Maestro Movie
-
బిగ్‌బాస్ స్టేజీపై రామ్‌చరణ్, బలమైన కారణంతో షోలో ఎంట్రీ
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో రెండోవారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే ఎలిమినేట్ అయ్యేది వీరేనంటూ ఈసారి విచిత్రంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. యానీ, నటరాజ్ మాస్టర్, ఉమాదేవిలలో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా వుంటే నేటి ఎపిసోడ్లో మాస్ట్రో టీమ్ సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో నితిన్, నభా నటేష్, తమన్నాలు బిగ్‌బాస్ ఇంటి సభ్యులను పలకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరివెంట రామ్‌చరణ్ కూడా ఉన్నాడు. ఇంతకీ ఈ యంగ్ హీరో ఇక్కడెందుకున్నాడంటారా? బిగ్‌బాస్ గురించి మరో సంచలన ప్రకటన చేయడానికి! ఈ సీజన్ ముగియగానే మినీ బిగ్‌బాస్ షోను ప్రవేశపెడతారట! ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం చేస్తారని, షో కూడా 50 రోజులు మాత్రమే కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ షోకు ఎక్కువగా సోషల్ మీడియా స్టార్లు, టీవీ యాంకర్లనే ఎంచుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరో ముఖ్య విషయమేంటంటే ఇందులో టాప్ 4 స్థానాల్లో నిలిచిన వారికి వచ్చే ఏడాది బిగ్‌బాస్ ఆరో సీజన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తారట! ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే ఇటీవలే రామ్‌చరణ్ హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే చెర్రీ ఈ షోకు వచ్చి ఉంటాడని అంటున్నారు మరికొందరు. మరి ఈ రెండింటింలో ఏది నిజం? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు
Tamanna Fan Cried After Watching Maestro: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకు హీరోయిన్గా కుర్రకారును ఆకట్టుకుంటూ లేడీ ఫ్యాన్స్‌ను అలరిస్తూ వచ్చింది. ప్పుడూ అల్లరి, అమాయక పాత్రలు పోషించి అందరి మదిని దోచిన ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అలాంటి సమంత తన తాజాగా చిత్రం ‘మాస్ట్రో’ నెగిటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.ఇందులో తమన్నా వరుస హత్యలు చేస్తూ సైలెంట్ కిల్లర్ పాత్ర పోషించి ఫ్యాన్స్‌ను భయపెట్టింది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో ఒక్కసారిగా తన నెగిటివ్ షెడ్‌ను చూపించేసరికి ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్ ఈ క్రమంలో తమన్నాను అలా చూసి ఏకంగా ఓ చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి ఎవరో కాదు డైరెక్టర్ మేర్లపాక గాంధీ చిన్న కూతురు లిపి. ఆమె తమన్నాకు పెద్ద ఫ్యాన్ అట. ఈ క్రమంలో నిన్న మాస్ట్రో మూవీ చూసిన లిపి తమన్నాను అలా చూసి ఏడుపు మొదలు పెట్టిన వీడియోను హీరో నితిన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. దీనికి ‘వాట్ యా.. నీ ఫ్యాన్‌ను ఏడింపించావు. ఈ రోజు నేను చూసిన క్యూట్ వీడియో ఇది. దర్శకుడు గాంధీ చిన్నకూతురు లిపి.. నీకు పెద్ద ఫ్యాన్’ అంటూ తమన్నాను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన తమన్నా ‘తప్పకుండా ఆ చిన్నారికి హగ్ ఇవ్వాల్సిందే’ అని కామెంట్ చేసింది. చదవండి: ‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ ఇక ఈ వీడియోలో ఆ చిన్నారి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా.. గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు అంటూ కన్నీరూ పెట్టుకుంటుంటే ఆమె తండ్రి డైరెక్టర్ గాంధీ తమన్నా నీ ఫేవరేట్ హీరోయిన్ హా అని అడుగుతాడు. అవును అనగానే అయితే ఇప్పుడు ఏమైందీ అనడంతో ఆ పాప తను ఎందుకు అలా అందరిని చంపుతుంది అంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి అది సినిమాలే అంటూ నచ్చజెప్పింది. కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో మూవీ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో అందుడిగా నితిన్, లేడీ విలన్‌గా తమన్నా పాత్రలకు మంచి రెస్పోన్స్ వస్తోంది. @tamannaahspeaks what ya… you made your fans cry? 😂… this was the cutest video I saw today .. Thats Gandhi’s little daughter Lipi who’s a big fan of you 🤗 MAESTRO only on @DisneyPlusHS pic.twitter.com/PtbwPMlG43 — nithiin (@actor_nithiin) September 17, 2021 -
‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాస్ట్రో నటీనటులు :నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్ నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి దర్శకత్వం: మేర్లపాక గాంధీ సంగీతం : మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ : వై యువరాజ్ ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్ విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021(డిస్నీ+హాట్‌స్టార్) భీష్మ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. కాని భీష్మ రేంజ్ హిట్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఆయన ఇటీవల చేసిన చెక్, రంగ్ దే మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని మాస్ట్రో లుక్‌లోకి మారాడు నితిన్. బాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ అంధాధున్‌కు తెలుగు రీమేక్. ఈ మూవీ శుక్రవారం(సెప్టెంబర్ 17)న ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిసారి నితిన్ అంధుడి పాత్ర పోషించడంతో మ్యాస్ట్రోపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు ‘మ్యాస్ట్రో’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. చూపు ఉన్న అంధుడిగా నటిస్తాడు అరుణ్(నితిన్). అతనిలో ఉన్న గొప్ప టాలెండ్ ఏంటంటే పియానో చక్కగా వాయించడం. ఒకసారి తన పియానో పాడవడంతో కొత్తది కొనాలని చూస్తాడు. ఈ క్రమంలో పెడ్రో అనే రెస్టారెంట్లో పియానో అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకొని,చూసేందుకు వెళ్తాడు. అక్కడ తన మ్యూజిక్ ప్రతిభ చూపించి అందరి మన్ననలు పొందుతాడు. అరుణ్ టాలెంట్ నచ్చి అతనితో ప్రేమలో పడిపోతుంది రెస్టారెంట్ ఓనర్ కూతురు సోఫీ(నభా నటేశ్). ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో మోహన్ (వీకే నరేష్).. అరుణ్ పియానో సంగీతానికి ఫిదా అవుతాడు. తన భార్య సిమ్రన్ (తమన్నా భాటియా) బర్త్‌డే సందర్భంగా ప్రైవేట్ కన్సర్ట్ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన ఇంటికి పిలుస్తాడు. అరుణ్ మోహన్ ఇంటికి వెళ్లేసరికి అతను హత్యకు గురవుతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఈ హత్యకు సిమ్రాన్, సీఐ బాబీ ( జిషు సేన్ గుప్తా)లకు సంబంధం ఏంటి? అరుణ్ అంధుడిగా ఎందుకు నటించాలనుకున్నాడు? మోహన్ హత్యతో అరుణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది తెలియాలంటే డిస్నీ+హాట్‌స్టార్‌లో సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నితిన్ తొలిసారి అంధుడిగా నటించిన సినిమా ఇది. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ చేశాడు. ఆయుష్మాన్‌కు సమానంగా అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నవ్వించిన నితిన్.. సెకండాఫ్‌లో భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. అంధుడు అరుణ్ పాత్రకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాడు. ఇక ఈ సినిమాలో నితిన్ తర్వాత బాగా పండిన పాత్ర తమన్నాది. సిమ్రన్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. హిందీలో టబు పోషించిన పాత్ర అది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. సోఫి పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ మెప్పించింది. జిషు సేన్ గుప్త, నభా నటేశ్, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. హిందీలో వచ్చి, సూపర్ హిట్ అయినా ‘అంధాధున్’ మూవీకి తెలుగు రీమేకే‘మ్యాస్ట్రో’.సాధారణంగా రీమేక్ అనగానే మాతృకతో పోల్చి చూస్తారు. అందులో ఉన్నది.. ఇందులో లేనిది ఏంటని నిశితంగా పరిశీలిస్తారు. ఉన్నది ఉన్నట్లు తీస్తే కాపీ అంటారు. ఏదైనా యాడ్ చేస్తే.. అనవసరంగా యాడ్ చేసి మంచి సినిమాను చెడగొట్టారని చెబుతారు. అందుకే రీమేక్ అనేది దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విజయవంతం అయ్యాడు. మాతృకలోని ఆత్మను ఏమాత్రం చెడకుండా ‘అంధాదున్’ని తెలుగు ప్రేక్షకులు మ్యాస్ట్రోగా అందించాడు. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే లాంటి దిగ్గజ నటులు సెట్ చేసిన టార్గెట్‌ని వందశాతం అందుకోలేకపోయినా.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నితిన్ చేసే సరదా సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సీఐ బాబీ అరుణ్ణి చంపాలనుకోవడం.. దాని నుంచి అరుణ్ తప్పించుకొని గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించే సీన్స్ ఆసక్తిని కలిగిస్తాయి. సెకండాఫ్‌లో అరుణ్, సిమ్రన్ మధ్యల వచ్చే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్. ఇక క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. అంధాదున్ సినిమా చూడకుండా డెరెక్ట్‌గా మాస్ట్రో చూసేవారిని థ్రిల్లింగ్ మూవీ చూశామనే అనుభూతి కలుగుతుంది. మహతి స్వర సాగర్ బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వై యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సమయంలో మాస్ట్రో అవసరమా అనుకున్నా: నితిన్
‘‘అంధాధున్’ కాస్త కల్ట్ సినిమా. తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కొంచెం భయం వేసింది. ఈ సమయంలో అవసరమా? కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవచ్చు కదా? అని. కానీ ఒక నటుడిగా రిస్క్ తీసుకోవాలి. ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమా చేయాలని ఒప్పుకున్నా’’ అన్నారు నితిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్ట్రో’. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ.. ‘‘అంధాధున్’ రీమేక్‌కి డైరెక్టర్ ఎవరు? అనుకుంటే మా అందరి ఛాయిస్ మేర్లపాక గాంధీ. ఒరిజినల్ సోల్ మిస్ కాకుండా హ్యమర్ యాడ్ చేసి బాగా తీశాడు. ‘అంధా ధున్’ ఎంత బాగుంటుందో ‘మాస్ట్రో’ కూడా అంతే బాగుంటుంది. హిందీలో నటీనటులే ‘అంధాధున్’ని ఒక లెవల్‌కి తీసుకెళ్లారు. మన తెలుగులో నేను, తమన్నా, నభాతో పాటు అందరం బాగా చేశాం. కొన్ని రిస్క్‌లు కూడా తీసుకున్నాం. ఈ సినిమాలో మంగ్లీతో యాక్టింగ్ చేయించడం ఒక డేరింగ్ స్టెప్’’ అన్నారు. చిత్రసమర్పకులు రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ.. ‘‘అంధా ధున్’ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి రీమేక్‌గా రుపొందిన ‘మాస్ట్రో’ చిత్రానికి నటీనటులను ఎంచుకోవడం పెద్ద ఛాలెంజ్. నితిన్, తమన్నా, నభా నటేశ్, నరేశ్.. ఇలా అందరి పాత్రలు చాలా బాగుంటాయి. మేర్లపాక గాంధీ ప్యాషనేట్ డైరెక్టర్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిగార్లతో కలసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. నిఖితా రెడ్డి మాట్లాడుతూ..‘‘మేర్లపాక గాంధీ ఈ రీమేక్‌ని చాలా బాగా చేశారు. నితిన్, తమన్నా, నభా నటేశ్‌తో పాటు అందరూ వారి వారి పాత్రలకు సరిగ్గా సరిపోయారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ.. ‘అంధా ధున్’ లాంటి సినిమాకి భాష అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనుకున్నాను. ఇప్పుడు వస్తోంది. లవ్‌స్టోరీ కాకుండా ఓ డిఫరెంట్ మూవీలో నితిన్‌తో కలిసి యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది. అంధుడిగా యాక్ట్ చేయడం చాలా కష్టం. నితిన్ అలాంటి పాత్రకు ఓకే చెప్పి ధైర్యంగా ముందడుగు వేశారు. ఓ సక్సెస్ఫుల్ సినిమాను మేర్లపాక గాంధీగారు తనదైన స్టైల్లో తీశారు. ఆయన కష్టం ప్రేక్షకులకు నచ్చుతుందను కుంటున్నాను’’ అని అన్నారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘‘నితిన్ అన్నతో ఓ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘అంధాధున్’ లాంటి మంచి ఆర్టిస్టిక్ ఫిల్మ్‌ని తనతో చేయడం హ్యాపీ. ‘అంధా ధున్’కు, ‘మాస్ట్రో’కు పోలికలు పెట్టవద్దన్నా పెడతారు. నిందించడానికో లేదా అభినందించడానికో అయినా సరే.. సినిమా చూడండి’’ అన్నారు. ఈ వేడుకలో నభా నటేష్, వీకే నరేశ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్, పాటల రచయితలు కాసర్ల శ్యామ్, భాస్కర భట్ల, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ అంటారు!
‘‘రీమేక్ సినిమాకి పోలికలు పెడతారు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ, పేస్ట్ అని ఆరోపిస్తారు. మార్పులు చేస్తే ఒరిజినల్ ఫిల్మ్ సోల్‌ను చెడగొట్టారని విమర్శిస్తారు. రీమేక్స్‌కి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు మేర్లపాక గాంధీ. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్’కి రీమేక్‌గా రూపొందిన ‘మాస్ట్రో’కు మేర్లపాక గాంధీ దర్శకుడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ చెప్పిన విశేషాలు. ►‘అంధా ధున్’లోని థ్రిల్లింగ్, డార్క్ హ్యూమర్ అంశాలు నచ్చి, రీమేక్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నితిన్, సుధాకర్ రెడ్డిగార్లు ఈ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు. మన నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీని మార్చాం. ఒరిజినల్ సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్‌ను అలాగే వాడాం. ‘మాస్ట్రో’లో నితిన్ అంధుడిగా బాగా నటించారు. హిందీలో టబు చేసిన రోల్‌కు తమన్నాను తీసుకోవాలన్నది నా ఆలోచనే. ►ఒక స్క్రిప్ట్ అనుకుని డెవలప్ చేస్తూ, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక ఎగై్జటింగ్‌గా అనిపించకపోతే ఇంకో కొత్త స్క్రిప్ట్‌ను స్టార్ట్ చేస్తా. అందుకే నా సినిమాల మధ్య గ్యాప్ వస్తోంది. సినిమాలను ఫాస్ట్‌గా తీస్తాను కానీ కథలు రాయడంలో మాత్రం కాస్త లేట్. మా నాన్న (రచయిత మేర్లపాక మురళి)గారు నావెల్స్ రాస్తుంటారు.‘ఏక్ మినీ కథ’ సినిమా కథ నాదే. నాన్నగారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా నచ్చుతుందనుకుని చేశాను. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. -
Maestro: ప్రమోషనల్ సాంగ్ అదిరిందిగా!
నితిన్, నభా నటేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హిందీ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘అంధాధున్’మూవీకి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్క్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యం శనివారం ప్రమోషన్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘షూరూ కరో’అంటూ సాగే ఈ పాట హీరో, హీరోయిన్ల లైఫ్ గురించి తెలియజేస్తుంది. ఈ సాంగ్‌కి శ్రిమణి లిరిక్స్ అందించగా, రేవంత్ ఆలపించాడు. మహతి స్వర సాగర్ అధ్భుత సంగీతాన్ని అందించాడు. (చదవండి: మాస్ట్రో’చూశాక జనాలు ఆ మాటే చెబుతారు : నభా నటేశ్) -
‘మాస్ట్రో’చూశాక జనాలు ఆ మాటే చెబుతారు : నభా నటేశ్
‘అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంధాదున్ గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది’అన్నారు హీరోయిన్ నభా నటేశ్. నితిన్, నభా నటేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రాబోతోన్న సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ► ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే అద్బుతంగానటించింది. కానీ అది నేను ఎలా చేయగలను? అని భయం వేసింది. కానీ మళ్లీ సినిమా చూడకూడదు..ప్రభావితం అవుతాను అని అనుకున్నాను. ► కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. మేమే మొదటగా సెట్‌కు వెళ్లామనుకుంటాను. అప్పుడు రెస్టారెంట్, పబ్ సీన్స్ చేశాం. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. షాట్ చేసేసి మేం పరిగెత్తే వాళ్లం. మా జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్లం. అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా సీన్స్, సాంగ్స్ బాగా వచ్చాయి. ► కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది. ► కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. ► రీమేక్ చేయడం ఇదే మొదటి సారి. కచ్చితంగా పోలికలు ఉంటాయి. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ► లాక్డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్‌లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈ సారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు. ► డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. ► లాక్డౌన్ తరువాత ఇండియాలోనే మొదటి సారి షూటింగ్ చేసింది మేమే. సోలో బతుకే సో బెటర్ సినిమాను కూడా రిలీజ్ చేశాం. అప్పుడు భయభయంగానే చేశాం. వీలైనంత తక్కువ మందితో, అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశాం. కానీ ఇప్పుడు అంత భయం లేదు. అలవాటు అయింది. ► మన తెలుగు సినిమాకు ఉండే ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటారు. మన వారి కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేశాం. పాటలు కూడా కనెక్ట్ అయ్యేలానే పెట్టాం. మన తెలుగు ఆడియెన్స్ రీచ్ వేరు. ఒరిజినల్ సినిమాను చూసినా కూడా ఇది కూడా చూస్తారు. కొత్త చిత్రాల కోసం మన వాళ్లు ఎదురుచూస్తున్నారు. అదే మాకు అడ్వాంటేజ్. నేను కూడా ఇంకా ఈ సినిమాను చూడలేదు. ఎంతో ఎదురుచూస్తున్నాను. ► నితిన్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించాం.. ఎప్పుడు పూర్తి చేశామో కూడా తెలియకుండా గడిచింది. దర్శకుడు, చిత్రయూనిట్ మొత్తం, తమన్నా ఇలా అందరూ ఎంతో సహకరించారు. ► భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మాస్ట్రోలోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను. -
మాస్ట్రో మూవీ టీమ్ ఇంటర్వ్యూ
-
నితిన్ మాస్ట్రో మూవీ ఇంట్రెస్టింగ్ వీడియో
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ మంచి స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో అంధుడిగా నితిన్ లుక్, తమన్నా రోల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉండగా నేడు(ఆగష్టు 30) క్రిష్ణాష్టమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. క్రిష్ణాష్టమి పండుగ సందర్భంగా నితిన్ అభిమానుల కోసం స్నీక్‌పీక్ పేరుతో మేకర్స్ ఈ విడియోను విడుదల చేశారు. చదవండి: సెప్టెంబర్ 17న నితిన్ మాస్ట్రో: హాట్‌స్టార్ ప్రకటన Here's the Sneak Peek of #MAESTRO's World🎹 ▶️ https://t.co/IPzacMAkMa Set your clock! #MaestroOnHotstar from Sep17th only on @DisneyPlusHS @actor_nithiin @tamannaahspeaks@NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella pic.twitter.com/AK4Ylg340M — Sreshth Movies (@SreshthMovies) August 30, 2021 నితిన్ పియానో వాయిస్తుండగా పిల్లి మెట్లపై నడుచుకుంటూ వస్తున్న ఈ వీడియో మూవీపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ను తెలుగు రీమేక్‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇది నితిన్ 30వ మూవీ కావడం విశేషం. నితిన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీకి ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నభా నటేష్, తమన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు. చదవండి: ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ.. -
సెప్టెంబర్ 17న నితిన్ మాస్ట్రో: హాట్‌స్టార్ ప్రకటన
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్నీహాట్ స్టార్ సంస్థ దీనిపై అధికారిక ప్రకట ఇచ్చింది. హీరో నితిన్ ఇది 30వ చిత్రం. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్లో నితిన్ నల్లటి కళ్లద్దాలు ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. చదవండి: పవన్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేశ్ గుడ్ న్యూస్.. థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ #Maestro Premiers Sept 17 on HOTSTAR. pic.twitter.com/S0danwjiOV — Christopher Kanagaraj (@Chrissuccess) August 28, 2021 ఈ సినిమాలోని ప్రధాన తారాగణంతో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషించింది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి-నికిత రెడ్డిలు ఈ మూవీని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. -
ఏదో మిస్సవుతోంది!
నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్ట్రో’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘కళ్లు కనబడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు. కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’, ‘బట్ సమ్‌థింగ్ ఈజ్ మిస్సింగ్’ (ఏదో మిస్సవుతోంది)’ అనే సంభాషణలు ట్రైలర్లో ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
ఆసక్తిగా నితిన్ ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్, సరికొత్తగా తమన్నా..
హీరో నితిన్- నభా నటేశ్ జంటగా రూపొందుతున్న చిత్రం మాస్ట్రో. నితిన్ 30వ సినిమాగా మేర్లపాక గాంధీ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టంబర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగిని ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. అంధుడిగా నితిన్ నటన మెప్పిస్తోంది. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇక తమన్నా ఇందులో నెగిటివ్ రోల్లో భయపెట్టనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖ్యం నితిన్-తమన్నా మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇలా ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. కాగా మాస్ట్రో హిందీ చిత్రం ‘అంధాధున్’కు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డిలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. (చదవండి: నాని బాటలోనే హీరో నితిన్.. ‘మాస్ట్రో’ నిర్మాతల క్లారిటీ) చదవండి: ఫుట్‌బోర్డ్ చేస్తూ సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్ -
ప్రేమకథ చీకటిని మిగిల్చిందంటున్న నితిన్
Vennello Aadapilla Full Song: ఈ ఏడాది రెండు వరుస ఫ్లాఫులతో నిరాశలో ఉన్నాడు హీరో నితిన్. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. అతడు అంధుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నభా నటేష్ హీరోయిన్గా తమన్నా భాటియా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమాలోని‘అనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే.. వెన్నెల్లో ఆడపిల్లే తనా.. ఈ చీకటై మిగిలానా..’ పూర్తి పాట రిలీజైంది. ఈ ఫీల్‌గుడ్ మెలోడీ సాంగ్ జనాలను ఆకట్టుకుంటోంది. అందంగా మొదలైన తన ప్రేమకథ చివరకు చీకటిని మిగిల్చిందని బాధపడుతున్నాడీ హీరో. మరి హీరో పాటతో హీరోయిన్ మనసు కరిగిందా? వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందా? అన్నది సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాటను స్వీకర్ అగస్తి ఆలపించారు. శ్రీజో–కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి–నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్. -
'మాస్ట్రో' :ఆ ఒక్క సాంగ్ కోసం అరకోటి ఖర్చుపెట్టారట!
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్‌కు రీమేక్ ఇది. నితిన్‌కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, హిందీలో 'టబు' చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రలు పోషించిన నటీనటులపై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఒక్క పాట కోసమే మేకర్స్ దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా ప్రమోఫన్స్లో ముఖ్యంగా ఈ పాటనే వాడతారట. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
‘మాస్ట్రో’ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది...
నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని బేబీ..ఓ బేబి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతులేని కళ్లలోకిలా అందం వచ్చి దూరితే ఎలా అంటూ సాగుతున్న ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీజో లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడారు. 'భీష్మ'తో నితిన్ కు మ్యూజికల్ హిట్ ఇచ్చిన మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సిద్ధం కానుంది. -
‘మాస్ట్రో’ అప్డేట్ : లిరికల్ సాంగ్ ప్రోమో
నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా తమన్నా కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని బేబీ..ఓ బేబి సాంగ్ లిరికల్ ప్రోమో వీడియోను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. హిందీ హిట అంధాదున్‌కు తెలుగు రీమేక్‌గా ‘మాస్ట్రో’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
Maestro: బీచ్‌లో పియానో వాయిస్తున్న నితిన్
వెర్సటైల్ హీరో నితిన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం `మ్యాస్ట్రో`. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. నెక్ట్స్ వీక్ నుండి మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభంకానుందని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్లో నితిన్ బీచ్‌లో పియానో వాయిస్తూ కనిపిస్తున్నారు. నితిన్ హిట్ మూవీ ‘భీష్మ’కు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ ఈ మ్యాస్ట్రో చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను ఆశించొచ్చు. ఇప్పటికే నితిన్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. 🎹 #MaestroMusicFest 🎹 Begins next week - A @mahathi_sagar Musical! 🥁 'Youth Star' @actor_nithiin as #Maestro arriving soon! 🎵@tamannaahspeaks @MerlapakaG @SreshthMovies @NabhaNatesh #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella pic.twitter.com/eLmHiSZlNP — Sreshth Movies (@SreshthMovies) July 10, 2021 -
నితిన్ స్పీడ్ మామూలుగా లేదుగా..
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదున్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్‌కు జోడీగా నభా నటేష్ నటిస్తుండగా, తమన్నా నెగిటివ్ షేడ్‌లో కనిపించనుంది. కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలె మొదలైంది. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టిన తొలి తెలుగు హీరో నితిన్ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముగిసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. అతి త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రం థియేటర్లో విడుదల కానున్నట్లు సమాచారం. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి : ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ' 'రాజా విక్రమార్క'గా కార్తికేయ..ఫస్ట్‌లుక్ విడుదల -
నితిన్ డేరింగ్ స్టెప్: షూటింగ్ మొదలు
గతేడాది భీష్మతో భారీ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. కానీ ఏడాది మాత్రం అతడు నటించిన రెండు సినిమాలు చెక్, రంగ్‌దే నిరాశనే మిగిల్చాయి. దీంతో అతడు అంధుడిగా నటిస్తున్న మాస్ట్రోతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో మాస్ట్రో ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నారట. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టిన తొలి తెలుగు హీరో నితినే కావడం విశేషం. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న మాస్ట్రోలో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే -
ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయిన తెలుగు సినిమాలివే!
గతేడాది కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ నుంచి ఈ ఏడాది మొదట్లో కాస్త కోలుకుంటున్నట్లు అనుకునేలోపే మళ్లీ సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని సందిగ్ధత ఏర్పడింది. దీంతో నిర్మాతలు కూడా ఇప్పుడు ఓటీటీకే జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు సైతం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అవేంటో చూసేద్దాం.. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యం 2 షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందే ఈ సినిమాను ఓటీటీలో చేయాలని భావించినా నిర్మాత సురేశ్ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఈ విషయంలో వెంకటేష్ కూడా సముఖత వ్యక్తం చేశారని, 'దృశ్యం 2'ను ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘అంధాదున్’కి రీమేక్ ఇది. నటా నటేశ్ హీరోయిన్గా నటిస్తోండగా తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుదల చేయాలని బావించినా కరోనా కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని బావిస్తున్నారట. ఇందుకు సంబంధించి నిర్మాతలు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం `పాగల్`.నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక జూన్‌లో ఈ మూవీని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం అందుకు తగ్గ పరిస్థితులు లేవు. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో డీల్ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి : ప్రియాంకకు షారుఖ్ కిస్: విడాకులిస్తానని భార్య బెదిరింపులు! Prabhas-Nag Ashwin Movie: రెమ్యునరేషనే రూ.200 కోట్లట! -
నభా నటేశ్‌తో బైక్ రైడ్‌కి వెళ్లిన నితిన్
జయాపజయాలతో సంబంధం లేకుండా వరసు సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను వదిలాడు. వాటిలో ‘చెక్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా, ‘రంగ్‌దే’ పర్వాలేదనిపించింది. ఇక నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘అంధాదున్’కి రీమేక్ ఇది. నటా నటేశ్ హీరోయిన్గా నటిస్తోంది. నితిన్ పుట్టిన రోజున(మార్చి 30) ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వదిలిన చిత్ర బృందం, తాజాగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. Love is Blind and Love doesn’t Discriminate! #MAESTRO🎹 is on the way with his girl to wish you a Happy #SriRamaNavami 🏹💥@actor_nithiin @NabhaNatesh @tamannaahspeaks @MerlapakaG @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella @mahathi_sagar @Jisshusengupta pic.twitter.com/RO3GdbcDuI — BARaju (@baraju_SuperHit) April 21, 2021 చదవండి: గుండుతో హీరోయిన్ రష్మిక!.. ఫోటోలు వైరల్ 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది'