![A Studios Production No 2 With Nithiin And Ramesh Varma - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/21/Srinivasa%20Kalyanam.jpg.webp?itok=WXVnlXtU)
సక్సెస్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న యంగ్ హీరో నితిన్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. అ ఆ తరువాత లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణం సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వటంతో తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్.
ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. రైడ్, వీర లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నితిన్. ఈ సినిమాను ఏ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment