రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో గతేడాది జోరు చూపించారు ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ చిత్రం తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదామెæ. 2017 సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదలైంది. 2018లో ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
కొంచెం గ్యాప్ తర్వాత టాలీవుడ్‌పై మళ్లీ దృష్టి సారించినట్టున్నారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’లో చైతూతో జోడీ కట్టనున్నారు. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ సినిమాలో శ్రీదేవి పాత్ర చేసిన రకుల్ తాజాగా నితిన్ సరసన ఓ సినిమా అంగీకరించారట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో రకుల్‌ని తీసుకున్నా రట. ఇవి కాకుండా మరికొన్ని తెలుగు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment