Baby O Baby, Nithiin Maestro Movie Release Lyrical Song- Sakshi
Sakshi News home page

‘మాస్ట్రో’ మూవీ నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ వచ్చేసింది...

Published Fri, Jul 16 2021 12:40 PM | Last Updated on Fri, Jul 16 2021 3:18 PM

Baby O Baby Lyrical Song From Nithiins Maestro Movie - Sakshi

నితిన్‌, నభా నటేష్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అంధాదున్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని బేబీ..ఓ బేబి లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అంతులేని కళ్లలోకిలా అందం వచ్చి దూరితే ఎలా అంటూ సాగుతున్న ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది.

 శ్రీజో లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడారు. 'భీష్మ'తో నితిన్ కు మ్యూజికల్ హిట్ ఇచ్చిన మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సిద్ధం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement