Vennello Aadapilla Full Video Song Released From Maestro Movie - Sakshi
Sakshi News home page

Maestro: 'వెన్నెల్లో ఆడపిల్లే తనా' ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Fri, Aug 6 2021 5:47 PM | Last Updated on Sun, Oct 17 2021 1:15 PM

Vennello Aadapilla Full Video Song Released From Maestro Movie - Sakshi

Vennello Aadapilla Full Song: ఈ ఏడాది రెండు వరుస ఫ్లాఫులతో నిరాశలో ఉన్నాడు హీరో నితిన్‌. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సక్సెస్‌ అందుకోవాలని ఆశపడుతున్నాడు. అతడు అంధుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నభా నటేష్‌ హీరోయిన్‌గా తమన్నా భాటియా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమాలోని‘అనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే.. వెన్నెల్లో ఆడపిల్లే తనా.. ఈ చీకటై మిగిలానా..’ పూర్తి పాట రిలీజైంది. ఈ ఫీల్‌గుడ్‌ మెలోడీ సాంగ్‌ జనాలను ఆకట్టుకుంటోంది.

అందంగా మొదలైన తన ప్రేమకథ చివరకు చీకటిని మిగిల్చిందని బాధపడుతున్నాడీ హీరో. మరి హీరో పాటతో హీరోయిన్‌ మనసు కరిగిందా? వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందా? అన్నది సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించిన ఈ పాటను స్వీకర్‌ అగస్తి ఆలపించారు. శ్రీజో–కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి–నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement