నితిన్‌ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. | Hero Nithins Maestro Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

నితిన్‌ స్పీడ్‌ మామూలుగా లేదుగా..

Published Sun, Jun 20 2021 4:11 PM | Last Updated on Sun, Jun 20 2021 4:12 PM

Hero Nithins Maestro Movie Shooting Completed  - Sakshi

నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన అంధాదున్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్‌కు జోడీగా నభా నటేష్‌ నటిస్తుండగా, తమన్నా నెగిటివ్‌ షేడ్‌లో కనిపించనుంది. కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలె మొదలైంది. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టిన తొలి తెలుగు హీరో నితిన్‌ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముగిసింది.

ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. అతి త్వరలోనే ఈ మూవీని రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుందట. ఇక తెలంగాణలో లాక్‌‌డౌన్‌ను ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

చదవండి : ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ : కీలక పాత్రలో 'జయమ్మ'
'రాజా విక్రమార్క'గా కార్తికేయ..ఫస్ట్‌లుక్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement