
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్. వీరసైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం నాడు హైదరాబాద్‌లో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
మా నాన్న కూడా..
శివకార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ సినిమాలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. ఆయన పోలీసాఫీసర్. డ్యూటీలోనే మరణించారు. సినిమా రిలీజైనప్పటినుంచి నితిన్ ప్రతిరోజు కాల్ చేసి అప్‌డేట్స్ చెప్తూనే ఉన్నారు అని పేర్కొన్నాడు. అభిమానుల కోసం ఓ పాట కూడా పాడాడు. ఓ ప్రియా ప్రియా.. తెలుసా నీకైనా.. అంటూ నితిన్ ఇష్క్ సినిమాలోని పాటను రెండు లైన్లు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా
అమరన్ సినిమా విషయానికి వస్తే ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Comments
Please login to add a commentAdd a comment