మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్‌ గాంధీ కూతురు | Merlapaka Gandi Daugter Cries After Watching Maestro Movie | Sakshi
Sakshi News home page

Maestro Movie: గాంధీ తమన్నా బ్రెయిన్‌ మార్చేశాడు: డైరెక్టర్‌ కూతురు

Published Sat, Sep 18 2021 1:27 PM | Last Updated on Sat, Sep 18 2021 1:43 PM

Merlapaka Gandi Daugter Cries After Watching Maestro Movie  - Sakshi

Tamanna Fan Cried After Watching Maestro: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇప్పటి వరకు హీరోయిన్‌గా కుర్రకారును ఆకట్టుకుంటూ  లేడీ ఫ్యాన్స్‌ను అలరిస్తూ వచ్చింది. ప్పుడూ అల్లరి, అమాయక పాత్రలు పోషించి అందరి మదిని దోచిన ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అలాంటి సమంత తన తాజాగా చిత్రం ‘మాస్ట్రో’ నెగిటివ్‌ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.ఇందులో తమన్నా వరుస హత్యలు చేస్తూ సైలెంట్‌ కిల్లర్‌ పాత్ర పోషించి ఫ్యాన్స్‌ను భయపెట్టింది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో ఒక్కసారిగా తన నెగిటివ్‌ షెడ్‌ను చూపించేసరికి ఆమె ఫ్యాన్స్‌ తట్టుకోలేకపోతున్నారు.

చదవండి: సమంతే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ లవర్‌.. రీట్వీట్‌ చేసిన సామ్‌

ఈ క్రమంలో తమన్నాను అలా చూసి ఏకంగా ఓ చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చిన్నారి ఎవరో కాదు డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ చిన్న కూతురు లిపి. ఆమె తమన్నాకు పెద్ద ఫ్యాన్‌ అట. ఈ క్రమంలో నిన్న మాస్ట్రో మూవీ చూసిన లిపి తమన్నాను అలా చూసి ఏడుపు మొదలు పెట్టిన వీడియోను హీరో నితిన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. దీనికి ‘వాట్‌ యా.. నీ ఫ్యాన్‌ను ఏడింపించావు. ఈ రోజు నేను చూసిన క్యూట్‌ వీడియో ఇది. దర్శకుడు గాంధీ చిన్నకూతురు లిపి.. నీకు పెద్ద ఫ్యాన్‌’ అంటూ తమన్నాను ట్యాగ్‌ చేశాడు. ఇది చూసిన తమన్నా ‘తప్పకుండా ఆ చిన్నారికి హగ్‌ ఇవ్వాల్సిందే’ అని కామెంట్‌ చేసింది. 

చదవండి: ‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ

ఇక ఈ వీడియోలో ఆ చిన్నారి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా.. గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు అంటూ కన్నీరూ పెట్టుకుంటుంటే ఆమె తండ్రి డైరెక్టర్‌ గాంధీ తమన్నా నీ ఫేవరేట్‌ హీరోయిన్‌ హా అని అడుగుతాడు. అవును అనగానే అయితే ఇప్పుడు ఏమైందీ అనడంతో ఆ పాప తను ఎందుకు అలా అందరిని చంపుతుంది అంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి అది సినిమాలే అంటూ నచ్చజెప్పింది. కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో మూవీ శుక్రవారం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. బాలీవుడ్‌ చిత్రం ‘అంధాదున్‌’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కిన సంగతి  తెలిసిందే. ఇందులో అందుడిగా నితిన్‌, లేడీ విలన్‌గా తమన్నా పాత్రలకు మంచి రెస్పోన్స్‌ వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement