడానికి తోడు పండుగ సమయంలో కుటుంబం మొత్తం ఆనందంగా సినిమా వీక్షించడం కూడా భారంగా మారిందని సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు అసహనంతో వెనుతిరిగుతున్నారు. -
‘వీడికి దూకుడెక్కువ’ మూవీ స్టిల్స్
-
జోరు పెంచిన పూరీ జగన్నాథ్
-
ఔను... త్రిష పెళ్లి ఆగిపోయింది!
-
జోరు పెంచిన చెర్రీ
-
ఆ చిత్రాల మధ్య పోటీ లేనట్లేనా?
భారతీయ సినిమా మాత్రమే కాదు ప్రపంచ సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు కోచ్చడయాన్, విశ్వరూపం-2. ఒక చిత్రంలో విశ్వ నటుడు కథనాయకుడు కాగా మరో చిత్రంలో ఇండియన్ సూపర్ స్టార్ హీరో. ఈ రెండు చిత్రాలు సాంకేతికపరంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతుండడం మరో విశేషం. భారీ తారాగాణంతో అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటున్న కోచ్చడయాన్, విశ్వరూపం-2 చిత్రాలు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రా లు ఒకేసారి తెరపైకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యం అయ్యేలా కనిపించడంలేదు. కోచ్చడయాన్ చిత్ర ఆడియోను ఈ నెల 28న, చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎప్పటిలానే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. మార్చి 9న ఆడియో విడుదల చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు. అయితే చిత్రం విడుదల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. విశ్వరూపం -2 విడుదల తేదీ మాత్రం మరోసారి వాయిదాపడనున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తి అయిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కోచ్చడయాన్‌కు పోటీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందుకు బయ్యర్లు ఒప్పుకోవడంలేదని తెలిసింది. రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదలయితే వసూళ్లు తగ్గిపోతాయని బయ్యర్లు అంటున్నారు. దీంతో విశ్వరూపం -2 చిత్రాన్ని కోచ్చడయాన్ చిత్రం విడుదలైన వారం తరువాత విడుదల చేయడానికి కూడా వారు అంగీకరించడంలేదు. అందువల్ల విశ్వరూపం-2 మే నెలకు వాయిదాపడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.