బిజీ నితీన్‌ | Venkat Prabhu and Eswari Rao in Vaibhav Reddy's next under Nithin | Sakshi
Sakshi News home page

బిజీ నితీన్‌

Published Fri, Mar 22 2019 12:33 AM | Last Updated on Fri, Mar 22 2019 12:33 AM

Venkat Prabhu and Eswari Rao in Vaibhav Reddy's next under Nithin - Sakshi

నితిన్‌

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తర్వాత ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించనున్నారు నితిన్‌. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండగా మరో రెండు సినిమాలను ప్రకటించారాయన. ‘‘చంద్రశేఖర్‌ యేలేటిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌గారు ఈ చిత్రం నిర్మిస్తారు. ఎం.ఎం. కీరవాణిగారు సంగీతం అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’ అన్నారు నితిన్‌.

అలాగే ‘రైడ్, ఒక ఊరిలో, వీర’ వంటి సినిమాలను తెరకెక్కించిన రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం అంగీకరించారు నితిన్‌. హవీష్‌ లక్ష్మణ్‌ కోనేరు ప్రొడక్షన్‌లో ‘ఎ’ స్టూడియోస్‌ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. నితిన్‌ నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల తరహాలో ఉంటుంది. ఆగస్ట్‌లో  రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. నటరాజన్‌ సుబ్రహ్మణ్యం (నట్టి) కెమెరామేన్‌గా పని చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement