Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో రెండోవారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే ఎలిమినేట్ అయ్యేది వీరేనంటూ ఈసారి విచిత్రంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. యానీ, నటరాజ్ మాస్టర్, ఉమాదేవిలలో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా వుంటే నేటి ఎపిసోడ్‌లో మాస్ట్రో టీమ్ సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో నితిన్, నభా నటేష్, తమన్నాలు బిగ్‌బాస్ ఇంటి సభ్యులను పలకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరివెంట రామ్‌చరణ్ కూడా ఉన్నాడు. ఇంతకీ ఈ యంగ్ హీరో ఇక్కడెందుకున్నాడంటారా? బిగ్‌బాస్ గురించి మరో సంచలన ప్రకటన చేయడానికి!
ఈ సీజన్ ముగియగానే మినీ బిగ్‌బాస్ షోను ప్రవేశపెడతారట! ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం చేస్తారని, షో కూడా 50 రోజులు మాత్రమే కొనసాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ షోకు ఎక్కువగా సోషల్ మీడియా స్టార్లు, టీవీ యాంకర్లనే ఎంచుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరో ముఖ్య విషయమేంటంటే ఇందులో టాప్ 4 స్థానాల్లో నిలిచిన వారికి వచ్చే ఏడాది బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తారట! ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే ఇటీవలే రామ్‌చరణ్ హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే చెర్రీ ఈ షోకు వచ్చి ఉంటాడని అంటున్నారు మరికొందరు. మరి ఈ రెండింటింలో ఏది నిజం? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment