ఆసక్తిగా నితిన్‌ ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్‌, సరికొత్తగా తమన్నా.. | Nithin Maestro Movie Trailer Release | Sakshi
Sakshi News home page

Nithin Maestro Trailer: ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్‌ విడుదల, ఉత్కంఠ రేపుతున్న క్రైం సీన్స్‌

Aug 23 2021 6:15 PM | Updated on Aug 23 2021 7:16 PM

Nithin Maestro Movie Trailer Release - Sakshi

హీరో నితిన్‌- నభా నటేశ్‌ జంటగా రూపొందుతున్న చిత్రం మాస్ట్రో. నితిన్‌ 30వ సినిమాగా  మేర్లపాక గాంధీ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టంబర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. క్రైం థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగిని ఈ ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది.

చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్‌ అనుమానాస్పద మృతి..

ఇక తమన్నా ఇందులో నెగిటివ్‌ రోల్‌లో భయపెట్టనుందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖ్యం నితిన్‌-తమన్నా మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇలా ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తోంది. కాగా మాస్ట్రో హిందీ చిత్రం ‘అంధాధున్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డిలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. (చదవండి: నాని బాటలోనే హీరో నితిన్‌.. ‘మాస్ట్రో’ నిర్మాతల క్లారిటీ)

చదవండి: ఫుట్‌బోర్డ్‌ చేస్తూ సమంత, నయన్‌, విజయ్‌.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement