నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్‌కు రీమేక్ ఇది. నితిన్‌కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, హిందీలో 'టబు' చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే..ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రలు పోషించిన నటీనటులపై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఒక్క పాట కోసమే మేకర్స్ దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా ప్రమోఫన్స్‌లో ముఖ్యంగా ఈ పాటనే వాడతారట. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment