
తమన్నా, నితిన్
నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్ట్రో’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘కళ్లు కనబడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు. కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’, ‘బట్ సమ్‌థింగ్ ఈజ్ మిస్సింగ్’ (ఏదో మిస్సవుతోంది)’ అనే సంభాషణలు ట్రైలర్‌లో ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.