నితిన్‌ మాస్ట్రో మూవీ ఇంట్రెస్టింగ్‌ వీడియో | Maestro Movie: Interesting Video Release From Nithin Maestro Movie | Sakshi
Sakshi News home page

కృష్ణాష్టమి: నితిన్‌ మాస్ట్రో మూవీ నుంచి ఇంట్రెస్టింగ్‌ వీడియో

Published Mon, Aug 30 2021 3:37 PM | Last Updated on Mon, Aug 30 2021 3:44 PM

Maestro Movie: Interesting Video Release From Nithin Maestro Movie - Sakshi

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ మంచి స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో అంధుడిగా నితిన్‌ లుక్‌, తమన్నా రోల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉండగా నేడు(ఆగష్టు 30) క్రిష్ణాష్టమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ వీడియో బయటకు వచ్చింది. క్రిష్ణాష్టమి పండుగ సందర్భంగా నితిన్‌ అభిమానుల కోసం స్నీక్‌పీక్‌ పేరుతో మేకర్స్‌ ఈ విడియోను విడుదల చేశారు. 

చదవండి: సెప్టెంబర్ 17న నితిన్‌ మాస్ట్రో: హాట్‌స్టార్‌ ప్రకటన

నితిన్‌ పియానో వాయిస్తుండగా పిల్లి మెట్లపై నడుచుకుంటూ వస్తున్న ఈ వీడియో మూవీపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తోంది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ను తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇది నితిన్ 30వ మూవీ కావడం విశేషం. నితిన్‌ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీకి ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నభా నటేష్‌, తమన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు. 

చదవండి: ఆయనో స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement