చెక్‌ మాస్టర్‌ | Check Movie Teaser Release | Sakshi
Sakshi News home page

చెక్‌ మాస్టర్‌

Published Mon, Jan 4 2021 6:10 AM | Last Updated on Mon, Jan 4 2021 6:11 AM

Check Movie Teaser Release - Sakshi

ఆదిత్య ఓ అద్భుతమైన చెస్‌ ప్లేయర్‌. ఎత్తులు పైఎత్తులతో ఈజీగా చెక్‌ పెట్టగలడు. కానీ ౖజñ ల్‌లో చిక్కుకున్నాడు. ఈ చెస్‌ ప్లేయర్‌ కారాగారంలో ఎలా చిక్కుక్కున్నాడు? అనేది ‘చెక్‌’ చూసి తెలుసుకోవాలి. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. వి. ఆనందప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. చెస్‌ ప్లేయర్‌ ఆదిత్య పాత్రలో నితిన్‌ నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది’’ అన్నారు చంద్రశేఖర్‌ యేలేటి. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణీ మాలిక్, కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement