ఆ హద్దుల్ని చెక్‌ చెరిపేస్తుందనుకుంటున్నాను | SS Rajamouli Entry At Check Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

ఆ హద్దుల్ని చెక్‌ చెరిపేస్తుందనుకుంటున్నాను

Published Mon, Feb 22 2021 1:35 AM | Last Updated on Mon, Feb 22 2021 5:05 AM

SS Rajamouli Entry At Check Movie Pre Release Event  - Sakshi

వరుణ్, కల్యాణీ మాలిక్, రాజమౌళి, నితిన్, ఆనంద్‌ప్రసాద్, వెంకీ, చంద్రశేఖర్, సంపత్, ప్రియ

నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అవగానే థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేయాలనిపించింది. కథాంశం వైవిధ్యంగా ఉంది. మాస్‌ సినిమా, క్లాస్‌ సినిమాకు ఉన్న హద్దుల్ని ఈ సినిమా చెరిపేస్తుందనుకుంటున్నాను. వైవిధ్యమైన సినిమాను కూడా ప్రేక్షకులు ఓ మాస్‌ సినిమాలా ఆదరిస్తారనుకుంటున్నాను. నితిన్‌ అన్ని రకాల సినిమాలు చేయగలడనిపించుకుంటున్నాడు’’ అన్నారు. ‘‘చెక్‌’ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వరుణ్‌ తేజ్‌.

నితిన్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా నటన వేరేలా ఉంటుంది. నాకు వచ్చిన నటనను మార్చుకుని కొత్తగా నేర్చుకుని ఈ సినిమా చేశాను. యేలేటిగారు ఈ సినిమాకు చాలా డబ్బులు రావాలి అన్నారు. తప్పకుండా వస్తాయి. ఈ సినిమాకి కల్యాణీ మాలిక్‌ మ్యూజిక్‌ పెద్ద బలం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఎవ్వర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు చంద్రశేఖర్‌ యేలేటి. ‘‘రెండు సక్సెస్‌ల (ఓ పిట్ట కథ, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌) తర్వాత మూడో చిత్రంతో వస్తున్నాం. నితిన్‌కి గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు ఆనంద్‌ ప్రసాద్‌. ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్, దర్శకులు గోపీచంద్‌ మలినేని, వెంకీ కుడుముల, నటుడు సంపత్‌ మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement